సీక్రెట్ ఫైళ్లు దాచేసుకోండి..!
మీ స్మార్ట్‌ఫోన్ మీ వ్యక్తిగతం. మీకు సంబంధించిన ఫైళ్లు, ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు పూర్తిగా మీకే ప్రత్యేకం. కానీ కుటుంబసభ్యులు, స్నేహితులతో సహా ఎవరూ చూడకూడదనుకుని మీరు దాచుకున్న ముఖ్యమైన ఫైళ్లు కొన్నిసార్లు అనుకోకుండానే ఇతరుల కంట పడుతుంటాయి. ఫలితంగా ఇబ్బందులూ తలె త్తుతుంటాయి. అందుకే స్మార్ట్‌ఫోన్ ఏదైనా.. ఫైళ్లను గోప్యంగా దాచుకునేందుకు పలు చక్కని మార్గాలున్నాయి...
ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైళ్లను సురక్షితంగా, గోప్యంగా ఉంచాలంటే పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌తో కూడిన ఫోల్డర్లు అవసరం. అప్పుడే పాస్‌వర్డ్ తెలియకుండా ఇతరులు ఎవరూ మీ ఫైళ్లను ఓపెన్ చెయ్యలేరు. గతంలో కంప్యూటర్లపైనే అందుబాటులో ఉన్న ఈ సౌకర్యం ఇప్పుడు అన్ని స్మార్ట్‌ఫోన్‌లలోనూ అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్‌లలో ఫైళ్లను గోప్యంగా దాచేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన అప్లికేషన్ల గురించి తెలుసుకుందాం...
కీప్ సేఫ్
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫైళ్లను హైడ్ చేసేందుకు ఉపయోగపడే ముఖ్యమైన ఆప్ కీప్ సేఫ్. మొదట ఆండ్రాయిడ్ మార్కెట్ నుంచి ఈ ఆప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత నాలుగు అంకెల ఓ పిన్ సెట్ చేసుకుని ఓకే చేయాలి. పిన్ నంబర్ మర్చిపోతే తిరిగి తెలుసుకునేందుకు వీలుగా ఈ-మెయిల్ రిమైండర్ ఆప్షన్‌ను కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. తర్వాత హైడ్ చేయాలనుకున్న ఫైళ్లను సెలక్ట్ చేసుకుని షేర్ బటన్‌పై క్లిక్ చేయాలి. కీప్‌సేఫ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అంతే. ఇక ఆ ఫైళ్లు ఇతరులెవరికీ కనిపించవు. వాటిని తెరవాలంటే మీ కీప్‌సేఫ్ పిన్ కొట్టాల్సిందే. అలాగే కీప్‌సేఫ్ నుంచి ఫైళ్లను అన్‌హైడ్ చేయాలంటే.. కీప్‌సేఫ్ గ్యాలరీలోకి వెళ్లాలి. బయటికి తీయాల్సిన ఫైళ్లపై లాంగ్‌ప్రెస్ చేయాలి. తర్వాత కనిపించే పాప్ అప్‌లో అన్‌హైడ్‌పై క్లిక్‌చేయాలి. కొన్నిసార్లు అన్‌హైడ్ చేసిన ఫైళ్లు వెంటనే కనిపించకపోతే, ఆండ్రాయిడ్‌ను రీబూట్ చేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్‌తోపాటు ఐఫోన్‌పై కూడా ఈ ఆప్‌ను ఉపయోగించవచ్చు. దీనిని https://play. google.com/store/appsనుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫొటోలాకర్ ఆప్‌తోనూ ఆండ్రాయిడ్‌లో ఫొటోలను దాచుకునేందుకు వీలవుతుంది. దీనిని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈ లింకు https://play.google. com/store/ apps/ details?id=com.handyapps.photoLockerలోకి వెళ్లండి. ఇంకా gallery lock pro, file cover, free data vault, video safe, gallery privateవంటి ఆప్‌లను కూడా ఆండ్రాయిడ్‌లపై ప్రయత్నించొచ్చు. వీటన్నింటినీ గూగుల్ ప్లే నుంచి ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాలిక్యులేటర్‌లోనే ఫొటోలు, వీడియోలూ!
చూడటానికి అందమైన కాలిక్యులేటర్. దానిపై లెక్కలు చేయడమే కాదు, చాటున ఫొటోలు, వీడియోలు కూడా దాచేసుకోవచ్చు. కాలిక్యులేటర్ మాదిరిగా కనిపించే ఇంటర్‌ఫేస్‌తో ఉండే వినూత్న ఆప్ ‘స్పైకాల్క్’. దీనితో ఐఫోన్‌లో ఫొటోలు, వీడియోలను హైడ్ చేయొచ్చు. సాధారణ కాలిక్యులేటర్ మాదిరిగానే పనిచేసే ఈ ‘కాలిక్యులేటర్’పై మనం ముందుగా సెట్ చేసుకున్న కొన్ని నెంబర్లను టైప్ చేస్తే సరి... ఫైళ్లను హైడ్, అన్‌హైడ్ చేసుకోవచ్చు. దీనిలో ఉచిత వెర్షన్‌లో కూడా అన్ని ఫీచర్లు ఉన్నా..
యాడ్స్ ఆధారితంగా ఉంటుంది కాబట్టి యాడ్స్ గోల ఉండకూడదనుకుంటే కొంత డబ్బు వెచ్చించాల్సిందే. దీనిని https://itunes.apple.com/ us/app/spy-calc-free-hide... నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జుడఝట అనే మరో కాలిక్యులేటర్ మాదిరిగా ఉండే సరదా ఆప్ కూడా ఐఫోన్‌పై పనిచేస్తుంది. అలాగే ఐఫోన్‌లో వీడియోలను సులభంగా ఆల్బమ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి హైడ్ చేసేందుకు ఉపయోగపడే మరో బెస్ట్ అప్లికేషన్ ఠిజీఛీౌ్ఛ ట్చజ్ఛ. ఇక ఐఫోన్, ఐపాడ్, ఐపాడ్ టచ్‌లలో వివిధ రకాలుగా ఫైళ్లను దాచేసేందుకు the secret folderఆప్ కూడా ఉపయోగపడుతుంది. ప్రైవేట్ ఫొటో వాల్ట్ ఆప్ పాస్‌వర్డ్/ప్యాటర్న్-లాకింగ్ ద్వారా కూడా మీ ఫైళ్లకు మూడు స్థాయిల్లో రక్షణ కల్పిస్తుంది. నాలుగంకెల పిన్‌ను సెట్ చేసుకోవడం ద్వారా ఫొటోలను పూర్తిగా హైడ్ చేసేందుకు లేదా లాక్ చేసేందుకు వీలవుతుంది. ఇంకా ఞజీఛి ౌఛిజు 2.0 అనే మరో ఆప్‌ను కూడా ఐఫోన్‌పై ప్రయత్నించొచ్చు. దీనిని కూడా itunes.apple.comనుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
లాక్ అండ్ హైడ్
విండోస్ ఫోన్‌లో ఫైళ్లను లాక్ చేసి దాచేసే బెస్ట్ ఉచిత ఆప్ ఇది. ఫోన్‌లో పిక్చర్ హబ్ మాదిరిగానే కనిపించే ఆల్బమ్ ఇంటర్‌ఫేస్‌తో కూడిన ఈ ఆప్ ఫైళ్లకు రక్షణ ఇవ్వడంతోపాటు వేగంగా పనిచేస్తుంది. దీనితో ఫైళ్లను అన్నింటినీ ఎన్‌క్రిప్ట్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ ఫైళ్లను ప్రైవేట్ ఆల్బమ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. పూర్తిస్థాయిలో ఫైళ్లను దాచే సేందుకు ్ఖజ్టీ ఇౌఠ్ఛిట్ట్ఛట అనే మరో ఉచిత ఆప్‌నూ ప్రయత్నించొచ్చు. విండోస్ ఫోన్ 8పై పనిచేసే బెస్ట్ ప్రైవసీ ఆప్ pic lock ultimateను కూడా www.windowsphone.comనుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే దీనికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే private lite, file lockerఆప్‌లను ఉపయోగించి కూడా విండోస్‌ఫోన్‌లలో ఫైళ్లను సురక్షితంగా దాచేసుకోవచ్చు. ఇక బ్లాక్‌బెర్రీ ఫోన్లలో ఫైళ్లను హైడ్ చేసేందుకు ఞటivate photo, private camera, applock™ోపాటు ఇంకా పలు ఆప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ ఆప్‌ను అయినా అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసి వాడుకోవడమే ఉత్తమం.
-హన్మిరెడ్డి యెద్దుల