అదంతా ఇన్ఫోసిస్‌ చేసిందే.. ఐటీ దిగ్గజంపై క్లయింట్‌ నిందలు | Bank of America blames Infosys for data leak | Sakshi
Sakshi News home page

అదంతా ఇన్ఫోసిస్‌ చేసిందే.. ఐటీ దిగ్గజంపై క్లయింట్‌ నిందలు

Published Thu, Feb 15 2024 8:50 AM | Last Updated on Thu, Feb 15 2024 11:51 AM

Bank of America blames Infosys for data leak - Sakshi

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ( Infosys )డేటా లీకేజీ నిందలు ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్‌ కీలక క్లయింట్లలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ అమెరికా ( Bank of America ) తమ 57,028 మంది కస్టమర్లను ప్రభావితం చేసిన సైబర్‌ దాడుల సంఘటనకు ఇన్ఫోసిస్ మెక్‌కామిష్ సిస్టమ్స్ ( Infosys McCamish Systems )కారణమని ఆరోపించింది.

ఇన్ఫోసిస్ బీపీఎం అనుబంధ సంస్థ అయిన మెక్‌కామిష్ సిస్టమ్స్, గత ఏడాది నవంబర్‌లో జరిగిన సైబర్‌ సెక్యూరిటీ సంఘటనతో ప్రభావితమైంది. దాని ఫలితంగా నిర్దిష్ట అప్లికేషన్‌లు, సిస్టమ్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. ఇన్ఫోసిస్ మెక్‌కామిష్ అనేది ప్లాట్‌ఫారమ్-ఆధారిత బీపీవో సంస్థ. ఇది జీవిత బీమా, యాన్యుటీ ఉత్పత్తులు, రిటైర్‌మెంట్ ప్లాన్‌లకు సంబంధించిన కంపెనీలకు సేవలను అందిస్తుంది. మెక్‌కామిష్ నిర్దిష్ట పరిశ్రమ క్లయింట్‌ల కోసం సాఫ్ట్‌వేర్‌లను పునఃవిక్రయిస్తుంటుంది. ఈ సంస్థను 2009లో ఇన్ఫోసిస్‌ బీపీఎం (గతంలో ఇన్ఫోసిస్‌ బీపీవో) కొనుగోలు చేసింది.

"2023 నవంబర్ 3 సమయంలో ఇన్ఫోసిస్ మెక్‌కామిష్ సిస్టమ్స్ (IMS)లో సైబర్‌ దాడులు జరిగాయి. ఒక అనధికార థర్డ్‌ పార్టీ చొరబడి సిస్టమ్‌లను యాక్సెస్ చేసిన ఫలితంగా కొన్ని ఐఎంఎస్‌ అప్లికేషన్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా అందించే వ్యత్యాస పరిహారం ప్లాన్‌లకు సంబంధించిన డేటా ప్రభావితమై ఉండవచ్చని 2023 నవంబర్ 24న ఐఎంఎస్‌ తెలియజేసింది. అయితే బ్యాంక్ సిస్టమ్‌లపై ఎటువంట ప్రభావం లేదు" అని కస్టమర్‌లకు అందించిన నోటీసులో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొంది.

ఇదీ చదవండి: హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్‌ ఇదే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement