ఏపీ ప్రజల డేటా చోరీ కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో తీగ లాగుతుంటే డొంక కదులుతోంది. ప్రజల డేటా చోరీకి పాల్పడిన ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీల ప్రతినిధులతో కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రెండు సంస్థలు కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కించుకున్నాయి.