సైదాబాద్: నిఘా నేత్రాలతోనే సేఫ్ సిటీ సాధ్యమని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శనివారం అన్నారు. సైదాబాద్ డివిజన్ తిరుమల హిల్స్‌లో సేఫ్ కాలనీలో భాగంగా ఏర్పాటు చేసిన 34 సీసీ కెమెరాలు, ప్రధాన గేట్‌లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాలనీ సంక్షేమ సంఘాల సహకారంతో, సేఫ్ కాలనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో పటిష్ట శాంతి భద్రతలకు అక్కడి పోలీస్ వ్యవస్థే కారణమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 24 అంతస్తులతో నిర్మించనున్న భవనంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, న గరంలోని మొత్తం సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థను రూపొందిస్తామని పేర్కొన్నారు. మలక్‌పేట ఎమ్మెల్యే బలాల మాట్లాడుతూ..సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు.
నిఘా నేత్రాలతోనే ‘సేఫ్ సిటీ’
Published Sat, May 30 2015 10:41 PM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement