న్యూయార్క్: మీ స్మార్ట్‌ఫోన్ ఏయే పనులు చేస్తుందో తెలుసా..? కాల్స్, మెసేజ్‌లు, ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియా కనెక్టింగ్ ఇలా అన్ని పనులు చేస్తుందం టారా..? అయితే ఇవన్నీ మీకు తెలిసి.. మీరు చేస్తే జరుగుతున్న పనులు. మరీ మీకు తెలియకుండా మీ స్మార్ట్‌ఫోన్ చేస్తున్న దొంగపనుల సంగతేంటీ..! అని శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. మీకు తెలియకుండా స్మార్ట్‌ఫోన్‌లోని అనేక ప్రముఖ యాప్‌లు మీరు చేసే ప్రతీ పనిని గమనిస్తున్నాయి. కాదు.. కాదు.. మీ మీద నిరంతరం నిఘా పెడుతున్నాయి.
అలాగే మీ విషయాలను స్క్రీన్‌షాట్లు, వీడియోలు కూడా తీసుకుని.. థర్డ్‌పార్టీలకు చేరవేస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. ఈ వీడియోలు, స్క్రీన్‌షాట్లలో యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్స్, క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారంతోపాటు మీకు సంబంధించిన ప్రతీ వ్యక్తిగత సమాచారం కూడా అవతలి వ్యక్తులు లేదా సంస్థలకు చేరిపోతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఫోన్‌లో మనం చేసే ప్రతీ యాక్టివిటీనీ రికార్డు చేసే సామర్థ్యం ప్రతీ యాప్‌కు ఉందని తాము కనుగొన్నట్లు బోస్టన్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ చోఫిన్స్ పేర్కొన్నారు.
ఈ అధ్యయనంలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా వాడే 17 వేలకు పైగా యాప్‌లను పరిశోధకులు పరీక్షించారు. వీటిలో 9 వేల యాప్‌లకు స్క్రీన్‌షాట్లు తీయగల సామర్థ్యం ఉందని.. వీటిలో ఏ యాప్ కూడా స్క్రీన్‌షాట్లు తీస్తున్నట్లు మనకు ఎలాంటి నోటిఫికేషన్ కూడా పంపకపోవడం ఆందోళన కలిగించే అంశమని వివరించారు. ఈ అధ్యయనాన్ని కేవలం ఆండ్రాయిడ్ ఆపరే టింగ్ సిస్టమ్ ఆధారిత యాప్‌ల మీద చేసినప్పటికీ.. ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఏమంత సురక్షితమైనవి కావని వెల్లడించారు. మెడికల్ యాప్‌లు సమాచారాన్ని ఇతరులతో పంచుకుం టున్నాయని తెలిపారు. ఈ అధ్యయన ఫలి తాలను బార్సిలోనాలో జరగనున్న ప్రైవసీ ఎన్‌హాన్సింగ్ టెక్నాలజీ సింపోజియమ్ సమావేశంలో సమర్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment