సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన పూర్తయింది. ఏపీకి 11.536 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలను కేటాయిస్తూ శనివారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన జరగలేదు.
ఇటీవల రెండు రాష్ట్రాల ప్రభుత్వాల అధికారుల సమన్వయంతో విభజన పూర్తయింది. ఢిల్లీలోని అశోకా రోడ్‌లోని ఆంధ్రప్రదేశ్ భవన్ 19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం దీని విలువ రూ.9,913.505 కోట్లు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. పంపకాల్లో భాగంగా ఏపీకి 58.32 శాతం వాటా దక్కగా, తెలంగాణకు 41.68 శాతం ఆస్తులు దక్కాయి.
ఏపీ భవన్‌కు ఇలా
19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవన్‌ను రెండు భాగాలుగా విభజించారు. విభజనలో భాగంగా ఏపీకి 11.536 ఎకరాలను అప్పగించారు. దీనిలో 5.781 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏపీ భవన్, 4.315 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సింగ్ హాస్టల్, 2.396 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్‌ను కేటాయించారు. 0.512 విస్తీర్ణంలో ఉన్న ఇంటర్నల్ రోడ్డు, 0.954 విస్తీర్ణంలోని శబరీ బ్లాక్ కొంత భాగాన్ని అప్పగించారు. ఏపీకి కేటాయించిన స్థలం విలువ రూ.5,781.416కోట్లు.
తెలంగాణ భవన్‌కు ఇలా..
విభజనలో భాగంగా తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించారు. దీనిలో మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న శబరీ బ్లాక్, 5.245 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్‌ను కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన 8.245 ఎకరాల విలువ రూ.4,132.089 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment