WhatsApp Edit Message: వాట్సాప్ అనేది ఎక్కువ మంది వినియోగించే యాప్‌లలో ఒకటి. ఈ యాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ 'ఎడిట్ మెసేజ్ ఫీచర్' అనే మరో కొత్త ఫీచర్ గురించి పరిచయం చేసింది. ఇంతకీ ఈ ఎడిట్ మెసేజ్ ఫీచర్ అంటే ఏమిటి? దీన్నెలా ఉపయోగించుకోవాలి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గత కొన్ని రోజులుగా ఎంతో మంది వాట్సాప్ యూజర్లు ఎదురు చూస్తున్న 'ఎడిట్ మెసేజ్ ఫీచర్' త్వరలోనే అమలులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా మెసేజ్ సెండ్ చేసిన 15 నిముషాల్లో దానిని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు పంపించిన మెసేజ్‌లో ఏదైనా తప్పు ఉంటే దానిని సెండ్ చేసిన పదిహేను నిముషాల్లో ఎడిట్ చేయవచ్చు. ఇటీవల వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే టెస్టింగ్ కోసం ఎడిట్ మెసేజ్ ఫీచర్ అందించింది. ఇప్పుడు సాధారణ యూజర్లకు రోల్అవుట్ మొదలుపెట్టింది.
(ఇదీ చదవండి: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఇక మార్కెట్లో రచ్చ రచ్చే!)
నిజానికి మనం అప్పుడప్పుడు వాట్సాప్ నుంచి మెసేజస్ పంపించినప్పుడు తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. దాన్ని డిలీట్ చేసి మళ్ళీ మెసేజ్ పంపించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎడిట్ మెసేజ్ ఫీచర్ ద్వారా మెసేజ్ డిలీట్ చేయకుండానే మళ్ళీ ఎడిట్ చేయవచ్చు. ఈ ఫీచర్ మెసేజ్ పంపిన 15 నిముషాల్లో ఉపయోగించుకోవాలి. పదిహేను నిముషాల తర్వాత మెసేజ్ ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. ఈ ఫీచర్స్ కేవలం టెక్స్ట్ మెసేజ్‍లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఫోటోలు, వీడియోలు, క్యాప్షన్ వంటి వాటిని సెండ్ చేసిన తరువాత ఎడిట్ చేయలేము.
వాట్సాప్ మెసేజ్ ఎడిట్ చేయడం ఎలా?
- ముందుగా మీరు మీరు వాట్సాప్‍లో సెండ్ చేసిన మెసేజ్‍పై ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఆ తరువాత ఆండ్రాయిడ్ డివైజ్‍ల్లో మెనూలోకి వెళ్లి ఎడిట్ ఆప్షన్‍పై ట్యాప్ చేయాలి.
- ఐఫోన్‍లలో మెసేజ్‍పై లాంగ్ ప్రెస్ చేసి, ఎడిట్ ఆప్షన్‍పై ట్యాప్ చేయాలి.
- వెబ్/డెస్క్‌టాప్‍లలో మెసేజ్ మెనూలోకి వెళ్లి ఎడిట్ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు.
- ఎడిట్ ఆప్షన్‍పై ట్యాప్ చేసి మెసేజ్ ఎడిట్ చేసి కరెక్ట్ చేసుకున్న తరువాత మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు.
- ఎడిట్ పూర్తయ్యాక, చెక్ మార్క్‌పై ట్యాప్ చేస్తే మెసేజ్ అప్‍డేట్ అవుతుంది.
ఇప్పటికే వాట్సాప్ కొందరు బీటా యూజర్లకు వాట్సాప్ ఎడిట్ మెసేజ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. సాధారణ యూజర్లందరికీ రోల్అవుట్‍ను నేడు వాట్సాప్ ప్రారంభించింది. కావున రానున్న కొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్, ఐఫోన్‍లలో వాట్సాప్ వాడుతున్న యూజర్లందరికీ ఈ ఎడిట్ మెసేజ్ ఫీచర్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఉపయోగించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment