
డార్క్ వెబ్‌లో 37.5 కోట్ల భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారుల డేటా అమ్మకానికి ఉందని ఓ హ్యాకర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఈ ఆరోపణల మీద కంపెనీ స్పందిస్తూ.. స్వార్థ ప్రయోజనాలతో ఎయిర్‌టెల్ ప్రతిష్టను దిగజార్చడానికి కొందరు చేస్తున్న ప్రయత్నం ఇదని ఖండించింది.
‘ఎక్స్‌జెన్’ పేరుతో 37.5 కోట్ల ఎయిర్‌టెల్ వినియోగదారుల వివరాలు, ఫోన్ నంబర్, ఈమెయిల్, చిరునామా, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఆధార్ నంబర్ డార్క్ వెబ్‌లో రూ. 41 లక్షలకు అమ్మకానికి పెట్టినట్లు హ్యాకర్ పేర్కొన్నారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవమని ఎయిర్‌టెల్ ప్రతినిధి అన్నారు.
డేటా లీక్ వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2021లో కూడా రాజశేఖర్ రాజహరియా 25 లక్షలకుపైగా ఎయిర్‌టెల్ యూజర్ల వివరాలను ‘రెడ్ రాబిట్ టీమ్’ అనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత కూడా దీనిపైన విచారణ జరిపితే.. అదికూడా వాస్తవం కాదని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని ఎయిర్‌టెల్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment