Personal Information
-
అప్పుడు సెహ్వాగ్‌కు ఏడేళ్లు.. ఆర్తికి ఐదేళ్లు.. 20 ఏళ్ల పెళ్లి బంధం! (ఫొటోలు)
-
అప్పుడు సెహ్వాగ్‌కు ఏడేళ్లు.. ఆర్తికి ఐదేళ్లు.. 20 ఏళ్ల పెళ్లి బంధం!(ఫొటోలు)
-
డేటా చౌర్యం చేస్తున్న పచ్చమూకలు
నూజివీడు: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటమే లక్ష్యంగా టీడీపీ మూకలు బరితెగిస్తున్నాయి. బాబు ష్యూరిటీ–భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి.. అమాయకులైన ప్రజల్ని మాయమాటలతో మభ్యపెట్టి వారి ఫోన్ల నుంచి సున్నిత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు తమ ఫోన్లు తీసుకొని ఓటీపీలు ఎందుకు సేకరిస్తున్నారో తెలియడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని గ్రామాల్లో పలువురు టీడీపీ కార్యకర్తలు ప్రజల ఇళ్లకు వెళ్తున్నారు. వారితో మాటలు కలిపి.. ఏ రాజకీయ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకుంటున్నారు. అనంతరం వారి ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. ఆ తర్వాత మెసేజ్‌లు పంపించి.. ఓటీపీలు సేకరిస్తున్నారు. మెసేజ్‌లు చూడటం తెలియనివారి వద్ద నుంచి టీడీపీ కార్యకర్తలే ఫోన్లు తీసుకొని ఓటీపీలను తమ ట్యాబ్‌లలో నమోదు చేసుకుంటున్నారు. రేగుంట గ్రామంలో ఇదే విధంగా జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ మూకలను ఎవరైనా ప్రశ్నిస్తే.. టీడీపీ మేనిఫెస్టో పేరుతో ఓ లింక్ పంపించి.. మీ కుటుంబం పలు పథకాలకు అర్హత పొందిందని.. 2024 జూన్ తర్వాత మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయంటూ మభ్యపెడుతున్నారు. నూజివీడుకు చెందిన వాసవికి ఆడబిడ్డ నిధి, ఇతర పథకాల కింద ఏడాదికి రూ.54 వేలు వస్తాయని, ఐదేళ్లకు రూ.2.70 లక్షలు లబ్ధి పొందుతారంటూ చెప్పి.. ఆమె సమాచారమంతా సేకరించారు. నా కుటుంబ వివరాలు వాళ్లకెందుకు? టీడీపీ కార్యకర్తలు మా ఇంటికి వచ్చారు. ఎన్ని ఓట్లు ఉన్నాయని అడిగారు. చెప్పగా.. నా ఫోన్‌కు ఏదో మెసేజ్ పంపించారు. నాకు చూడటం రాదని చెప్పగా.. వాళ్లే ఏదో నమోదు చేసుకొని వెళ్లారు. ఏదో ఓటీపీ నా ఫోన్ నుంచి తీసుకున్నారని ఆ తర్వాత తెలిసింది. నా కుటుంబ వివరాలు వాళ్లకెందుకో అర్థం కావడం లేదు. – కె.విజయకుమార్, రేగుంట -
ఇళ్లకొచ్చి బెదిరింపులు.. సమాచార దోపిడీలో టీడీపీ, జనసేన
సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు అర్బన్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దోపిడీ చేస్తున్నాయి. ఆ పార్టీలకు చెందిన కొందరు వ్యక్తులు ఇళ్లకు వచ్చి, వ్యక్తిగత సమాచారం కోరుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో ఇళ్లలోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నారు. ఆధార్ కార్డులు చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఓటీపీ వస్తుందని, వెంటనే చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు. వారు చెప్పినట్లు చేయని వారిపై దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఏలూరు, తణుకు నగరాల్లో వీరు ఇంటింటికీ వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో జిల్లావాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో అమరావతి భూముల కుంభకోణంలో పలువురి ఆధార్ కార్డులతో భూములను రిజిస్ట్రేషన్ చేసిన టీడీపీ.. ఇప్పుడు తమ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లతో ఏం చేయబోతుందనే భయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ఏలూరు పత్తేబాదలోని ఓ ఇంటికి వెళ్లిన కొందరు వ్యక్తులు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను ఆధార్ కార్డు కావాలంటూ అడిగారు. మీరెవరని ప్రశ్నించగా టీడీపీ నుంచి వచ్చామని, ఆధార్ కార్డు ఇస్తే యాప్‌లో వివరాలను నమోదు చేస్తామని చెప్పారు. ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలంటూ దురుసుగా అడిగారు. మీకెందుకివ్వాలంటూ ఆ మహిళ గట్టిగా నిలదీయడంతో ఆమెను బెదిరిస్తూ వెళ్లిపోయారు. ఏలూరు కొత్తపేటలోనూ ఇదే విధంగా పలు ఇళ్లలో ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ చెప్పాలని టీడీపీ, జనసేనకు చెందిన కొందరు వ్యక్తులు డిమాండ్ చేశారు. స్థానికులు గట్టిగా ఎదురు తిరగడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇలా దెందులూరు, ఉంగుటూరు, తణుకులో కూడా టీడీపీ, జనసేనకు చెందిన పలువురు స్థానిక నాయకులు కొందరు యువకులను ఇళ్లకు పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తణుకులోనూ ఓటరు లిస్టుతో ఇంటింటికీ వచ్చి వివరాలు అడుగుతూ బాబు గ్యారంటీ కార్డులు అందజేస్తున్నారు. మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీ వెంటనే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం 8, 17 వార్డుల్లో ఇలాగే బెదిరించిన టీడీపీ కార్యకర్తలపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, హెచ్చరించి పంపించారు. వ్యక్తిగత సమాచారం చెప్పొద్దని పోలీసుల హెచ్చరిక ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో అపరిచితులు ఎవరికీ వ్యక్తిగత సమాచారం, ఆధార్ కార్డులు, ఓటీపీ నంబర్లు ఇవ్వవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దంటూ తణుకులో మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు వారి వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని, ఎవరికీ చెప్పవద్దని వాటి కోసం బలవంతం చేసిన వారిపై ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. వాలంటీర్లపై దుష్ప్రచారం చేసిన పవన్.. ఇప్పుడిదేం పని? ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారికి అండదండగా ఉంటూ, సంక్షేమ పథకాలను అందిస్తున్న వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు దు్రష్పచారం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును తెలుసుకొనేందుకు వెళ్లిన వాలంటీర్లపై నానా రకాల ప్రచారం చేశారు. వాలంటీర్లు ప్రభుత్వం నియమించిన వారు. అదే ప్రాంతానికి చెంది, నిత్యం ప్రజల మధ్య ఉండి, వారికి సుపరిచితులైన వారు. అలాంటి వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు మరింత సమర్ధంగా అందేలా ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తే తప్పంటూ నానా యాగీ చేశారు. ఇప్పుడు అదే జనసేన, టీడీపీ వారు ఆ ప్రాంతానికి సంబంధం లేని వారిని, అపరిచితులను ఇంటింటికీ పంపి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ఇవ్వని వారిపై బెదిరింపులు, దాడులకు పాల్పడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులు వస్తున్నారు అపరిచిత వ్యక్తులు ఇళ్లకు వచ్చి ఆధార్ కార్డు కావాలని అడుగుతున్నారు. ఫోన్ నంబర్లకు ఓటీపీలు వస్తాయని అవి చెప్పాలని అడుగుతున్నారు. మీకెందుకని అడిగితే టీడీపీ యాప్‌లో నమోదు చేయాలని అంటున్నారు. వారి తీరుతో మాకు భయంగా ఉంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – బి.మణి, వన్‌టౌన్, ఏలూరు చదవండి: ఇదీ.. జగన్ కమిట్మెంట్ -
డేటా దేశం దాటిందా?
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన డేటా లీక్ వ్యవహారాన్ని కేంద్ర హోం శాఖ సీరియస్‌గా తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు 24 రాష్ట్రాలకు చెందిన 80 కోట్ల మంది ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయానికి పెట్టడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా చౌర్యానికి గురైన డేటాలో 2.60 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల రహస్య సమాచారం కూడా ఉండటంతో అప్రమత్తమైంది. దీనిపై మంగళవారం సైబరాబాద్ పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇటీవల మూడు డేటా చౌర్యం కేసులకు సంబంధించి 17 మంది నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు, ర్యాంకులు, పనిచేస్తున్న చోటు, విభాగం వంటి వివరాలు లీక్ అయ్యాయి. విద్యుత్, ఇంధన శాఖ, జీఎస్టీ, ఆర్టీఓలతో పాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రవాసులు, టీచర్లు, వైద్యులు, లాయర్లు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు.. ఇలా 104 కేటగిరీలకు చెందిన ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని నిందితులు విక్రయిసున్నారు. ఎలా లీకైంది? ఎవరు కొన్నారు? హై ప్రొఫైల్ వ్యక్తుల రహస్య సమాచారం లీక్ కావడంతో అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ.. నిందితులకు సమాచారం ఎలా చేరింది? ఎక్కడి నుంచి లీకైంది? ఎవరెవరు డేటా కొనుగోలు చేశారు? కొన్న సమాచారాన్ని దేని కోసం వినియోగిస్తున్నారు? సున్నితమైన సమాచారం ఏమైనా దేశం దాటిందా? వంటి అంశాలపై సైబరాబాద్ పోలీసులను ఆరా తీసినట్టు తెలిసింది. దీంతో ఇప్పటికే నిందితుల నుంచి రాబట్టిన సమాచారాన్ని సైబరాబాద్ పోలీసులు వివరించారు. వెబ్సైట్ల ద్వారా డేటా విక్రయం.. తొలుత నిందితులు జస్ట్ డయల్ వేదికగా డేటాను విక్రయిస్తున్నట్టు సైబరాబాద్ పోలీసులు నిర్ధారించారు. అయితే కస్టడీలో ఉన్న నిందితుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించగా.. నిందితులు సొంతగా నకిలీ గుర్తింపు కార్డులతో కంపెనీలను ఏర్పాటు చేసి, వాటి పేరుతో వెబ్సైట్లను సృష్టించి మరీ డేటాను విక్రయిస్తున్నట్లు తేలింది. ఢిల్లీ, ఫరీదాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి, గ్రామీణ నిరుద్యోగులను టెలీ కాలర్లుగా నియమించుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. నకిలీ పేర్లతో సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు తెరుస్తూ.. కొట్టేసిన సొమ్మును నేరుగా ఆయా ఖాతాలకు మళ్లిస్తే పోలీసులకు దొరికిపోతామని నో బ్రోకర్.కామ్, హౌసింగ్.కామ్, పేటీఎం, మ్యాజిక్ బ్రిక్స్ వంటి ఆన్లైన్ సంస్థలకు మళ్లిస్తున్నట్లు గుర్తించారు. 21 సంస్థలకు నోటీసులు జారీ.. నిందితుల నుంచి స్వా«దీనం చేసుకున్న సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతరత్రా ఎల్రక్టానిక్ ఉపకరణాలను విశ్లేషించిన పోలీసులు.. 21 సంస్థల నుంచి డేటా చౌర్యానికి గురైనట్లు గుర్తించారు. దీంతో బిగ్ బాస్కెట్, ఫోన్‌పే, ఫేస్బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, అస్ట్యూట్ గ్రూప్, మ్యా ట్రిక్స్, టెక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి 21 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఇందులో 8 సంస్థలు మాత్రమే విచారణకు హాజరై.. కస్టమర్ల డేటా సమీకరణ, భద్రత విధానాలపై పోలీసులకు నివేదికను సమర్పించాయి. దీంతో గైర్హాజరైన కంపెనీలపై పోలీసులు న్యాయపరమైన చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. 28 వెబ్సైట్లు ఇవే.. ♦ ఇన్‌సై్పర్ వెబ్స్ ♦ డేటా మార్ట్ ఇన్ఫోటెక్ ♦ గ్లోబల్ డేటా ఆర్ట్స్ ♦ ఎంఎస్ డిజిటల్ గ్రో ♦ ఇన్స్పైర్ డిజిటల్ ♦ ఫన్డూడేటా.కామ్ ♦ కెనిల్స్.కో ♦ డేటాస్పెర్నీడ్.కామ్ ♦ బినరీక్లూస్.కామ్ ♦ ఇనిగ్మా మార్కెటింగ్ ♦ అల్టీమోక్డ్స్.కామ్ ♦ ఫాస్ట్ డేటాబేస్ ప్రొవైడర్ ♦ డేటా సొల్యూషన్ ఫర్ బీ2బీ అండ్ ♦ బీ2సీ పోర్టల్ ♦ బీజీ డేటా ♦ డిమాండ్ డేటా సొల్యూషన్ ♦ స్పెర్ డిజిటల్ ఇండియా ♦ క్యూబిక్టెక్నాలజీ.కామ్ ♦ బీబీజీఈబ్రాండిం గ్.కామ్ ♦ ఈజీసర్వ్.కో.ఇన్ ♦ డేటాప్రొలిక్స్.కామ్ ♦ క్యూబిర్ర్ డేటాబేస్ మార్కెటింగ్ ♦ 77డేటా.నెట్ ♦ 99డేటాఏసీడీ.కామ్ ♦ డేటాబేస్ప్రొవైడర్.ఇన్ ♦ హెచ్ఐడేటాబేస్.కామ్ ♦ బల్క్డేటాబేస్.ఇన్ఫో ♦ గ్లోబల్‌డేటా.కామ్ ♦ డేటాపార్క్.కో.ఇన్ -
డేటా లీకుపై పోలీసుల దూకుడు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన డేటా చౌర్యం కేసులో సైబరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. గత నెల రోజుల వ్యవధిలో సైబరాబాద్ పోలీసులు నాలుగు డేటా చౌర్యం, విక్రయం, నకిలీ కాల్ సెంటర్ నిర్వహణ కేసులను ఛేదించారు. వీటిల్లో 30 మంది నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయా కేసులలో నిందితులు విక్రయానికి పెట్టిన వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీ ఏజెన్సీలు, ఈ–కామర్స్ సంస్థల నుంచి లీకైనట్లు గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయా కంపెనీలను విచారించాలని నిర్ణయించింది. ఇప్పటికే బిగ్ బాస్కెట్, ఫోన్‌పే, ఫేస్బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, అస్ట్యూట్ గ్రూప్, మ్యాట్రిక్స్, టెక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా మరో పది కంపెనీలకూ తాఖీదులు జారీ చేసింది. ఇప్పటికే సిట్ ముందు హాజరైన కంపెనీలు.. కస్టమర్ల డేటా, సమీకరణ, భద్రతా విధానాలు, థర్డ్ పార్టీ ఏజెన్సీలు తదితరాలపై సమగ్ర సమాచారాన్ని సమర్పించాయి. ఆయా సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు మరికొంత అదనపు సమాచారం కోసం మరోసారి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు రాష్ట్రాల్లో గాలింపు.. ప్రధానంగా హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్ దేశంలోని 70 కోట్ల మంది వ్యక్తులు, సంస్థలకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, విక్రయానికి పెట్టడం సంచలనం సృష్టించింది. ఇందులో 2.60 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారంతో పాటు విద్యుత్, ఇంధనం వంటి ప్రభుత్వ శాఖలు, విద్యార్థులు, ప్రవాసులు, గృహిణులు, బ్యాంకు ఖాతాదారుల సమాచారం ఉండటం గమనార్హం. ఈ కేసులో నిందితుడు వినయ్ భరద్వాజ్ ఈ డేటాను గుజరాత్‌కు చెందిన అమీర్ సోహైల్, మదన్ గోపాల్ అనే వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీంతో వారి కోసం సిట్ బృందాలు గాలిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్తాన్, హరియాణా, పశ్చిమ బెంగాల్లో నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నట్లు తెలిసింది. -
డేటా లీకు మూలం ‘పునరుద్ధరణే’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 16.8 కోట్ల మంది డేటా లీకు కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రక్షణ శాఖతో పాటు టెలికం, విద్యుత్, ఇంధనం వంటి కీలకమైన ప్రభుత్వ సంస్థల వ్యక్తిగత సమాచారం కూడా తస్కరణకు గురికావటాన్ని సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. థర్డ్ పార్టీ ఏజెన్సీల నుంచే ఈ కీలక సమాచారం బహిర్గతమైనట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుల రెండో రోజు కస్టడీ విచారణపూర్తిగా ప్రభుత్వ సంస్థల డేటా లీకు మూలాలను కనుక్కొనే దిశలోనే సాగింది. వెబ్సైట్ల పునరుద్ధరణ నుంచే లీకు.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖతో పాటు పలు కేంద్ర సంస్థలకు చెందిన వెబ్సైట్లను పునరుద్ధరణ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సాధారణంగా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు డెబిట్, క్రెడిట్ కార్డుల నిర్వహణ సేవలను థర్డ్ పార్టీలకు అందిస్తుంటాయి. ఇదే తరహాలో కేంద్ర సంస్థల వెబ్సైట్ల రీడెవలప్ సేవలు కూడా ఆయా యాజమాన్యలు ఐటీ కంపెనీలకు అందించాయి. నోయిడా, ముంబైకి చెందిన ఔట్సోర్సింగ్ కంపెనీల నుంచే ఈ వ్యక్తిగత సమాచారం బహిర్గతమైందని సైబరాబాద్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు.. నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న 12 సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, వెబ్సైట్లను సైబరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ పోలీసు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ (టీఎస్పీసీసీ) విశ్లేషించి.. పలు కీలక సమాచారాన్ని గుర్తించినట్లు తెలిసింది. పలు అనుమానిత ఈ–మెయిల్స్, వెబ్‌పేజీలను వినియోగించే చిరునామా యూనిఫాం రిసోర్స్ లొకేటర్ (యూఆర్ఎల్)లను గుర్తించారు. వీటిని నిర్ధారించేందుకు టెలికం సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్పీ), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ)లను విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఈమేరకు పలు కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారం గొలుసుకట్టు తరహాలో ఉండటంతో మరింతమంది ఈ కేసులో అరెస్టయ్యే అవకాశాలున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఉగ్రకోణం ఉంటే కేసు ఎన్ఐఏకు బదిలీ? బహిరంగ మార్కెట్లో నిందితులు అమ్మకానికి పెట్టిన డేటాలో 2.60 లక్షల మంది రక్షణ శాఖకు చెందిన వ్యక్తిగత సమాచారం కూడా ఉండటం గమనార్హం. దీంతో ఇప్పటికే పలుమార్లు సైబరాబాద్ పోలీసులతో హైదరాబాద్, ఢిల్లీకి చెందిన రక్షణ శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టేందుకు కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) అధికారులు కూడా భేటి కానున్నట్లు తెలిసింది. సైబర్ మోసాల కోసమే డేటా చోరీ చేశారా లేక ఏమైనా ఉగ్రకోణం దాగి ఉందా అని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఉగ్రకోణం అంశాలు వెలుగులోకి వస్తే గనక ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ఏడుగురిలో నాగ్‌పూర్‌కు చెందిన జియా ఉర్ రెహ్మాన్ కీలకమని పోలీసుల విచారణలో తేలింది. ఇతను ముంబైకి చెందిన ఓ వ్యక్తి నుంచి డేటాను కొనుగోలు చేసి, జస్ట్ డయల్, డేటా మార్ట్ ఇన్ఫోటెక్, గ్లోబల్ డేటా ఆర్ట్స్, ఎంఎస్ డిజిటల్ గ్రో, ఇన్‌స్పైరీ డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ డేటాను విక్రయించేవాడు. -
‘పబ్లిక్ వైఫై’ వాడుతున్నారా? అయితే జర జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడంతా ఇంటర్నెట్ జమానా...నెట్‌తో కనెక్ట్ కాకుండా క్షణం ఉండలేని పరిస్థితి. ఆన్లైన్ షాపింగ్ మొదలు..ఆఫీస్‌కు ఇన్ఫర్మేషన్ పంపే వరకు ఎప్పుడైనా ఎక్కడైనా..ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి. కొన్ని సార్లు ప్రయాణంలో ఉన్నప్పుడు, బయట అనుకోని పరిస్థితుల్లో మన ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేనప్పుడు ఫ్రీ వైఫైల వైపు చూడడం పరిపాటే.. అయితే ఇకపై పబ్లిక్ వైఫైలు వాడుతున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే వైఫై వినియోగించి మనం ఈ మెయిల్, ఇతర సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయడం,, ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీలు చేస్తే మనం నమోదు చేసే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సైబర్ నేరగాళ్లు మాల్వేర్ ద్వారా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ ప్రాంతాల్లోని వైఫై వాడినట్లయితే సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారం సైతం కొట్టేసే ప్రమాదం ఉంటుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు పబ్లిక్ వైఫై వాడకుండా ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో అయితే నమ్మదగిన వీపీఎన్(వర్చువల్ ప్రైవేటు నెట్వర్క్)ను ముందుగా ఇన్స్టాల్ చేసుకోవాలంటున్నారు. వీపీఎన్ ఉండడం వల్ల మన ఫోన్లోని సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తపడొచ్చని సూచిస్తున్నారు. -
బాబోయ్.. 90 లక్షల క్రెడిట్ కార్డుల డేటా లీక్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులతో సహా 90 లక్షల కార్డ్ హోల్డర్ల ఆర్థికపరమైన డేటా భారీ లీకైనట్లు సైబర్-సెక్యూరిటీ పరిశోధకులు బయటపెట్టారు. సింగపూర్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు జరుపుతున్న CloudSEK సంస్థ ఈ విషయాన్ని గుర్తించింది. వారి పరిశోధనలో.. రష్యాకు చెందిన డార్క్ వెబ్ సైబర్ క్రైమ్ ఫోరమ్‌లో 1.2 మిలియన్ కార్డ్‌ల డేటాబేస్‌ను ఉచితంగా అందుబాటులో ఉన్నట్లు తేలింది. వీటితో పాటు 7.9 మిలియన్ కార్డ్ హోల్డర్ డేటా BidenCash వెబ్సైట్లో ఉన్నట్లు కనుగోన్నారు. గతంలో మాదిరి కాకుండా, ఈసారి, హ్యాకర్లు SSN, కార్డ్ వివరాలు, CVV వంటి ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని విడుదల చేశారని బృందం వెల్లడించింది. వీటితో పాటు కార్డ్ వివరాలతో అనుసంధానించిన చాలా వ్యక్తిగత ఇమెయిల్‌లు కూడా బయటపడ్డాయి. BidenCash ద్వారా గతంలో సాఫ్ట్‌బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సింగపూర్‌తో అనుబంధించబడిన అధికారిక ఇమెయిల్‌ల రికార్డులు కూడా లీక్ అయ్యాయి. "స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫిసర్వ్ సొల్యూషన్స్ LLC, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు కొన్ని అగ్రశ్రేణి బ్యాంకింగ్ సంస్థల కస్టమర్ల డేటా కూడా లీక్ అయ్యింది. మాస్టర్‌కార్డ్, వీసా నెట్‌వర్క్‌లకు సంబంధించిన 414,000 రికార్డులతో సుమారు 508,000 డెబిట్ కార్డ్‌ల వివరాలు కూడా బహిర్గతమైంది." అని భద్రతా పరిశోధకులు దేశాయ్ తెలిపారు. ఈ కార్డుల సమాచారం లీక్ వల్ల అక్రమ కొనుగోళ్ళు, కార్డ్ క్లోనింగ్, అనధికారిక లావాదేవీలు జరుగుతాయని దేశాయ్ అన్నారు. BidenCash వెబ్ సైట్ తన సైట్ కు ట్రాఫిక్‌ను పెంచుకోవడం కోసం ఈ తరహా చర్యలకు పాల్పడుతూ ఉంటుందని తెలిపారు. చదవండి: ఎఫ్బీలో జుకర్‌బర్గ్‌కు భారీ షాక్, కష్టాల్లో మెటా -
వెంటాడే చిత్రాలు..
ఉద్యోగంలో ప్రమోషన్ రావడంతో ఫ్రెండ్స్‌కి హోటల్లో పార్టీ ఇచ్చాను. అక్కడ, ఫ్రెండ్స్‌తో పాటు నన్ను నేను మరిచిపోయి చేసిన డ్యాన్స్ వీడియోను ఎవరో ఆన్లైన్ ఫ్లాట్ఫారమ్లలో పోస్ట్ చేశారు. ఇది నన్ను చాలా ఇబ్బందులకు గురిచేసింది. ఆ వీడియోను ఎలా తొలగించాలో అర్థం కావడంలేదు. – ఓ బాధితురాలు ∙∙ ఐదేళ్ల క్రితం నా మొదటి భర్తతో విడిపోయాను. మూడేళ్ల క్రితం మళ్లీ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాను. మాకు ఏడాదిన్నర పాప కూడా ఉంది. నా మాజీ భర్తతో గతంలో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు కొన్ని అశ్లీల వెబ్సైట్లలో కనిపించాయి. అవి చూస్తే ఇప్పటి నా భర్తతో ఇప్పుడు విభేదాలు వచ్చేలా ఉన్నాయి. వాటిని నా మాజీ భర్త పోస్ట్ చేయలేదని తెలిసింది. వాటిని తొలగించడం ఎలాగో తెలియడం లేదు. –ఓ బాధితురాలు ∙∙ ఒక రోజు మద్యం తాగి వాహనం నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఆ సందర్భానికి సంబంధించి నేనున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. ఆశ్చర్యపోయాను. ఆ ఫొటోను ఎవరో అనుకోకుండా పోస్ట్ చేసి ఉంటారు. చాలా చోట్లకు షేర్ అయ్యింది కూడా. కానీ, దాని వల్ల నేను తాగుబోతుననే ముద్ర నా చుట్టూ ఉన్నవారిలో పడుతోంది. అది డిలీట్ చేయడం ఎలాగో తెలియదు. – ఓ బాధితుడు మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మనకు తెలియకుండానే ఆన్లైన్ వేదికలపై కనిపిస్తే, ప్రస్తుత జీవితంపై అవి ప్రభావం చూపకుండా ఉండవు. ఇలాంటప్పుడు ఆ చిత్రాలను కానీ, వీడియోలు కానీ డిలీట్ చేయడం ఎలా?! దీనికి సంబంధించి ఎవరిని సంప్రదించాలి, వీటి కట్టడికి చట్టాలు లేవా? ఇలాంటి సందేహాలు మనందరిలో రావడం సహజం. యూజర్ హక్కులు ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తొలగించే హక్కు జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్(జిడిపిఆర్)లో భాగంగా ఉంది కానీ దానికి ప్రత్యేకించి చట్టాలు అంటూ ఏమీ లేవు. అయితే, రైట్ టు కన్ఫర్మ్, రైట్ టు యాక్సెస్, రైట్ టు కరెక్ట్, రైట్ టు పోర్టబులిటీ, రైట్ టు ఫర్గెట్... ఇవన్నీ వ్యక్తిగత డేటాకు సంబంధించి ఒక యూజర్‌కు ఉన్న హక్కులు. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో ‘పరువు’ తీయడం అనేది ఒక ఉద్యమంలా తయారయ్యింది. వాటికి ఎన్ని క్లిక్‌లు, ఎన్ని షేర్లు, ఎన్ని కామెంట్లు వస్తే అంత బాగా ‘ఖ్యాతి’ వచ్చినట్టుగా, ‘డబ్బు’లు వస్తాయన్నట్టుగా ఆన్లైన్ వేదికలు తయారయ్యాయి. అవతలి వ్యక్తికి కలిగే బాధ మీద డబ్బు సంపాదించుకోవడం అతి మామూలు విషయంగా మారిపోవడంతో ఇలాంటి ‘వెంటాడే చిత్రాలు’ మన జీవితంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. అయోమయ పరిస్థితిని కలిగిస్తున్నాయి. మరేం చేయాలి? డేటా ప్రొటెక్షన్‌లో భాగంగా ‘రైట్ టు ఫర్గెట్’ హక్కు ఉండాలి. వ్యక్తిగత స్వేచ్ఛకు, స్వతంత్రతకు భంగం వాటిల్లకుండా ఉండాలి. అందుకు ప్రపంచవ్యాప్తంగా మేధావి వర్గం కలిసి ఓ నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమయ్యింది ఈ లోపు మనం చేయాల్సినవి... ► www.cybercrime.gov in లోనూ, హెల్ప్‌లైన్ 155260 కి ఫోన్ చేసి.. ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తూ ఫిర్యాదు చేయాలి. ముఖ్యంగా మహిళ తన పరువుకు భంగం కలిగిందని ఫిర్యాదు చేస్తే.. ఆమెకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సంబంధించిన డేటా 24 గంటల్లోపు తొలగించాలనేది చట్టంలో ఉంది. కాబట్టి ఫిర్యాదులో వెనుకంజ వేయకూడదు. ► సైబర్‌క్రైమ్ విభాగం సాయం తీసుకోవాలి. సోషల్ మీడియా నిర్వహణ మనం సృష్టించిన దానికి తగిన ప్రోత్సాహం లభించడానికి, ఇతరులు మన ఆలోచనలను సానుకూలంగా అర్ధం చేసుకోవడానికి సోషల్ మీడియా గొప్ప రహదారి. పాత స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి మంచి అవకాశం. దీంతోపాటు మన కుటుంబంలోని వ్యక్తుల అభిరుచుల, ఆలోచనలనూ గమనించవచ్చు. పరస్పర చర్యల ఆధారంగా ఒక వ్యక్తి ప్రవర్తనా అంశాన్ని సోషల్ మీడియా పర్యవేక్షిస్తుంది. అలాగే, డాక్యుమెంట్ చేయబడుతుంది. అలాగే, తన వ్యాపార ప్రయోజనం కూడా ఉంటుంది. కాబట్టి అత్యుత్సాహం చూపకుండా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఆఫ్‌లైన్‌లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటామో.. అదే విధంగా ఆన్లైన్ వేదికలు, మనం వెలిబుచ్చే అభిప్రాయాలు, పంచుకునే చిత్రాలు.. అన్నింటి పట్లా జాగరూకతతో ఉండాలి. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
హ్యాకర్ల ఆటలు..!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ పుణ్యమా అని ఇప్పుడు డిజిటల్ ప్రపంచానికి, వాస్తవానికి మధ్య అంతరం దాదాపుగా చెరిగిపోయింది. ఐటీ ఉద్యోగాలు ఇళ్లకు చేరిపోవడం, పాఠశాలలు నట్టింట్లోకి వచ్చేయడం, కొత్త ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తరచూ కొనేస్తుండటంతో మనకొచ్చిన సౌలభ్యమేమిటో తెలియదు గానీ.. సైబర్ నేరగాళ్ల పంట పండుతోంది.. ఈ కోవిడ్ కాలంలోనూ హ్యాకర్ల పని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ భద్రతపై ఇకనైనా కాసింత దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖ ఐటీ భద్రత సంస్థ నార్టన్ జరిపిన ఒక సర్వే ప్రకారం ఇటీవలి కాలంలో సైబర్ నేరాల తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. డిజిటల్ వెల్నెస్ రిపోర్ట్ పేరుతో సిద్ధం చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.. కోవిడ్ మహమ్మారి కాలంలో హ్యాకర్లు కంపెనీల నెట్‌వర్క్‌లలోకి చొరబడటం, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ఎక్కువైంది. నార్టన్ లైఫ్‌లాక్ సైబర్ సేఫ్టీ ఇన్సైట్స్ 2019 నివేదిక ప్రకారం.. భారత్‌లో సర్వేలో పాల్గొన్న వారిలో కనీసం 39 శాతం మంది వ్యక్తిగత గుర్తింపు తస్కరణ బారినపడ్డారు. మాల్వేర్ల సాయంతో కంప్యూటర్లపై పట్టు సాధించి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరించడం సాధారణమైపోతోంది. ఈ సమాచారాన్ని బ్రోకర్లకు అమ్ముకుని హ్యాకర్లు సొమ్ము చేసుకుంటున్నారు..సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ క్లుప్తంగా వీపీఎన్ చాలా ముఖ్యమని డిజిటల్ వెల్బీయింగ్ 2020 సర్వే ద్వారా స్పష్టమైంది. ఇంటి నుంచి పనిచేస్తున్న సిబ్బంది కంపెనీతో సురక్షిత పద్ధతిలో కనెక్టయ్యేందుకు వీపీఎన్ ఉపయోగపడుతుంది. సమాచారం మొత్తాన్ని రహస్య సంకేత భాషలోకి మార్చేయడం వల్ల హ్యాకర్ల పప్పులు ఉడకవు. వైర్లెస్ ఫిడిలిటీ లేదా వైఫై కనెక్షన్‌కూ భద్రత ఏర్పాట్లు ఉండేలా చూసుకోవడం ద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడటం తక్కువవుతుందని, బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా లభించే వైఫై విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఈ సర్వే తెలిపింది. డిజిటల్ వెల్నెస్ రిపోర్ట్ కోసం సర్వే చేసిన వారిలో 24 శాతం మంది పబ్లిక్ వైఫై ఉపయోగిస్తున్నట్లు తెలపడం ఇక్కడ గమనించదగ్గ విషయం..లాక్డౌన్ సమయంలో కేవైసీ (నో యువర్ కస్టమర్) పేరుతో వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని దొంగిలించడం ఎక్కువైందని తేలింది. డార్క్‌వెబ్‌లో నిక్షిప్తమయ్యే ఈ సమాచారాన్ని తొలగించడం అంత సులువు కాదు. అందువల్లనే ఆన్లైన్లో ఎవరితోనైనా సమాచారం పంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. -
ఆండ్రాయిడ్ ఫోన్లకు మాల్వేర్ ముప్పు!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల నుంచి బ్యాంకింగ్ తదితర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ‘బ్లాక్‌రాక్’ పేరుతో ఓ మాల్వేర్ చలామణిలో ఉందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఒకటి గురువారం హెచ్చరించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని దాదాపు 337 అప్లికేషన్ల నుంచి ఈ మాల్వేర్ సమాచారాన్ని సేకరించగలదని, ఈమెయిల్, ఈకామర్స్, సోషల్‌మీడియా, బ్యాంకింగ్ ఆప్స్ కూడా ఇందులో ఉన్నాయని ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ’క్లుప్తంగా సెర్ట్.ఇన్ హెచ్చరించింది. ఈ ట్రోజన్ వైరస్ ఇప్పటికే ప్రపంచమంతా చక్కర్లు కొడుతోందని సెర్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్లాక్‌రాక్‌ను క్సెరెక్స్ బ్యాంకింగ్ మాల్వేర్ సోర్స్‌కోడ్ ఆధారంగా తయారు చేశారని ఈ క్సెరెక్స్ అనేది లోకిబోట్ ఆండ్రాయిడ్ ట్రోజాన్ అని సెర్ట్ తెలిపింది. ఈ వైరస్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడినప్పుడు యాప్ డ్రాయర్ నుంచి తన ఐకాన్‌ను దాచివేస్తుందని, ఆ తరువాత గూగుల్అప్డేట్ రూపం దాల్చి అనుమతులు కోరుతుందని వివరించారు. ఒక్కసారి అనుమతులిస్తే.. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే సమాచారం లాగేస్తుందని సెర్ట్ తెలిపింది. గుర్తు తెలియని అప్లికేషన్లను డౌన్లోడ్/ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండటం, అప్లికేషన్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, వినియోగదారుల సమీక్షలను కూడా గమనించి ఒక నిర్ణయం తీసుకోవడం.. అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునే ముందు అదనపు సమాచారం ఏముందో తెలుసుకోవడం, తెలియని వైఫై నెట్‌వర్క్‌లకు దూరంగా ఉండటం ద్వారా ఈ మాల్వేర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. -
నమ్మి ఫోన్ ఇస్తే.. నట్టేట ముంచుతారు..!
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ యుగంలో చేతిలో ఉన్న ఫోన్ స్మార్ట్‌గా పనిచేయకపోతే వెనకబడిపోతాం. దానిలో ఏ చిన్న లోపం తలెత్తిన ఆగమేఘాలపై రిపేర్ సెంటర్లకు పరుగెడతాం. అయితే, తగు జాగ్రత్తలు తీసుకోకుండా రిపేరర్ చెప్పే కస్టమర్ ఫ్రెండ్లీ మాటల్లో పడి గోప్యంగా ఉంచాల్సిన ఫోన్ పాస్వర్డ్ చెప్తే నట్టేట మునిగినట్టేనని అంటున్నారు కొందరు బాధితులు. ఫోన్ రిపేర్ కోసం వెళ్తే తన వ్యక్తిగత ఫోటోలను లూటీ చేసి ఎలా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారో శ్వేతా దీక్షిత్(27) అనే యువతి పోలీసులకు చెప్పుకుని వాపోయారు. ‘నా స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే పగిలిపోవడంతో రిపేర్‌కోసం కరోల్‌బాగ్‌లోని గఫార్ మార్కెట్‌కి గత నెలలో వెళ్లాను. రిపేర్ నిమిత్తం ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని షాప్ అతను అడిగాడు. రిపేర్ చేయాలంటే పాస్వర్డ్ తప్పనిసరిగా కావాలన్నాడు. అతని మాటలు నమ్మి పాస్వర్డ్ చెప్పాను. ఎలాగైతేనేం ఫోన్ బాగయితే చాలు అనుకున్నాను. మూడు గంటల అనంతరం ఫోన్ బాగుచేసి తిరిగిచ్చాడు. కానీ, మూడు రోజుల అనంతరం అసలు కథ మొదలైంది. అపరిచిత నెంబర్ల నుంచి బ్లాక్‌మెయిలింగ్ కాల్స్ వచ్చాయి. నీ వ్యక్తిగత ఫొటోలు మావద్ద ఉన్నాయి. లక్ష రూపాయల్వికుంటే వాటిని యూట్యూబ్‌లో, పోర్న్ సైట్లలో పెడతామని బెదిరింపులకు గురిచేశారు. ఊహించని పరిణామం ఎదురవడంతో బిత్తరపోయాను. ఘటనపై ఈమెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని చెప్పారు. ‘శ్వేత ఫిర్యాదుపై విచారణ చేపట్టాం. మొబైల్ రిపేర్ చేసిన వ్యక్తే ఫోటోలు దొంగిలించాడని తేలింది. అయితే, ఫోన్ నెంబర్లు నకిలీ చిరునామాలతో ఉండటంతో నిందితులను గుర్తించడం కష్టమవుతోంది. దర్యాప్తు కొనసాగుతోంది. కస్టమర్ల వ్యక్తిగత ఫొటోలు, సమాచారం దొంగిలించి బ్లాక్మెయిర్లకు షాప్ వాళ్లు అమ్ముకుంటున్నట్టు మా విచారణలో తేలింది. అందుకే ఫోన్ రిపేర్‌కు ఇచ్చేటప్పుడు అందులో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని డిలీట్ చేసి ఇవ్వాలి. యువతులే టార్గెట్‌గా బ్లాక్‌మెయిలర్లు పంజా విసురుతారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు యువతులు చిత్రవధ అనుభవిస్తారు. బయటికి చెప్పుకోలేక ఆత్మహత్యకు యత్నించిన వారూ ఉన్నారు. ప్రైవేటు వ్యవహారాలు పబ్లిక్ అవుతాయేమోనని ఫిర్యాదు చేయడం కూడా అరుదే. ఒకవేళ ఫిర్యాదు చేయాల్సివస్తే ఆన్లైన్నే ఆశ్రయిస్తున్నారు’ అని ఢిల్లీ సైబర్‌క్రైం డిప్యూటీ కమిషనర్ అనీష్రాయ్ చెప్పారు. ఇక డిలీట్ చేసిన సమాచారాన్ని కూడా తిరిగి రిట్రైవ్ చేసే కేటుగాళ్లు ఉండటం కలవరపెట్టే అంశం. -
మీ ఫోన్.. మీపైనే నిఘా..!
న్యూయార్క్: మీ స్మార్ట్‌ఫోన్ ఏయే పనులు చేస్తుందో తెలుసా..? కాల్స్, మెసేజ్‌లు, ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియా కనెక్టింగ్ ఇలా అన్ని పనులు చేస్తుందం టారా..? అయితే ఇవన్నీ మీకు తెలిసి.. మీరు చేస్తే జరుగుతున్న పనులు. మరీ మీకు తెలియకుండా మీ స్మార్ట్‌ఫోన్ చేస్తున్న దొంగపనుల సంగతేంటీ..! అని శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. మీకు తెలియకుండా స్మార్ట్‌ఫోన్‌లోని అనేక ప్రముఖ యాప్‌లు మీరు చేసే ప్రతీ పనిని గమనిస్తున్నాయి. కాదు.. కాదు.. మీ మీద నిరంతరం నిఘా పెడుతున్నాయి. అలాగే మీ విషయాలను స్క్రీన్షాట్లు, వీడియోలు కూడా తీసుకుని.. థర్డ్‌పార్టీలకు చేరవేస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. ఈ వీడియోలు, స్క్రీన్షాట్లలో యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారంతోపాటు మీకు సంబంధించిన ప్రతీ వ్యక్తిగత సమాచారం కూడా అవతలి వ్యక్తులు లేదా సంస్థలకు చేరిపోతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఫోన్లో మనం చేసే ప్రతీ యాక్టివిటీనీ రికార్డు చేసే సామర్థ్యం ప్రతీ యాప్‌కు ఉందని తాము కనుగొన్నట్లు బోస్టన్లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ చోఫిన్స్ పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఎక్కువగా వాడే 17 వేలకు పైగా యాప్‌లను పరిశోధకులు పరీక్షించారు. వీటిలో 9 వేల యాప్‌లకు స్క్రీన్షాట్లు తీయగల సామర్థ్యం ఉందని.. వీటిలో ఏ యాప్ కూడా స్క్రీన్షాట్లు తీస్తున్నట్లు మనకు ఎలాంటి నోటిఫికేషన్ కూడా పంపకపోవడం ఆందోళన కలిగించే అంశమని వివరించారు. ఈ అధ్యయనాన్ని కేవలం ఆండ్రాయిడ్ ఆపరే టింగ్ సిస్టమ్ ఆధారిత యాప్‌ల మీద చేసినప్పటికీ.. ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఏమంత సురక్షితమైనవి కావని వెల్లడించారు. మెడికల్ యాప్‌లు సమాచారాన్ని ఇతరులతో పంచుకుం టున్నాయని తెలిపారు. ఈ అధ్యయన ఫలి తాలను బార్సిలోనాలో జరగనున్న ప్రైవసీ ఎన్హాన్సింగ్ టెక్నాలజీ సింపోజియమ్ సమావేశంలో సమర్పించనున్నారు. -
మృతుని ఖాతాల వివరాలు వారసులకు ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: మృతుని అకౌంట్ల వివరాలను వ్యక్తిగత సమాచారం పేరుతో అతని వారసులకు ఇచ్చేందుకు నిరాకరించ రాదని పేర్కొన్న కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) సంబంధిత అధికారికి జరిమానా విధించింది. చనిపోయిన తన తండ్రికి సంబంధించిన పోస్టాఫీసు అకౌంట్ల వివరాలు అందజేయాల్సిందిగా ఓ వ్యక్తి పోస్టల్ సూపరింటెండెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అది వ్యక్తిగత సమాచారం కాబట్టి, తాము ఇవ్వలేమంటూ సూపరింటెండెంట్ నిరాకరించారు. దీనిపై బాధితుడు సీఐసీని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు.. ‘హిందూ వారసత్వ చట్టం ప్రకారం మృతునికి దరఖాస్తుదారు చట్టపరమైన వారసుడు. కాబట్టి అతడు వ్యక్తిగత వివరాలు కోరినట్లుగా పరిగణించలేము. తండ్రికి సంబం ధించిన అన్ని అకౌంట్ల వివరాలు తెలుసుకునే హక్కు అతనికి ఉంది. మృతుని కుటుంబానికి పోస్టాఫీసు ఎటువంటి డబ్బు కూడా చెల్లించలేదు. కాబట్టి, దరఖాస్తు దారు అడిగిన మేరకు అకౌంట్లు, నిల్వల వివరాలు అందజే యాల్సిందే’ అని పేర్కొన్నారు. అంతేకాదు, దరఖాస్తుదారును ఇబ్బంది పెట్టినందుకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. -
అసభ్య పోస్టులపై ఫిర్యాదు.. పట్టపగలే దారుణం!
పుణే : మహారాష్ట్రలోని పుణేలో దారుణం చోటుచేసుకుంది. సోదరి ఫొటోలు అప్లోడ్ చేస్తూ ఆమె గురించి అసభ్యంగా పోస్టులు పెడుతున్నాడని ఫిర్యాదు చేసిన యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. పట్టపగలే బస్సులో కత్తితో దాడి చేసి హత్యకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖేడ్ టెహ్‌సిల్‌లోని దవాడికి చెందిన ఓ యువతిని వారికి దూరపు బంధువు వేధింపులకు గురి చేస్తున్నాడు. గత కొంతకాలం నుంచి యువతి ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అసభ్య పదజాలం వాడుతున్నాడు. వ్యక్తిగత సమాచారంతో పాటు ఫొటోలు పోస్టు చేస్తున్నాడంటూ బాధితురాలి సోదరుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న నిందితుడు తనపై ఫిర్యాదు చేసిన యువకుడిని హతమార్చాలని ప్లాన్ చేశాడు. మంగళవారం యువకుడి కంటే ముందుగానే నిందితుడు దవాడిలో బస్సు ఎక్కాడు. బస్సు వెళ్తుండగా ఒక్కసారిగా వెనకనుంచి యువకుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. బస్సులోని వారు షాక్‌కు గురై ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ బస్ ఆపగా.. నిందితుడు పారిపోయాడు. బస్సులోని ప్రయాణికులు, మృతుడి కుటుంసభ్యులు చెప్పిన వివరాలతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై ఫిర్యాదు చేసినందుకే ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. -
లొంగిపోయారో..లైఫ్ రిస్కే..!!
సాక్షి, న్యూఢిల్లీ: ‘హాయ్ నేనొక చైనా విద్యార్థిని. నా స్టడీలో భాగంగా ఇండో-చైనా సరిహద్దులపై ఒక వ్యాసం తయారు చేయాల్సివుంది. మీకు ఇబ్బంది లేదనుకుంటే.. వారి దైనందిన జీవితానికి సంబంధించి కొంత సమాచారం ఇస్తారా? నా నుంచి మీకేదైనా సహాయం అవసరమైతే చెప్పండి. తప్పక చేస్తాను’. ఇలాంటి మాటలతో భారత జవాన్లతో దాయాది దేశం పాకిస్తాన్, పొరుగునున్న చైనా దేశాల గూఢచర్యం ముఠాలు స్నేహం చేస్తున్నాయి. గత రెండు, మూడేళ్లుగా సోషల్ మీడియా కేంద్రంగా ఇలాంటి ధోరణి పెరిగిపోయిందనీ.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే మాదిరిగా సోషల్ మీడియా మారే ప్రమాదముందని భారతీయ పారామిలటరీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీసర్చ్ స్కాలర్స్‌గా, టూరిస్టులుగా.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భద్రతా సిబ్బందితో రీసర్చ్ స్కాలర్స్‌గా, టూరిస్టులుగా తమను తాము పరిచయం చేసుకుని స్నేహం పేరుతో చనువుగా ఉండి దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని తస్కరించాలని చైనా, పాకిస్తాన్ గూఢచారులు యత్నిస్తున్నారని సోషల్‌మీడియా పర్యవేక్షణాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా బీఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సీఆర్పీఎఫ్ భద్రతా దళాలపై ఈ విధమైన ఎత్తుగడలు సాగుతున్నాయని అధికారులు తెలిపారు. యూనిఫాంతో ఫోటోలు, వీడియోలు వద్దు.. ఉద్యోగ విషయాలు, వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో ఇతరులతో పంచుకోకపోవడమే ఉత్తమమని అధికారులు అంటున్నారు. యూనిఫాం ధరించి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని భద్రతా సిబ్బందికి నిపుణులు సూచిస్తున్నారు. కొత్త వ్యక్తుల నుంచి వచ్చే పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్, ట్వీటర్, వీకాంటాక్ట్, క్యూజోన్, ఓడ్నోక్లాసినికి, లింక్డ్ఇన్, గూగుల్ ప్లస్ వంటి సోషల్ వేదికల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. విదేశీ మహిళతో స్నేహం చేస్తూ.. సోషల్ మీడియాలో ఒక విదేశీ మహిళతో స్నేహం చేస్తూ.. దేశ భద్రతకు చెందిన సున్నితమైన సమాచారాన్ని తస్కరించే యత్నం చేశాడనే ఆరోపణలపై ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పటిష్టమైన సాంకేతిక వ్యవస్థ ఏర్పాటు వల్ల మళ్లీ అలాంటి ఉదంతాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సైనికుల కదలికలపై దృష్టి.. ‘ఇప్పటి వరకు మా పర్యవేక్షణా, నిఘాల్లో తేలింది ఏంటంటే.. మన దేశానికి చెందిన సున్నితమైన, ఆందోళనకరమైన ప్రదేశాల్లో ఎంతమంది సైనికులు పనిచేస్తున్నారు. ప్రధానంగా వారి కదలికలు ఏ వైపుగా సాగుతున్నాయి. భద్రతా బలగాలు ఉపయోగిస్తున్న ఆయుధ సామాగ్రి విశేషాలను తస్కరించే యత్నాలు సోషల్ వేదికల ద్వారా జరుగుతున్నాయ’ని సైబర్ పాలసీ అడ్వయిజర్ సుబీమల్ భట్టాచార్ జీ చెప్పారు. -
ఆధార్ లీకేజీ కలకలం!
న్యూఢిల్లీ: ఆధార్ భద్రతపై వెల్లువెత్తుతున్న అనుమానాలకు మరో రుజువు దొరికింది. ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఓ కంప్యూటర్లో ఆధార్ కార్డు ఉన్న వారి వ్యక్తిగత సమాచారం, పేర్లు, 12 అంకెలుండే ఆధార్ నంబర్‌తోపాటు బ్యాంక్ అకౌంట్ల వివరాలు కూడా లభ్యమయ్యాయని బిజినెస్ టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్ జెడ్డీ నెట్ తెలిపింది. అయితే, ఏ సంస్థ కంప్యూటర్లలో ఇలా ఆధార్ సమాచారం దొరుకుతోందో జెడ్డీ నెట్ వెల్లడించలేదు. అయితే, ఈ పరిణామం ఆధార్ భద్రతను ప్రశ్నార్ధకం చేస్తోందని నిపుణులు అంటున్నారు. ఆధార్ వివరాలు తెలుసుకునేందుకు ముందుగా యూనిఫాం రిసోర్స్ లొకేటర్‌ను గుర్తించాల్సి ఉంటుంది..దీనిని కేవలం 20 నిమిషాల్లోనే కనిపెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రభుత్వ సంస్థల కంప్యూటర్లలో ఇటువంటివి జరుగుతున్నట్లు తెలిసినా వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. అయితే, ఆధార్ సమాచారం లీకవుతోందంటూ వచ్చిన వార్తలను యూఐడీఏఐ ఖండించింది. ఆధార్ వివరాలకు పూర్తి భద్రత, రక్షణ ఉందని తెలిపింది. లీకేజీ వాస్తవమనుకున్నప్పటికీ వెల్లడైన సమాచారం ఆ రాష్ట్ర ప్రభుత్వ విభాగానికి చెందినదై ఉంటుందనీ, దానికి ఆధార్‌తో ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. ఆధార్ సంఖ్య తెలిసినా∙పూర్తి వ్యక్తిగత సమాచారం లీకయినట్లు కాదని పేర్కొంది. -
వ్యక్తిగత సమాచారాన్ని ఎందుకు సేకరించారు?
న్యూఢిల్లీ: పౌరుల్ని గుర్తించడానికి ఆధార్ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి క్రోడీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌ల రాజ్యాంగ ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. సింగపూర్‌లో ప్రతి పౌరుడు చిప్ ఆధారిత గుర్తింపు కార్డును కలిగిఉంటాడనీ, ఈ పద్ధతిలో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం సేకరించదని సుప్రీం వ్యాఖ్యానించింది. దీంతో ఆధార్‌పై నెలకొన్న భయాందోళనల్ని తొలగించడానికి వీలుగా న్యాయస్థానంలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సీఈవో అజయ్ భూషణ్ పాండేను అనుమతించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. గోప్యత హక్కు కంటే పేదప్రజలు గౌరవంగా బతకడమే ముఖ్యమన్నారు. దీంతో రాజ్యాంగ ధర్మాసనం స్పందిస్తూ.. పేదవారు కూడా గోప్యత హక్కును కలిగిఉంటారనీ, వాటిని ప్రభుత్వం ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. -
మేమెప్పుడూ మీ వివరాలు అడగం: ఆర్బీఐ
మోసపూరిత ఈ-మెరుుల్స్తో జాగ్రత్త హైదరాబాద్: ప్రజలను తామెప్పుడూ బ్యాంక్ అకౌంట్, పాస్వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వివరాలను అడగబోమని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇలాంటి వివరాల కోసం తాము ప్రజలకు ఎలాంటి ఈ-మెరుుల్స్, ఎస్ఎంఎస్లు, కాల్స్ చేయమని పేర్కొంది. ఈ మేరకు ప్రజలు మోసపూరిత ఈ-మెరుుల్స్, కాల్స్, ఎస్ఎంఎస్ పట్ల అవగాహనతో ఉండాలని సూచించింది. ఇవి ఒక్కొక్కసారి ఆర్బీఐ నుంచి వచ్చిన ఈ-మెరుుల్స్, ఎస్ఎంఎస్లు లాగే ఉంటాయని, అలాంటప్పుడు జాగ్రత్తతో వ్యవహరించాలని, వాటికి రెస్పాండ్ కావొద్దని విజ్ఞప్తి చేసింది. తామెప్పుడూ ఎవరికీ డబ్బుల్ని ఆఫర్ చేయమని పేర్కొంది. -
కలత చెందుతున్న ఫేస్ బుక్ యాజమాన్యం?
2015 సంవత్సరం మధ్యకాలం నుంచి ప్రాభవాన్ని కోల్పోతున్నామనే ఆందోళన ఫేస్ బుక్ యాజమాన్యాన్ని వేధిస్తోంది. ఫేస్ బుక్ ఉన్నత ఉద్యోగులతో సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఫేస్ బుక్ యాజమాన్యం అంతగా కలత చెందడానికి కారణమేంటంటే.. ఫేస్ బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచార పోస్టులు క్రమేపీ తగ్గుతున్నాయట. ఫలితంగా ఫేస్ బుక్ యూజర్లను ప్రతి ఏటా కోల్పోతున్నామని ఆందోళన చెందుతోంది. ఫేస్ బుక్ మనకు పాత స్నేహితుడిలా ఉంటూ, వ్యక్తిగత జీవితం గురించి ఏమైనా షేర్ చేసుకునే అవకాశం కల్పించింది. కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారింది. వ్యక్తిగత సమాచారం ఎక్కువగా ఫేస్ బుక్ లో కనిపించట్లేదు. షేరింగ్ లు తక్కువ అవుతున్నాయి. పెళ్లివేడుకలు, పిల్లల పుట్టినరోజులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఇంకా ప్రజలకు అందుబాటులో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా ఏడాది ఏడాదికి 5 శాతం తగ్గుతూ ఉన్నాయి. అదేవిధంగా వ్యక్తిగత సమాచారం కూడా 21 శాతం తగ్గుతోంది. ప్రజలు ఫేస్ బుక్ టన్నుల సమాచారం షేర్ చేస్తున్నారని, కానీ మొత్తంగా చూస్తే అదంత ఎక్కువ సమాచారం కాదని ఫేస్ బుక్ అధికారికంగా తెలుపుతోంది. సోషల్ నెట్ వర్క్ సైట్లలోనే వ్యక్తిగత సమాచారం షేరింగ్ తగ్గుతోందని తెలిపింది. దీనిపై ఫేస్ బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ ఉద్యోగులతో చర్చించినట్టు సమాచారం. 'కంటెంట్ పరంగా పతనం' ప్రధానమైన అంశంగా ఫేస్ బుక్ ఉద్యోగులు దీనిపై విశ్లేషించనున్నారు. పరిమితులు లేని యూజర్లు ఇంటర్ నెట్ వినియోగదారులుగా ఉండటం, సన్నిహితం కాని వారికి కూడా ఇది ఉద్దేశించడటంతో కంటెంట్ పరంగా పతనమవుతోందని భావిస్తున్నారు. వ్యక్తిగత సమాచార షేరింగ్ ఇప్పుడే ఫేస్ బుక్ పై ప్రభావం చూపదని, కానీ ఇది ఇలాగే కొనసాగటం మంచిది కాదని విశ్లేషకులంటున్నారు.