airtel prepaid
-
ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ ప్రయాణం చేసేవారి కోసం ఎయిర్టెల్ వరల్డ్ పాస్ పేరుతో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌ను పరిచయం చేసింది. ఈ ప్యాక్‌తో కస్టమర్లు 184 దేశాల్లో రోమింగ్ సేవలను పొందవచ్చు. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌లోనూ ఇవి లభిస్తాయి. ఇంటర్నెట్, కాల్స్ వినియోగం, బిల్లు వంటి విషయాలను వినియోగదార్లు ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో తెలుసుకోవచ్చు. ఒకరోజుతో మొదలుకుని 365 రోజుల కాలపరిమితితో ఇవి లభిస్తాయి. ఎంచుకున్న ప్యాక్‌నుబట్టి చార్జీ రూ.649 నుంచి రూ.14,999 వరకు ఉంది. -
ఎయిర్‌టల్ ప్యాక్ తో అన్ని ఓటీటీలు ఫ్రీ
-
ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే!
ఎప్పటికప్పుడు కస్టమర్లకు అదిరిపోయే అఫర్లను ప్రకటిస్తూ దూసుకుపోతోంది ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్. ఈ సారి తన వినియోగదారుల కోసం ఒకే ప్లాన్‌లో బోలెడు ప్రయోజనాలను అందివ్వాలని నిర్ణయించుకుంది. అందుకే కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్‌లో.. డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ ఓటీటీ బెనిఫిట్స్, ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్, DTH ప్రయోజనాలను ఒక రీచార్జ్‌తో కస్టమర్లకు సొంతం చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్స్‌ను ఎయిర్టెల్ బ్లాక్ ప్యాకేజీ కింద అందిస్తోంది. ఇప్పటికే ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌పై ఒకే బిల్లులో ఫైబర్, డీటీహెచ్ మొబైల్‌తో సహా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్టెల్ సర్వీసులను కలిపేందుకు ఎయిర్టెల్ బ్లాక్ యూజర్లకు అందిస్తుంది. ఈ బెనిఫిట్స్ ద్వారా జీరో-స్విచింగ్ ఇన్స్టాలేషన్ ఖర్చులతో పాటు జీవితకాలపు ఉచిత సర్వీస్ కూడా పొందవచ్చు. వీటిని రూ. 699 నుంచి 2,999 వరకు వివిధ రకాల ప్లాన్లతో అందిస్తోంది. వీటిపై ఓ లుక్కేద్దాం! రూ. 699 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఇది ఎయిర్టెల్ అందించే ఎంట్రీ-లెవల్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా ల్యాండ్‌లైన్ కనెక్షన్, ఫైబర్ ద్వారా 40Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ స్పీడ్‌తో పాటు DTH కనెక్షన్లో రూ. 300 విలువైన టీవీ ఛానెల్‌లకు యాక్సెస్ పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో డిస్నీ హాట్ స్టార్( Disney Hotstar), సోనీ లివ్( Sony Liv), Airtel XStream యాప్‌తో పాటు మరో 12 ఓటీటీ యాప్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ప్లాన్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను అందించదు, కాబట్టి దీనిని ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు కూడా కొనుగోలు చేయవచ్చు. రూ. 899 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 105 GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్‌తో రెండు పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లను అందిస్తోంది ఎయిర్టెల్. ఈ ఆఫర్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీంతో పాటు 12 ఇతర యాప్‌లకు సబ్స్క్రిప్షన్, రూ. 350 విలువైన (డీటీహెచ్) DTH టీవీ ఛానెల్‌లు ఉన్నాయి. రూ. 1098 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 100Mbps స్పీడ్‌తో ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్ లభిస్తుంది. 75 GB ఇంటర్నెట్తో పాట అన్లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. రూ. 1099 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ సబ్స్క్రిప్షన్ ల్యాండ్‌లైన్ ద్వారా అపరిమిత కాలింగ్, ఫైబర్‌పై 200Mbps వరకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, మరో 13 యాప్‌లతో సహా రూ.350 విలువైన OTT ఛానెల్‌లకు కూడా కస్టమర్లు యాక్సెస్ పొందుతారు. రూ. 1599 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: అన్లిమిటెడ్ కాలింగ్, 300Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో పాటు ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌తో వస్తుంది. ఇందులో రూ. 350 విలువైన టీవీ ఛానెల్‌లతో డీటీహెచ్ కనెక్షన్ వస్తుంది. ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్, మరిన్ని OTT ప్రయోజనాలు ఉంటాయి. రూ. 1799 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్‌లో ఫైబర్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్తో కూడిన ల్యాండ్‌లైన్ వస్తుంది అది కూడా గరిష్టంగా 200Mbps స్పీడ్‌తో ఉపయెగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 190GB డేటా , 4 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లతో అపరిమిత కాలింగ్ ఉంది. అదనంగా OTTలో అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్, ఇతర సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. రూ. 2299 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ : ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్, 300 Mbps డేటాతో ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను అందించే అత్యంత ఖరీదైన ప్లాన్. 240 GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్‌తో 4 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు పొందవచ్చు. అంతేనా ఇంకా రూ. 350 విలువైన టీవీ ఛానెల్‌లతో DTH కనెక్షన్ లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్( Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియోలు (Amazon Prime Videos), డిస్నీ+ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్, (Airtel Xstream) మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. -
ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్,అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్! ఐపీఎల్ అభిమానులకు పండగే!
దేశంలో ఐపీఎల్ సందడి షురూ అయ్యింది. మార్చి 26 నుంచి మే 29 వరకు జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్‌ను వీక్షించేందుకు జోష్ మీద వున్న క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ బంపరాఫర్ ప్రకటించింది. ఐపీఎల్ అభిమానుల కోసం ప్రత్యేకంగా బండిల్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్లతో పాటు ఉచితంగా ఓటీటీ సేవల్ని ఉచితంగా అందిస్తుంది. కొద్దిరోజుల క్రితం రిలయన్స్ జియో ఉచితంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌ను ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది. తాజాగా ఎయిర్టెల్ డిస్నీ+హాట్‌స్టార్‌ను వీక్షించవచ్చు. ఇందులో అదనంగా మరో 3రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ను ఉచితంగా చూసే అవకాశం అందిస్తున్నట్లు ఎయిర్టెల్ ప్రతినిధులు తెలిపారు. ఎయిర్టెల్ అందిస్తున్న ఉచిత డిస్నీ+హాట్‌స్టార్ సేవలు ఎయిర్టెల్ రూ.499ప్లాన్: ఈ ప్లాన్‌ను ఎంచుకున్న యూజర్లకు ప్రతిరోజు 2జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతో పాటు అన్లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ,రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ రూ.599 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 3జీబీ డేటా, డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతో పాటు అన్లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ బెన్ఫిట్ పొందవచ్చు. ఎయిర్టెల్ రూ.839 ప్లాన్: 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2జీబీ డేటా, డిస్నీ+హాట్‌స్టార్, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ బెన్ఫిట్స్, వింక్ మ్యూజిక్‌ను ఉచితంగా వినొచ్చు. ఎయిర్టెల్ రూ.2,999 ప్లాన్: ఈ ప్లాన్‌లో యూజర్లు 365రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2జీబీ డేటా , ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో,వింక్ మ్యూజిక్‌ను ఫ్రీగా పొందవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ బెన్ఫిట్స్ పొందవచ్చు. ఎయిర్టెల్ రూ.3359ప్లాన్: ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో,వింక్ మ్యూజిక్‌ను ఫ్రీగా పొందవచ్చు. అంతేకాదు ప్రతిరోజు 2జీబీ డేటా, దీంతో పాటు అన్లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ బెన్ఫిట్ పొందవచ్చు. చదవండి: 'ఆఫర్లు మావి..ఛాయిస్ మీది', పోటీపడుతున్న టెలికాం దిగ్గజాలు! -
Airtel: ఎయిర్టెల్ కస్టమర్లకు భారీ షాక్
Airtel Prepaid Price Hike: తన సబ్స్క్రయిబర్లకు ఎయిర్టెల్ పెద్ద షాకే ఇచ్చింది. టారిఫ్ రేట్లను ఒక్కసారిగా పెంచేసింది. ప్రీపెయిడ్ టారిఫ్‌ను 20 నుంచి 25 శాతం, డాటా టాప్ అప్ ప్లాన్ల మీద 20 నుంచి 21 శాతం పెంచేసింది. ప్రతీ ప్యాక్ మీద పది రూపాయల మినిమమ్ పెంపును ప్రకటించింది. Bharti Airtel New tariffs.. ఆరోగ్యకరమైన ఆర్థిక పోటీలో భాగంగానే ఈ పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు భారతీ ఎయిర్టెల్ సోమవారం ప్రకటించింది. 28 రోజుల వాలిడిటీతో ఉన్న మినిమమ్ టారిఫ్ ప్రస్తుతం 79రూ. ఉండగా, అది రూ.99 కానుంది. ఇక డాటా టాప్ అప్స్లో 48 రూ. అన్లిమిటెడ్ 3జీబీ డాటా ప్యాక్‌ను 58రూ. లకు పెంచేసింది. నవంబర్ 26 నుంచి పెరిగిన ఈ ధరలు టెలికామ్ సబ్స్క్రయిబర్స్కు వర్తించనున్నాయి. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ARPU) కింద 200 నుంచి 300 రూ. అవుతోందని, ఈ లెక్కన ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే టారిఫ్‌లను పెంచక తప్పలేదని భారతీ ఎయిర్టెల్ స్పష్టం చేసింది. టారిఫ్ పెంపు మౌలిక సదుపాయాలలో "గణనీయమైన పెట్టుబడులకు" దారి తీస్తుందని, భారతదేశంలో 5G స్పెక్ట్రమ్‌ను విడుదల చేయడంలో సహాయపడుతుందని సోమవారం ఓ ప్రకటన ఎయిర్‌లెట్ పేర్కొంది. ఇదిలా ఉంటే టెలికామ్ పరిశ్రమ ముందుకు వెళ్లాలంటే టారిఫ్‌లను పెంచకతప్పదని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ఆగస్టులోనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇక తాజా టారిఫ్ పెంపుదల నేపథ్యంలో #Airtel మీద సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా సెటైర్లు పేలుతున్నాయి. -
ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్
తెలుగు రాష్టాల ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త తెలిపింది ఎయిర్టెల్. టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.199ను తాజాగా సవరించింది. ఈ కొత్త ప్లాన్‌లో భాగంగా యూజర్లు మరింత డేటాను పొందవచ్చు అని పేర్కొంది. కొత్త రూ.199 ప్లాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో టెలికాం సర్కిల్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. త్వరలో మిగతా యూజర్లకు తీసుకు రానున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు వినియోగదారులు రూ.199 ప్లాన్ కింద రోజూ 1జీబీ డేటాను పొందగా, ఇప్పుడు వారికి రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది. రిలయన్స్ జియో కూడా రూ.199 ప్లాన్ కింద 1.5 జీబీ డేటా అందిస్తుంది.(చదవండి: కొత్త ఏడాదిలో వాట్సాప్ నుంచి బిగ్ అప్డేట్) ఎయిర్టెల్ యూజర్లు 1.5జీబీ రోజువారీ డేటా కోటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత కాలింగ్ సేవలను అందించనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజుల వరకు ఉటుంది. రీఛార్జ్‌తో పాటు ఎయిర్టెల్ యూజర్లు వింక్ మ్యూజిక్, హెలోట్యూన్‌లను యాక్సెస్ చేయగలరు. అలాగే, యూజర్లు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ ఉచిత సేవలను కూడా పొందవచ్చు. ఎయిర్టెల్ ఇప్పటికే ప్రీపెయిడ్ ప్లాన్ ప్రతిరోజూ అందిస్తుంది. రూ.249 కింద రోజుకు 1.5 జిబి డేటాను, 100 ఎస్ఎంఎస్, 28 రోజుల కాలానికి అపరిమిత కాలింగ్ సేవలను కూడా అందిస్తుంది. రెండు ప్లాన్లు ఒకే విదంగా ఉన్న కారణంగా దీనిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్టెల్ త్వరలో రూ.249 ప్లాన్‌లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. జియో రూ.249 ప్లాన్ కింద 2జీబీ డేటాను అందిస్తుంది. -
ఎయిర్టెల్: రూ.19కే అన్లిమిటెడ్ కాల్స్
మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు చౌకైన ప్లాన్ కోసం తెగ వెతికేస్తుంటాం. తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా ప్లాన్‌ను ఎంచుకుంటాం. జియో వచ్చినప్పటి నుండి మార్కెట్లో తీవ్ర పోటీ ఉన్న కారణంగా అన్నీ కంపెనీలు తక్కువ ధరకే ప్లాన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ఎయిర్టెల్ కూడా తమ కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు అత్యంత చౌకైన రూ. 19 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో కాలింగ్‌తో పాటు డేటా సదుపాయాన్ని కల్పిస్తుంది. ట్రూలీ అన్లిమిటెడ్ క్యాటరిగీ కింద ఈ 19 రూపాయల ప్లాన్‌ను తీసుకొచ్చింది ఎయిర్టెల్. ఈ ప్లాన్‌లో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. ఎవరైతే ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతారో వారికీ ఎక్కువగా ఇది ఉపయోగ పడుతుంది. దీనిలో ఉచిత కాలింగ్ తో పాటు మీకు డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా మీకు 200 ఎంబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ లో మీకు ఎటువంటి ఉచిత ఎస్ఎంఎస్లు లభించవు. దీని యొక్క కాలపరిమితి 2 రోజులు మాత్రమే. (చదవండి: 14 ఐఫోన్లతో డెలివరీ బాయ్ జంప్) -
జియోకు పోటీగా ఎయిర్టెల్ బంపర్ ఆఫర్?
ప్రస్తుతం టెలికం రంగంలో టారిఫ్ వార్ జోరుగా నడుస్తోంది. ఒకవైపు రిలయన్స్ జియో అన్లిమిటెడ్ కాల్స్, బోలెడంత డేటా అని ఊదరగొడుతుంటే మరోవైపు దానికి పోటీగా ఎయిర్టెల్ కూడా బరిలోకి దూకుతోంది. సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఒకదాన్ని ప్రకటించబోతోంది. ఈ విషయాన్ని ప్రముఖ టెలికం బ్లాగర్ సంజయ్ బఫ్నా ట్వీట్ చేశారు. కొత్త ప్లాన్ ప్రకారం రూ. 399తో రీచార్జి చేసుకుంటే 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జీబీ 4జీ డేటా వస్తుంది, దాంతోపాటు అన్లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అయితే, ఇదంతా 4జీ సిమ్ కార్డుతో పాటు 4జీ సదుపాయం ఉన్న ఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది. దాంతోపాటు జియో ఇటీవల ప్రకటించిన ధన్ ధనాధన్ ఆఫర్‌కు పోటీగా రోజుకు 1జీబీ, 2జీబీ డేటా లిమిట్‌తో వేర్వేరు ప్లాన్లు ప్రకటించాలని కూడా ఎయిర్టెల్ యోచిస్తున్నట్లు సమాచారం. కంపెనీ నుంచి ఇంతవరకు దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు గానీ, టెలికం రంగానికి సంబంధించి కచ్చితమైన లీకులు ఇవ్వడంలో బఫ్నాకు మంచి రికార్డు ఉంది. దాంతో ఈ కొత్త ప్లాన్ల విషయంలో కూడా ఆయన చెప్పింది కరెక్టే కావచ్చని అంటున్నారు.