వాషింగ్టన్: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై మరో ఆరోపణ వచ్చింది. వినియోగదారుల వివరాలు పొందేందుకు కొన్ని సంస్థలకు ఫేస్‌బుక్ ప్రత్యేక అనుమతి ఇచ్చినట్టు మీడియాలో కథనాలొచ్చాయి. యూజర్ల ఫోన్ నంబర్లు, ఎఫ్‌బీ ఖాతాలో ఫ్రెండ్స్ తదితర వివరాలను అందించేందుకు సంస్థలతో ఒప్పందాలు చేసుకుందని, వీటిని ‘వైట్‌లిస్ట్స్’ అంటారని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా, నిస్సాన్ మోటార్ తదితర కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుందని పేర్కొంది. తాము అతికొద్దిమంది భాగస్వాములకు డేటా పొందేందుకు అనుమతినిచ్చినట్టు ఫేస్‌బుక్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment