bharati airtel
-
సునీల్ మిత్తల్‌కు అరుదైన పురస్కారం
న్యూఢిల్లీ: టెలికం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో ఉన్న భారతీ ఎంటర్ప్రైసెస్ ఫౌండర్, చైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ తాజాగా గౌరవ నైట్‌హుడ్ పతకాన్ని అందుకున్నారు.బ్రిటన్‌లో నాయకత్వం, వ్యాపార పెట్టుబడులకుగాను మిత్తల్‌కు నైట్ కమాండర్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్ (కేబీఈ) వరించింది. యూకే రాజు చార్లెస్–3 తరఫున ఢిల్లీలో బ్రిటిష్ హై కమిషనర్ లిండీ కామెరాన్ నుండి ఆయన ఈ గౌరవాన్ని స్వీకరించారు.Sunil Bharti Mittal was presented the insignia of the Knight Commander of the Most Excellent Order of the British Empire (KBE) by H.E. Lindy Cameron on behalf of HM King Charles III. The KBE was conferred to Mr. Mittal for advancing UK-India business relations. pic.twitter.com/9C1xxmF11Y— Bharti Airtel (@airtelnews) February 22, 2025 -
37.5 లక్షల యూజర్ల డేటా లీక్!.. స్పందించిన ఎయిర్టెల్
డార్క్ వెబ్‌లో 37.5 కోట్ల భారతీ ఎయిర్టెల్ వినియోగదారుల డేటా అమ్మకానికి ఉందని ఓ హ్యాకర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఈ ఆరోపణల మీద కంపెనీ స్పందిస్తూ.. స్వార్థ ప్రయోజనాలతో ఎయిర్టెల్ ప్రతిష్టను దిగజార్చడానికి కొందరు చేస్తున్న ప్రయత్నం ఇదని ఖండించింది.‘ఎక్స్జెన్’ పేరుతో 37.5 కోట్ల ఎయిర్టెల్ వినియోగదారుల వివరాలు, ఫోన్ నంబర్, ఈమెయిల్, చిరునామా, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఆధార్ నంబర్ డార్క్ వెబ్‌లో రూ. 41 లక్షలకు అమ్మకానికి పెట్టినట్లు హ్యాకర్ పేర్కొన్నారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవమని ఎయిర్టెల్ ప్రతినిధి అన్నారు.డేటా లీక్ వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2021లో కూడా రాజశేఖర్ రాజహరియా 25 లక్షలకుపైగా ఎయిర్టెల్ యూజర్ల వివరాలను ‘రెడ్ రాబిట్ టీమ్’ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత కూడా దీనిపైన విచారణ జరిపితే.. అదికూడా వాస్తవం కాదని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని ఎయిర్టెల్ వివరించింది. -
జియో జోరు, వొడాఫోన్ ఐడియాకు 40 లక్షల యూజర్లు గోవిందా!
న్యూఢిల్లీ: టెలికం కనెక్షన్లలో జియో ఆధిపత్యం కొనసాగుతోంది. సెప్టెంబర్‌లో కంపెనీ కొత్త యూజర్ల సంఖ్య 7.2 లక్షలు పెరిగింది. 4.12 లక్షల కొత్త యూజర్లతో భారతీ ఎయిర్టెల్ రెండో స్థానంలో నిల్చింది. సంక్షోభంలో ఉన్న వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా సెప్టెంబర్‌లో ఏకంగా 40 లక్షల యూజర్లను కోల్పోయింది. 21.75 శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానంలో నిలిచింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జియో యూజర్లు సెప్టెంబర్‌లో పెరిగినప్పటికీ ఆగస్టుతో పోలిస్తే (32.81 లక్షలు) మాత్రం తగ్గింది. ఇక తాజాగా సెప్టెంబర్‌లో మొత్తం అన్ని టెల్కోల వైర్లెస్ యూజర్ల సంఖ్య 36 లక్షల మేర తగ్గింది. ఆగస్టు ఆఖరు నాటికి ఇది 114.91 కోట్లుగా ఉండగా, సెప్టెంబర్ ఆఖరు నాటికి 114.54 కోట్లకు పడిపోయింది. -
ఎయిర్టెల్ ఆఫ్రికాకు సిటీ రూ.1,000 కోట్ల రుణం
ముంబై: ఎయిర్టెల్ ఆఫ్రికా 125 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,000 కోట్లు) రుణ సదుపాయం కోసం అమెరికాకు చెందిన సిటీ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. 14 ఆఫ్రికా దేశాల్లో ఎయిర్టెల్ ఆఫ్రికా టెలికం, మొబైల్ మనీ సేవలు అందిస్తోంది. స్థానిక కరెన్సీతోపాటు, డాలర్ మారకంలో ఈ రుణ సదుపాయం ఉంటుందని ఎయిర్టెల్ ఆఫ్రికా ప్రకటించింది. ఈ సదుపాయం 2024 సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఎయిర్టెల్ ఆఫ్రికా కార్యకలాపాలకు మద్దతుగా, నాలుగు సబ్సిడరీ కంపెనీల్లో పెట్టుబడులకు వినియోగించనున్నట్టు తెలిపింది. ఎయిర్‌టెల్‌కు చెందిన ముంబై యూనిట్ ద్వారా ఈ డీల్ చేసుకున్నట్టు ప్రకటించింది. -
రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్.. స్వదేశీ కంపెనీ మెడ మీద వేలాడుతున్న కత్తి..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంకా దాడులు కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఆ దాడుల ప్రభావం ఇప్పుడు ఇతర రంగాల మీద కూడా పడుతుంది. ఈ దాడుల వల్ల లో ఎర్త్ ఆర్బిట్(లియో) బ్రాడ్ బ్యాండ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్ వెబ్ దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రష్యా 24 టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ అధిపతి డిమిత్రి రోగోజిన్ మాట్లాడుతూ.. వన్ వెబ్ తన ఉపగ్రహాలను సైనిక అవసరాల కోసం ఉపయోగించబోమని హామీ ఇవ్వకపోతే, మార్చి 4న దాని ఉపగ్రహ ప్రయోగాన్ని నిలిపి వేయనున్నట్లు తెలిపారు. ఈ వన్ వెబ్ కంపెనీలో ఎయిర్‌టెల్‌కు చెందిన భారతి గ్లోబల్ గ్రూప్‌కు ఎక్కువ వాటా ఉంది. కజకస్తాన్ నుంచి రష్యా అద్దెకు తీసుకున్న బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి 36 ఉపగ్రహాలను మార్చి 4న ప్రయోగించడానికి వన్ వెబ్ ప్రణాళికలు వేసింది. అయితే, మార్చి 4న మాస్కో సమయం 21:30 వరకు వన్ వెబ్ సైనిక అవసరాల కోసం ఉపయోగించబోమని హామీ ఇవ్వకపోతే ఉపగ్రహాలను ప్రయోగించడానికి వినియోగిస్తున్న సోయుజ్-2.1బీ అంతరిక్ష వాహన నౌక వాడకాన్ని అంతరిక్ష సంస్థ అనుమతించదని రోగోజిన్ తెలిపారు. తన ఉపగ్రహాలను రష్యాకు వ్యతిరేకంగా సైనిక అవసరాల కోసం ఉపయోగించబోమని వన్ వెబ్ హామీలను అందించాలని తన ఏజెన్సీ కోరుకుంటున్నట్లు రోగోజిన్ తెలిపినట్లు ఇంటర్ ఫ్యాక్స్ వార్తా సంస్థ నివేదించింది. ❗️ В связи с враждебной позицией Великобритании в отношении России еще одним условием запуска космических аппаратов OneWeb 5 марта является выход британского правительства из состава акционеров компании OneWeb. 🔗 Подробнее: https://t.co/HHbGC0DY12 pic.twitter.com/M6FnQeKC4K — РОСКОСМОС (@roscosmos) March 2, 2022 నవంబర్ 2020లో దివాలా అంచున ఉన్న వన్ వెబ్ కంపెనీలో యుకె ప్రభుత్వం, భారతి గ్లోబల్ కన్సార్టియం కలిసి 650 లియో ఉపగ్రహాల ద్వారా బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ సేవలను అందించడానికి సంస్థలో 1 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టుబడి పెట్టాయి. వన్ వెబ్ ఇప్పటికే 400కు పైగా ఉపగ్రహలను కక్ష్యలో ప్రవేశ పెట్టింది. ఉపగ్రహ ప్రయోగాన్ని రద్దు చేస్తే రష్యా-ఉక్రెయిన్ దాడి వల్ల ప్రత్యక్ష పర్యవసానాన్ని ఎదుర్కొన్న మొదటి భారతీయ కార్పొరేట్ కంపెనీగా భారతి గ్రూప్ నిలవనుంది. గత ఏడాది జూన్ నెలలో అతిపెద్ద వాటాదారుగా మారడానికి వన్ వెబ్ సంస్థలో అదనంగా 500 మిలియన్ డాలర్లు(రూ.3,700 కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టనున్నట్లు భారతి గ్రూప్ తెలిపింది. $550 మిలియన్ పెట్టుబడితో వన్ వెబ్'లో భారతి గ్రూప్ 38.6 శాతం వాటా కలిగి ఉంది. యుకె ప్రభుత్వం, యూటెల్‌శాట్, సాఫ్ట్ బ్యాంక్ ఒక్కొక్కటి 19.3 శాతం వాటా కలిగి ఉన్నట్లు వన్ వెబ్ ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..!) -
Jio Vs Airtel: తగ్గేదె లే అంటున్న ఎయిర్టెల్..!
కొద్ది రోజుల క్రితం వరకు టెలికాం రంగంలో పోటీపడుతున్న దిగ్గజ కంపెనీలు టెలికాం జియో, ఎయిర్టెల్ ఇప్పుడు మరో రంగంలో పోటీ పడేందుకు సిద్ద పడుతున్నాయి. ప్రపంచంలోని ఇతర ప్రధాన ఇంటర్నెట్ హబ్‌లతో కనెక్ట్ చేస్తూ జియో సముద్ర మార్గానా ఇంటర్నెట్ కేబుల్ నిర్మాణాల్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నిర్మాణాలు త్వరలో మాల్దీవ్లోని హుల్ హుమలే ప్రాంతం వరకు కనెక్ట్ చేసేందుకు సిద్ద పడుతుంది. అయితే, ఎయిర్టెల్ కూడా జియోకి పోటీగా సముద్ర మార్గానా ఇంటర్నెట్ కేబుల్ నిర్మాణ పనుల్ని చేపట్టేందుకు సిద్ద పడుతుంది. ఏంటి ఈ సీ-ఎంఈ-డబ్ల్యుఈ-6 ప్రాజెక్టు: వేగంగా అభివృద్ధి చెందుతున్న డీజీటల్ ఆర్థిక వ్యవస్థకు సేవలందించే తన హైస్పీడ్ గ్లోబల్ నెట్ వర్క్ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా 'సీ-ఎంఈ-డబ్ల్యుఈ-6(SEA-ME-WE-6)' అండర్ సీ కేబుల్ కన్సార్టియంలో చేరినట్లు భారతి ఎయిర్టెల్ తెలిపింది. సీ-ఎంఈ-డబ్ల్యుఈ-6లో "ప్రధాన పెట్టుబడిదారు"గా పాల్గొంటున్నట్లు ఎయిర్టెల్ పేర్కొంది. ఈ అండర్ సీ కేబుల్ వ్యవస్థ నిర్మాణానికి కావాల్సిన మొత్తం పెట్టుబడిలో 20 శాతం పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. సీ-ఎంఈ-డబ్ల్యుఈ-6లోని మరో 12 కన్సార్టియం సభ్యుల్లో బంగ్లాదేశ్ సబ్ మెరైన్ కేబుల్ కంపెనీ, ధియాగు(మాల్దీవులు), జిబౌటీ టెలికామ్, మొబిల(సౌదీ అరేబియా), ఆరెంజ్ (ఫ్రాన్స్), సింగ్ టెల్ (సింగపూర్), శ్రీలంక టెలికామ్, టెలికామ్ ఈజిప్ట్, టెలికోమ్ మలేషియా, టెలిన్ (ఇండోనేషియా) ఉన్నాయి. SEA-ME-WE-6 ప్రాజెక్టులో భాగంగా ఫ్రాన్స్ నుంచి అన్నీ దేశాలను కలుపుతూ సింగపూర్ వరకు అండర్ సీ కేబుల్ నిర్మాణం చేపడుతారు. దీని పొడవు 19,200 కిలోమీటర్లు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సముద్రగర్భ కేబుల్ వ్యవస్థలో ఇది ఒకటిగా నిలవనుంది. SEA-ME-WE-6 వల్ల ఎయిర్టెల్ గ్లోబల్ నెట్‌వర్క్‌కు అదనంగా 100 టీబీపీఎస్ సామర్ధ్యం సమకూరనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎయిర్టెల్ ఇతర భాగస్వాములతో కలిసి సింగపూర్ - చెన్నై - ముంబై మధ్య నాలుగు ఫైబర్ పెయిర్ నిర్మించనుంది. (చదవండి: ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన కంపెనీ..!) -
ఎయిర్టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఏడాది పాటు ఉచితంగా ఓటీటీ సేవలు..!
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన యూజర్లకు శుభవార్త తెలిపింది. ఇతర టెలికాం సంస్థలకు పోటీగా తన యూజర్లకు ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్‌తో మీ ముందుకు వచ్చింది. ఇతర టెలికాం సంస్థలు అందిస్తున్నట్లు గానే ఓటీటీ సేవలను ఉచితంగా అందించేందుకు సిద్దం అయ్యింది. దీర్ఘకాల వ్యాలిడిటీ ప్లాన్‌లో భాగంగా ఇప్పటి వరకు ఉన్న రూ.2999 ప్లాన్‌ను ఎయిర్టెల్ సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసింది. ఎయిర్టెల్ రూ.2999 ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే 356 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. రోజుకు 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్లు, రూ.499 విలువ గల డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందవచ్చు. ఇంకా wynk మ్యూజిక్, ఉచిత హలోట్యూన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 వరకు క్యాష్‌బ్యాక్ లాంటి బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. నెలపాటు అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్‌ను కూడా వినియోగించుకోవచ్చు. అయితే, ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.3359 ప్లాన్ కింద కూడా ఇవే ప్రయోజనాలు ఉండడంతో. ఈ ప్లాన్ ఎన్నిరోజులు అందుబాటులో ఉంటుంది అనేదానిపై మాత్రం స్పష్టత లేదు. (చదవండి: ద్విచక్ర వాహన దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్!) -
హెక్సాకామ్‌లో టీసీఐఎల్ వాటా విక్రయం!
న్యూఢిల్లీ: రాజస్తాన్, ఈశాన్య రాష్ట్రాలలో టెలికం సర్వీసులందిస్తున్న భారతీ హెక్సాకామ్లోగల 30 శాతం వాటాను పీఎస్‌యూ సంస్థ టీసీఐఎల్ విక్రయించనుంది. ఈ వాటా విలువను ప్రభుత్వ ఆదేశాలమేరకు ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ రూ.8,900 కోట్లుగా మదింపు చేసినట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. భారతీ హెక్సాకామ్‌లో మొబైల్ సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు 70 శాతం వాటా ఉంది. టీసీఐఎల్ ద్వారా ఈ భాగస్వామ్య సంస్థ(జేవీ)లో గల వాటాను ప్రభుత్వం విక్రయించే యోచనలో ఉంది. ఈ జేవీలోగల వాటాను విక్రయించడం ద్వారా భారతీ హెక్సాకామ్ నుంచి ప్రభుత్వం వైదొలగనుంది. ఈ అంశం 15ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. కాగా.. వాటా విక్రయాన్ని పబ్లిక్ ఇష్యూ ద్వారా చేపట్టదలిస్తే మరో రెండేళ్ల కాలం పట్టవచ్చని, అప్పటికి వాటా విలువలో మార్పులుంటాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. (చదవండి: యూని'ఫ్లాప్' కార్న్‌లు.. బేర్ మంటున్న టెక్ స్టార్టప్‌లు!) -
జియో యూజర్లకు అలర్ట్.. 42 కోట్ల వినియోగదారులకు మెసేజ్!
ఈ-కేవైసీ మోసాలు, నకిలీ ఎస్సెమ్మెస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ రిలయన్స్ జియో తన వినియోగదారులను కోరింది. దేశంలోని అతిపెద్ద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ జియో తన చందాదారులకు పంపిన ఒక మెసేజ్‌లో ఇటీవల దేశంలో ఎక్కువగా జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొత్త ఏడాది, పండుగుల పేరుతో వచ్చే ఆఫర్స్ లింక్స్ మీద క్లిక్ చేయవద్దు అని తెలిపింది. ఇప్పటికే ఈ ఈ-కేవైసీ మోసాలు, నకిలీ ఎస్సెమ్మెస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని భారతి ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా మెసేజ్‌లు పంపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ క్రింద పేర్కొన్న విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జియో తన యూజర్లకు సూచిస్తుంది. ► ఈ-కేవైసీ వెరిఫికేషన్ పేరుతో వచ్చే కాల్స్/సందేశాలకు స్పందించవద్దు అని సూచిస్తుంది. వెరిఫికేషన్ కోసం ఏదైనా నెంబరుకు కాల్ చేయమని మిమ్మల్ని అడిగే ఆ మోసపూరిత సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలుపుతుంది. ► కేవైసీ /ఆధార్ వివరాలను అప్డేట్ చేయడానికి జియో కస్టమర్లు ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దని కోరింది. అటువంటి వాటి కోసం ఏదైనా థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేసుకోమని జియో మిమ్మల్ని ఎన్నడూ అడగదని పేర్కొంది. ఇలాంటి థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల మోసగాళ్ళు మీ ఫోన్లోని మొత్తం సమాచారాన్ని యాక్సెస్ చేసుకుంటారు అని పేర్కొంది. ► సైబర్ మోసానికి సంబంధించిన ఇటీవలి కొన్ని కేసుల్లో మోసగాళ్ళు తమను తాము జియో ప్రతినిధులుగా పేర్కొంటున్నారని తెలిపింది. అలాగే, చందాదారుల ఆధార్, బ్యాంకు ఖాతాలు మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ-కేవైసీ పేరుతో అడుగుతున్నారని, అలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఈ-కేవైసీ పేరుతో వచ్చే ఎస్ఎమ్ఎస్/కాల్స్ ను ఏవీ నమ్మవద్దని టెల్కో వినియోగదారులను కోరింది. ► ఈ-కేవైసీ పేరుతో వచ్చే ఎస్ఎమ్ఎస్‌లలో ఉన్న నెంబర్లను తిరిగి కాల్ చేయవద్దని కస్టమర్లకు పేర్కొంది. ► జియో ప్రతినిధి అని చెప్పుకునే కాలర్లు పంపే లింక్స్, అటాచ్ మెంట్లపై క్లిక్ చేయవద్దని జియో కస్టమర్లకు సూచిస్తుంది. ► మైజియో యాప్‌లో మీకు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు గనుక తృతీయపక్ష యాప్‌లను డౌన్లోడ్ చేసుకోమని వినియోగారులను ఎన్నడూ అడగాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది. (చదవండి: చిక్కుల్లో సుందర్ పిచాయ్...! అదే జరిగితే..?) -
Jio: తగ్గేదె లే అంటున్న రిలయన్స్ జియో!
న్యూఢిల్లీ: టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. నవంబర్ నెలలో 4జీ సర్వీస్ ప్రొవైడర్లలో రిలయన్స్ జియో సెకనుకు 24.1 మెగాబిట్ డేటా డౌన్లోడ్ వేగంతో తన అగ్ర స్థానాన్ని నిలుపుకుంది. అలాగే, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా డేటా డౌన్లోడ్ వేగంలో పెరిగినట్లు పేర్కొంది. గతంతో పోలిస్తే జియో నెట్ వర్క్ సగటు 4జీ డేటా డౌన్ లోడ్ వేగంలో 10 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అలాగే, వొడాఫోన్ ఐడియా & భారతి ఎయిర్టెల్ నెట్వర్క్ వేగం గత నెలతో పోలిస్తే వరుసగా 8.9 శాతం పెరిగి 17 ఎంబిపిఎస్ స్పీడ్, 5.3 శాతం పెరిగి 13.9 ఎంబిపిఎస్ వేగాన్ని నమోదు చేశాయి. అక్టోబర్ నెలతో పాటు ఓ నెల కూడా 4జీ డేటా అప్ లోడ్ వేగం పరంగా వొడాఫోన్ ఐడియా అగ్ర స్థానాన్ని కొనసాగిస్తుంది. వొడాఫోన్ ఐడియా కంపెనీ నెట్వర్క్ 8 ఎంబిపిఎస్ అప్లోడ్ వేగాన్ని నమోదు చేసింది. గత ఐదు నెలల్లో ఇదే అత్యధికం. డౌన్లోడ్ వేగం వినియోగదారులు ఇంటర్నెట్ నుంచి కంటెంట్ యాక్సెస్ చేసుకోవడానికి సహాయపడితే, అప్లోడ్ వేగం ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వేగంగా పోస్టు చేయడానికి సహాయ పడుతుంది. ఇక, ఎయిర్టెల్ & రిలయన్స్ జియో నెట్వర్క్ అప్లోడ్ వేగం అక్టోబర్ నెలలో గత ఐదు నెలలతో పోలిస్తే గరిష్ట స్థాయిలో 5.6 ఎంబిపిఎస్, 7.1 ఎంబిపిఎస్ వేగాన్ని నమోదు చేశాయి. రియల్ టైమ్ ప్రాతిపదికన మైస్పీడ్ అప్లికేషన్ సాయంతో భారతదేశం అంతటా సేకరించే డేటా ఆధారంగా ట్రాయ్ నెట్వర్క్ సగటు వేగం లెక్కిస్తుంది. (చదవండి: అగ్నికి ఆహుతి అయిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఏ కంపెనీదో తెలుసా?) -
వొడాఫోన్ ఐడియా యూజర్లకు భారీ షాక్!
Vodafone Idea Hikes Mobile Call, Data Rates by Above 20%: దేశంలో ఒక్కసారిగా మొబైల్ రిచార్జ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిన్న(నవంబర్ 22న) ఎయిర్టెల్ మొబైల్ కాల్, డేటా టారిఫ్ ధరలను భారీగా పెంచిన తేలిసిందే. ఇప్పుడు దేశంలోని మరొక టెలికామ్ సంస్థ ఎయిర్టెల్ బాటలోనే నడించేందుకు సిద్దం అయ్యింది. నేడు ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా మొబైల్ కాల్, డేటా టారిఫ్ ధరలను 20-25 శాతం పెంచినట్లు ప్రకటించింది. నవంబర్ 25 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఫిక్సిడ్ బ్రాడ్ బ్యాండ్, మొబైల్ నెట్వర్క్ టెస్టింగ్ అప్లికేషన్స్ కంపెనీ ఊక్లా పేర్కొన్న విధంగా ఈ కొత్త టారిఫ్ ప్లాన్లు 'భారతదేశంలో వేగవంతమైన మొబైల్ నెట్వర్క్ సేవలను అందించడం' కోసం సహాయపడతాయని వొడాఫోన్ తెలిపింది. ప్రారంభ స్థాయి ప్లాన్ల ధరలను 25శాతం పెంచగా.. లిమిటెడ్ కేటగిరీ ప్లాన్ల ధరలను 20-23శాతం పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. పరిశ్రమ ఎదుర్కొంటోన్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో వినియోగదారుపై సగటు ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భారతి ఎయిర్టెల్ టారిఫ్ ధరల ప్రకటించిన ఒక రోజు తరువాత వొడాఫోన్ ఐడియా ఈ ప్రకటన చేసింది. నవంబర్ 26 నుంచి అన్ని కొత్త ధరలు అమలులోకి రానున్నట్లు ఎయిర్టెల్ పేర్కొంది. (చదవండి: క్వాలిటీ లేని వస్తువులెలా అమ్ముతారు? అమెజాన్, ఫ్లిప్‌కార్టులకు నోటీసులు!) -
Airtel: ఎయిర్టెల్ కస్టమర్లకు భారీ షాక్
Airtel Prepaid Price Hike: తన సబ్స్క్రయిబర్లకు ఎయిర్టెల్ పెద్ద షాకే ఇచ్చింది. టారిఫ్ రేట్లను ఒక్కసారిగా పెంచేసింది. ప్రీపెయిడ్ టారిఫ్‌ను 20 నుంచి 25 శాతం, డాటా టాప్ అప్ ప్లాన్ల మీద 20 నుంచి 21 శాతం పెంచేసింది. ప్రతీ ప్యాక్ మీద పది రూపాయల మినిమమ్ పెంపును ప్రకటించింది. Bharti Airtel New tariffs.. ఆరోగ్యకరమైన ఆర్థిక పోటీలో భాగంగానే ఈ పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు భారతీ ఎయిర్టెల్ సోమవారం ప్రకటించింది. 28 రోజుల వాలిడిటీతో ఉన్న మినిమమ్ టారిఫ్ ప్రస్తుతం 79రూ. ఉండగా, అది రూ.99 కానుంది. ఇక డాటా టాప్ అప్స్లో 48 రూ. అన్లిమిటెడ్ 3జీబీ డాటా ప్యాక్‌ను 58రూ. లకు పెంచేసింది. నవంబర్ 26 నుంచి పెరిగిన ఈ ధరలు టెలికామ్ సబ్స్క్రయిబర్స్కు వర్తించనున్నాయి. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ARPU) కింద 200 నుంచి 300 రూ. అవుతోందని, ఈ లెక్కన ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే టారిఫ్‌లను పెంచక తప్పలేదని భారతీ ఎయిర్టెల్ స్పష్టం చేసింది. టారిఫ్ పెంపు మౌలిక సదుపాయాలలో "గణనీయమైన పెట్టుబడులకు" దారి తీస్తుందని, భారతదేశంలో 5G స్పెక్ట్రమ్‌ను విడుదల చేయడంలో సహాయపడుతుందని సోమవారం ఓ ప్రకటన ఎయిర్‌లెట్ పేర్కొంది. ఇదిలా ఉంటే టెలికామ్ పరిశ్రమ ముందుకు వెళ్లాలంటే టారిఫ్‌లను పెంచకతప్పదని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ఆగస్టులోనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇక తాజా టారిఫ్ పెంపుదల నేపథ్యంలో #Airtel మీద సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా సెటైర్లు పేలుతున్నాయి. -
Jio: తగ్గేదె లే అంటున్న జియో!
న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. అక్టోబర్ నెలలో 4జీ సర్వీస్ ప్రొవైడర్లలో రిలయన్స్ జియో సెకనుకు 21.9 మెగాబిట్ డేటా డౌన్లోడ్ వేగంతో తన అగ్ర స్థానాన్ని నిలుపుకుంది. అలాగే, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా డేటా డౌన్లోడ్ వేగంలో పెరిగినట్లు పేర్కొంది. గతంతో పోలిస్తే డేటా డౌన్లోడ్ వేగం పరంగా భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, జియో నెట్వర్క్ మధ్య అంతరం తగ్గుతుంది. 4జీ డేటా డౌన్లోడ్ వేగం స్వల్పంగా తగ్గిన తర్వాత అక్టోబర్ నెలలో జియో నెట్వర్క్ జూన్ నెలలో నమోదైన 21.9 ఎంబిపిఎస్ డౌన్లోడ్ వేగాన్ని అందుకుంది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా డేటా డౌన్లోడ్ వేగం దాదాపు రెండున్నర రెట్లు పెరిగాయి. ఎయిర్టెల్ 4జీ డేటా డౌన్లోడ్ వేగం జూన్ నెలలో ఉన్న 5 ఎంబిపిఎస్ నుంచి అక్టోబర్ నెలలో 13.2 ఎంబిపిఎస్ కు పెరిగింది. ఇంకా, వొడాఫోన్ ఐడియా డేటా డౌన్లోడ్ వేగం ఐదు నెలల్లో 6.5 ఎంబిపిఎస్ నుంచి 15.6 ఎంబిపిఎస్'కు పెరిగింది. అయితే, అక్టోబర్ నెలలో 4జీ డేటా అప్లోడ్ వేగం పరంగా వొడాఫోన్ ఐడియా తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. వొడాఫోన్ ఐడియా కంపెనీ 7.6 ఎంబిపిఎస్ అప్లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఈ వేగం గత ఐదు నెలల్లో అత్యధికం. అదేవిధంగా, ఎయిర్టెల్, రిలయన్స్ జియో నెట్వర్క్ అప్లోడ్ వేగం అక్టోబర్ నెలలో గత ఐదు నెలలతో పోలిస్తే గరిష్ట స్థాయిలో 5.2 ఎంబిపిఎస్, 6.4 ఎంబిపిఎస్ వేగాన్ని నమోదు చేశాయి. రియల్ టైమ్ ప్రాతిపదికన మైస్పీడ్ అప్లికేషన్ సాయంతో భారతదేశం అంతటా సేకరించే డేటా ఆధారంగా ట్రాయ్ ద్వారా సగటు వేగం లెక్కిస్తుంది. (చదవండి: నెలకు లక్షల్లో జీతాలు.. నెలాఖరుకు జేబులు ఖాళీ!) -
శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఇస్రోతో వన్ వెబ్ కీలక ఒప్పందం
ప్రపంచంలో పెనుమార్పులు తీసుకురానున్న యుకె ఆధారిత గ్లోబల్ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రొవైడర్ వన్ వెబ్ సంస్థలో భారతి ఎయిర్టెల్ భారీగా వాటాను కొనుగోలు చేసిన మనకు తెలిసిందే. వన్ వెబ్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు విజయవంతమైతే ఇంటర్నెట్ కొత్త దశలోకి అడుగుపెడుతుంది. ఇక ఈ భూగోళం మీద ఎక్కడైనా ఆన్లైన్ సేవలు అందుకోవచ్చు. మారుమూల ప్రాంతాలకు.. కనీస రవాణా సౌకర్యాలు లేని ప్రదేశాల్లోని వారు కూడా ఇంటర్నెట్ను వినియోగించే అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా సేవలు నిలిచిపోయే సమస్య రాదు. అటువంటి వన్ వెబ్ ప్రాజెక్టు ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టడం కోసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం గురుంచి భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. "భారత నేల నుంచి వన్ వెబ్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి మేము(వన్ వెబ్) ఇస్రోతో ఒప్పందం చేసుకున్నాము. ఈ రోజు ఈ ఒప్పందం గురుంచి మీ అందరితో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను" అని సునీల్ మిట్టల్ చెప్పారు. అసలు ఏమిటి వన్ వెబ్ ప్రాజెక్టు ఇప్పటి వరకు ప్రపంచంలో అన్నీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం కేబుల్స్ వేయడం, టవర్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే నేరుగా ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం వన్ వెబ్ ప్రాజెక్టు పేరుతో లండన్ కేంద్రంగా 2012లో జార్జివేలర్ అనే వ్యక్తి స్థాపించాడు. అయితే, ఆ కంపెనీ దివాళా తీసే సమయంలో మన దేశ దిగ్గజ టెలికామ్ కంపెనీ, యుకె ప్రభుత్వం అందులో భారీ వాటాను దక్కించుకున్నాయి. (చదవండి: ఎంజీ ఆస్టార్ వచ్చేసింది. ధర ఎంతంటే?) ఇప్పుడు ఆ ప్రాజెక్టు శర వేగంగా దూసుకెళ్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే తొలి దశలో 150 కిలోల బరువున్న 650 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇప్పటికే 322 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరుకొన్నాయి. రెండో దశలో దాదాపు 1900కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాలను ఫ్లోరిడాలోని ఒక కంపెనీ తయారు చేస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ స్పేస్ కంపెనీ రష్యా సోయజ్ రాకెట్ల సాయంతో ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపించేవారు. కానీ, ఇప్పుడు ఈ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టడం కోసం ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం చేసుకుంది. ఈ చిన్న ఉపగ్రహాలు గంటకు 27వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి భూభ్రమణాన్ని 90-120 నిమిషాల్లో పూర్తి చేస్తాయి. వన్ వెబ్ కీ పోటీగా స్పేస్ ఎక్స్ స్టార్ లింకు ప్రాజెక్టు దూసుకెళ్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా ప్రారంభించింది. -
ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. మొబైల్ కొంటె రూ.6000 క్యాష్‌బ్యాక్!
ముంబై: ప్రముఖ టెలికామ్ దిగ్గజం భారతి ఎయిర్టెల్ కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ బ్రాండ్ల నుంచి ₹12,000 వరకు ధర కలిగిన కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు భారతి ఎయిర్టెల్ ₹6,000 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎయిర్టెల్ ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ పొందాలనుకునే వినియోగదారులు కంపెనీ ఎంపిక చేసిన 150కి పైగా స్మార్ట్ ఫోన్లు ఏదైనా ఒకటి కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.అలాగే, క్యాష్ బ్యాక్ బెనిఫిట్ పొందడం కోసం కస్టమర్ 36 నెలల పాటు నిరంతరం(ప్యాక్ వాలిడిటీ ప్రకారం) ₹249 లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.(చదవండి: అద్దె రూపంలో భారీగా సంపాదిస్తున్న బచ్చన్ కుటుంబం) కస్టమర్ రెండు దశలలో క్యాష్ బ్యాక్ అందుకొనున్నారు. మొబైల్ కొన్న 18 నెలల తరువాత మొదటి విడత కింద ₹2000, మిగతా 4 వేల రూపాయలను 36 నెలల తర్వాత అందుకుంటారు. ఈ ప్రోగ్రామ్ కింద మొబైల్ కొనే కస్టమర్ల స్మార్ట్‌ఫోన్‌కు ఏదైనా డ్యామేజీ జరిగినట్లయితే సెర్విఫై ద్వారా ఒక్కసారి ఫ్రీ స్క్రీన్ రీప్లేస్ మెంట్ కు అర్హులు. దీనివల్ల మీకు అదనంగా ₹4800 వరకు ప్రయోజనం కలుగుతుంది. “స్మార్ట్ఫోన్లు ఇప్పుడు ప్రాథమిక అవసరం, ప్రత్యేకించి కరోనా మహమ్మారి అనంతర కాలంలో వినియోగదారులు డిజిటల్‌గా అనేక రకాల సేవలను యాక్సెస్ చేయాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా మిలియన్ల మంది కస్టమర్లు మంచి ఆన్లైన్ అనుభవం కోసం నాణ్యమైన స్మార్ట్‌ఫోన్ కోసం ఆకాంక్షిస్తుండగా, వారికి నచ్చిన పరికరాన్ని సులభంగా కలిగి ఉండాలనేది మా ఆశయం” అని మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శాశ్వత్ శర్మ అన్నారు. -
టెలికాం రంగానికి కేంద్రం భారీ ఊరట
న్యూఢిల్లీ: చాలా కాలం నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న టెలికాం రంగానికి ఊరట కలిగించే కీలకమైన ప్రణాళికకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్ టెల్ వంటి టెలికామ్ కంపెనీలకు భారీ ఊరట కలగనుంది. టెలికాం కంపెనీల్లో వంద శాతం విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే, అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి ఊరట కలిగించేలా ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నేడు జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను టెలికామ్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ రంగంలో ఒత్తిడికి ఏజీఆర్ బకాయిలు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. అందుకే ఏజీఆర్ నిర్వచనాన్ని హేతుబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. ఇకపై టెలికామేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏజీఆర్ అనేది చట్టబద్ధమైన బకాయిలచెల్లింపు కొరకు పరిగణించబడే ఆదాయాలను తెలియజేస్తుంది అని అన్నారు. లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ యూజర్ ఛార్జీలు, అన్ని రకాల ఛార్జీల చెల్లింపు విషయాలపై నేడు హేతుబద్ధీకరించినట్లు పేర్కొన్నారు.(చదవండి: జెట్ ఎయిర్వేస్: టేకాఫ్‌కు సిద్ధం!) భవిష్యత్ వేలంలో స్పెక్ట్రం కాలవ్యవధి 20 సంవత్సరాలకు బదులుగా 30 సంవత్సరాలు చేయనున్నట్లు తెలిపారు. టెలికాంలో 100 శాతం ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. అలాగే ఏజీఆర్, స్పెక్ట్రమ్ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం కూడా ఉందని ఆయన తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల టెలికాం రంగంలో వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలకు నగదు కొరత తీరుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి చెప్పారు. టెలికాం రంగంలో ఆటగాళ్ళ మధ్య ఆరోగ్యకరమైన పోటీని నిర్వహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. -
ఎయిర్టెల్ మరో రికార్డు.. అదేంటంటే!
ప్రముఖ టెలికామ్ దిగ్గజం ఎయిర్టెల్ మరో రికార్డు సాధించింది. భారత దేశంలో 5జీ టెక్నాలజీ సహాయంతో మొట్ట మొదటి క్లౌడ్ గేమింగ్ సెషన్ విజయవంతంగా నిర్వహించినట్లు ఎయిర్టెల్ తెలిపింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికామ్(డీఓటీ) కేటాయించిన స్పెక్ట్రమ్ 5జీ ట్రయల్స్ లో భాగంగా మనేసర్(గుర్గావ్)లో ఈ ప్రదర్శన నిర్వహించారు. గేమర్లు డెమో కోసం వన్ ప్లస్ 9ఆర్ మొబైల్ ఉపయోగించారు. ముఖ్యంగా, ఎయిర్టెల్ సీటీఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది 5జీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. "వచ్చే ఏడాది మొదట్లో 5జీ రావచ్చు" అని ఆయన అన్నారు. ఎయిర్టెల్ నిర్వహించిన 5జీ క్లౌడ్ గేమింగ్ సమావేశంలో భారతదేశంలోని ఇద్దరు ప్రముఖ గేమర్లు మోర్టల్(నమన్ మాథుర్), మాంబా(సల్మాన్ అహ్మద్)లు పాల్గొన్నారు. "ఈ స్మార్ట్ ఫోన్లో హై ఎండ్ పీసీ, కన్సోల్ క్వాలిటీ గేమింగ్ ఆడిన అనుభవం కలిగింది. 5జీ నిజంగా భారతదేశంలో ఆన్ లైన్ గేమింగ్ ను అన్ లాక్ చేస్తుందని" అని గేమర్స్ అన్నారు. వీరు గేమ్ ఆడే సమయంలో 3500 మెగాహెర్ట్జ్ అధిక సామర్థ్యం కలిగిన స్పెక్ట్రమ్ బ్యాండ్ కు కనెక్ట్ అయినట్లు సంస్థ తెలిపింది. గేమింగ్ ప్రియులు హై ఎండ్ గేమ్స్ ఆడాలంటే ఖరీదైన పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ క్లౌడ్ గేమింగ్ ద్వారా రియల్ టైమ్ లో గేమ్స్ స్ట్రీమ్ చేయవచ్చు.(చదవండి: అదే జరిగితే ఇంటర్నెట్ బంద్!) "భారతదేశంలో ఎక్కువ మంది యువత ఉన్నారు. రోజు రోజుకి 5జీ విక్రయాలు పెరిగిపోతున్నాయి. మొబైల్ గేమింగ్ $2.4 బిలియన్ మార్కెట్ గా అభివృద్ధి చెందనుంది. దేశంలో ఆన్ లైన్ గేమర్లు సంఖ్య 2022 నాటికి 510 మిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది" అని ఎయిర్టెల్ పేర్కొంది. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఎయిర్టెల్ 5జీ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఎయిర్టెల్ ఈ ట్రయల్స్ కోసం ఎరిక్సన్, నోకియాతో భాగస్వామ్యం ఒప్పందం చేసుకుంది. ప్రస్తుత టెక్నాలజీతో పోలిస్తే ఎయిర్టెల్ 5జీ ఏకంగా పది రెట్లు వేగవంతమైన సేవలు అందించనుంది. ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్ నగరంలో లైవ్‌గా 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. -
ఎయిర్‌టెల్‌కు సుప్రీంకోర్టులో ఊరట!
ప్రముఖ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. మూడు వారాల వరకు వీడియోకాన్ టెలీ కమ్యూనికేషన్స్(వీటీఎల్) సర్దుబాటు స్థూల ఆదాయం(ఏజీఆర్) బకాయిలకు సంబధించిన రూ.1,300 కోట్ల చెల్లింపుకోసం భారతి ఎయిర్టెల్ అందించిన బ్యాంక్ గ్యారంటీలను వాడుకోవద్దు అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. మధ్యంతర ఉపశమనం కోసం ఈలోగా టెలికామ్ వివాదాల సెటిల్ మెంట్ అండ్ అప్పిలేట్ ట్రిబ్యునల్(టీడీఎస్ఎటి)కు వెళ్లేందుకు ఎయిర్‌టెల్‌కు అనుమతి ఇచ్చింది. ఏజీఆర్ తీర్పును కోర్టు సమీక్షించదని ఈ సందర్భంగా మరోసారి సుప్రీంకోర్టు తెలిపింది. 2016లో ఎయిర్టెల్ వీడియోకాన్ స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసింది. అయితే, ఈ కొనుగోలు సందర్భంగా వీడియోకాన్ ఏజీఆర్ బకాయిలను కేంద్రం డిమాండ్ చేయకుండా భారతి ఎయిర్టెల్ టెలికమ్యూనికేషన్స్ శాఖ దాఖలు చేసిన దరఖాస్తును జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, ఎస్ అబ్దుల్ నజీర్, ఎంఆర్ షాలతో కూడిన బెంచ్ నేడు(ఆగస్టు 24) విచారించింది. ఎయిర్టెల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ మాట్లాడుతూ.. "వీడియోకాన్ ఏజీఆర్ బకాయిలను వారంలోగా రూ.1,500 కోట్లకు చెల్లించాలని కోరుతూ ఎయిర్‌టెల్‌కు డీఓటి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ చెల్లించడంలో విఫలమైతే అప్పుడు హామీ ఇచ్చిన ఎయిర్టెల్ బ్యాంకు నుంచి రికవరీ చేస్తామని డీఓటి తెలిపింది. ఒక టెలికామ్ కంపెనీ స్పెక్ట్రమ్ ఏజీఆర్ బకాయిలను ఆ కంపెనీ మాత్రమే భరించాలని కొనుగోలుదారుడు కాదు అని" అన్నారు. అందుకే వీడియోకాన్ ఏజీఆర్ బకాయిలను ఎయిర్టెల్ నుంచి తిరిగి పొందలేరని పేర్కొన్నారు.(చదవండి: జోకర్ రీఎంట్రీ... జర జాగ్రత్త! క్షణాల్లో మీ ఖాతా ఖాళీ) -
వొడాఫోన్ ఐడియాకు గట్టి ఎదురుదెబ్బ!
మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు ఉంది వొడాఫోన్ ఐడియా పరిస్థితి. ఇప్పటికే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్ ఐడియా జూన్ 2021లో దాదాపు 43 లక్షల మంది చందాదారులను కోల్పోయింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విడుదల చేసిన తాజా టెలికామ్ చందాదారుల డేటా ప్రకారం.. రిలయన్స్ జియో ఈ నెలలో 54 లక్షల మందికి పైగా వినియోగదారులను చేర్చుకుంది. వొడాఫోన్ ఐడియా మేలో 40 లక్షలకు పైగా చందాదారులను కోల్పోతే జూన్ నెలలో 42,89,159 మంది వినియోగదారులను కోల్పోయింది. దీంతో వొడాఫోన్ ఐడియా మొత్తం కస్టమర్ల సంఖ్య 27.3 కోట్లకు పడిపోయింది. రిలయన్స్ జియో జూన్ నెలలో 54,66,556 వినియోగదారులను ఆన్ బోర్డు చేసుకుంది. మేలో ఈ సంఖ్య 35.54 లక్షలుగా ఉంది. ప్రస్తుతం రిలయన్స్ జియో కస్టమర్ల సంఖ్య 43.6 కోట్లకు చేరింది. అలాగే, భారతి ఎయిర్టెల్ 38,12,530 చందాదారులను జోడించుకోవడంతో మొత్తం చందాదారుల సంఖ్య 35.2 కోట్లుగా ఉన్నారు. దేశం మొత్తం మీద టెలిఫోన్ చందాదారుల సంఖ్య జూన్ 2021 చివరినాటికి 120.2 కోట్లకు చేరుకుంది. గత నెలతో పోలిస్తే నెలవారీ వృద్ధి రేటు 0.34 శాతం. పట్టణ టెలిఫోన్ సబ్ స్క్రిప్షన్ పెరిగితే, కానీ గ్రామీణ సబ్ స్క్రిప్షన్ జూన్‌లో స్వల్పంగా తగ్గింది.(చదవండి: ఆస్తుల విక్రయానికి రోడ్‌మ్యాప్ విడుదల చేసిన కేంద్రం) ఇక మొత్తం బ్రాడ్ బ్యాండ్ చందాదారులలో ఐదు సర్వీస్ ప్రొవైడర్లు జూన్ చివరిలో 98.7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నారు. "ఈ సర్వీస్ ప్రొవైడర్లలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 439.91 మిలియన్లు, భారతి ఎయిర్ టెల్ 197.10 మిలియన్లు, వొడాఫోన్ ఐడియా 121.42 మిలియన్లు, బిఎస్ఎన్ఎల్ 22.69 మిలియన్లు, అట్రియా కన్వర్జెన్స్ 1.91 మిలియన్ల చందాదారులను" కలిగి ఉన్నట్లు ట్రాయ్ తెలిపింది. -
స్పేస్ స్టార్టప్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్టెల్
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్‌వెబ్‌లో సునీల్ మిట్టల్‌కు చెందిన భారతీ గ్రూప్ మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడుతోంది. తాజాగా 50 కోట్ల డాలర్లు(రూ. 3,700 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా వన్‌వెబ్‌లో భారతీ గ్రూప్ అతిపెద్ద వాటాదారుగా అవతరించనుంది. దివాలా పరిస్థితులకు చేరిన వన్వెబ్ను గతేడాది యూకే ప్రభుత్వం ఆదుకుంది. గ్లోబల్ ఎల్ఈవో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్‌వెబ్‌లో కాల్ ఆప్షన్లో భాగంగా భారతీ గ్రూప్ తాజా పెట్టుబడులను చేపట్టనుంది. మరోవైపు యూటెల్సాట్ 55 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఈ లావాదేవీల తదుపరి భారతీకి వన్‌వెబ్‌లో 38.6 శాతం వాటా లభించనుంది. యూకే ప్రభుత్వం, యూటెల్సాట్, సాఫ్ట్‌బ్యాంక్ విడిగా 19.3 శాతం చొప్పున వాటాలు పొందనున్నాయి. చదవండి: SBI: ఎస్బీఐ ‘బేసిక్’ కస్టమర్లకు షాక్ -
ఎయిర్టెల్ 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా?
గుర్గావ్: కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం దేశంలోని టెలికాం సంస్థలకు 5జీ టెక్నాలజీ ట్రయల్స్ కోసం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ట్రయిల్స్ లో భాగంగా ఎయిర్టెల్ 5జీ నెట్‌వర్క్‌ను గుర్గావ్లోని సైబర్ హబ్ ప్రాంతంలో 3500 మెగా హెర్ట్జ్ మిడిల్ బ్యాండ్ స్పెక్ట్రంలో పరీక్షించింది. ఎయిర్టెల్ టెలికమ్యూనికేషన్ విభాగం(డీఓటి) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీతో సహా ఇతర నాలుగు భారతీయ టెలికం సర్కిల్‌లలో ఎయిర్‌టెల్‌కు స్పెక్ట్రంను డీఓటి కేటాయించింది. 1 జీబీపీఎస్ వేగాన్ని అందుకున్న ఎయిర్టెల్ ఎయిర్టెల్ దేశంలోని ఇతర ప్రాంతాలలో మిడ్-స్పెక్ట్రంను పరీక్షించే అవకాశం ఉంది. ఎకనామిక్ టైమ్స్ టెలికాం నివేదిక ప్రకారం.. ఈ ట్రయిల్స్ లో 1 జీబీపీఎస్ వేగానికి కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంది. ఎయిర్‌టెల్‌కు 5జీ ట్రయల్ కోసం 3500 మెగాహెర్ట్జ్, 28 గిగాహెర్ట్జ్, 700 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రంను కేటాయించినట్లు నివేదిక పేర్కొంది. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా(వి)లకు 700 మెగాహెర్ట్జ్, 3.5 గిగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్‌లను కేటాయించారు. 5జీ ట్రయిల్స్ కోసం దరఖాస్తు చేసుకున్న టీఎస్‌పీలలో ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎమ్టిఎన్ఎల్ ఉన్నాయి. ఎయిర్టెల్ 5జీ ట్రయల్స్ కోసం ఎరిక్సన్ 5జీ నెట్వర్క్ గేర్‌తో కలిసి పనిచేస్తోంది. ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ-డాట్ టెక్నాలజీ ప్రొవైడర్లతో టీఎస్పీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇంకా, రిలయన్స్ జియో తన సొంత దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రయల్స్ నిర్వహించనుంది. ట్రయల్స్ యొక్క వ్యవధి 6 నెలల మాత్రమే. ఇందులో పరికరాల సేకరణ, ఏర్పాటు కోసమే 2 నెలల పడుతుంది. ఈ ఏడాది జనవరిలో ఎన్ఎస్ఏ (నాన్-స్టాండ్ అలోన్) నెట్వర్క్ టెక్నాలజీ ద్వారా 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో హైదరాబాద్ నగరంలో వాణిజ్య నెట్వర్క్ ద్వారా లైవ్ 5జీ సేవలను విజయవంతంగా పరీక్షించిన మొదటి టెల్కోగా ఎయిర్టెల్ నిలిచింది. ఇప్పటికే ఉన్న టెక్నాలజీలతో పోల్చినప్పుడు 5జీ 10x స్పీడ్స్, 10 ఎక్స్ లేటెన్సీ, 100 ఎక్స్ కంకరెన్సీని అందించగలదని గతంలో ఎయిర్టెల్ నిరూపించింది. చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త! -
స్పేస్ ఎక్స్ కు పోటీగా దూసుకెళ్తున్న వన్‌వెబ్
న్యూఢిల్లీ: భారతి ఎయిర్టెల్ యాజమాన్యంలోని శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ వన్‌వెబ్ 36 కొత్త లో ఎర్త్ ఆర్బిట్(లియో) ఉపగ్రహాలను ఈ రోజు ప్రయోగించినట్లు ప్రకటించింది. రష్యాలోని ఏరియన్‌స్పేస్ నుంచి ఇవి దూసుకెళ్లాయని తెలిపింది. ‘5 టు 50’ లక్ష్యంలో భాగంగా మరొక శాటిలైట్‌ను ప్రయోగించడం ద్వారా యూకే, అలస్కా, ఉత్తర యూరప్, గ్రీన్‌ల్యాండ్, కెనడావంటి దేశాలకు ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. వాణిజ్య సేవలు 2022 నుంచి ప్రారంభం అవుతాయని వివరించింది. దీంతో కక్ష్యలోకి చేరిన మొత్తం శాటిలైట్ల సంఖ్య 218కి చేరుకుందని భారతి గ్రూప్ ప్రమోట్ చేస్తున్న ఈ కంపెనీ వెల్లడించింది. వన్‌వెబ్ గత మార్చి నెలలో ఇదే అంతరిక్ష కేంద్రం నుంచి 36 ఉపగ్రహాల ప్రయోగించింది. కంపెనీ తన సేవల్లో భాగంగా 648 లియో ఉపగ్రహాలను ప్రయోగించాలని యోచిస్తోంది. జూన్ 2021 నాటికి 50 డిగ్రీల అక్షాంశానికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలకు సేవలను అందించడానికి కంపెనీ ఒక అడుగు దూరంలో ఉంది. వన్‌వెబ్, ఏరోస్పేస్ సంస్థ ఎయిర్‌బస్ జాయింట్ వెంచర్ కింద ఈ ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. ఏప్రిల్ చివరిలో వన్‌వెబ్ లో పారిస్ కు చెందిన యూటెల్సాట్ కమ్యూనికేషన్స్ 550 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా యుటెల్సాట్ వన్‌వెబ్‌లో 24శాతం వాటాను సొంతం చేసుకుంది. స్పేస్ ఎక్స్ కు పోటీగా వన్‌వెబ్ శాటిలైట్ ఇంటర్నెట్ అందించాలని చూస్తుంది. చదవండి: నెలకు రూ.890 కడితే శామ్సంగ్ ఫ్రిజ్ మీ సొంతం! -
ఎయిర్టెల్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం సేవల దిగ్గజం భారతీ ఎయిర్టెల్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 759 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 5,237 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 12% పుంజుకుని రూ. 25,747 కోట్లను తాకింది. దేశీయంగా ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 18,338 కోట్లకు చేరింది. దీనిలో మొబైల్ సేవల ఆదాయం 9% బలపడి రూ. 14,080 కోట్లయ్యింది. ఆఫ్రికా ఆదాయం 17 శాతం ఎగసి రూ. 7,602 కోట్లకు చేరువైంది. వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) 5.8% నీరసించి రూ. 145కు పరిమితమైంది. వ్యయాలు తగ్గినా.. క్యూ4లో పెట్టుబడుల వ్యయం సగానికి తగ్గి రూ. 3,739 కోట్లకు పరిమితమైంది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ పరిస్థితుల కారణంగా డేటాకు డిమాండ్ పెరిగింది. దీంతో ఫిక్స్డ్ లైన్లుసహా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల కోసం అధిక పెట్టుబడులు వెచ్చించవలసి వచ్చినట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. వెరసి హోమ్ సర్వీసులపై మూడు రెట్లు అధికంగా రూ. 332 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసింది. ఎక్స్ట్రీమ్ పేరుతో విడుదల చేసిన ఇంటర్నెట్ కనెక్షన్ల ద్వారా కొత్తగా 2.74 లక్షల మంది జత కలిశారు. దీంతో ఈ విభాగంలో కస్టమర్ల సంఖ్య 30.7 లక్షలకు చేరింది. ఎల్సీవో భాగస్వామ్యం ద్వారా నాన్‌వైర్‌డ్ పట్టణాలలోనూ సేవలు విస్తరిస్తున్నట్లు ఎయిర్టెల్ వివరించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం భారీగా తగ్గి రూ. 15,084 కోట్లకు పరిమితమైంది. 2019–20లో రూ. 32,183 కోట్ల నికర నష్టం నమోదైంది. ఈ కాలంలో టర్నోవర్ తొలిసారి రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించి రూ. 1,00,616 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది రూ. 84,676 కోట్ల ఆదాయం సాధించింది. ప్రస్తుతం దేశీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 72,308 కోట్లను అధిగమించింది. ఆఫ్రికా బిజినెస్ సైతం 19 శాతం పుంజుకుని రూ. 28,863 కోట్లను తాకింది. గ్లోబల్ కస్టమర్ల సంఖ్య 47 కోట్లుకాగా.. దేశీయంగా కస్టమర్లు 13 శాతం పెరిగి 35 కోట్లకు చేరారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రుణ భారం రూ. 1,48,508 కోట్లుగా నమోదైంది. కోవిడ్–19 సవాళ్లలో అవసరమైన డిజిటల్ ఆక్సిజన్ వంటి సర్వీసులను అందిస్తున్నాం. ఇలాంటి కష్టకాలంలోనూ కస్టమర్లకు పటిష్ట నెట్‌వర్క్‌ను అందించేందుకు తోడ్పడుతున్న సిబ్బందిని ప్రశంసిస్తున్నాను. వెరసి మరోసారి ప్రోత్సాహకర ఫలితాలు సాధించగలిగాం. క్యూ4లో ఎంటర్ప్రైజ్ విభాగం రెండంకెల వృద్ధిని సాధించింది. – ఎయిర్టెల్ ఇండియా, దక్షిణాసియా విభాగం ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు ఎన్ఎస్ఈలో 2.3 శాతం నష్టంతో రూ. 548 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 564–546 మధ్య ఊగిసలాడింది. -
స్పెక్ట్రం బిడ్డింగ్‌కు రూ. 13,475 కోట్ల డిపాజిట్
న్యూఢిల్లీ: రాబోయే విడత స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు టెలికం సంస్థలు మొత్తం రూ. 13,475 కోట్ల డిపాజిట్ (ఈఎండీ) సమర్పించాయి. రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 10,000 కోట్లు, భారతి ఎయిర్టెల్ రూ. 3,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 475 కోట్ల ఈఎండీ ఇచ్చాయి. టెలికం శాఖ (డాట్) గురువారం ఈ వివరాలు వెల్లడించింది. మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే స్పెక్ట్రం వేలం నిబంధనల ప్రకారం దీని ఆధారంగానే నిర్దిష్ట పరిమాణం స్పెక్ట్రం కోసం పోటీపడేందుకు అనుమతిస్తారు. మొత్తం అన్ని స్పెక్ట్రం బ్లాకుల కోసం బిడ్ చేయాలంటే రూ. 48,141 కోట్ల ఈఎండీ చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే వేలంలో పెద్దయెత్తున స్పెక్ట్రం అమ్ముడు కాకపోవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
ఎయిర్టెల్ చేతికి టెలిమీడియా వాటా
న్యూఢిల్లీ: డీటీహెచ్ విభాగం భారతీ టెలిమీడియాలో 20 శాతం వాటాను తిరిగి సొంతం చేసుకోనున్నట్లు మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తాజాగా పేర్కొంది. పీఈ దిగ్గజం వార్బర్గ్ పింకస్ నుంచి ఈ వాటాను రూ. 3,126 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. 2017 డిసెంబర్లో కుదుర్చుకున్న డీల్‌లో భాగంగా వార్‌బర్గ్‌కు చెందిన అనుబంధ సంస్థ లియన్ మెడో ఇన్వెస్ట్మెంట్ 2018లో భారతీ టెలిమీడియాలో 20 శాతం వాటాను పొందింది. ఇందుకు రూ.2,310 కోట్లు వెచ్చించింది. కాగా.. తాజాగా టెలిమీడియాలో వాటాను నగదు చెల్లింపు, ఈక్విటీ జారీ ద్వారా సొంతం చేసుకోనున్నట్లు ఎయిర్టెల్ తెలియజేసింది. షేరుకి రూ. 600 ధరలో 3.64 కోట్ల ఎయిర్టెల్ షేర్లను వార్‌బర్గ్‌కు జారీ చేయనుంది. వీటికి జతగా రూ.1,038 కోట్లవరకూ నగదును సైతం చెల్లించనున్నట్లు వివరించింది. భారతీ టెలిమీడియా డీటీహెచ్ బిజినెస్ డిసెంబర్ కల్లా 1.7 కోట్లమంది సబ్స్క్రయిబర్లను కలిగి ఉంది.(చదవండి: మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్) -
ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త..!
న్యూఢిల్లీ: బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఎయిర్టెల్ శుభవార్త ప్రకటించనుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు అయిన బేసిక్, ఎంటర్టైన్మెంట్, ప్రీమియం, తదితర వాటికి డేటా పరిమితిని తొలగించనుంది. ప్రస్తుతం అన్ని ప్లాన్ల వినియోగదారులకు అపరిమిత డేటా ఆఫర్ ఇవ్వనుంది. అయితే తమ ఖాతాదారులు జియోకు మారకుండా ఉండే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రూ. 299 అన్లిమిటెడ్ డేటా యాడ్ ఆన్ ప్యాక్‌ను తొలగించింది. అయితే అపరిమిత డేటా ప్రయోజనం 3300 జీబీ ఎఫ్‌యూపీ క్యాప్‌తో అందుబాటులోకి రానుంది. ఎయిర్టెల్ తాజా ఆఫర్‌కు సంబంధించిన వివరాలు ఎయిర్టెల్ వెబ్సైట్, మై ఎయిర్టెల్ యాప్‌లో పెట్టనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. కాగా రిలయన్స్ జియోతో పోటీని తట్టుకోవడానికి ఈ ఆఫర్ ప్రకటించిందని మొబైల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎయిర్టెల్ తాజా నిర్ణయంతో తమ వినియోగదారులు జియోకు మారకుండా ఉండేందుకు దోహదం చేస్తుందని ఎయిర్టెల్ భావిస్తుంది. ఇదివరకే ఆంధ్రప్రదేశ్, గుజరాత్ సర్కిళ్లలో ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై అపరిమిత డేటాను అందిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: చిప్స్ కొంటే..ఉచిత డేటా : ఎయిర్టెల్) -
అమెజాన్ డీల్ : ఎయిర్టెల్ క్లారిటీ
సాక్షి,ముంబై: దేశీయ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌లో భారీ పెట్టుబడులు అంటూ వచ్చిన వార్తలపై స్పందించిన ఎయిర్టెల్ ఈ రూమర్లను కొట్టి పారేసింది. ఇటువంటి ఊహాగానాలు అనవసరమైన పరిణామాలకు దారి తీస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమైన అంశాలపై కంపెనీల స్పష్టమైన వివరణ లేకుండానే ఇలాంటి నివేదికలు వెలువడటం విచారకరమని వ్యాఖ్యానించింది. అంతేకాదు ఇలాంటి అంచనాలతో స్టాక్ ధర ప్రభావితమవుతుందని, తద్వారా తమ ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొంది. ఇలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఎయిర్టెల్ స్పష్టత ఇవ్వడంతో శుక్రవారం నాటి మార్కెట్ లో కంపెనీ షేరు 2 శాతానికి పైగా ఎగిసింది. (జియోలో పెట్టుబడుల ప్రవాహం: మరో మెగా డీల్) అటు భారతి ఎయిర్‌టెల్‌లో వాటాలు కొనుగోలు వార్తలపై స్పందించేందుకు అమెజాన్ ప్రతినిధి ఇప్పటికే తిరస్కరించారు. భవిష్యత్తులో తాము ఏం చేయబోతున్నాం అనే ఊహాగానాలపై వ్యాఖ్యానించలేమన్నారు. కాగా అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సుమారు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. (బుల్ దౌడు : ట్రిపుల్ సెంచరీ) -
దేశీ టెల్కోల్లో..టెక్‌చల్!
న్యూఢిల్లీ: దేశీ టెలికం సంస్థల్లో వాటాలు దక్కించుకోవడంపై అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలు దృష్టి పెడుతున్నాయి. పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో మైక్రోసాఫ్ట్; వొడాఫోన్ ఐడియాపై గూగుల్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటి వివరాలు వెల్లడవుతాయని పరిశ్రమవర్గాల సమాచారం. మైక్రోసాఫ్ట్–జియో జోడీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్, టెలికం వ్యాపార విభాగాన్ని విడగొట్టి ఏర్పాటు చేసిన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, అబుధాబికి చెందిన ముబాదలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కూడా రంగంలోకి దిగాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌లో మైక్రోసాఫ్ట్ సుమారు 2.5% వాటాల కోసం దాదాపు 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయవచ్చని సమాచారం. దేశీయంగా అతి పెద్ద టెలికం సేవల సంస్థల్లో ఒకటైన జియో కూడా జియో ప్లాట్‌ఫామ్స్‌లో భాగమే. ఇప్పటిదాకా ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ వంటి దిగ్గజాలు దాదాపు 10 బిలియన్ డాలర్లపైగా ఇన్వెస్ట్ చేసింది. ఈ పెట్టుబడుల ఊతంతో జియోను విదేశాల్లో లిస్టింగ్ చేసే యోచనలో కూడా రిలయన్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రిలయన్స్ జియో, మైక్రోసాఫ్ట్ మధ్య ఒక భాగస్వామ్యం ఉంది. క్లౌడ్ సేవల మైక్రోసాఫ్ట్ అజూర్‌కు సంబంధించి ఒప్పందం ఉంది. మరోవైపు, జియోలో పెట్టుబడులు పెట్టడంపై ముబాదలా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా వచ్చిన పెట్టుబడులను బట్టి జియో ప్లాట్‌ఫామ్స్ సంస్థ విలువ దాదాపు రూ. 5.61 లక్షల కోట్లుగా ఉంది. వొడా–గూగుల్ జట్టు.. ఆర్థిక సంక్షోభ పరిస్థితులతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్ చేయాలని సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దాదాపు 5 శాతం వాటాలు కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని వివరించాయి. మరోపక్క, గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ కూడా అటు జియోలోనూ వాటాలు కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇవి జరుగుతూనే ఉన్నప్పటికీ, డీల్ విషయంలో మాత్రం ప్రత్యర్థి సంస్థలతో పోటీలో గూగుల్ వెనుకబడిందనేది పరిశ్రమవర్గాల మాట. వేల కోట్ల నష్టాలు, రుణాల భారంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారిన వొడాఫోన్ ఐడియాలో ఒకవేళ గూగుల్ గానీ ఇన్వెస్ట్ చేసిన పక్షంలో కంపెనీకి గణనీయంగా ఊరట లభించనుంది. టెలికం శాఖ గణాంకాల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల కింద కేంద్రానికి వొడాఫోన్ ఐడియాకు దాదాపు రూ. 53,000 కోట్లు కట్టాల్సి ఉంది. వొడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్ చేసిన పక్షంలో జియో సహా ఫేస్‌బుక్‌తో కూడా గూగుల్ పోటీ ఎదుర్కొనాల్సి రానుంది. భారత్ కోసం ప్రత్యేక ప్రణాళికలు వేస్తూనే ఉన్న గూగుల్.. తమ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, మొబైల్ పేమెంట్స్ సేవలు మొదలైన మార్గాల్లో దేశీ మార్కెట్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఎయిర్‌టెల్‌లోనూ విదేశీ పెట్టుబడులు.. టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌లో కూడా ఇటీవలే అంతర్జాతీయ దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. ప్రమోటరు సంస్థ భారతి టెలికం ఇందులో 2.75 శాతం వాటాలను విక్రయించింది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సొసైటీ జనరల్, బ్లాక్‌రాక్, నోర్జెస్ బ్యాంక్, ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్ మొదలైనవి వీటిని కొనుగోలు చేశాయి. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వంటి సంస్థలూ వాటాలను దక్కించుకున్నాయి. ఈ షేర్ల విక్రయం ద్వారా భారతి టెలికం రూ. 8,433 కోట్లు సమీకరించింది. -
లాక్‌డౌన్‌ను ఎదుర్కొనే సత్తా ఉన్న రంగమిదే..!
కోవిడ్ సంబంధిత అంతరాయాతో విశ్లేషకులు పలు కంపెనీ షేర్ల వృద్ధి అంచనాలను, టార్గెట్ ధరలను తగ్గిస్తున్నారు. దీంతో ఇటీవల వారాల్లో అనేక షేర్లు రీ-రేటింగ్‌ను చూస్తున్నాయి. కానీ ఇంత సంక్షోభంలో ఒక రంగానికి చెందిన కంపెనీలు దుమ్ముదులుపుతున్నాయి. చాలామంది ఇన్వెస్టర్లు ఈ రంగంపై మక్కువ చూపిస్తున్నారు. అదే టెలికాం రంగం.... ఇటీవల కాలం వరకు ఈ రంగం నానా ఇబ్బందులతో సతమతమైతూ వచ్చింది. కానీ ఒక్కమారుగా ఈ రంగం బంగారుబాతుగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ వ్యవధిలో డబ్బులు డబుల్ కావడానికి టెలికాం రంగం ఉత్తమైన ఎంపికగా కొందరు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లాక్డౌన్ సమయంలో డేటా, వాయిస్ వినియోగం పెరగడం, గతేడాది చివరి నెలలో టారీఫ్‌ల పెంపుతో పాటు భవిష్యత్తులో కంపెనీలు టారీఫ్‌లు పెంచవచ్చనే అంచనాలతో బ్రోకరేజ్ సంస్థలు టెలికాం రంగ షేర్లకు బుల్లిష్ రేటింగ్‌ను ఇస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ కంపెనీల ఆదాయాలు పెరగవచ్చని అంచనా వేస్తున్నాయి. టెలికాం కంపెనీలు రానున్న పదేళ్ల వరకు వార్షిక ప్రాతిపాదికన 14శాతం చక్రీయ వార్షిక వృద్ది నమోదు చేయగలవని యాంబిట్ క్యాపిటల్ ఛైర్మన్ వివేకానంద్ అభిప్రాయపడ్డారు. ఈయన వోడాఫోన్ ఐడియా షేరుపై బాగా బుల్లిష్‌గా ఉన్నారు. త్వరలో పోస్ట్‌పెయిడ్ ధరలను పెంచడంతో పాటు ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే ప్రీమియం వినియోగదారులు అధికంగా ఉండటం వోడాఫోన్ ఐడియాకు కలిసొస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో షేరుకు ‘‘బై’’ రేటింగ్ కేటాయింపుతో పాటు, ఏడాది కాలానికి టార్గెట్ ధరను రూ.19గా నిర్ణయించారు. ఈ టార్గెట్ ధర షేరు ప్రస్తుత ట్రేడింగ్‌ను నుంచి ఏకంగా 248శాతం అధికంగా ఉంది. ఇదే షేరు మార్చి కనిష్టం నుంచి ఏకంగా 73శాతం పెరిగింది. టెలికాం రంగంలో ఆదాయాల విజిబిలిటి మెరుగుపడుతున్నందున టెలికాం షేర్లు రానున్న రోజుల్లో చెప్పుకోదగిన ర్యాలీ చేసే అవకాశం ఉందని నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ సిఐఓ సైలేష్ రాజ్ భన్ అభిప్రాయపడ్డారు. భారతీ ఎయిర్టెల్ షేరుపై అధిక బ్రోకరేజ్ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి. మోర్గాన్ స్టాన్లీతో సహా మొత్తం 7 కంపెనీలు అవుట్పర్ఫామ్ రేటింగ్, 16 కంపెనీలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించినట్లు రాయిటర్స్ నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల కంపెనీ నిరుత్సాహకరమైన త్రైమాసికపు ఫలితాలను ప్రకటించినప్పటికీ.., మోర్గాన్ స్టాన్లీ సేరు ఓవర్‌వెయిట్ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్ ధరను రూ.525 నుంచి రూ.725కు పెంచింది. భారతీ ఎయిర్టెల్ షేరు ఈ క్యాలెండర్ అన్ని బ్లూచిప్ కంపెనీల్లో కెల్లా అత్యధిక ర్యాలీని చేసింది. వార్షిక ప్రాతిపదికన 31శాతం లాభపడింది. -
బాకీలు వెంటనే కట్టేయండి
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏజీఆర్ సంబంధ మిగతా బాకీలను కూడా వెంటనే కట్టేయాలంటూ టెల్కోలను కేంద్రం ఆదేశించింది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు ఇతర ఆపరేటర్లకు టెలికం శాఖ (డాట్) ఈ మేరకు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ’మరింత జాప్యం లేకుండా’ మిగతా బకాయిలు చెల్లించడంతో పాటు స్వీయ మదింపు గణాంకాలు తదితర వివరాలు కూడా సమర్పించాలని డాట్ సూచించినట్లు వివరించాయి. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) ఫార్ములాకు అనుగుణంగా డాట్ లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల కింద టెల్కోలు దాదాపు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, తమ స్వీయ మదింపు ప్రకారం డాట్ చెబుతున్న దానికంటే తాము కట్టాల్సినది చాలా తక్కువే ఉంటుందని టెల్కోలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా రూ. 26,000 కోట్లు మాత్రమే చెల్లించాయి. పీఎస్‌యూలకు మినహాయింపు.. ఏజీఆర్ బాకీల కేసు నుంచి టెలికంయేతర ప్రభుత్వ రంగ సంస్థలను సుప్రీం కోర్టు తప్పించినట్లు సమాచార శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే పార్లమెంటుకు తెలియజేశారు. తగు వేదికల ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించినట్లు రాతపూర్వక సమాధానంలో ఆయన పేర్కొన్నారు. సొంత అవసరాల కోసం తీసుకున్న స్పెక్ట్రంలో కొంత భాగాన్ని థర్డ్ పార్టీలకు ఇవ్వడం ద్వారా ఆదాయం ఆర్జించాయన్న ఉద్దేశంతో గెయిల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు ఏజీఆర్‌పరంగా రూ. 2.7 లక్షల కోట్లు కట్టాలంటూ డాట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
టెలికాం కంపెనీలకు సుప్రీం షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం కంపెనీలకు సర్వోన్నత న్యాయస్ధానం నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్ధూల రాబడి (ఏజీఆర్)పై బకాయిల చెల్లింపుల కోసం నూతన షెడ్యూల్‌ను ప్రకటించాలని కోరుతూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపుల్లో విఫలమైన టెలికాం కంపెనీలపై కఠిన చర్యలు ఎందుకు చేపట్టలేదని టెలికాం శాఖను తీవ్రంగా మందలించింది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలపై కోర్టు ధిక్కరణ అభియోగాలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. బకాయిల చెల్లింపులపై ఒత్తిడి చేయరాదని కోరుతూ అటార్నీ జనరల్‌కు లేఖ రాసిన టెలికాం శాఖ డెస్క్ అధికారిపైనా సుప్రీంకోర్టు మండిపడింది. తనపై ఎందుకు చర్య తీసుకోరాదో వివరించాలని కోరుతూ ఆ అధికారికి కోర్టు ధిక్కరణ నోటీసును జారీ చేసింది. ఏజీఆర్ చెల్లింపులపై పలుసార్లు ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు చెల్లింపులు చేపట్టలేదో మార్చి 17న కోర్టుకు హాజరై వివరించాలని, వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టకూడదో తెలపాలని భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా సహా టెలికాం కంపెనీల ఎండీ, డైరెక్టర్లందరికీ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. టెలికాం కంపెనీల పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీం బెంచ్ విచారణను చేపట్టింది. చదవండి : నిర్భయ: ‘సుప్రీం’ను ఆశ్రయించిన వినయ్ శర్మ -
భారతి ఎయిర్‌టెల్‌కు గ్రీన్ సిగ్నల్, భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌కు భారీ ఊరట లభించింది. భారతీ ఎయిర్‌టెల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచుకోవడానికి టెలికాం విభాగం (డాట్) ఆమోదం తెలిపింది. ఇంతకుముందు అనుమతించిన 49 శాతం నుంచి 100 శాతానికి పెంచుకునేందుకు అనుమతి లభించిందని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ సమాచారంలో కంపెనీ మంగళవారం తెలిపింది. జనవరి 23 తేదీలోపు రూ. 35,586 కోట్ల బకాయిలను చెల్లించడానికి ముందు ఈ ఆమోదం లభించడం గమనార్హం. ఇందులో రూ .21,682 కోట్లు లైసెన్స్ ఫీజు, మరో రూ.13,904 కోట్లు స్పెక్ట్రం బకాయిలు (టెలినార్, టాటా టెలిసర్వీస్ బకాయిలను మినహాయించి) ఉన్నాయి. నష్టాల ఊబిలో కూరుకుపోయిన భారతి టెలికాం సుమారు రూ 4,900 కోట్ల విదేశి పెట్టుబడుల కోసం ప్రభుత్వ అనుమతికోసం వేచి చూస్తోంది. నిధుల సమీకరణలో భాగంగా భారతి టెలికాం పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను సమీకరిస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్ కు చెందిన సింగ్ టెల్ అనే కంపెనీ సహా మరికొన్ని విదేశీ సంస్థల ద్వారా సుమారు రూ 4,900 కోట్ల పెట్టుబడిని సేకరించనుంది. కాగా ఎఫ్‌డీఐ దరఖాస్తును కేంద్ర టెలికాం శాఖ తిరస్కరించింది. ఈ క్రమంలో భారతీ ఎయిర్టెల్ తమ సంస్థలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ రెండోసారి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. -
భారీ క్యూఐపీకి భారతి ఎయిర్టెల్!
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం కంపెనీ భారతి ఎయిర్టెల్ భారీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేసెమెంట్ (క్యూఐపీ)కి సిద్ధమవుతోంది. క్యూఐపి ద్వారా సుమారు 2 బిలియన్ డాలర్లు సేకరించాలని ఎయిర్టెల్ యోచిస్తోందన్నవార్తలు మార్కెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి ఈ పెట్టుబడుల సమీకరణకు పలు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ భారీ క్యూఐపీ వచ్చే రెండు వారాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2 బిలియన్ డాలర్ల వరకు ఈక్విటీని, మరో బిలియన్ డాలర్ల రుణాన్ని సేకరించే ప్రతిపాదనలకు భారతి ఎయిర్టెల్ వాటాదారుల అనుమతి లభించిందని పేరు చెప్పడానికి ఇష్టపడని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వార్తల ప్రకారం వార్‌బగ్ పిన్కస్, ప్రుడెన్షియల్, క్యాపిటల్ ఇంటర్నేషనల్, జీఐసి, సహా టెమాసెక్ భారతి ఎయిర్‌టెల్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టెమాసెక్, జీఐసీ సంస్థనుంచి చెరి 500 మిలియన్ డాలర్లు సమకూర్చుకోనుంది. ఇందుకు వాటాదారుల ఆమోదం లభించిందనీ, రానున్న రెండు వారాల్లోనే ఈ క్యూఐపీ మొదలు కానుందని భావిస్తున్నారు. అయితే ఈ అంచనాలపై భారతి ఎయిర్టెల్ అధికారికంగా ప్రకటన చేయాల్సి వుంది. -
టెలికం.. లైన్ కట్ అవుతోంది
న్యూఢిల్లీ: అత్యంత చౌక చార్జీలు, భారీ స్థాయిలో వినియోగం.. అన్నీ కలిసి టెలికం పరిశ్రమను కోలుకోలేనంతగా కుదేలెత్తిస్తున్నాయని టెల్కో దిగ్గజం భారతీ ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతీ మిట్టల్ ఆందోళన వ్యక్తం చేశారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తక్షణమే జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్నారు. ఇటు పెట్టుబడులు అటు వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, రెండింటి మధ్య సమతౌల్యం ఉండేలా ట్రాయ్ తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బడ్జెట్ ముందరి సమావేశాల్లో భాగంగా ఇతర కార్పొరేట్ దిగ్గజాలతో కలిసి గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన సందర్భంగా సునీల్ మిట్టల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, టెలికం కంపెనీల ఏఆర్పీయూ (యూజరుపై సగటు ఆదాయం) క్రమంగా రూ.200 నుంచి రూ.300 దాకా చేరొచ్చని చెప్పారాయన. ‘డేటా, వాయిస్, ఇతర సర్వీసులకు కలిపి నెలకు ఒకో యూజరు కనిష్టంగా రూ.100, గరిష్టంగా రూ.450–500 దాకా చెల్లించవచ్చని అంచనా. వీటి సగటు సుమారు రూ.300 దాకా ఉండవచ్చు. డాలర్ రూపంలో నెలకు 4 డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత చౌక టారిఫ్‌లు ఇవే. డేటా వినియోగం మాత్రం మిగతా దేశాలతో పోలిస్తే రెండు, మూడు రెట్లు ఎక్కువే‘ అని మిట్టల్ పేర్కొన్నారు. ఇంటర్‌కనెక్ట్ యూసేజీ చార్జీలను (ఐయూసీ) ట్రాయ్ ఏడాది పాటు వాయిదా వేయడం, టెలికం సేవలకు కనీస చార్జీలను నిర్ణయించే అంశంపై దృష్టి సారించడం తదితర అంశాల నేపథ్యంలో సునీల్ మిట్టల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కర్ణాటకలో 3జీ సేవలకు ఎయిర్టెల్ గుడ్‌బై ఎయిర్టెల్ క్రమంగా 3జీ సేవలను ఉపసంహరిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా కర్ణాటకలో 3జీ నెట్‌వర్క్‌ను నిలిపివేసినట్లు కంపెనీ గురువారం తెలిపింది. ఇకపై అక్కడ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను.. హై స్పీడ్ 4జీ నెట్‌వర్క్‌పై అందిస్తామని తెలిపింది. ఫీచర్ ఫోన్ల వినియోగదారుల కోసం 2జీ సేవలు యథాప్రకారం కొనసాగించనున్నట్లు తెలిపింది. -
వ్యాపార నిబంధనాలు తొలగించండి
న్యూఢిల్లీ: దేశంలో వ్యాపారాలను మరింత సులభంగా నిర్వహించుకునే వాతావరణం కల్పించాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కేంద్రాన్ని కోరారు. 2020–21 బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్, అసోచామ్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గోయెంకా తదితర పారిశ్రామిక ప్రముఖులతోపాటు కార్మిక సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమైన సూచనలు, డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. మరింత స్వేచ్ఛ... ‘‘దేశంలో వ్యాపార నిర్వహణను సులభంగా మార్చే విషయమై చర్చించేందుకే నేను ఈ రోజు ఇక్కడకు వచ్చాను. నా డిమాండ్ ఇదే. వినియోగదారుల ప్రయోజనాన్ని, పెట్టుబడులను సమతౌల్యం చేయాల్సి ఉంది’’ అని సునీల్ భారతీ మిట్టల్ సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులకు చెప్పారు. కంపెనీల కొనుగోళ్లు, విలీనాలు, వ్యాపార విభజన, ఎన్సీఎల్టీ ప్రక్రియను ఆలస్యం చేస్తున్న ఆదాయపన్ను సెక్షన్లపై సూచనలు చేసినట్టు వెల్లడించారు. ‘‘పరిశ్రమలు మరింత స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉండాలన్నదే ఆలోచన. వాటిని ఆర్థిక మంత్రి చక్కగా స్వీకరించారు. భారత పారిశ్రామికవేత్తల శక్తిని ద్విగుణీకృతం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నాం’’ అని మిట్టల్ తెలిపారు. వ్యాపార సులభతర నిర్వహణ కీలక పాత్ర పోషిస్తుందని అసోచామ్ ప్రెసిడెంట్ బాలకృష్ణగోయంకా పేర్కొనగా, చాలా పరిశ్రమలకు ఇదే ఆందోళనకర అంశమని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ చెప్పారు. వ్యాపార సులభ నిర్వహణతోపాటు వృద్ధి ప్రేరణకు ఏం చేయగలమన్న అంశంపై చర్చించినట్టు ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపు అధినేత సంజీవ్ గోయెంకా తెలిపారు. ‘‘అన్ని రకాల సలహాలను వారు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ తరహా స్పందనను ప్రభుత్వం నుంచి చూడడం ఇదే మొదటిసారి’’ అని గోయెంకా పేర్కొన్నారు. మందగమనం చాలా రంగాల్లో ఉత్పత్తి సామర్థ్యం వినియోగంపై ప్రభావం చూపించిందన్నారు. ఇది సాధారణ స్థితికి రావడానికి మూడు, నాలుగు త్రైమాసికాల సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. పన్ను భారం తగ్గించాలి.. ‘‘రూ.20 లక్షల కంటే ఒక ఏడాదిలో తక్కువ ఆర్జించే వారికి ఆదాయపన్ను తగ్గించాలని సూచన చేశాం. దీనివల్ల వినియోగదారుల చేతుల్లో ఖర్చు చేసేందుకు మరింత ఆదాయం ఉంటుంది. అది ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది. ఈఎంఐలను తగ్గించాలనీ కోరాం. ఆర్బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని మరింతగా వినియోగదారులకు బదిలీ చేస్తే ఈఎంఐల భారం తగ్గుతుంది’’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని తెలిపారు. ఆదాయపన్ను సీలింగ్ పెంచాలి: కార్మిక సంఘాలు కనీస వేతనాన్ని రూ.21,000 చేయాలని, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద కనీస పెన్షన్‌ను రూ.6,000కు పెంచాలని, వార్షికంగా రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారిని ఆదాయపన్ను నుంచి మినహాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కార్మిక సంఘాలు కోరాయి. బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా తమ డిమాండ్లను మంత్రి ముందుంచాయి. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంపై ఆందోళనను వ్యక్తం చేశాయి. ఉద్యోగ కల్పన దిశగా రానున్న బడ్జెట్లో ఉండాల్సిన చర్యలను సూచించాయి. ► మౌలిక, సామాజిక రంగాలు, వ్యవసాయంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వ్యయం చేయడం ద్వారా ఉద్యోగాలను కల్పించొచ్చు. ►అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపు, అదనపు పోస్టులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలి. ► నిత్యావసర వస్తువులను స్పెక్యులేటివ్ ఫార్వార్డ్ ట్రేడింగ్ నుంచి నిషేధించాలి. ►సామర్థ్యాలు ఉండి కూడా దెబ్బతిన్న ప్రభుత్వరంగ సంస్థలను పునరుద్ధరించేందుకు బడ్జెట్ నుంచి నిధుల సహకారం ఇవ్వాలి. ►10 మంది ఉద్యోగులను కలిగిన కంపెనీలనూ ఈపీఎఫ్‌వో పరిధిలోకి తీసుకురావాలి. ప్రస్తుతం ఇది కనీసం 20 మంది ఉద్యోగులున్న కంపెనీలకు వర్తిస్తోంది. ►గ్రాట్యుటీని ఏడాదిలో 15 రోజులకు కాకుండా కనీసం 30 రోజులకు చెల్లించేలా చేయాలి. ►హౌసింగ్, మెడికల్, ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఇస్తున్న అలవెన్స్‌లపై పన్ను మినహాయింపు ఇవ్వాలి. ►స్టీల్, బొగ్గు, మైనింగ్, హెవీ ఇంజనీరింగ్, ఫార్మా, డ్రెడ్జింగ్, సివిల్ ఏవియేషన్, ఫైనాన్షియ ల్ రంగంలోని ప్రభుత్వరంగ సంస్థలను వ్యూహాత్మక విక్రయాలకు దూరంగా ఉంచాలి. -
మొబైల్ రీచార్జితో రూ. 4 లక్షల బీమా కవరేజీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ తమ ప్రీ–పెయిడ్ మొబైల్ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూ. 599 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకునేవారికి రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ కూడా అందించనున్నట్లు తెలిపింది. భారతి యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. సోమవారం కొత్తగా ప్రకటించిన రూ. 599 ప్లాన్‌తో రోజుకు 2 జీబీ డేటా, ఏ నెట్‌వర్క్‌కయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు అదనంగా రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజీ లభిస్తుందని ఎయిర్టెల్ వివరించింది. ఈ రీచార్జ్ వేలిడిటీ 84 రోజులు ఉంటుందని, ప్రతీ రీచార్జ్‌తో పాటు బీమా కవరేజీ ఆటోమేటిక్‌గా మూడు నెలల పాటు కొనసాగుతుందని తెలిపింది. 18–54 ఏళ్ల కస్టమర్లకు ఇది వర్తిస్తుందని.. ఇందుకోసం ప్రత్యేకంగా వైద్యపరీక్షలు అవసరం లేదని వివరించింది. దీన్ని ప్రస్తుతం ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లోనే ప్రవేశపెట్టినట్లు, క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు కంపెనీ వివరించింది. -
జియో జైత్రయాత్ర
భారత టెలికాం రంగంలో కాలిడిన మూడేళ్లలోనే రిలయన్స్ జియో టాప్‌లోకి దూసుకొచ్చింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ఎంట్రీతోనే ప్రత్యర్థి కంపెనీల గుండెల్లో గుబులు రేపిన జియో వినియోగదారుల ఆదరణతో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. 331.3 మిలియన్ల చందాదారులతో దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. తద్వారా వోడాఫోన్ ఐడియాను వెనక్కి నెట్టేసింది. 2019 జూన్ (మొదటి త్రైమాసికం) నాటికి వొడాఫోన్ ఐడియా వినియోగదారుల సంఖ్య 320 మిలియన్లకు క్షీణించిందని వోడాఫోన్ ఐడియా త్రైమాసిక ఫలితాల సందర్భంగా శుక్రవారం నివేదించింది. మార్చి త్రైమాసికంలో 334.1 మిలియన్ల మంది ఖాతాదారులు నమోదయ్యారు. మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత వారం ప్రకటించిన క్యూ1 ఆర్థిక ఫలితాల ప్రకారం, అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 2019 జూన్ నాటికి 331.3 మిలియన్ల వినియోగదారులు ఉన్నట్టు ప్రకటించింది. ఈ తాజా లెక్కల ప్రకారం అత్యధిక వినియోగదారులతో అతిపెద్ద సంస్థగా జియో నిలిచింది. టెలికాం రంగ నియంత్రణ మండలి ట్రాయ్ డేటా ప్రకారం..మే నెలలో జియో 32.29 కోట్ల మంది కస్టమర్లు, 27.80 శాతం మార్కెట్ వాటాతో దేశంలో రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఎదిగింది. భారతి ఎయిర్టెల్ 32.03 కోట్ల యూజర్లు, 27.6 శాతం మార్కెట్ వాటాతో మూడోస్థానానికి పడిపోయింది. మే నెలలో జియో నెట్‌వర్క్‌లోకి నికరంగా 81.80 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరగా.. వొడాఫోన్ ఐడియా 56.97 లక్షలు, భారతీ ఎయిర్టెల్ 15.08 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయి. కాగా గత ఏడాదిలో వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ విలీనం తరువాత ఏర్పడిన సంస్థ వొడాఫోన్ ఐడియా 400 మిలియన్లకు పైగా సభ్యులతో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే క్రమంగా కస్టమర్లను కోల్పోతూ వచ్చిన వొడాఫోన తాజాగా రెండో స్థానంతో సరిపెట్టుకోగా, వొడా, ఐడియా విలీనానికి ముందువరకు దిగ్గజ కంపెనీగా కొనసాగిన ఎయిర్టెల్ ప్రస్తుతం మూడో స్థానానికి జారుకుంది. -
ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్
సాక్షి, ముంబై : రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ మరోసారి లాభదాయకమైన టెలికాం ఆపరేటర్‌గా నిలిచింది. ముఖ్యంగా మొబైల్ చందాదారుల పరంగా ప్రత్యర్థి భారతి ఎయిర్‌టెల్‌ను అధిగమించి రెండవ అతిపెద్ద ఆపరేటర్‌గా అవతరించింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా టాప్‌ప్లేస్‌ను నిలబెట్టుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది. మే చివరి నాటికి జియోకు 322.98 మిలియన్ల వినియోగదారులుండగా, ఎయిర్టెల్ 320.38 మిలియన్ల యూజర్లను సాధించింది. వోడాఫోన్ ఐడియా 387.55 మిలియన్ల వినియోగదారులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాగా మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు (శుక్రవారం) క్యూ1 (ఏప్రిల్-జూన్ త్రైమాసికం) ఫలితాలను ప్రకటించనుంది. బలమైన చందాదారులను తన ఖాతాలో వేసుకున్న జియో మెరుగైన ఆదాయాన్ని వెల్లడించనుందని భావిస్తున్నారు. అయితే 329 మిలియన్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం సంస్థ 119 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నివేదిస్తుందని గోల్డ్‌మన్ సాచ్స్ ఆశిస్తుండగా, ఆర్పూ(ఏఆర్పీయూ, వినియోగదారుకు సగటు ఆదాయం)125కు పడిపోతుందని భావిస్తున్నారు. మార్చి త్రైమాసికంలో 111 బిలియన్ డాలర్ల ఆపరేటింగ్ రెవెన్యూని సాధించగా రూ. 840 కోట్ల లాభాలను సాదించింది. మార్చి చివరి నాటికి 306 మిలియన్ల చందాదారులున్నారు. -
ఎయిర్టెల్ పేమెంట్స్‌లోకి రూ.325 కోట్ల నిధులు
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో భారతీ ఎయిర్టెల్, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌లు రూ.325 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. ప్రిఫరెన్స్ షేర్ల రూపంలో భారతీ ఎయిర్టెల్ రూ.260 కోట్లు, భారతీ ఎంటర్ప్రైజెస్ రూ.65 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయని మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ, టోఫ్లర్ తెలిపింది. కాగా ఈ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణకు పెట్టుబడులు కొనసాగిస్తామని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ అనుబ్రత బిశ్వాస్ పేర్కొన్నారు. ప్రతి భారతీయుడికి బ్యాంకింగ్ సేవలందించడం, డిజిటల్ ఇండియా వంటి ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా డిజిటల్ లావాదేవీలు జోరుగా పెరుగుతున్నాయని వివరించారు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్ అవుట్‌లెట్స్ 5 లక్షలకు చేరాయని, మంచి వృద్ధి సాధిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రిటైల్ బ్యాంకింగ్ పాయింట్స్ ద్వారా భారతీ ఆక్సా లైఫ్ పాస్ సరళ్ జీవన్ బీమా యోజన టర్మ్ పాలసీని విక్రయించనున్నామని తెలిపారు. ఈ మేరకు భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షల పాలసీలను ఎంచుకోవచ్చని, వీటికి ప్రీమియమ్‌లు తక్కువగా ఉంటాయని వివరించారు. -
65శాతం తగ్గిన ఎయిర్టెల్ లాభాలు : అయినా ఓకే
సాక్షి, ముంబై: టెలికాం కంపెనీ భారతి ఎయిర్టెల్ క్యూ2 ఫలితాల్లో మార్కెట్ వర్గాలను మెప్పించింది. ముఖ్యంగా మార్కెట్ లోని పోటీ వాతావరనం, ఇంధన ధరల కారణంగా ఎయిర్‌టెల్‌కు భారీ నష్టం తప్పదని అంచనా వేసింది. వార్షిక ప్రతిపాదికన 65 శాతం క్షీణించి 119కోట్లు నికర లాభాలకు పరిమితమైంది. దాదాపు 800 కోట్ల రూపాయల మేర ఎయిర్టెల్ నష్టపోనుందని ఎనలిస్టులు భావించారు. ఆదాయం కూడా 6.2 శాతం క్షీణించి 20,442 కోట్లను సాధించింది. వాల్యూమ్ గ్రోత్ కూడా మెరుగ్గా నమోదు చేసింది. ఏఆర్పీయూ (యావరేజ్ రెవన్యూ పెర్ యూజర్) కూడా అంచనాలను మించి నమోదు కావడం ఎయిర్‌టెల్‌కు అనుకూలం అంశమని విశ్లేషకులు అంటున్నారు. ఇది 28.80 క్షీణించి 101 రూపాయలుగా నిలిచింది. ఉంది. ఇది గత ఏడాది 142గా ఉంది. జియో ఎంట్రీతో ఆర్‌పీయూ మరింత దిగజారుతుందని మార్కెట్‌వర్గాలు అంచనా వేశాయి. అలాగే గత సరసమైన ధరలు కంటెంట్ పార్టనర్షిప్ల ద్వారా నాణ్యమైన కస్టమర్లపై దృష్టి సారించామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విటల్ అన్నారు. ఏఆర్పీయూ క్షీణత ఈ త్రైమాసికానికి మితంగా ఉందని తెలిపారు. మరోవైపు భారీ నష్టాలతో ముగిసిన ఇవాల్టి ఈక్విటీ మార్కెట్లో భారతి ఎయిర్టెల్ 6.28శాతం నష్టపోయింది. -
నోకియా ఫోన్లపై ఎయిర్టెల్ క్యాష్‌బ్యాక్!!
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ ‘భారతీ ఎయిర్టెల్’ తాజాగా ఎంపిక చేసిన నోకియా స్మార్ట్ఫోన్లపై క్యాష్‌బ్యాక్ అందిస్తామని ప్రకటించింది. నోకియా–2, నోకియా–3 స్మార్ట్ఫోన్లపై తమ ప్రిపెయిడ్ కస్టమర్లు రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చని తెలిపింది. ‘కస్టమర్లకు అందుబాటు ధరల్లో 4జీ స్మార్ట్ఫోన్లను అందించాలనే లక్ష్యంతో హెచ్ఎండీ గ్లోబల్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. ఇందులో భాగంగా నోకియా–3, నోకియా–2 స్మార్ట్ఫోన్లపై రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తున్నాం’ అని భారతీ ఎయిర్టెల్ వివరించింది. ఇక నోకియా రెండు స్మార్ట్ఫోన్లు ఎయిర్టెల్ ప్రత్యేకమైన రీచార్జ్ ప్యాక్ రూ.169తో బండిల్ ఆఫర్ కింద కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి. రూ.169 ప్లాన్‌లో రోజుకు 1 జీబీ 4జీ డేటా, అపరిమిత కాల్స్ వంటి ఫీచర్లున్నాయి. క్యాష్‌బ్యాక్ ఇలా.. ఎయిర్టెల్ కస్టమర్లు నోకియా–2, నోకియా–3 స్మార్ట్ఫోన్లను మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాష్‌బ్యాక్ మొత్తం రూ.2,000.. 36 నెలల కాలంలో రెండు విడతల్లో యూజర్ ఎయిర్టెల్ వాలెట్లో జమవుతుంది. తొలి విడత క్యాష్‌బ్యాక్ (రూ.500) పొందాలంటే యూజర్ ఫోన్ కొనుగోలు దగ్గరి నుంచి తొలి 18 నెలల కాలంలో రూ.3,500 విలువైన రీచార్జ్ చేసుకోవాలి. ఇక తర్వాతి 18 నెలల కాలంలో మళ్లీ రూ.3,500 విలువైన రీచార్జ్ చేయించుకోవాలి. అప్పుడు రెండో విడత క్యాష్‌బ్యాక్ (రూ.1,500) పొందొచ్చు. కాగా నోకియా–3 ధర రూ.9,499గా, నోకియా–2 ధర రూ.6,999గా ఉంది. -
టెలికాం షేర్లకు జియో దెబ్బ
సాక్షి, ముంబై: దలాల్ స్ట్రీట్‌లో కొత్త గరిష్టాల హోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా నిఫ్టీ 11,100స్థాయిని కూడా దాటేసింది. ఆరంభంలో కన్సాలిడేషన్ బాట పట్టిన మార్కెట్లు లాభాలతో పుంజుకున్నాయి. ఈ క్రమంలో నిష్టీ ఈ గరిష్టాన్ని తాకింది. అయితే తీవ్ర ఊగిసలాటలమధ్య మార్కెట్లు మళ్లీ ఫ్లాట్‌గా మారాయి. మరోవైపు గురువారం డెరివేటివ్ కౌంటర్‌కు చివరి రోజు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతగా వ్యవహరిస్తున్నట్టు ఎనలిస్టులు పేర్కొంటున్నారు. మెటల్, ఆటో, నష్టపోతుండగా, బ్యాంక్స్ ,ఐటీ లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో నిఫ్టీ బ్యాంకు కొత్త గరిష్టాన్ని తాకింది. కానీ ప్రాఫింట్‌బుకింగ్ కారణంగా నష్టాల్లోకి మళ్లింది. టీసీఎస్ షేరు కూడా ఆల్ టైం ని తాకింది. మరోవైపు రిలయన్స్ జియో ప్రకటించిన రిపబ్లిక్ డే ఆఫర్లదెబ్బతో టెలికాం దిగ్గజాల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. భారతి ఎయిర్టెల్ 4 శాతం క్షీణించి, ఐడియా 5 శాతం పతనమై టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. వీటితోపాటు ఆర్‌కాం కూడా 2శాతం నష్టాలతో కొనసాగుతోంది. -
ఇన్ఫ్రాటెల్లో ఎయిర్టెల్ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: రుణభారాన్ని తగ్గించుకునేందుకు నిధుల సమీకరణ ప్రయత్నాల్లో భాగంగా టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తమ అనుబంధ సంస్థ భారతి ఇన్ఫ్రాటెల్లో 8.3 కోట్ల షేర్లను స్టాక్ మార్కెట్లో విక్రయించింది. తద్వారా రూ.3,325 కోట్లు సమీకరించింది. ఈ లావాదేవీతో భారతి ఎయిర్‌టెల్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థల వాటా భారతి ఇన్ఫ్రాటెల్లో 53.51 శాతానికి పరిమితం కానుంది. సెప్టెంబర్ ఆఖరు నాటి గణాంకాల ప్రకారం ఇన్ఫ్రాటెల్లో ప్రమోటర్ల వాటాలు 58 శాతంగా ఉన్నాయి. విలీనం కాబోతున్న మరో రెండు టెలికం దిగ్గజాలు వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్‌లు కూడా భారత్‌లోని తమ టవర్ల వ్యాపారాన్ని ఏటీసీ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకి రూ.7,850 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయి అనుబంధ సంస్థ నెటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఎయిర్టెల్ తాజా షేర్ల విక్రయ లావాదేవీ నిర్వహించింది. సోమవారం నాటి క్లోజింగ్ ధరతో పోలిస్తే 3.6 శాతం డిస్కౌంట్‌తో షేరు ఒక్కింటికి రూ.400.6 చొప్పున విక్రయించినట్లు ఎయిర్టెల్ తెలిపింది. ఈ నిధులను రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగిస్తామని సంస్థ తెలిపింది. సెప్టెంబర్ ఆఖరుకి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎయిర్టెల్ రుణభారం రూ.91,480 కోట్లు. -
జియోకి ఝలక్:ఎయిర్టెల్ మూడు సూపర్ ప్లాన్లు
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ మరో ఆకర్షణీయమైనప్లాన్ను తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ ఖాతాదారులకోసం సరికొత్త వార్షిక పథకాన్ని ప్రకటించింది. అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత డేటా, ఎస్ఎంఎస్లతో మూడు కొత్త ప్లాన్లను ప్రకటించింది. ఎయిర్టెల్ వెబ్ సైట్ లో పొందుపర్చిన సమాచారం ప్రకారం నేషనల్ రోమింగ్, ఎస్ఎమ్ఎస్ ఫ్రీ (100 ఎస్ఎంఎస్ /రోజుకు), రూ. 3999, రూ. 1999, రూ. 999 ల రీచార్జి ప్లాన్‌ను ప్రీ పెయిడ్ కస్టమర్లకు అందిస్తోంది. రూ.3999 రీచార్జ్ ప్లాన్ లో 300 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. 360 రోజులు చెల్లుబాటయ్యేలా ఈ ప్లాన్‌ను లాంచ్ చేసింది. రూ.1999 రీచార్జ్‌పై 180 రోజుల (ఆరునెలలు) కాలపరిమితిలో.. 125 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ (నేషనల్ రోమింగ్), 100 ఎస్ఎంఎస్లు రోజుకు ఉచితం. రూ. 999 రీచార్జ్‌పై 90 రోజులు(మూడు నెలలు) వ్యవధిలో 60 జీబీ డేటా, దీంతోపాటు నేషనల్ రోమింగ్ & ఎస్ఎమ్ఎస్లు (100 ఎస్ఎంఎస్ / రోజుకు) ఉచితం. కాగా టెలికాం మార్కెట్లో నెలకొన్ని తీవ్ర పోటీనేపథ్యంలో తాజాగా ఈవార్షికప్లాన్లను లాంచ్ చేసింది. రిలయన్స్ జియో 360 రోజులకు రూ.9999 లకు అన్లిమిటెడ్ కాలింగ్, డేటా సేవలనుఅందిస్తోంది.. జియోకు షాకిచ్చేలా ఎయిర్ టెల్ తన కస్టమర్లకు సరికొత్త ఆకర్షణీయ రీచార్జ్‌ప్లాన్లను లాంచ్ చేయడం విశేషం. -
ఎయిర్‌టెల్‌కు ఖతార్ షాక్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ కు వాటా విక్రయం షాక్ తగిలింది. ఖతార్‌కు చెందిన బిగ్ ఇన్వెస్టర్ భారతికి చెందిన భారీవాటాను విక్రయించనున్నారన్న వార్తలతో బుధవారం నాటి మార్కెట్లో భారతి ఎయిర్టెల్ టాప్ లూజర్‌గా నిలిచింది. భారతీ ఎయిర్టెల్ షేర్లు 3.4 శాతం క్షీణించి రూ .514.35 వద్ద ముగిశాయి. ఖతార్ ఫౌండేషన్ అనుబంధ సంస్థ త్రి పిల్లర్స్ లిమిటెడ్ భారతి ఎయిర్టెల్ లిమిటెడ్‌లో 5 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తోంది. ఈ బ్లాక్ డీల్ ద్వారా 9,500 కోట్ల (1.46 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను విక్రయించనుంది. 1999 మిలియన్ షేర్లను మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. షేర్ ధర రూ.473-490 గా ఉండనుంది. 2013లో వీటిని రూ.340 వద్ద కొనుగోలు చేసింది. అటు ఖతర్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రషీద్ ఫహాద్ అల్ నోయిమి భారతి ఎయిర్టెల్ బోర్డులో ఉన్నారు. అయితే ఈ పరిణామాలపై స్పందించేందుకు భారతి ఎయిర్టెల్ నిరాకరించింది. కాగా ఉగ్రవాదానికి మద్దతిస్తోందన్న ఆరోపణలతో ఖతార్‌తో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్ట్ దేశాలు దౌత్య సంబంధాలను తెగ తెంపులు చేసుకున్నాయి.దీంతో ఖతార్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని నివారించే వ్యూహంతో అక్కడి కంపెనీలు విదేశాల్లో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నాయి. గల్ఫ్ దేశాలు ఈ ఏడాది జూన్ 5 న దోహాతో దౌత్య మరియు రవాణా సంబంధాలను కట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఎయిర్టెల్.. ఆరో‘సారీ’..!
న్యూఢిల్లీ: టెలికం రంగంలో టారిఫ్లపరమైన పోటీతో దిగ్గజ టెల్కో భారతి ఎయిర్టెల్ ఆదాయాలు వరుసగా ఆరో క్వార్టర్లోనూ క్షీణించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 77 శాతం క్షీణించి రూ. 343 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ లాభం రూ. 1,461 కోట్లు. సీక్వెన్షియల్ ప్రాతిపదికన మాత్రం నికర లాభం జూన్‌లో నమోదైన రూ. 367 కోట్లతో పోలిస్తే 6.5 శాతం క్షీణించింది. టెలికం రంగంలో ఆర్థిక ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉందని, కాల్ కనెక్ట్ చార్జీలు తగ్గడంతో రాబోయే త్రైమాసికంలో ఇది మరింతగా పెరిగే అవకాశముందని ఎయిర్టెల్ హెచ్చరించింది. 2013 జనవరి–మార్చి త్రైమాసికం తర్వాత తాజా సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన లాభమే అత్యల్పం. చౌక టారిఫ్‌లతో సంచలనం సృష్టించిన కొత్త టెల్కో రిలయన్స్ జియోతో ఎయిర్టెల్ సహా ఇతర టెలికం కంపెనీలు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. 10 శాతం క్షీణించిన ఆదాయం .. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 17 దేశాల్లో కార్యకలాపాలు ఉన్న ఎయిర్టెల్ మొత్తం ఆదాయం క్యూ2లో సుమారు 10 శాతం క్షీణించి రూ. 24,651.50 కోట్ల నుంచి రూ. 21,777 కోట్లకు తగ్గింది. భారత్‌లో ఆదాయాలు 13 శాతం తగ్గి రూ. 16,728 కోట్లుగా నమోదైంది. ఆదాయాలు రెండంకెల స్థాయిలో క్షీణిస్తుండటంతో పరిశ్రమపై ఆర్థికపరమైన ఒత్తిడి కొనసాగుతోందని భారతి ఎయిర్టెల్ ఎండీ, సీఈవో (భారత్, దక్షిణాసియా) గోపాల్ విఠల్ తెలిపారు. ఇక ఇంటర్‌కనెక్ట్ యూసేజీ చార్జీలు కూడా తగ్గించడంతో రాబోయే త్రైమాసికంలో ఆదాయాలపై మరింతగా ప్రభావం పడగలదని పేర్కొన్నారు. ఇది ఇటీవలి కాలంలో చూసినట్లుగా కొన్ని టెల్కోల మధ్య విలీనాలు, మరికొన్నింటి నిష్క్రమణలకు దారితీయగలదని ఆయన అభిప్రాయపడ్డారు. తీవ్రమైన పోటీ మధ్య మార్కెట్ వాటా పెంచుకునే లక్ష్యానికి తాము కట్టుబడి ఉన్నామని విఠల్ చెప్పారు. మరోవైపు, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సంస్థ నికర రుణం రూ. 87,840 కోట్ల నుంచి రూ. 91,480 కోట్లకు చేరింది. వడ్డీ వ్యయాలు రూ. 1,603 కోట్ల నుంచి రూ. 1,905 కోట్లకు పెరిగింది. ఆఫ్రికా మార్కెట్లో ఆదాయాలు 2.8 శాతం, నిర్వహణ లాభాల మార్జిన్లు కూడా 9 శాతం మేర మెరుగుపడ్డాయని, నిరంతరం వ్యయ నియంత్రణ చర్యలు ఇందుకు దోహదపడ్డాయని విఠల్ చెప్పారు. ఇన్ఫ్రాటెల్లో వాటాలపై ఇన్వెస్టర్ల ఆసక్తి .. మొబైల్ టవర్ల వ్యాపార విభాగం భారతి ఇన్ఫ్రాటెల్లో గణనీయమైన వాటాలు కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు సంప్రదిస్తున్నట్లు ఎయిర్టెల్ మరో ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ గానీ కుదిరిన పక్షంలో ఇన్ఫ్రాటెల్లో యాజమాన్య హక్కులు సదరు ఇన్వెస్టర్లకు దఖలుపడతాయని పేర్కొంది. డేటా కవరేజీ, సామర్థ్యాల పెంపు కోసం రెండో త్రైమాసికంలో పెట్టుబడులు మరింతగా పెంచినట్లు సంస్థ వెల్లడించింది. మంగళవారం బీఎస్ఈలో కంపెనీ షేరు సుమారు ఒక్క శాతం వృద్ధితో దాదాపు రూ. 498 వద్ద ముగిసింది. ఆర్థిక ఫలితాలు మంగళవారం స్టాక్ మార్కెట్లు ముగిశాక వెల్లడయ్యాయి. -
క్షీణించిన ఎయిర్టెల్ లాభాలు
సాక్షి,ముంబై: దేశీయ టెలికాం మేజర్ భారతి ఎయిర్టెల్ క్యూ2 ఫలితాల్లో నిరాశపర్చింది. 2017-18 సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం క్వార్టర్ ఆన్ క్వార్టర్ 5.4 శాతం క్షీణించి రూ.343 కోట్లుగా ప్రకటించింది. గత ఏడాది రూ.1,461కోట్ల లాభంతో పోలిస్తే ఈ ఏడాది సుమారు77శాతం క్షీణతను నమోదు చేసింది. దేశంలో నెలకొన్న పోటీవాతావరణం సంస్థ లాభాలను భారీగా దెబ్బతీసింది. మొత్తం ఆదాయం గత ఏడాది రూ. 21,958 కోట్లతో పోలిస్తే..ఈ క్వార్టర్లో 0.8శాతం క్షీణించి రూ. 21, 777కోట్లను సాధించింది. ఎబిటా మార్జిన్ రూ.7922కోట్లుగా ఉంది. ఐయూసీ చార్జీలకోత తమ ఆదాయంపై ప్రభావాన్ని చూపిందని భారతిఎయిర్టెల్ ఎండీ గోపాల్ మిట్టల్ తెలిపారు. ఇది క్యూ3లో కొనసాగనుందని ఆయన అంచనా వేశారు. -
కొత్త కస్టమర్లు ఎయిర్టెల్ వైపు..
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ను దిగ్గజ టెలికం కంపెనీ అని ఎందుకు పిలుస్తారో మరొకసారి రుజువైంది. సెప్టెంబర్ నెలలో ఎయిర్‌టెల్‌కు మాత్రమే కొత్తగా యూజర్లు జతయ్యారు. సీవోఏఐ ప్రకారం.. ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య కొత్తగా 10 లక్షలకు పైగా పెరిగింది. ఇదే సమయంలో ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌సెల్, టెలినార్ సంస్థలు మొత్తంగా 29 లక్షలకుపైగా యూజర్లను కోల్పోయాయి. టెలినార్ కస్టమర్ల సంఖ్య ఏకంగా 9.37 లక్షలమేర తగ్గింది. అయితే టెలినార్ – ఎయిర్టెల్ విలీనం ఇప్పటికే దాదాపు ఖరారవటం ఈ సందర్భంగా గమనార్హం. ఐడియా 9.04 లక్షలమేర, వొడాఫోన్ 7 లక్షలమేర, ఎయిర్‌సెల్ 3.94 లక్షలమేర సబ్స్క్రైబర్లను కోల్పోయాయి. సెప్టెంబర్ చివరి నాటికి చూస్తే.. భారతీ ఎయిర్టెల్ 29.8 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీని మొత్తం యూజర్ల సంఖ్య 28.2 కోట్లుగా ఉంది. దీని తర్వాతి స్థానంలో వొడాఫోన్ (20.74 కోట్లు), ఐడియా (19 కోట్లు) ఉన్నాయి. కాగా రిలయన్స్ జియో, టాటా టెలీసర్వీసెస్, ఆర్‌కామ్, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సబ్స్క్రైబర్ల సంఖ్యను సీవోఏఐ ప్రకటించలేదు. -
మోతెక్కనున్న సెల్‌ఫోన్ చార్జీలు
చేతిలో సెల్‌ఫోన్ ఉంది కదాని ఎడాపెడా మాట్లాడేస్తున్నారా? కాస్త జాగ్రత్త. ఎందుకంటే... త్వరలోనే ఫోన్ చేసినా, ఎస్ఎంఎస్ ఇచ్చినా కూడా బిల్లు మోతెక్కిపోతుంది. అంతా ఇంతా కాదు. కాల్ చార్జీలు గతంలో ఉన్నదాని కంటే సగం పెరుగుతాయట. ఎందుకంటే, వచ్చే స్పెక్ట్రం వేలంలో బేస్ ధరను తగ్గించాలని టెలికం కంపెనీలు అడిగినా.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఇక ధరలు పెంచక తప్పదని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. స్పెక్ట్రం విలువ మరీ ఎక్కువ ఉండకూడదని, అలా ఉంటే వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీలను తప్పనిసరిగా పెంచాల్సి వస్తుందని.. అంతేకాక స్పెక్ట్రం ఖాళీగా ఉండిపోవడం వల్ల ఖజానాకు ఆదాయం కూడా ఏమీ ఉండదని భారతి ఎయిర్టెల్ తెలిపింది. స్పెక్ట్రంకు 2008 సంవత్సరంలో ఆపరేటర్లు చెల్లించిన మొత్తాని కంటే 11 రెట్లు ఎక్కువ ధర పెట్టాలని టెలికం నియంత్రణ సంస్థ ప్రతిపాదించింది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, లూప్ మొబైల్ సంస్థల లైసెన్సుల కాలపరిమితి 2014తో ముగుస్తుంది. అందువల్ల వాటిపైనే స్పెక్ట్రం చార్జీల పెంపు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలా చేయాల్సి వస్తే తప్పనిసరిగా మొబైల్ కాల్ చార్జీలు, ఎస్ఎంఎస్ చార్జీలు పెంచాల్సి ఉంటుందని కంపెనీలు తెలిపాయి. గడిచిన రెండేళ్ల కాలంలో మొబైల్ కాల్ చార్జీలు దాదాపు నూరు శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం అవి నిమిషానికి 90 పైసల నుంచి 1.20 రూపాయల వరకు ఉన్నాయి. 2012 నాటి ట్రాయ్ ప్రతిపాదనలను అమలుచేయాల్సి వస్తే వినియోగదారుల టారిఫ్ తప్పనిసరిగా 26 పైసల మేర పెంచాల్సి ఉంటుందని ఎయిర్టెల్ తెలిపింది. ప్రభుత్వం 2010 సంవత్సరంలో 3జి స్పెక్ట్రం ధరను భారతదేశం మొత్తానికి 3,500 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. గత సంవత్సరం నిర్వహించిన వేలంలో రిజర్వుధరను 14,000 కోట్ల రూపాయలు చేసింది.