1.4 కోట్ల మంది సమాచారం బహిర్గతం | Facebook privacy goof makes posts by 14 million users readable to anyone | Sakshi
Sakshi News home page

1.4 కోట్ల మంది సమాచారం బహిర్గతం

Published Sat, Jun 9 2018 2:37 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Facebook privacy goof makes posts by 14 million users readable to anyone - Sakshi

న్యూయార్క్‌: సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో వివాదంలో చిక్కుకుంది. ఓ సాంకేతిక సమస్య కారణంగా యూజర్లు తమ స్నేహితులతో పంచుకున్న ఫొటోలు, పోస్ట్‌లు బహిర్గతమయ్యాయని ఫేస్‌బుక్‌ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ ఎరిన్‌ ఎగన్‌ తెలిపారు. మే 18 నుంచి 27 వరకూ ఈ సమస్య కారణంగా 1.4 కోట్లమంది యూజర్లు ప్రభావితమయ్యారని చెప్పారు. ఫేస్‌బుక్‌లో తమ పోస్ట్‌లు, ఫొటోలను స్నేహితులు మాత్రమే చూసేలా యూజర్లు పెట్టుకున్న ‘ఫ్రెండ్స్‌ ఓన్లీ’ సెట్టింగ్‌ తాజా సాంకేతిక సమస్యతో ఆటోమేటిక్‌గా ‘పబ్లిక్‌’ సెట్టింగ్‌కు మారిపోయిందన్నారు. ఈ ఘటనపై ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ విచారణ చేపట్టే వీలుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement