వాట్సాప్ నెంబర్ల షేరింగ్ను ఆపివేయొచ్చట!
వాట్సాప్ నెంబర్ల షేరింగ్ను ఆపివేయొచ్చట!
Published Sat, Aug 27 2016 4:15 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
వినియోగదారులు రహస్యాన్ని తుంగలో తొక్కుతూ వాట్సాప్ తన యూజర్ల నెంబర్ల సమాచారం పేరెంట్ కంపెనీ ఫేస్బుక్తో షేర్ చేసే కొత్త పాలసీ నుంచి యూజర్లు బయటపడేందుకు మార్గాలు ఉన్నాయట. వాట్సాప్ యూజర్లు తమ సమాచారాన్ని ఫేస్బుక్తో పంచుకోకుండా చేసుకోవచ్చట. సమాచారాన్ని తెలుపకుండే ఉండేందుకు వాట్సాప్ సెట్టింగ్స్ బాక్స్లో అన్టిక్ సదుపాయాన్ని కల్పించినట్టు వాట్సాప్ చెబుతోంది. ఆ ఫీచర్ ద్వారా యూజర్లు సమాచారాన్ని పంచుకోకుండా అన్ చెక్ చేసుకోవచ్చట.
ఈ ఫీచర్ల గురించి యూజర్లకు సరియైన అవగాహన లేకపోవడంతో యూజర్లు గుడ్డిగా కొత్త పాలసీలను అగ్రి చేస్తున్నారట. అలా యాప్ కొత్త విధానాలను గుడ్డిగా సమ్మతించకుండా.. కింద ఉన్న "రీడ్ మోర్" ఆప్షన్ను క్లిక్ చేస్తే చాలట. ఫేస్బుక్తో తమ సమాచారాన్ని వాట్సాప్ షేర్ చేయకుండా ఆపివేయొచ్చట.
ఒకవేళ మీరు ఆ కొత్త పాలసీలను యూజర్లు అగ్రి చేసినా..సమాచార షేరింగ్ నుంచి వైదొలగడానికి ఇంకా 30 రోజుల సమయాన్ని యూజర్లు సద్వినియోగం చేసుకోవచ్చట. యాప్ సెట్టింగ్స్ మెనూకి వెళ్లి, అకౌంట్ ట్యాబ్ను ప్రెస్ చేయాల్సి ఉంటుది. "షేర్ మై అకౌంట్ ఇన్ఫో" ను అన్ చెక్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఫేస్బుక్తో సమాచారాన్ని షేర్ చేసే ఎంపికను యూజర్లు ఆపివేయవచ్చని వాట్సాప్ పేర్కొంటోంది..
Advertisement
Advertisement