కోవిడ్-19 వ్యాక్సిన్ టీకాలు అందించే భారత ప్రభుత్వ పోర్టల్ కోవిన్‌లో నమోదు చేసుకున్న ప్రముఖుల వ్యక్తిగత వివరాలు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ ఛానల్‌లో లభ్యమైనట్లు
కోవిన్ డేటా లీకేజీపై కేంద్ర ఐటీ శాఖ స్పందించింది. డేటా లీకేజీ అంశంపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింది. డేటా లీకేజీ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సైతం బ్యాంకుల్ని అప్రమత్తం చేసినట్లు జాతీయ, అంతర్జాతీయంగా ఆర్ధిక సేవల్ని అందించే సౌత్ ఏసియా ఇండెక్స్ నివేదించింది.
కొవిడ్ -19 వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్ పోర్టల్‌లోని (CoWIN ) సున్నితమైన సమాచారం బయటకొచ్చింది. కోవిన్‌లో వ్యక్తిగత ఫోన్ నెంబర్లతో వారి వివరాల్ని నమోదు చేసుకున్న ప్రముఖుల పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, జెండర్, పుట్టిన తేదీ, వ్యాక్సినేషన్ సెంటర్‌తో ఇతర వివరాలు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ ఛానల్‌లో లభ్యమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
Just IN:— Major data breach in India;
— South Asia Index (@SouthAsiaIndex) June 12, 2023
Personal data of all vaccinated Indians have been leaked online.
☆ Leaked data has Aadhaar, voter ID, Passport numbers & mobile numbers of Indians who got covid-19 vaccines.
అంతేకాదు కోవిన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకున్న విదేశీ ప్రయాణాల వివరాలు, వారి పాస్‌పోర్ట్ సమాచారం టెలిగ్రామ్ ఛానల్‌లో ప్రత్యక్షమైనట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
వ్యక్తిగత వివరాలు లీకైన ప్రముఖుల్లో యూనియన్ హెల్త్ మినిస్ట్రీ రాజేష్ భూషణ్‌తో పాటు అతని భార‍్య ఉత్తరాఖండ్ కోటద్వార్ బీజేపీ ఎమ్మెల్యే రితూ ఖండూరి భూషణ్‌ల ఆధార్, పుట్టిన తేదీ వివరాలు ఉన్నాయని సమాచారం. ఈ తరుణంలో డేటా లీక్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ, ఐటీ శాఖలు అప్రమత్తమయ్యాయి. విచారణను వేగవంతం చేస్తున్నట్లు ప్రకటించాయి.
ఇదీ చదవండి : బైక్ ట్యాక్సీ కంపెనీలకు సుప్రీం షాక్!
Comments
Please login to add a commentAdd a comment