కలత చెందుతున్న ఫేస్ బుక్ యాజమాన్యం?
2015 సంవత్సరం మధ్యకాలం నుంచి ప్రాభవాన్ని కోల్పోతున్నామనే ఆందోళన ఫేస్ బుక్ యాజమాన్యాన్ని వేధిస్తోంది. ఫేస్ బుక్ ఉన్నత ఉద్యోగులతో సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఫేస్ బుక్ యాజమాన్యం అంతగా కలత చెందడానికి కారణమేంటంటే.. ఫేస్ బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచార పోస్టులు క్రమేపీ తగ్గుతున్నాయట. ఫలితంగా ఫేస్ బుక్ యూజర్లను ప్రతి ఏటా కోల్పోతున్నామని ఆందోళన చెందుతోంది.
ఫేస్ బుక్ మనకు పాత స్నేహితుడిలా ఉంటూ, వ్యక్తిగత జీవితం గురించి ఏమైనా షేర్ చేసుకునే అవకాశం కల్పించింది. కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారింది. వ్యక్తిగత సమాచారం ఎక్కువగా ఫేస్ బుక్ లో కనిపించట్లేదు. షేరింగ్ లు తక్కువ అవుతున్నాయి. పెళ్లివేడుకలు, పిల్లల పుట్టినరోజులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఇంకా ప్రజలకు అందుబాటులో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా ఏడాది ఏడాదికి 5 శాతం తగ్గుతూ ఉన్నాయి. అదేవిధంగా వ్యక్తిగత సమాచారం కూడా 21 శాతం తగ్గుతోంది. ప్రజలు ఫేస్ బుక్ టన్నుల సమాచారం షేర్ చేస్తున్నారని, కానీ మొత్తంగా చూస్తే అదంత ఎక్కువ సమాచారం కాదని ఫేస్ బుక్ అధికారికంగా తెలుపుతోంది. సోషల్ నెట్ వర్క్ సైట్లలోనే వ్యక్తిగత సమాచారం షేరింగ్ తగ్గుతోందని తెలిపింది. దీనిపై ఫేస్ బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ ఉద్యోగులతో చర్చించినట్టు సమాచారం.
'కంటెంట్ పరంగా పతనం' ప్రధానమైన అంశంగా ఫేస్ బుక్ ఉద్యోగులు దీనిపై విశ్లేషించనున్నారు. పరిమితులు లేని యూజర్లు ఇంటర్ నెట్ వినియోగదారులుగా ఉండటం, సన్నిహితం కాని వారికి కూడా ఇది ఉద్దేశించడటంతో కంటెంట్ పరంగా పతనమవుతోందని భావిస్తున్నారు. వ్యక్తిగత సమాచార షేరింగ్ ఇప్పుడే ఫేస్ బుక్ పై ప్రభావం చూపదని, కానీ ఇది ఇలాగే కొనసాగటం మంచిది కాదని విశ్లేషకులంటున్నారు.