సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన డేటా లీక్ వ్యవహారాన్ని కేంద్ర హోం శాఖ సీరియస్‌గా తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు 24 రాష్ట్రాలకు చెందిన 80 కోట్ల మంది ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయానికి పెట్టడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా చౌర్యానికి గురైన డేటాలో 2.60 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల రహస్య సమాచారం కూడా ఉండటంతో అప్రమత్తమైంది. దీనిపై మంగళవారం సైబరాబాద్ పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.
ఇటీవల మూడు డేటా చౌర్యం కేసులకు సంబంధించి 17 మంది నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు, ర్యాంకులు, పనిచేస్తున్న చోటు, విభాగం వంటి వివరాలు లీక్ అయ్యాయి. విద్యుత్, ఇంధన శాఖ, జీఎస్‌టీ, ఆర్‌టీఓలతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రవాసులు, టీచర్లు, వైద్యులు, లాయర్లు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు.. ఇలా 104 కేటగిరీలకు చెందిన ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని నిందితులు విక్రయిసున్నారు.
ఎలా లీకైంది? ఎవరు కొన్నారు?
హై ప్రొఫైల్ వ్యక్తుల రహస్య సమాచారం లీక్ కావడంతో అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ.. నిందితులకు సమాచారం ఎలా చేరింది? ఎక్కడి నుంచి లీకైంది? ఎవరెవరు డేటా కొనుగోలు చేశారు? కొన్న సమాచారాన్ని దేని కోసం వినియోగిస్తున్నారు? సున్నితమైన సమాచారం ఏమైనా దేశం దాటిందా? వంటి అంశాలపై సైబరాబాద్ పోలీసులను ఆరా తీసినట్టు తెలిసింది. దీంతో ఇప్పటికే నిందితుల నుంచి రాబట్టిన సమాచారాన్ని సైబరాబాద్ పోలీసులు వివరించారు.
వెబ్‌సైట్ల ద్వారా డేటా విక్రయం..
తొలుత నిందితులు జస్ట్ డయల్ వేదికగా డేటాను విక్రయిస్తున్నట్టు సైబరాబాద్ పోలీసులు నిర్ధారించారు. అయితే కస్టడీలో ఉన్న నిందితుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించగా.. నిందితులు సొంతగా నకిలీ గుర్తింపు కార్డులతో కంపెనీలను ఏర్పాటు చేసి, వాటి పేరుతో వెబ్‌సైట్లను సృష్టించి మరీ డేటాను విక్రయిస్తున్నట్లు తేలింది.
ఢిల్లీ, ఫరీదాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి, గ్రామీణ నిరుద్యోగులను టెలీ కాలర్లుగా నియమించుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. నకిలీ పేర్లతో సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు తెరుస్తూ.. కొట్టేసిన సొమ్మును నేరుగా ఆయా ఖాతాలకు మళ్లిస్తే పోలీసులకు దొరికిపోతామని నో బ్రోకర్.కామ్, హౌసింగ్.కామ్, పేటీఎం, మ్యాజిక్ బ్రిక్స్ వంటి ఆన్‌లైన్ సంస్థలకు మళ్లిస్తున్నట్లు
గుర్తించారు.
21 సంస్థలకు నోటీసులు జారీ..
నిందితుల నుంచి స్వా«దీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతరత్రా ఎల్రక్టానిక్ ఉపకరణాలను విశ్లేషించిన పోలీసులు.. 21 సంస్థల నుంచి డేటా చౌర్యానికి గురైనట్లు గుర్తించారు. దీంతో బిగ్ బాస్కెట్, ఫోన్‌పే, ఫేస్‌బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, అస్ట్యూట్ గ్రూప్, మ్యా ట్రిక్స్, టెక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి 21 సంస్థలకు నోటీసులు జారీ చేశారు.
ఇందులో 8 సంస్థలు మాత్రమే విచారణకు హాజరై.. కస్టమర్ల డేటా సమీకరణ, భద్రత విధానాలపై పోలీసులకు నివేదికను సమర్పించాయి. దీంతో గైర్హాజరైన కంపెనీలపై పోలీసులు న్యాయపరమైన చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది.
28 వెబ్‌సైట్లు ఇవే..
♦ ఇన్‌సై్పర్ వెబ్స్
♦ డేటా మార్ట్ ఇన్ఫోటెక్
♦ గ్లోబల్ డేటా ఆర్ట్స్
♦ ఎంఎస్ డిజిటల్ గ్రో
♦ ఇన్స్పైర్ డిజిటల్
♦ ఫన్‌డూడేటా.కామ్
♦ కెనిల్స్.కో
♦ డేటాస్పెర్‌నీడ్.కామ్
♦ బినరీక్లూస్.కామ్
♦ ఇనిగ్మా మార్కెటింగ్
♦ అల్టీమోక్‌డ్స్.కామ్
♦ ఫాస్ట్ డేటాబేస్ ప్రొవైడర్
♦ డేటా సొల్యూషన్ ఫర్ బీ2బీ అండ్
♦ బీ2సీ పోర్టల్
♦ బీజీ డేటా
♦ డిమాండ్ డేటా సొల్యూషన్
♦ స్పెర్ డిజిటల్ ఇండియా
♦ క్యూబిక్‌టెక్నాలజీ.కామ్
♦ బీబీజీఈబ్రాండిం గ్.కామ్
♦ ఈజీసర్వ్.కో.ఇన్
♦ డేటాప్రొలిక్స్.కామ్
♦ క్యూబిర్ర్ డేటాబేస్ మార్కెటింగ్
♦ 77డేటా.నెట్
♦ 99డేటాఏసీడీ.కామ్
♦ డేటాబేస్‌ప్రొవైడర్.ఇన్
♦ హెచ్‌ఐడేటాబేస్.కామ్
♦ బల్క్డేటాబేస్.ఇన్ఫో
♦ గ్లోబల్‌డేటా.కామ్
♦ డేటాపార్క్.కో.ఇన్
Comments
Please login to add a commentAdd a comment