దేశంలో ఐపీఎల్ సందడి షురూ అయ్యింది. మార్చి 26 నుంచి మే 29 వరకు జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్‌ను వీక్షించేందుకు జోష్ మీద వున్న క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ బంపరాఫర్ ప్రకటించింది. ఐపీఎల్ అభిమానుల కోసం ప్రత్యేకంగా బండిల్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లతో పాటు ఉచితంగా ఓటీటీ సేవల్ని ఉచితంగా అందిస్తుంది.
కొద్దిరోజుల క్రితం రిలయన్స్ జియో ఉచితంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌ను ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది. తాజాగా ఎయిర్‌టెల్ డిస్నీ+హాట్‌స్టార్‌ను వీక్షించవచ్చు. ఇందులో అదనంగా మరో 3రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ను ఉచితంగా చూసే అవకాశం అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ ప్రతినిధులు తెలిపారు.
ఎయిర్‌టెల్ అందిస్తున్న ఉచిత డిస్నీ+హాట్‌స్టార్ సేవలు
ఎయిర్‌టెల్ రూ.499ప్లాన్: ఈ ప్లాన్‌ను ఎంచుకున్న యూజర్లకు ప్రతిరోజు 2జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ,రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.599 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 3జీబీ డేటా, డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ బెన్ఫిట్ పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.839 ప్లాన్: 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2జీబీ డేటా, డిస్నీ+హాట్‌స్టార్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ బెన్ఫిట్స్, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినొచ్చు.
ఎయిర్‌టెల్ రూ.2,999 ప్లాన్: ఈ ప్లాన్‌లో యూజర్లు 365రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2జీబీ డేటా , ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో,వింక్ మ్యూజిక్‌ను ఫ్రీగా పొందవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ బెన్ఫిట్స్ పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.3359ప్లాన్: ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో,వింక్ మ్యూజిక్‌ను ఫ్రీగా పొందవచ్చు. అంతేకాదు ప్రతిరోజు 2జీబీ డేటా, దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ బెన్ఫిట్ పొందవచ్చు.
చదవండి: 'ఆఫర్లు మావి..ఛాయిస్ మీది', పోటీపడుతున్న టెలికాం దిగ్గజాలు!
Comments
Please login to add a commentAdd a comment