స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులతో సహా 90 లక్షల కార్డ్ హోల్డర్ల ఆర్థికపరమైన డేటా భారీ లీకైనట్లు సైబర్-సెక్యూరిటీ పరిశోధకులు బయటపెట్టారు. సింగపూర్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు జరుపుతున్న CloudSEK సంస్థ ఈ విషయాన్ని గుర్తించింది. వారి పరిశోధనలో.. రష్యాకు చెందిన డార్క్ వెబ్ సైబర్ క్రైమ్ ఫోరమ్‌లో 1.2 మిలియన్ కార్డ్‌ల డేటాబేస్‌ను ఉచితంగా అందుబాటులో ఉన్నట్లు తేలింది.
వీటితో పాటు 7.9 మిలియన్ కార్డ్ హోల్డర్ డేటా BidenCash వెబ్‌సైట్‌లో ఉన్నట్లు కనుగోన్నారు. గతంలో మాదిరి కాకుండా, ఈసారి, హ్యాకర్లు SSN, కార్డ్ వివరాలు, CVV వంటి ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని విడుదల చేశారని బృందం వెల్లడించింది. వీటితో పాటు కార్డ్ వివరాలతో అనుసంధానించిన చాలా వ్యక్తిగత ఇమెయిల్‌లు కూడా బయటపడ్డాయి. BidenCash ద్వారా గతంలో సాఫ్ట్‌బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సింగపూర్‌తో అనుబంధించబడిన అధికారిక ఇమెయిల్‌ల రికార్డులు కూడా లీక్ అయ్యాయి.
"స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫిసర్వ్ సొల్యూషన్స్ LLC, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు కొన్ని అగ్రశ్రేణి బ్యాంకింగ్ సంస్థల కస్టమర్ల డేటా కూడా లీక్ అయ్యింది. మాస్టర్‌కార్డ్, వీసా నెట్‌వర్క్‌లకు సంబంధించిన 414,000 రికార్డులతో సుమారు 508,000 డెబిట్ కార్డ్‌ల వివరాలు కూడా బహిర్గతమైంది." అని భద్రతా పరిశోధకులు దేశాయ్ తెలిపారు. ఈ కార్డుల సమాచారం లీక్ వల్ల అక్రమ కొనుగోళ్ళు, కార్డ్ క్లోనింగ్, అనధికారిక లావాదేవీలు జరుగుతాయని దేశాయ్ అన్నారు. BidenCash వెబ్ సైట్ తన సైట్ కు ట్రాఫిక్‌ను పెంచుకోవడం కోసం ఈ తరహా చర్యలకు పాల్పడుతూ ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment