ఎఫ్‌బీ చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్‌ లేఖ | Rahul Gandhi Shares Congress Letter To Zuckerberg | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ ఎగ్జిక్యూటివ్‌లపై చర్యకు డిమాండ్‌

Published Tue, Aug 18 2020 3:55 PM | Last Updated on Tue, Aug 18 2020 4:45 PM

Rahul Gandhi Shares Congress Letter To Zuckerberg - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విద్వేష కంటెంట్‌ను సోషల్‌ మీడియాలో వ్యాప్తి చేసేందుకు బీజేపీ నేతలను ఫేస్‌బుక్‌ అనుమతిస్తోందన్న వాల్‌స్ర్టీట్‌ కథనం నేపథ్యంలో ఎఫ్‌బీ చీఫ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్‌ పార్టీ రాసిన లేఖను ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ మంగళవారం షేర్‌ చేశారు. ఎన్నో పోరాటాలతో తాము సాధించుకున్న ప్రజాస్వామ్యాన్ని పక్షపాతం, నకిలీ వార్తలు, విద్వేష ప్రసంగాల ద్వారా దెబ్బతీసేందుకు తాము అనుమతించమని, దీనిపై ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నించాలని లేఖను వెల్లడిస్తూ రాహుల్‌ పేర్కొన్నారు. హేట్‌ స్పీచ్‌ పాలసీకి విరుద్ధంగా భారత్‌లో పాలక బీజేపీకి ఫేస్‌బుక్‌ దాసోహమైందని కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఫేస్‌బుక్‌ ఉన్నతాధికారుల పక్షపాత వైఖరిపై నిర్ధిష్ట కాలపరిమితితో విచారణ జరిపించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు.

హింసను ప్రేరేపించే విభజన వాద కంటెంట్‌ను అనుమతించేందుకు ఎఫ్‌బీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అంఖి దాస్‌ బీజేపీకి పావులా మారారని ఈ లేఖలో కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆగస్ట్‌ 14న వాల్‌స్ర్టీట్‌ జర్నల్‌లో ప్రచురించిన కథనం అనూహ్యమేమీ కాదని పార్టీ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ సంతకంతో కూడిన కాంగ్రెస్‌ లేఖ స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ వ్యవస్ధాపక నేతలు ప్రాణాలను పణంగా పెట్టి నెలకొల్పిన విలువలు, హక్కులకు పాతరవేయడంలో ఫేస్‌బుక్‌ ఉద్దేశపూర్వకంగానే భాగస్వామిగా మారిందని, అయితే ఇప్పటికీ దిద్దుబాటు చర్యలకు సమయం మించిపోలేదని జుకర్‌బర్గ్‌కు రాసిన లేఖలో పేర్కొంది. కాగా ప్రజల మత ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించారని పేర్కొంటూ ఫేస్‌బుక్‌ పాలసీ చీఫ్‌(భారత్‌) అంఖి దాస్‌పై కేసుపై నమోదైంది. గత రెండు రోజులుగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంపై కాంగ్రెస్‌, బీజేపీల నడుమ మాటల యుద్ధం సాగుతోంది. భారత్‌లో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లను పాలక బీజేపీ, ఆరెస్సెస్‌ నియంత్రిస్తున్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.

చదవండి : ఫేస్‌బుక్‌ను బీజేపీ నియంత్రిస్తోంది: రాహుల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement