కస్టమర్ డేటా, మెడికల్ రికార్డుల లీక్ వ్యవహారానికి సంబంధించి దేశంలో అతిపెద్ద ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ కొత్త విషయాన్ని వెల్లడించింది. సైబర్‌హ్యాకర్లు తమను 68,000 డాలర్లు (రూ.57 లక్షలు) డిమాండ్ చేసినట్లు తెలిపింది.
టెలిగ్రామ్ చాట్‌బాట్‌లు, వెబ్‌సైట్‌ను ఉపయోగించి పన్ను వివరాలు, మెడికల్ క్లెయిమ్ పేపర్‌లు సహా కస్టమర్‌ల సున్నితమైన డేటాను హాకర్ లీక్ చేసినట్లు రాయిటర్స్ నుంచి కథనం వెలువడిన తర్వాత కంపెనీ వ్యాపార సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో స్టార్ హెల్త్ షేర్లు 11% క్షీణించాయి. ఈ డేటా లీక్ వ్యవహారంపై కంపెనీ అంతర్గత విచారణ చేపట్టింది. టెలిగ్రామ్, హ్యాకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంది.
టార్గెటెడ్ సైబర్‌అటాక్‌కు గురైనట్లు గతంలో చెప్పిన స్టార్, హ్యాకర్ తమను 68,000 డాలర్లు డిమాండ్ చేస్తూ గత ఆగస్ట్‌లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్‌లకు ఈమెయిల్ పంపినట్లు తాజాగా వెల్లడించింది.
డేటా లీక్‌లో తమ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై కంపెనీ దర్యాప్తు చేస్తోందని రాయిటర్స్ నివేదికపై భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు స్టార్ నుండి వివరణలు కోరిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. అంతర్గత విచారణ కొనసాగుతున్నప్పటికీ, అధికారి అమర్జీత్ ఖనుజా ఎలాంటి తప్పు చేయలేదని స్టార్ పునరుద్ఘాటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment