
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారుల అవసరాలను గుర్తిస్తూ ప్రజాదరణ పొందిన ‘క్లిక్2 ప్రొటెక్ట్ 3డీ ప్లస్’ ప్లాన్‌లో బీమా కవరేజీ గరిష్ట వయసును పెంచింది. ఇప్పటి వరకు గరిష్టంగా 75 ఏళ్లు వచ్చే వరకే బీమా కవరేజీ పొందే ఆప్షన్ ఇందులో ఉండగా, దీన్ని 85 సంవత్సరాలు చేసింది. తమ నిరంతర ఉత్పత్తుల పరిశోధనలో భాగంగా... మెరుగైన వైద్య సదుపాయాలు, నాణ్యమైన జీవనంతో పెరుగుతున్న ఆయుర్దాయం నేపథ్యంలో గరిష్ట వయసు వరకు (రిటైర్మెంట్ తర్వాత కూడా) పాలసీదారులకు బీమా అవసరాన్ని గుర్తించినట్టు సంస్థ ప్రకటించింది. దీనికితోడు యువతలో టర్మ్ ప్లాన్లపై అవగాహన పెరుగుతున్న దృష్ట్యా క్లిక్2 ప్రొటెక్ట్ 3డీ ప్లస్ పాలసీలో గరిష్ట కాలాన్ని 85 ఏళ్ల వరకు పెంచామని, 85లో తమ వయసును తీసివేయగా మిగిలిన కాలానికి కవరేజీ పొందొచ్చని కంపెనీ తెలిపింది. లైఫ్ ఆప్షన్, ఎక్స్‌ట్రా లైఫ్ ఆప్షన్, 3డీ లైఫ్ ఆప్షన్ అలాగే, మెచ్యూరిటీ తర్వాత ప్రీమియం తిరిగి చెల్లించే ఆప్షన్లకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.