Airtel Prepaid Price Hike: తన సబ్‌స్క్రయిబర్లకు ఎయిర్‌టెల్ పెద్ద షాకే ఇచ్చింది. టారిఫ్ రేట్లను ఒక్కసారిగా పెంచేసింది. ప్రీపెయిడ్ టారిఫ్‌ను 20 నుంచి 25 శాతం, డాటా టాప్ అప్ ప్లాన్‌ల మీద 20 నుంచి 21 శాతం పెంచేసింది. ప్రతీ ప్యాక్ మీద పది రూపాయల మినిమమ్ పెంపును ప్రకటించింది.
Bharti Airtel New tariffs.. ఆరోగ్యకరమైన ఆర్థిక పోటీలో భాగంగానే ఈ పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ సోమవారం ప్రకటించింది. 28 రోజుల వాలిడిటీతో ఉన్న మినిమమ్ టారిఫ్ ప్రస్తుతం 79రూ. ఉండగా, అది రూ.99 కానుంది. ఇక డాటా టాప్ అప్స్‌లో 48 రూ. అన్‌లిమిటెడ్ 3జీబీ డాటా ప్యాక్‌ను 58రూ. లకు పెంచేసింది. నవంబర్ 26 నుంచి పెరిగిన ఈ ధరలు టెలికామ్ సబ్‌స్క్రయిబర్స్‌కు వర్తించనున్నాయి.
యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ARPU) కింద 200 నుంచి 300 రూ. అవుతోందని, ఈ లెక్కన ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే టారిఫ్‌లను పెంచక తప్పలేదని భారతీ ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. టారిఫ్ పెంపు మౌలిక సదుపాయాలలో "గణనీయమైన పెట్టుబడులకు" దారి తీస్తుందని, భారతదేశంలో 5G స్పెక్ట్రమ్‌ను విడుదల చేయడంలో సహాయపడుతుందని సోమవారం ఓ ప్రకటన ఎయిర్‌లెట్ పేర్కొంది.
ఇదిలా ఉంటే టెలికామ్ పరిశ్రమ ముందుకు వెళ్లాలంటే టారిఫ్‌లను పెంచకతప్పదని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ఆగస్టులోనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇక తాజా టారిఫ్ పెంపుదల నేపథ్యంలో #Airtel మీద సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా సెటైర్లు పేలుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment