
మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు చౌకైన ప్లాన్ కోసం తెగ వెతికేస్తుంటాం. తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా ప్లాన్‌ను ఎంచుకుంటాం. జియో వచ్చినప్పటి నుండి మార్కెట్లో తీవ్ర పోటీ ఉన్న కారణంగా అన్నీ కంపెనీలు తక్కువ ధరకే ప్లాన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ఎయిర్టెల్ కూడా తమ కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు అత్యంత చౌకైన రూ. 19 ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లో కాలింగ్‌తో పాటు డేటా సదుపాయాన్ని కల్పిస్తుంది.
ట్రూలీ అన్‌లిమిటెడ్ క్యాటరిగీ కింద ఈ 19 రూపాయల ప్లాన్‌ను తీసుకొచ్చింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్లో మీకు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. ఎవరైతే ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతారో వారికీ ఎక్కువగా ఇది ఉపయోగ పడుతుంది. దీనిలో ఉచిత కాలింగ్ తో పాటు మీకు డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా మీకు 200 ఎంబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ లో మీకు ఎటువంటి ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభించవు. దీని యొక్క కాలపరిమితి 2 రోజులు మాత్రమే. (చదవండి: 14 ఐఫోన్లతో డెలివరీ బాయ్ జంప్)
Comments
Please login to add a commentAdd a comment