Whatsapp Caption Edit Feature: వాట్సాప్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఇప్పటికే మెసేజ్ ఎడిట్ ఫీచర్ పరిచయం చేయగా.. ఇప్పుడు మరో లేటెస్ట్ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. వాట్సాప్‌లో ఇప్పుడు ఫొటోస్, వీడియోలు, గిఫ్ట్స్, డాక్యుమెంట్స్ క్యాప్షన్ కూడా ఎడిటింగ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఆ తరువాత ఈ ఫీచర్ అందరికి అందుబాటులోకి వస్తుంది. ఇది తప్పకుండా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము.
ఇదీ చదవండి: ఇషా అంబానీ కారు.. దూరం నుంచి అలా.. దగ్గర నుంచి ఇలా!
ఇప్పటి వరకు ఇలాంటి ఎడిటింగ్ ఫీచర్ అందుబాటులో లేదు. అయితే ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌తో ఒకసారి పంపిన వీడియో, ఫోటో క్యాప్షన్ సులభంగా ఎడిట్ చేయవచ్చు. కావున మీరు పంపించి క్యాప్షన్‌లో ఏదైనా తప్పులుంటే కేవలం 15 నిమిషాలు లోపు మాత్రమే ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఎడిట్ చేసుకునే అవకాశం లేదు. దీనిని వినియోగాదారులు తప్పకుండా గమనించాలి.
Comments
Please login to add a commentAdd a comment