Surveillance eyes
-
Sharad Pawar: నాపై నిఘాకే జెడ్ ప్లస్ భద్రత
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున తన కదలికలపై అధికారిక సమాచారం కోసమే తనకు జెడ్ ప్లస్ భద్రతను కలి్పంచి ఉండొచ్చని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. శరద్ పవార్‌కు వీఐపీ భద్రతలో అత్యున్నతమైన జెడ్ ప్లస్ భద్రతను బుధవారం కేంద్రం కల్పించింది. 55 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బృందం ఆయనకు రక్షణ కలి్పస్తారు. ముప్పును అంచనా వేసి కేంద్ర ఏజెన్సీలు ఈ మేరకు సిఫారసు చేశాయని కేంద్రం పేర్కొంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీపై అడగ్గా.. భద్రత పెంపునకు కారణాలు తనకు తెలియదని పవార్ విలేకరులతో అన్నారు. ‘ముగ్గురికి జెడ్ ప్లస్ భద్రత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని, అందులో నేనొకడినని హోంశాఖ అధికారి ఒకరు నాకు తెలిపారు. మిగతా ఇద్దరు ఎవరని అడగ్గా.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, హోంమంత్రి అమిత్ షాలని ఆ అధికారి బదులిచ్చారు’ అని పవార్ వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున నాపై నిఘాకు ఈ ఏర్పాటు చేశారేమోనని 83 ఏళ్ల పవార్ అన్నారు. విపక్ష మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లు భాగస్వాములనే విషయం తెలిసిందే. -
గాల్లో గూఢచారులు: స్పై బెలూన్లు... కథా కమామిషు
ఓ బెలూన్ కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా గగనతలంపై 60 వేల అడుగుల ఎత్తున ఎగురుతూ కన్పించిన ఈ చైనా బెలూన్ కచ్చితంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను భారీగా పెంచేసింది. అది కచ్చితంగా నిఘా బాపతేనని అమెరికా, వాతావరణ పరిశోధనలు చేస్తూ దారి తప్పిందని చైనా వాదిస్తున్నాయి. సైనిక రంగంలో నిఘా బెలూన్ల వాడకం ఈ ఉదంతంతో మరోసారి తెరపైకి వచ్చింది... ఈ కాలంలోనూ అవసరముందా? సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ఉపగ్రహాలు, డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఈ నిఘా బెలూన్లతో పనేమిటన్న సందేహాలు సహజం. కానీ ఇప్పటికీ మిలటరీలో ఈ బెలూన్లకు ఎంతో ప్రాధాన్యముంది. ఉపగ్రహాలతో పోలిస్తే వీటిని చాలా చౌకలో తయారు చేయొచ్చు. నిర్ధిష్ట గగన తలాలకు పంపడమూ ఎంతో సులభం. గాలివాటానికి అనుగుణంగా బెలూన్ల దిశను మార్చవచ్చు. అత్యంత ఎత్తులో ప్రయాణించే ఈ బెలూన్లు సేకరించే సమాచారం, ఫొటోలు చాలా నాణ్యతతో ఉంటాయి. లక్షిత గగనతలాల్లో రోజుల తరబడి ప్రయాణించే సత్తా వీటికుంది. చైనా ప్రయోగం వెనక... అమెరికా, చైనా మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొంటూనే ఉన్నాయి. తైవాన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు, చైనాలో మానవహక్కుల నుంచి హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్యం నిర్వీర్యం చేసే చర్యల దాకా తరచూ ఘర్షణాత్మక వాతావరణం నెలకొంటూనే ఉంది. కొంతకాలం క్రితం అప్పటి అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శన నాటి నుంచీ విభేదాలు మరింత ముదిరాయి. చైనా 34 యుద్ధ విమానాలను,, 9 యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. ప్రతిగా తైవాన్ కూడా యుద్ధ విమానాల్ని సన్నద్ధం చేయడం, తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించడం ఉద్రిక్తతల్ని పెంచింది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ చైనా పర్యటనకు కొద్ది రోజుల ముందే చైనా నిఘా బెలూన్ ఇలా అమెరికా గగనతలంలోకి ప్రవేశించి కలకలం రేపింది. తద్వారా అగ్రరాజ్యానికి చైనా ఓ రకంగా హెచ్చరికలు పంపిందని భావిస్తున్నారు. ఎప్పట్నుంచి వాడుకలో ఉన్నాయి? ► ఈ బెలూన్లను ఫ్రెంచి విప్లవం కాలం నుంచే వాడుతున్నారు. యుద్ధ భూమిలో ఆస్ట్రియా, డచ్ సైనిక దళాల కదలికలు తెలుసుకునేందుకు 1794లో ఫ్రాన్స్ వీటిని తొలిసారి వాడింది. ► గాల్లో చాలా ఎత్తున ఎగిరే ఈ బెలూన్ల ద్వారా సమాచార సేకరణ తేలిక కావడంతో అమెరికా అంతర్యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వీటి వాడకం పెరిగింది. ► రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక అడుగు ముందుకేసి ప్రత్యర్థులపై ఈ బెలూన్లతో బాంబు దాడులకు దిగిన సందర్భాలూ ఉన్నాయి! జపాన్ సైన్యం ప్రయోగించిన బెలూన్ బాంబు అమెరికాలో ఒరెగాన్ వుడ్‌ల్యాండ్‌లో పడి ముగ్గురు పౌరులు మరణించారు. ► రెండో ప్రపంచ యుద్దం తర్వాత ప్రాజెక్ట్ జెనెట్రిక్స్ పేరుతో అమెరికా ఈ బెలూన్లపై విస్తృతంగా ప్రయోగాలు చేసింది. 1950లో వీటి సాయంతో సోవియట్ భూభాగాన్ని ఫొటోలు తీసింది. ► అమెరికా ఆర్మీ ప్రాజెక్టు మొగల్ పేరుతో బెలూన్లకు మైక్రోఫోన్లను అమర్చి సోవియట్ యూనియన్ అణు పరీక్షలకు సంబంధించిన శబ్దాలను రికార్డు చేసింది. ఏమిటీ నిఘా బెలూన్లు? నిఘా బెలూన్లను అత్యంత తేలికైన హీలియం వాయువుతో నింపుతారు. కెమెరాలు, రాడార్లు, సెన్సార్లు, కమ్యూనికేషన్ పరికరాలు అమర్చుతారు. అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు సుదూర ప్రాంతాల్లోని సమాచారాన్ని కూడా అత్యంత స్పష్టతతో సేకరించగలవు. ప్రయాణికుల విమానాలు 40 వేల అడుగుల ఎత్తు దాటవు. ఈ స్పై బెలూన్లు భూమికి 60 వేల నుంచి, లక్షా 50 వేల అడుగుల ఎత్తులో రోజుల తరబడి ప్రయాణించే సామర్థ్యం కలిగినవి. స్పై బెలూన్లు... కథా కమామిషు ► ప్రచ్ఛన్న యుద్ధ తొలినాళ్లలో వీటిని విరివిగా వాడారు ► అత్యంత ఎత్తుల్లో రాడార్లకూ చిక్కకుండా వెళ్లగలవు ► సౌర పలకలు ► నిఘా పరికరాలు ► గాలివాటంగా కదులుతాయి ► కిందివైపు కెమెరా ఉంటుంది ► రాడార్ వ్యవస్థలను అనుసంధానించవచ్చు ► 24వేల నుంచి 37వేల మీటర్ల ఎత్తులో ప్రయాణించగలవు – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీ ఫోన్.. మీపైనే నిఘా..!
న్యూయార్క్: మీ స్మార్ట్‌ఫోన్ ఏయే పనులు చేస్తుందో తెలుసా..? కాల్స్, మెసేజ్‌లు, ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియా కనెక్టింగ్ ఇలా అన్ని పనులు చేస్తుందం టారా..? అయితే ఇవన్నీ మీకు తెలిసి.. మీరు చేస్తే జరుగుతున్న పనులు. మరీ మీకు తెలియకుండా మీ స్మార్ట్‌ఫోన్ చేస్తున్న దొంగపనుల సంగతేంటీ..! అని శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. మీకు తెలియకుండా స్మార్ట్‌ఫోన్‌లోని అనేక ప్రముఖ యాప్‌లు మీరు చేసే ప్రతీ పనిని గమనిస్తున్నాయి. కాదు.. కాదు.. మీ మీద నిరంతరం నిఘా పెడుతున్నాయి. అలాగే మీ విషయాలను స్క్రీన్షాట్లు, వీడియోలు కూడా తీసుకుని.. థర్డ్‌పార్టీలకు చేరవేస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. ఈ వీడియోలు, స్క్రీన్షాట్లలో యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారంతోపాటు మీకు సంబంధించిన ప్రతీ వ్యక్తిగత సమాచారం కూడా అవతలి వ్యక్తులు లేదా సంస్థలకు చేరిపోతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఫోన్లో మనం చేసే ప్రతీ యాక్టివిటీనీ రికార్డు చేసే సామర్థ్యం ప్రతీ యాప్‌కు ఉందని తాము కనుగొన్నట్లు బోస్టన్లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ చోఫిన్స్ పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఎక్కువగా వాడే 17 వేలకు పైగా యాప్‌లను పరిశోధకులు పరీక్షించారు. వీటిలో 9 వేల యాప్‌లకు స్క్రీన్షాట్లు తీయగల సామర్థ్యం ఉందని.. వీటిలో ఏ యాప్ కూడా స్క్రీన్షాట్లు తీస్తున్నట్లు మనకు ఎలాంటి నోటిఫికేషన్ కూడా పంపకపోవడం ఆందోళన కలిగించే అంశమని వివరించారు. ఈ అధ్యయనాన్ని కేవలం ఆండ్రాయిడ్ ఆపరే టింగ్ సిస్టమ్ ఆధారిత యాప్‌ల మీద చేసినప్పటికీ.. ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఏమంత సురక్షితమైనవి కావని వెల్లడించారు. మెడికల్ యాప్‌లు సమాచారాన్ని ఇతరులతో పంచుకుం టున్నాయని తెలిపారు. ఈ అధ్యయన ఫలి తాలను బార్సిలోనాలో జరగనున్న ప్రైవసీ ఎన్హాన్సింగ్ టెక్నాలజీ సింపోజియమ్ సమావేశంలో సమర్పించనున్నారు. -
నగరంలో మరో చైన్ స్నాచింగ్
* పద్మారావునగర్‌లో వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ * నిఘానేత్రానికి చిక్కిన నిందితుడు హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరంలో మరో గొలుసు దొంగతనం జరిగింది. పద్మారావునగర్‌లో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే స్నాచింగ్ దృశ్యాలు నిఘానేత్రానికి చిక్కాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. పద్మారావునగర్‌కు చెందిన రామనాథరావు, రమాదేవి(70) భార్యాభర్తలు. బుధవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రి వెనుక గల డయాగ్నోస్టిక్ సెంటర్లో వైద్య పరీక్షలు చేయించుకుని నడుచుకుంటూ వెళుతుండగా.. వెనుక నుంచి వచ్చిన చైన్ స్నాచర్ రమాదేవి మెడలోని గొలుసు తెంపబోయాడు. ఆమె గట్టిగా పట్టుకోవడంతో చిన్న బంగారు గొలుసు ముక్క స్నాచర్ చేతిలో ఉండిపోయింది. రామనాథరావు వాకింగ్ స్టిక్‌తో నిందితుడిని నిలువరించబోయేలోగా అతను పరిగెత్తుకుంటూ వెళ్లి నిలిపి ఉంచిన వాహనంపై పరారయ్యాడు. ఈ క్రమంలో రామనాథరావు కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. -
నిఘా నేత్రాలతోనే ‘సేఫ్ సిటీ’
సైదాబాద్: నిఘా నేత్రాలతోనే సేఫ్ సిటీ సాధ్యమని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శనివారం అన్నారు. సైదాబాద్ డివిజన్ తిరుమల హిల్స్‌లో సేఫ్ కాలనీలో భాగంగా ఏర్పాటు చేసిన 34 సీసీ కెమెరాలు, ప్రధాన గేట్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాలనీ సంక్షేమ సంఘాల సహకారంతో, సేఫ్ కాలనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పటిష్ట శాంతి భద్రతలకు అక్కడి పోలీస్ వ్యవస్థే కారణమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 24 అంతస్తులతో నిర్మించనున్న భవనంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, న గరంలోని మొత్తం సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థను రూపొందిస్తామని పేర్కొన్నారు. మలక్‌పేట ఎమ్మెల్యే బలాల మాట్లాడుతూ..సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. -
తిరుపతిపై నిఘా నేత్రం!
కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ఆలయ పట్టణం తిరుపతిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూసేందుకు రాష్ట్ర పోలీసు విభాగం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నిఘా నేత్రాన్ని మరింత విస్తృతం చేస్తోంది. ఇప్పటికే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)ని నెలకొల్పి పట్టణవ్యాప్తంగా 184 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. వీటి సంఖ్యను 600కు పెంచాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వానికి పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అదేసమయంలో ఈ పైలట్ ప్రాజెక్టును రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నాలకూ విస్తరించాలని యోచిస్తోంది. తిరుపతి సురక్షితానికే: శరవేగంగా విస్తరిస్తున్న తిరుపతిని సురక్షిత ప్రాంతంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీ జాస్తి వెంకట రాముడు గతంలో ఆదేశాలిచ్చారు. ఆ మేరకు రాయలసీమ ఐజీ వి.వేణుగోపాలకృష్ణ, చిత్తూరు ఎస్పీ జి.శ్రీనివాస్ తిరుపతిలో నేరగాళ్లకు చెక్ చెప్పడంతోపాటు ట్రాఫిక్ నియంత్రణకోసం వినియోగానికి, భద్రతాంశాలకు సమప్రాధాన్యమిస్తూ సీసీసీ ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో తొలిదశలో.. కీలకంగా భావిస్తున్న 184 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని సీసీసీతో అనుసంధానించారు. ఇక్కడుండే సిబ్బంది అనునిత్యం సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న దృశ్యాలను అధ్యయనం చేస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్నవారికి అవసరమైన సూచనలిస్తుంటారు. ఇది అందుబాటులోకొచ్చిన రెండు నెలల్లోనే చెప్పుకోదగిన ఫలితాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. పలు చైన్స్నాచింగ్స్తోపాటు ఇతర నేరాలు జరిగిన కొన్ని నిమిషాల్లోనే నిందితుల్ని గుర్తించి పట్టుకున్నారు. ఇటీవల సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం దృష్టికి అధికారులు ఈ అంశాలను తీసుకెళ్లారు. సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం నిఘా నేత్రం విస్తరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పట్టణంలోకి దారితీసే రహదారులతోపాటు పలుప్రాంతాల్లో 600 కెమెరాల ఏర్పాటుకు డీజీపీ కార్యాలయం ప్రతిపాదనలు రూపొందిస్తోంది. కెమెరాలేగాక వీడియో అనలిటిక్స్ పేరుతో ఆధునిక సాఫ్ట్‌వేర్స్‌ను సమీకరించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు తిరుపతిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకొచ్చాక రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నారు. వీడియో అనలిటిక్స్‌లో ఉండేవివీ.. ఫేసియల్ రికగ్నేషన్ సిస్టం: సీసీసీలోని సర్వర్‌లో పాత నేరగాళ్లు, వాంటెడ్ వ్యక్తులేగాక మిస్సింగ్ కేసుల్లోని వారి ఫొటోలను నిక్షిప్తం చేస్తారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌వల్ల పట్టణంలోని ఏ కెమెరా ముందుకైనా వీరొస్తే కంప్యూటర్ తక్షణం గుర్తించి సిబ్బందికి తెలియజేస్తుంది. సస్పీషియస్ అలార్మింగ్ సిస్టమ్: ఎవరైనా అనుమానిత వ్యక్తి, వస్తువు, వాహనం ఓ ప్రదేశంలో నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు కదలకుండా ఉంటే దాన్ని కెమెరా ద్వారా కంప్యూటర్ గుర్తించి అలారమ్‌తో సమాచారమిస్తుంది. ఆటోమేటెడ్ నంబర్‌ప్లేట్ రికగ్నేషన్ సిస్టం(ఏఎన్పీఆర్): వాహనాల నంబర్ప్లేట్లను గుర్తించడానికి ఇది ఉపకరిస్తుంది. చోరీ వాహనాలు, హిట్ అండ్ రన్ కేసుల్లో ఉన్నవాటితోపాటు భారీగా ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాలు పట్టణంలో ఎక్కడ తిరిగినా గుర్తించే కెమెరాలు సీసీసీలో ఉన్నవారిని అప్రమత్తం చేస్తాయి. సిట్యువేషన్ మేనేజ్మెంట్ సిస్టం పట్టణవ్యాప్తంగా ఎక్కడైనా బాంబు పేలినా, తుపాకీ కాల్పులు జరిగినా, అగ్నిప్రమాదం సంభవించినా ఈ సిస్టంతో అనుసంధానించి ఉన్న కెమెరాలు గుర్తించి సమాచారమిస్తాయి. -
నిఘా కళ్లకు గంతలు
రాజంపేట: స్మగ్లర్లు నిఘా కళ్లకు గంతలు కట్టి ఎర్రచందనం రవాణాలో సరికొత్త మార్గం ఎంచుకున్నారు. ఇన్నాళ్లుగా దుంగల రూపంలో విదేశాలకు ఎగుమతి చేసే విధానానికి స్వస్తి చెప్పి... బొమ్మల రూపంలో ఎర్రబంగారంను తరలిస్తున్నారు. బెంగళూరు పోలీసులు తాజాగా పలువురిని అరెస్టు చేయడంతో ఎర్రబొమ్మల స్మగ్లింగ్ వెలుగు చూసింది. దీంతో ఎపీ పోలీసులు అప్రమత్తమయ్యూరు. బొమ్మల రూపంలో భారీగా బరువు కలిగిన దుంగలను తరిలించడం వల్ల లబ్ధి పొందవచ్చునని స్మగ్లర్లు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు అటవీ నిఘా వర్గాలు గుర్తించారుు. నాణ్యత కలిగిన దుంగలతో బొమ్మలను తయారుచేసి రూ50వేల నుంచి రూ.1లక్షదాకా అమ్ముతున్నారు. చైనాలో కిలోబరువు ఉన్న బొమ్మ రూ.2లక్షలు దాకా పలుకుతుంది. గ్రేడ్-1 దుంగలను కిలో రూ7వేల వంతను కొనుగోలు చేయడం ద్వారా బొమ్మల బిజినెస్ నిర్వహిస్తున్నారు. చైనా నుంచి బెంగళూరు, చెన్నై, గోవా తదితర పర్యాటక ప్రదేశాలకు వచ్చే విదేశీయులతో బొమ్మసైజు, బరువుపై ఆర్డర్లు తీసుకోవడం జరుగుతోంది. బెంగుళూరులోని హొసకోట వద్ద ఓ గోడౌన్ తీసుకుని అక్కడి నుంచి ఆర్డర్లు విదేశాలకు వెళుతున్నాయని అటు కర్నాటక, ఇటు ఆంద్రప్రదేశ్ పోలీసులు దృష్టి సారించారు. పట్టుబడిన వారి నుంచి సమాచారం రాబేట్టందుకు రంగంలోకి యాంటీ రెడ్ శ్యాండిల్ ఫోర్స్‌ను రంగంలోకి దింపినట్లు అటవీ వర్గాల సమాచారం. అయితే అధికారికంగా రాజంపేట ఫార్టెసు డివిజన్ పరిధిలో శెట్టిగుంట, లక్ష్మింగారిపల్లెలో కొయ్య బొమ్మల తయారీతో జీవనం సాగిస్తున్నారు. లే పాక్షికి ఈ బొమ్మలు సరఫరా చేస్తున్నారు. ఈ బొమ్మలు తయారు చేసే కళాకారులకు గతంలో ప్రభుత్వం ప్రోత్సాహం అందచేసిన సంగతి విధితమే. ఇప్పుడైతే ఆ పరిస్ధితులు కనిపించడంలేదు. అటవీమార్గాల్లో నిఘానేత్రాలు.. శేషాచలం అటవీ మార్గాల్లో నిఘానేత్రాలు ఏర్పాటుచేసే దిశగా అటవీశాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. కడప, రాజంపేట ప్రాంతాల పరిధిలో విస్తరించిన శేషాచల అటవీ ప్రాంతాల్లో సీసీ కెమారాలు పెట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తాజాగా హైదరాబాదులో ఇదే విషయంపై పీసీసీఎఫ్ జోసెఫ్ ఇతర అధికారులతో సమీక్షించారు. శేషాచలం అటవీ పరిధిలో రాజంపేట డివిజన్లో 57వేల హెక్టార్లు, కడప డివిజన్ పరిధిలో 20వేల హెక్టార్లలో, ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో 48వేల హెక్టార్లలో విస్తరించి ఉందని అటవీ రికార్డులు చెపుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో వాటిని పరిరక్షించుకునేందుకు అటవీశాఖ దృష్టి సారించింది. ఎర్రచందనం చెట్లను లెక్కించే ప్రక్రియను కూడా ఇది వరకే చేపట్టారు. ఎర్రచందనం లెక్కతేల్చేందుకు ఇంటర్నేషనల్ ప్రమాణాలు కలిగిన కన్సల్టెంట్‌ను నియమించేందుకు సన్నాహాలు అటవీశాఖ చేస్తోంది. సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి శేషాచలంఅటవీ మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై అటవీశాఖ దృష్టి పెట్టింది. త్వరలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే అంశం పరిశీలిస్తున్నారు. చెక్‌పోస్టులలో కొయ్యబొమ్మలు వెళుతున్నా పట్టుకోవడం జరుగుతుంది. అటవీ ప్రాంతంలో చిన్న, పెద్దచెట్లను లెక్కిస్తున్నాం. వెంకటేశ్, డీఎఫ్ఓ, రాజంపేట నిఘా కళ్లు, ఎర్రచందనం, విదేశాలకు ఎగుమతి, Surveillance eyes, red scandal, exported