ఒడిసిపట్టిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
వాషింగ్టన్: భూ ఉపరితల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అద్భుతమైన చిత్రాలను కెమెరాల్లో బంధించింది. కనువిందు చేసే ఆకుపచ్చ, ఊదా రంగుల కాంతి పుంజాల (ఆరోరా) ఫొటోలు, వీడియోలను భూమికి పంపింది.
ఆరోరాల పైనుంచి అంతరిక్ష కేంద్రం పయనిస్తున్న సమయంలో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఉత్తర ధ్రువజ్యోతి అని, కాంతి ప్రవాహం అని పిలిచే అరోరాలు భూమి నుంచి అరుదుగా కనిపిస్తుంటాయి. గాలి రేణువులు, విద్యుత్ శక్తి కలిగిన సూర్యకాంతి రేణువులు భూ అయస్కాంత క్షేత్రంలో ఢీకొన్నప్పుడు అరోరాలు ఏర్పడుతుంటాయి. ఇవి సాధారణంగా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగుల్లో కనిపిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment