Wall Street Journal report
-
అడ్వాంటేజ్ డొనాల్డ్ ట్రంప్.. హారిస్‌తో ఉత్కంఠ పోరు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పది రోజులే మిగిలి ఉంది. పోలింగ్ తేదీ నవంబర్ 5 దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార హోరు పెరిగింది. పోల్స్ ఫలితాలు కూడా తారుమారవుతున్నాయి. అధ్యక్ష బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకొన్న మొదట్లో వరుస పోల్స్ హారిస్ వైపే మొగ్గు చూపాయి. కానీ తీరా పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ పరిస్థితి క్రమంగా తారుమారు అవుతున్నట్టు కన్పిస్తోంది. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలోకి వెళ్తున్నారు. అంతేగాక తాజా పోల్స్‌లో సానుకూలతను పెంచుకున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ట్రంప్, హారిస్ పోరు తారాస్థాయికి చేరుతోంది. మొన్నటిదాకా సర్వేల్లో హారిస్ ఆధిక్యంలో ఉండగా తాజాగా ట్రంప్ కాస్త ముందంజలోకి వచ్చారు. వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా సర్వేలో ట్రంప్ 47 శాతం మద్దతు దక్కించుకోగా హారిస్‌కు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. సీఎన్‌బీసీ ఆల్ అమెరికన్ ఎకనమిక్ సర్వేలోనూ హారిస్ కంటే ట్రంప్ రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. హోరాహోరీ పోరు సాగుతున్న 7 కీలక స్వింగ్ రాష్ట్రాల్లోనూ తాజా సర్వేల్లో హారిస్ కంటే ట్రంప్ ఒక్క పాయింట్ ఆధిక్యం సాధించారు. డెమొక్రాట్ల కంచుకోటలైన మిషిగన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాతో పాటు నల్లజాతీయులు, లాటినో ఓటర్లలో ఆయన పట్టు సాధిస్తున్నారు.ఇది డెమొక్రాట్లకు ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ప్రధాన పోల్స్ అన్నింటినీ విశ్లేషించే రియల్క్లియర్పాలిటిక్స్ ప్రకారం హారిస్ ఇప్పటికీ ట్రంప్‌పై 0.3 శాతం ఆధిక్యంలో ఉన్నారు. కాకపోతే స్వింగ్ స్టేట్లలో మాత్రం ట్రంప్‌కే 0.9 శాతం మొగ్గుందని అది తేల్చింది. అమెరికా బెట్టింగ్ మార్కెట్ అయితే ట్రంప్ విజయావకాశాలను ఏకంగా 61 శాతంగా అంచనా వేసింది. హారిస్ గెలిచేందుకు 39 శాతం మాత్రమే చాన్సుందని పేర్కొంది. ట్రంప్‌పై కొన్ని రోజులుగా హారిస్ తీవ్ర విమర్శలు చేస్తుండటం తెలిసిందే. హిట్లర్‌ను ప్రశంసించిన ట్రంప్ అంతకంటే నియంత అంటూ దుయ్యబట్టారు. ఆయనో అసమర్థుడని ఎద్దేవా చేశారు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే పర్యవసానాల గురించి పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హారిస్ పాపులర్ ఓట్లను గెలుచుకోవచ్చని సర్వేలంటున్నాయి. కానీ కీలక రాష్ట్రాలను కైవసం చేసుకుంటేనే ఎన్నికల విజయం సాధ్యం. మరోవైపు చాలా రాష్ట్రాల్లో ఓటర్లకు హారిస్‌పై పలు అంశాల్లో ఇప్పటికీ అభ్యంతరాలున్నాయి. మరోవైపు ముందస్తు ఓటేసిన అమెరికన్ల సంఖ్య 3.1 కోట్లు దాటింది.పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యంస్వింగ్ రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైనది పెన్సిల్వేనియా. వాటిలో అత్యధికంగా 19 ఎలక్టోరల్ కాలేజీ ఓటు్లున్న రాష్ట్రం. ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రకటనలపైనే రెండు పార్టీలు కోట్లు వెచ్చించాయి. ఇక్కడి ఓటర్లు ఆర్థిక వ్యవస్థపై చాలా ఆందోళన చెందుతున్నారు. వారు క్రమంగా ట్రంప్ వైపే మొగ్గుతున్నారు. వివాదాస్పద, కుంభకోణాల వ్యక్తిగా ట్రంప్‌పై విముఖత ఉన్నా ఆయన హయాంలో ఆహారం, పెట్రోల్ ధరలు తక్కువగా ఉండేవని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి మహిళలు మాత్రం హారిస్ పట్ల సానుకూలంగా ఉన్నారు. ‘‘ట్రంప్ వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన దారుణం. ఆయన్ను మరోసారి వైట్‌హౌస్‌కు పంపించేదే లేదు’’ అంటున్నారు. కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, మాజీ ఉపాధ్యక్షుడు డిక్ షెనీ కూతురు లిజ్ షెనీ వంటివారి ప్రచారం కూడా హారిస్‌కు ఎంతో కొంత కలిసి రానుంది.‘అబార్షన్ హక్కులు’ ప్రభావం చూపేనా?హారిస్‌కు అమెరికావ్యాప్తంగా ఉన్న సానుకూలత మహిళా ఓటర్లలో బలమైన ఆధిక్యం. ఆమె అభ్యర్థిత్వమే చరిత్రాత్మకం. కానీ ఆమె దీనిపై ప్రచారం చేసుకోవడం లేదు. మహిళల అబార్షన్ హక్కులకు బలంగా మద్దతిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ప్రవేశపెట్టిన అత్యంత కఠినమైన అబార్షన్ నిషేధం మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీన్ని రాజ్యాంగంలో చేర్చాలా వద్దా అనే అంశాన్ని పది రాష్ట్రాలు ఓటింగ్‌కు పెట్టాయి. అలాంటి రాష్ట్రాల్లో అరిజోనాలో హారిస్‌కు మెజారిటీ వచ్చే అవకాశముంది. అయితే అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడు సృష్టించిన వాతావరణాన్ని హారిస్ బలంగా కొనసాగించలేకపోయినట్టు పోల్స్ చెబుతున్నాయి.డెమొక్రాట్లకు ‘గాజా’ షాక్ట్రంప్కే అరబ్–అమెరికన్ల జయహోకీలక రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్‌లో అరబ్–అమెరికన్ ఓటర్లు అత్యధికంగా ఉంటారు. 2020లో బైడెన్ కేవలం అక్కడ 1.5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు, ఇక్కడ అరబ్ అమెరికన్ల జనాభా 3 లక్షలు. గాజా, లెబనాన్లలో ఇజ్రాయెల్ దాడులను నియంత్రించడంలో బైడెన్ విఫలమయ్యారని వారంతా భావిస్తున్నారు. ఈ ప్రభావం నేరుగా డెమొక్రాట్ల అభ్యర్థి హారిస్‌పై పడేలా ఉంది. ఉపాధ్యక్షురాలిగా హారిస్ కూడా దీనికి బాధ్యురాలేనని వారు భావిస్తున్నారు. డెమొక్రాట్ల కంటే అధిక వామపక్ష భావాలున్న వారిలోనూ ఇదే ధోరణి కనబడుతోంది. ‘‘మేమంతా ట్రంప్‌కు ఓటేస్తాం. అంతేగాక ఆయనకే ఓటేయాలని ఇతరులకూ చెబుతాం’’ అని వారంటున్నారు. ‘‘మేం ట్రంప్‌కు ఓటేస్తామని ఏడాది కిందట ఊహించను కూడా లేదు. కానీ ఇప్పుడు డెమొక్రాట్లను క్షమించలేం. హారిస్‌కు ఓటేసేది లేదు’’ అని స్పష్టంగా చెబుతున్నారు. మిషిగన్‌లో కార్మికవర్గం, యూనియన్ల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. తామెవరికీ మద్దతివ్వబోమని ఇప్పటికే కొన్ని యూనియన్లు ప్రకటించాయి. హారిస్‌పై కొన్ని అభ్యంతరాలున్నా ఆమె తప్ప ప్రత్యామ్నాయం లేదని కొందరు భావిస్తుండటం ఆమెకు కాస్త కలిసొచ్చే అంశం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
నకిలీ ‘సీఐఏ’ ఏజెంట్ ఎన్ఆర్ఐపై బిగుస్తున్న ఉచ్చు : నవ్వుతూనే ముంచేశాడు!
భారతీయ వ్యాపారవేత్త గౌరవ్ శ్రీవాస్తవ మోసం, మనీ లాండరింగ్ ఆరోపణల వ్యవహారం మరింత ముదురు తోంది. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) రంగంలోకి దిగింది. అమెరికా పౌరుడిగా చెప్పుకుంటూ, సీఐఏ ఏజెంట్ అని నమ్మించి వివిధ దేశాలకు చెందిన రాజకీయ, వ్యాపార నాయకులను మోసగించడం, తీవ్రమైన తప్పిదాలకు పాల్పడటం ఆరోపణల కేసులో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది.నకిలీ సీఐఏ ఏజెంట్‌గా శ్రీవాస్తవ ఏకంగా ప్రెసిడెంట్ జో బిడెన్‌ను కలిశారని, డెమోక్రటిక్ పార్టీకి 10 లక్షల డాలర్ల పైగా విరాళం ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తడం అక్కడ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. 'నకిలీ సీఐఏ ఏజెంట్' స్కామ్‌లో శ్రీవాస్తవ, అనేక సంవత్సరాలుగా మోసపూరిత కార్యకలాపాలతో అమెరికా జాతీయ భద్రతకు భంగం కలిగించాడనే ఆరోపణలను ఎఫ్‌బీఐ విచారిస్తోంది.ఘోరమైన అబద్ధాలతో వాషింగ్టన్ రాజకీయ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీను బురిడీ కొట్టించాడు. వ్యాపార వేత్తలను నమ్మించి, తనఫౌండేషన్కు భారీనిధులను దక్కించుకున్నాడు. అయితే ఇండియాలోని లక్నోకు చెందిన శ్రీవాస్తవ కాలేజీ డ్రాపౌట్ అని కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా రిపోర్ట్ చేసింది.శ్రీవాస్తవ మోసపూరిత కార్యకలాపాలు అంతర్జాతీయ లావాదేవీలకు కూడా విస్తరించాయని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. సూడాన్, లిబియాతో సహా ఆఫ్రికాలోని నాయకులను తప్పుదారి పట్టించాడు . అమెరికా ప్రభుత్వ మద్దతు పొందేందుకు తప్పుడు వాగ్దానాలు చేశాడు. వాషింగ్టన్లో, అతను తన చర్యలను చట్టబద్ధం చేయడానికి ఉన్నత అధికారులతో సంబంధాలను మెయింటైన్ చేశాడు. మిస్టర్ జీగా పాపులర్ అయిన శ్రీవాస్తవ బాధితుల్లో నాటో మాజీ కమాండర్ జనరల్ వెస్లీ క్లార్క్ వంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఇంకా అట్లాంటిక్ కౌన్సిల్ థింక్ ట్యాంక్, అనేక డెమొక్రాటిక్ నిధుల సేకరణ కమిటీలు, అనేకమంది సెనేటర్లు , కాంగ్రెస్ సభ్యులతో సహా అనేక ఉన్నత స్థాయి వ్యక్తులను మోసగించాడు. నేటర్ మార్క్ వార్నర్, ప్రతినిధి పాట్రిక్ ర్యాన్, జెనీవాకు చెందిన వస్తువుల వ్యాపారి, ఇంకా అనేక మంది ఆఫ్రికన్ నాయకులు ఇండోనేషియా అధ్యక్షుడు కూడా శ్రీవాస్తవ మోసానికి గురి కావడం గమనార్హం. అంతేకాదు తనపై కథనాలను రాసిన మీడియాను కూడా పరువు నష్టం దావాతో బెదరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాలు మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో కొందరు ఆయనకు దూరం కాగా, మరికొందరు సంబంధాలను తెంచుకున్నారు.మరోవైపు శ్రీవాస్తవ, అతని భార్య షరోన్‌పై కాలిఫోర్నియాలో రెండు వేర్వేరు మోసం కేసులు నమోదైనాయి. అలాగే లీజు గడువు ముగిసిన తర్వాత 12 మిలియన్ల డార్లు శాంటా మోనికా ఇంటిని ఖాళీ చేయడం లేదని, అద్ద కూడా చెల్లించలేదని ఆరోపిస్తూ ఇంటి యజమాని స్టీఫెన్ మెక్‌ఫెర్సన్, శ్రీవాస్తవపై దావా వేశారు. శ్రీవాస్తవ,అతని భార్య షారోన్ ఆధ్వర్యంలో ‘ది గౌరవ్ & షారన్ శ్రీవాస్తవ ఫ్యామిలీ ఫౌండేషన్’ను కూడా ఉంది. ఆహారం , ఇంధన భద్రత వంటి ప్రపంచ సమస్యలపై ఇది దృష్టి సారిస్తుంది. అయితే తాజా అరోపణల నేపథ్యంలో ఈ ఫౌండేషన్ చట్టబద్ధతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కాగా శ్రీవాస్తవ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యాపారి నీల్స్ ట్రూస్ట్కు అనుమానం రావడంతో ఈ భారీ స్కాం బట్టబయలైంది. అయితే ఇవన్నీ కట్టుకథలని శ్రీవాస్తవ న్యాయవాది కొట్టి పారేశారు. కాలిఫోర్నియాలో వ్యాజ్యాలతో సహా కొన్ని ఖచ్చితమైన ఆధారాలున్నప్పటికీ, శ్రీవాస్తవ అతని న్యాయవాదులు అన్ని ఆరోపణలను ఖండిస్తూనే ఉన్నారు. -
బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం: ఇంటర్వ్యూలో షాకింగ్ ప్రశ్నల దుమారం
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్మరోసారి వార్తల్లో నిలిచారు. బిల్‌గేట్స్ ఆఫీసులో ఉద్యోగం కోసం పిలిచి ఇంటర్వ్యూలో అభ్యంతరకర ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వైరల్‌గా మారింది. (వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్‌వర్త్) ఈ నివేదిక ప్రకారం బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసు ఇంటర్వ్యూను థర్డ్ పార్టీ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బిల్ గేట్స్ ప్రైవేట్ కార్యాలయంలో ఉద్యోగాలు కోరుతున్న మహిళలను లైంగికంగా అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారు. గేట్స్ వెంచర్స్ కోసం ఇంటర్వ్యూ చేసే ఎక్సటర్న్ సెక్యూరిటీ వారి లైంగిక చరిత్ర, మీకు నచ్చే పోర్న్ చిత్రాలు, చిత్రాలు, వారి ఫోన్లో నగ్న ఫోటోలేమైనా ఉన్నాయా, ఇంతకు ముందు వివాహేతర సంబంధాలున్నాయా అని మహిళల్ని ప్రశ్నించారు. అంతేకాదు డ్రగ్స్ తీసుకుంటారా వంటి ఇతర ప్రశ్నల్ని కేడా అడిగారు. అయితే అదే స్థానాలకు పురుష దరఖాస్తుదారులు అలాంటి వ్యక్తిగత వివరాల గురించి అడగలేదని కూడా నివేదించింది. కొంతమంది మహిళలు తాము ఇంతకుముందు "డాలర్ల కోసం డ్యాన్స్ చేసారా" అని అడిగారని తెలపారని, లైంగికంగా సంక్రమించే వ్యాధికి మీకు సోకిందా అని కూడా ప్రశ్నించారని తెలిపారని వాల్ స్ట్రీట్ పేర్కొంది. అయితే ఈ కథనంపై కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ స్పందించింది. కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ సీఈవో మైక్ లెఫెవర్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. చట్టాలకు లోబడి మాత్రమే ప్రవర్తించామన్నారు. ఇదీ చదవండి: Bhuvan Bam Net Worth 2023: తొలి జీతం 5వేలే.. ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా? మరోవైపు గేట్స్ వెంచర్స్ ప్రతినిధి మాట్లాడుతూ కాన్సెంట్రిక్ అడ్వైజర్స్ లైంగికంగా అసభ్యకరమైన ప్రశ్నలు అడగడం గురించి తమకు తెలియదనీ, అయితే ఇది ఈ విధానం ఆమోదయోగ్యం కాదు, తమ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆమె పేర్కొన్నారు. కానీ. పదిహేనేళ్ల స్క్రీనింగ్ ప్రక్రియలో ఇలాంటి సమాచారం ఎపుడూ తమకు అందలేదని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామన్నది స్పష్టం చేయలేదు. (బిజినెస్ టైకూన్ల తొలి జాబ్ ఏదో తెలుసా? మెగా స్టార్ల సక్సెస్ జర్నీ తెలుసా?) కాగా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ బిల్ గేట్స్ మిలిండా దంపతులు విడాకులు తీసుకోవడం పెద్ద సంచలనం రేపింది. 2021 ఆగస్టులో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఆ తరువాత ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడనే వార్తలొచ్చాయి. దీంతోపాటు బిల్ గేట్స్ పలువురు మహిళా ఉద్యోగులతో సంబంధాలున్నాయని ఆరోపణలు కూడా జోరుగానే ఉండటం గమనార్హం. -
కరోనా పుట్టుక అక్కడే.. 2019లోనే పరిశోధకులకు అనారోగ్యం
వాషింగ్టన్/బీజింగ్: ప్రపంచ పాలిట పెనుగండంగా మారిన కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(వూహాన్ ల్యాబ్)లోనే పుట్టిందా? అది నిజం కాదని చైనా నమ్మబలుకుతున్నప్పటికీ వైరస్ అక్కడే పుట్టిందని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. కరోనా వైరస్ జన్మస్థానం వూహాన్ ల్యాబ్ అని చెప్పడానికి మరో కీలక ఆధారం లభించింది. డ్రాగన్ దేశంలో కరోనా మహమ్మారి ఉనికిని చైనా ప్రభుత్వం 2019 ఆఖరులో బయటపెట్టిన సంగతి తెలిసందే. అప్పటికి కొన్ని వారాల ముందే.. అంటే 2019 నవంబర్‌లో వూహాన్ ల్యాబ్‌లో పనిచేసే ముగ్గురు పరిశోధకులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందారట. అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థ వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక ఈ విషయాన్ని సోమవారం వెల్లడించింది. ఇంకా బహిర్గతం చేయని అమెరికన్ ఇంటెలిజెన్స్ డాక్యుమెంట్‌లోని అంశాలను ప్రస్తావిస్తూ వూహాన్ ల్యాబ్ పరిశోధకుల అనారోగ్యం, చికిత్స వివరాలను తెలిపింది. వారు కరోనా కారణంగానే అనారోగ్యం పాలై, ఆసుపత్రిలో చేరినట్లు విశ్వసనీయ సమాచారం ఉన్నట్లు పేర్కొంది. వూహాన్ ల్యాబ్ నుంచే వైరస్ బయటకు వచ్చిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఆరోపించిన విషయం తెలిసిందే. కోవిడ్–19 పుట్టుకను తేల్చే పనిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిమగ్నమయ్యింది. త్వరలో దీనిపై కీలక సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో అమెరికా మీడియా సంస్థ నివేదిక బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందుకు ఆధారాల్లేవ్: చైనా కరోనాపై వాల్‌స్ట్రీట్ జర్నల్ తాజా నివేదికను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ ఖండించారు. వూహాన్ ల్యాబ్‌లో సున్నా కోవిడ్–19 ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు అదే ల్యాబ్ మార్చి 23న విడుదల చేసిన ఒక నివేదికలో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లో పుట్టిందనడానికి ఆధారాల్లేవని పేర్కొన్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదికలో ప్రస్తావించినట్లు ముగ్గురు పరిశోధకులు అనారోగ్యం పాలయ్యారనడం ఎంతమాత్రం నిజం కాదని వెల్లడించారు. వూహాన్ ల్యాబ్‌లో పనిచేసే వారిలో ఇప్పటిదాకా ఎవరికీ కరోనా సోకలేదని తేల్చి చెప్పారు. -
గేట్స్ దంపతులు విడిపోవడానికి కారణం ‘అతడేనట’..
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, బిలయనీర్ బిల్ గేట్స్ తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చిన సంగతి తెలిసిందే. 27 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకనున్నట్లు గేట్స్ దంపతులు ప్రకటించారు. ఈ క్రమంలో వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన విషయాలు వెల్లడించింది. 2019 నుంచే వీరి విడాకుల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి మెలిందా 2019లోనే న్యాయవాదులను కలిసి చర్చించారని వాల్ స్ట్రీట్ రాసుకొచ్చింది వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, మెలిందా అక్టోబర్, 2019 నాటికి అనేక సంస్థలకు చెందిన న్యాయవాదులతో విడాకుల గురించి చర్చించారని.. వారి వైవాహిక జీవితం “అతకలేని విధంగా విచ్ఛిన్నమైందని” మెలిందా వారికి తెలిపినట్లు వాల్ స్ట్రీట్ వెల్లడించింది. గతేడాది కోవిడ్ సమయంలోనే వీరి విడాకుల గురించి చర్చలు జరిగాయని.. వారి సంపద 145 బిలియన్ డాలర్లను విభజించడానికి న్యాయవాదుల బృందం మధ్యవర్తిత్వం చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ రాసుకొచ్చింది. ఓ లైంగిక నేరస్థుడితో గేట్స్‌కు ఉన్న డీలింగ్ వల్లే మెలిందా భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వాల్‌స్ట్రీట్ పేర్కొంది. అతడు ఎవరంటే జెఫ్రీన్ ఎప్స్టీన్. ఎప్స్టీన్తో బిల్ గేట్స్‌కు ఉన్న సంబంధాల గురించి తెలిసినప్పటి నుంచి మెలిందా చాలా బాధపడ్డారని నివేదిక పేర్కొంది. 2013 నుంచి బిల్‌గేట్స్, ఎప్స్టీన్తో డీలింగ్స్ కలిగి ఉన్నట్లు వాల్ స్ట్రీట్ రాసుకొచ్చింది. గత సంవత్సరం న్యూయార్క్ టైమ్స్ నివేదిక కూడా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు జెఫ్రీ ఎప్స్టీన్ను చాలాసార్లు కలుసుకున్నారని, అతని న్యూయార్క్ టౌన్హౌస్లోనే గేట్స్ చాలా సమయం గడిపేవారని తెలిపింది. ఈ వార్తలపై బిల్ గేట్స్ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. గేట్స్, ఎప్స్టీన్ మధ్య సమావేశాలు దాతృత్వంపై దృష్టి సారించాయని తెలిపారు. ఎవరీ జెఫ్రీ ఎప్స్టీన్.. జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్ ఒక అమెరికన్ ఆర్థికవేత్త. అతను లైంగిక వేధింపులకు, దాడులకు పాల్పడ్డాడు. అతనిపై సెక్స్ కోసం తక్కువ వయస్సు గల అమ్మాయిలతో విస్తారమైన నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లైంగిక అక్రమ రవాణాకు సంబంధించిన సమాఖ్య ఆరోపణలపై విచారణ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఎప్స్టీన్ 2019 ఆగస్టులో 66 సంవత్సరాల వయసులో జైలులో మరణించాడు. చదవండి: గేట్స్ గుండె తలుపులు తట్టిందెవరు? -
డిబేట్ తర్వాత పెరిగిన బైడెన్ ఆధిక్యం!
వాషింగ్టన్: తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ అనంతరం ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే ప్రత్యర్థి జోబైడెన్ పాపులారిటీ 14 పర్సంటేజ్ పాయింట్ల మేర పెరిగిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ సర్వే తెలిపింది. అధ్యక్ష రేసులోకి దిగిన తర్వాత బైడెన్‌కు ఇంత ఆధిపత్యం రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం సర్వేలో బైడెన్‌కు 53 శాతం మద్దతు లభించగా, ట్రంప్‌నకు 39 శాతం మద్దతు దక్కింది. సెప్టెంబర్ 20 సర్వేతో పోలిస్తే బైడెన్‌కు 6 పాయింట్ల ఆధిపత్యం పెరిగింది. ట్రంప్‌నకు కరోనా నిర్థారణ ప్రకటనకు ముందు ఈ సర్వే నిర్వహించారు. డిబేట్లో బైడెన్ అదరగొట్టాడని సర్వేలో 50 శాతం మంది అభిప్రాయపడ్డారు. 24 శాతం మంది ట్రంప్‌దే హవా అని పేర్కొనగా 17 శాతం మంది ఇద్దరిలో ఎవరూ ఆధిపత్యం ప్రదర్శించలేదని అన్నారు. ఓటింగ్‌లో తమపై డిబేట్ ప్రభావం ఉండదని సర్వేలో 73 శాతం మంది చెప్పారు. ఎప్పటిలాగే ట్రంప్ ప్రత్యర్ధిని బెదిరించారని ఎక్కువమంది భావించారు. -
ఎఫ్బీ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : విద్వేష కంటెంట్‌ను సోషల్ మీడియాలో వ్యాప్తి చేసేందుకు బీజేపీ నేతలను ఫేస్బుక్ అనుమతిస్తోందన్న వాల్‌స్ర్టీట్ కథనం నేపథ్యంలో ఎఫ్బీ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్ పార్టీ రాసిన లేఖను ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ మంగళవారం షేర్ చేశారు. ఎన్నో పోరాటాలతో తాము సాధించుకున్న ప్రజాస్వామ్యాన్ని పక్షపాతం, నకిలీ వార్తలు, విద్వేష ప్రసంగాల ద్వారా దెబ్బతీసేందుకు తాము అనుమతించమని, దీనిపై ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నించాలని లేఖను వెల్లడిస్తూ రాహుల్ పేర్కొన్నారు. హేట్ స్పీచ్ పాలసీకి విరుద్ధంగా భారత్‌లో పాలక బీజేపీకి ఫేస్బుక్ దాసోహమైందని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఫేస్బుక్ ఉన్నతాధికారుల పక్షపాత వైఖరిపై నిర్ధిష్ట కాలపరిమితితో విచారణ జరిపించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. హింసను ప్రేరేపించే విభజన వాద కంటెంట్‌ను అనుమతించేందుకు ఎఫ్బీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంఖి దాస్ బీజేపీకి పావులా మారారని ఈ లేఖలో కాంగ్రెస్ ఆరోపించింది. ఆగస్ట్ 14న వాల్‌స్ర్టీట్ జర్నల్‌లో ప్రచురించిన కథనం అనూహ్యమేమీ కాదని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సంతకంతో కూడిన కాంగ్రెస్ లేఖ స్పష్టం చేసింది. కాంగ్రెస్ వ్యవస్ధాపక నేతలు ప్రాణాలను పణంగా పెట్టి నెలకొల్పిన విలువలు, హక్కులకు పాతరవేయడంలో ఫేస్బుక్ ఉద్దేశపూర్వకంగానే భాగస్వామిగా మారిందని, అయితే ఇప్పటికీ దిద్దుబాటు చర్యలకు సమయం మించిపోలేదని జుకర్‌బర్గ్‌కు రాసిన లేఖలో పేర్కొంది. కాగా ప్రజల మత ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించారని పేర్కొంటూ ఫేస్బుక్ పాలసీ చీఫ్(భారత్) అంఖి దాస్‌పై కేసుపై నమోదైంది. గత రెండు రోజులుగా వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంపై కాంగ్రెస్, బీజేపీల నడుమ మాటల యుద్ధం సాగుతోంది. భారత్‌లో ఫేస్బుక్, వాట్సాప్‌లను పాలక బీజేపీ, ఆరెస్సెస్ నియంత్రిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. చదవండి : ఫేస్‌బుక్‌ను బీజేపీ నియంత్రిస్తోంది: రాహుల్ -
సోషల్ మీడియా వేదికగా మతవిద్వేషం
ముంబై: సోషల్ మీడియా వేదికగా బీజేపీ దేశంలో మత విద్వేషాన్ని వ్యాపింపచేస్తోందని శివసేన ఆరోపించింది. ఈ మేరకు పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్బుక్ చూసీచూడనట్లుగా వదిలేస్తోందనే వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం రాజకీయ వేడిని రగిలించిన సంగతి తెలిసిందే. దీనిపై శివసేన స్పందించింది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని బీజేపీ గత ఎన్నికల్లో ఎంతో లాభపడటమే కాక.. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మత విద్వేశాన్ని వ్యాప్తి చేసి రాజకీయంగా బలపడిందని ఆరోపించింది. బీజేపీపై ఫేస్బుక్ చర్యలు తీసుకోకపోవడం పట్ల శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఫేస్బుక్ వేదికగా ఎవరైనా సరే దేశాన్ని విభజించడానికి ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తే.. వారు ఏ పార్టీకి చెందినవారు అనే దానితో సంబంధం లేకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ అయినంత మాత్రాన కళ్లుమూసుకుని కూర్చోకూడదు’ అంటూ శివసేన తీవ్రంగా విమర్శించింది. (విద్వేషంపై ఉదాసీనత) అంతేకాక ‘బీజేపీ నాయకులు ఈ సోషల్ మీడియా వేదికలను సమాజాన్ని అనుసంధానించడానికి బదులు ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి వినియోగిస్తున్నారు. ఈ వేదికలు రాజకీయ పార్టీల కనుసన్నల్లో మెలుగుతాయి. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ సోషల్ మీడియా సైన్యం బీజేపీకి ఎంతో సహకరించింది. అందువల్లే మోదీ నాయకత్వంలోని బీజేపీ విజయం సాధించింది’ అని తెలిపింది. అంతేకాక ‘గత ఏడు సంవత్సరాలలో సత్యాన్ని వక్రీకరించి.. అబద్దాన్ని వాస్తవాలుగా చూపిస్తూ.. బహిరంగంగా ప్రచారం చేశారు. రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలు, పుకార్లు ప్రచారం చేశారని’ శివసేన ఆరోపించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద సోషల్ మీడియాలో చాలా కాలం వరకు మీమ్స్, జోకులు ప్రచారంలో ఉన్నాయని సామ్నా ఎత్తి చూపింది. అయితే ఇప్పుడు అదే వేదిక మీద మోదీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌పై ఆగ్రహం వ్యక్తం అవుతోందన్నది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. శివసేన వ్యాఖ్యలు హాస్యాస్పాదంగా ఉన్నాయన్నది. (బీజేపీకి వత్తాసు : ఫేస్బుక్ క్లారిటీ) -
చిక్కుల్లో ఫేస్బుక్!
వాషింగ్టన్: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై మరో ఆరోపణ వచ్చింది. వినియోగదారుల వివరాలు పొందేందుకు కొన్ని సంస్థలకు ఫేస్బుక్ ప్రత్యేక అనుమతి ఇచ్చినట్టు మీడియాలో కథనాలొచ్చాయి. యూజర్ల ఫోన్ నంబర్లు, ఎఫ్బీ ఖాతాలో ఫ్రెండ్స్ తదితర వివరాలను అందించేందుకు సంస్థలతో ఒప్పందాలు చేసుకుందని, వీటిని ‘వైట్లిస్ట్స్’ అంటారని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా, నిస్సాన్ మోటార్ తదితర కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుందని పేర్కొంది. తాము అతికొద్దిమంది భాగస్వాములకు డేటా పొందేందుకు అనుమతినిచ్చినట్టు ఫేస్బుక్ వెల్లడించింది. -
ట్విట్టర్ కొనుగోలు రేసులో మరో దిగ్గజం
న్యూయార్క్ : ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను చేజిక్కించుకోవడానికి గూగుల్, సేల్స్‌ఫోర్స్ రేసులోకి మరో మీడియా దిగ్గజం వచ్చి చేరింది. ట్విట్టర్ కొనుగోలుకు టెక్ దిగ్గజంతో పోటీ పడటానికి వాల్ట్‌డిస్నీ కంపెనీ ముందుకొచ్చింది. ట్విట్టర్‌ను డిస్నీ కంపెనీ సొంతం చేసుకుంటే ఆ కంపెనీకి ఇదే అతిపెద్ద టెక్నాలజీ డీల్‌గా వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టు వెల్లడించింది. ట్విట్టర్ ఇటీవలే స్ట్రీమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్లను ఆన్లైన్లో అందించడానికి పెట్టుబడులు పెట్టింది. ట్విట్టర్ స్పోర్ట్స్ ప్రోగ్రామింగ్ ప్రయత్నాలను ఓ శక్తివంతమైన ప్రత్యర్థిగా ఈ మీడియా దిగ్గజం భావించింది. విజయవంతంగా ట్విట్టర్‌ను డిస్నీ సొంతం చేసుకుంటే, ఈఎస్పీఎన్ చానల్ సేవలను మరింత విస్తరించడానికి డిస్నీకి ఈ టెక్నాలజీ సంస్థ ఓ సాధనంగా ఉపయోగపడుతుందని వాల్‌స్ట్రీట్ రిపోర్టు పేర్కొంది. ఈఎస్పీఎన్ అమెరికాకు చెందిన గ్లోబల్ కేబుల్,శాటిలైట్ టెలివిజన్ చానల్. దీని యాజమాన్య హక్కులను 1996లో డిస్నీ సొంతం చేసుకుంది. గత నెలరోజులుగా ట్విట్టర్ అమ్మక వార్త మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ట్విట్టర్ విక్రయానికి ఆ సంస్థ దిగ్గజ కంపెనీలతో సంప్రదింపులు కూడా ప్రారంభించింది. ట్విట్టర్ అమ్మక వార్త ఊపందుకోవడంతో ఆ కంపెనీ షేర్లు గతవారంతో 20 శాతానికి పైగా ఎగిశాయి. నెలకు 313 మిలియన్ యాక్టివ్ యూజర్లున్న ఆ సంస్థకు ప్రస్తుతం యూజర్ల వృద్ధి మందగించి, ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం ఆ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 16 బిలియన్ డాలర్లు.