calling
-
TRAI: ఫోన్ డిస్ప్లేపై కాలర్ పేరు
న్యూఢిల్లీ: కొత్త నంబర్ నుంచి కాల్ వస్తుంటే ఎవరు చేస్తున్నారు? అనే సందేహం వస్తుంటుంది. ఆ సందేహానికి చెక్ పెడుతూ కాల్ చేస్తున్న వారి పేరు ఫోన్ డిస్ప్లేపై కనిపించే ఫీచర్ త్వరలో సాకారం కానుంది. టెలికం నెట్‌వర్క్‌లో ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ సప్లిమెంటరీ సరీ్వస్’(సీఎన్ఏపీ)ను ప్రవేశపెట్టాలంటూ టెలికం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ సిఫారసు చేసింది. సిఫార్సు అమలైతే కస్టమర్ అభ్యర్థన మేరకు టెలికం కంపెనీలు ఈ సేవను అందించాల్సి ఉంటుంది. స్పామ్, మోసపూరిత కాల్స్‌కు దీనితో చెక్ పెట్టొచ్చన్నది ట్రాయ్ ఉద్దేశ్యంగా ఉంది. -
వరుడుకి డబ్బులు లెక్కించడం రాదని..పెళ్లికి నిరాకరించిన యువతి
ప్రతి ఒక్కరి వివాహం అనగా తమకు కాబోయే వరుడు లేదా వధువు ఇలా ఉండాలనే కొన్ని అంచనాలు, ఆశలు ఉంటాయి. అది సహజం. మనం ఊహించినట్లగానే జరిగితే అందరికీ సంతోషమే కానీ చాలా మటుకు అలా కుదరుదు. ఒక్కోసారి మనం అనుకున్న అంచనాలకు విభిన్నంగా కూడా ఉండవచ్చు. అయినప్పటికీ కొందరూ సర్దుకుని పెళ్లి అయ్యాక నెమ్మదిగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ప్రస్తుతం యువత అలా లేదు. ప్రతీదీ చాలా స్పీడ్‌గా అయిపోవాలి. నచ్చలేదంటే అప్పటికప్పుడూ పీటల మీద పెళ్లైనా ఆపేసి బంధువుల్ని, తల్లదండ్రుల్ని షాక్ గురి చేస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని ఫారుఖాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. గీతా సింగ్ అనే యువతికి, భరత్ అనే యువకుడికి వివాహం నిశ్చయమైంది. మంచి ఘనంగా వివాహ తంతు సాగుతుంది. ఇంకాసేపట్లో వివాహం అనంగా పెళ్లికూతురు చేసుకోనంటే చేసుకోను అని తెగేసి చెప్పింది. వరుడి పద్ధతి చాలా విచిత్రంగా ఉందని, అతనికి లెక్కలు సరిగా రావని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో అమ్మాయ తరుఫు కుటుంబ సభ్యులు వరుడు వద్దకు వచ్చి పది రూపాయాల కరెన్సీ నోటులు మూడు ఇచ్చి లెక్కించమని పరీక్షించారు. పాపం ఆ వరుడు ఆ చిన్న పరీక్షలో నెగ్గలేకపోయాడు. అతను కరెన్సీ లెక్కించడంలో విఫలమవ్వడంతో అక్కడ ఉన్నవారందూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ యువతి మాత్రం నాకు అతను వద్దంటే వద్దని బీష్మించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఆఖరికి పోలీసులు సైతం జోక్యం చేసుకుని ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినా.. పెళ్లికూతురు ససేమిరా అని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసింది. దీంతో చేసేది లేక వరుడు, అతడి కుటుంబ సభ్యులు అక్కడ నుంచి భారంగా భనిష్క్రమించారు. (చదవండి: నడిరోడ్డుపై కారు ఆపినందుకు..ఊహించని రేంజ్లో జరిమానా!) -
కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే రూ. 1.72 లక్షలు మాయం
హిమాయత్‌నగర్: ఫోన్‌పేలో డబ్బులు కట్ అయ్యాయని కస్టమర్ కేర్‌కు కాల్ చేయగా.. ఉన్న వాటిని లూటీ చేశారని నగరవాసి ఒకరు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల నగరవాసి ఫోన్‌పే నుంచి కొంత డబ్బులు కట్ అయ్యాయి. తాను ఎవరికీ పంపకుండా ఇలా కట్ అవ్వడంపై తెలుసుకునేందుకు గూగుల్‌లో కనిపించిన ఫోన్‌పే కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేశాడు. వారు చెప్పిన విధంగా బ్యాంకు వివరాలు అన్నీ చెప్పడంతో అకౌంట్లో నుంచి రూ. 1.72 లక్షలు స్వాహా చేశారు. బజాజ్ ఫైనాన్స్ పేరుతో... బజాజ్ కార్డుపై లోను వచ్చిందని తనని ఓ వ్యక్తి మోసం చేశాడని నగర వాసి ఒకరు సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఓ వ్యక్తి తాను బజాజ్ ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నానని కాల్ చేశాడు. మీ కార్డుపై రూ. 5 లక్షల రుణం మంజూరైందన్నాడు. అది మీ అకౌంట్‌కు రావాలంటే డాక్యుమెంట్స్‌కి కొంత ఖర్చు అవుతుందన్నాడు. దీనికి సరే అనడంతో పలు దఫాలుగా రూ. 2.70 లక్షలు చెల్లించాడు. ఆపై రుణం రాకపోగా మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వినయ్ తెలిపారు. (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) -
ఎయిర్టెల్: రూ.19కే అన్లిమిటెడ్ కాల్స్
మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు చౌకైన ప్లాన్ కోసం తెగ వెతికేస్తుంటాం. తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా ప్లాన్‌ను ఎంచుకుంటాం. జియో వచ్చినప్పటి నుండి మార్కెట్లో తీవ్ర పోటీ ఉన్న కారణంగా అన్నీ కంపెనీలు తక్కువ ధరకే ప్లాన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ఎయిర్టెల్ కూడా తమ కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు అత్యంత చౌకైన రూ. 19 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో కాలింగ్‌తో పాటు డేటా సదుపాయాన్ని కల్పిస్తుంది. ట్రూలీ అన్లిమిటెడ్ క్యాటరిగీ కింద ఈ 19 రూపాయల ప్లాన్‌ను తీసుకొచ్చింది ఎయిర్టెల్. ఈ ప్లాన్‌లో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. ఎవరైతే ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతారో వారికీ ఎక్కువగా ఇది ఉపయోగ పడుతుంది. దీనిలో ఉచిత కాలింగ్ తో పాటు మీకు డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా మీకు 200 ఎంబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ లో మీకు ఎటువంటి ఉచిత ఎస్ఎంఎస్లు లభించవు. దీని యొక్క కాలపరిమితి 2 రోజులు మాత్రమే. (చదవండి: 14 ఐఫోన్లతో డెలివరీ బాయ్ జంప్) -
రెడ్మి వినియోగదారులకు శుభవార్త
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమికి చెందిన రెడ్మి శుభవార్త అందించింది. వైఫై కాలింగ్ సదుపాయాన్ని రెడ్మి స్మార్ట్ఫోన్లలో కల్పిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. టెలికాం దిగ్గజ సంస్థలు భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో తన విని యోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిన వాయిస్ వైఫై కాలింగ్ సేవలు ఇక మీదట తమ స్మార్ట్ఫోన్లలో వినియోగించు కోవచ్చని తెలిపింది. ఈమేరకు ఫోన్ల జాబితాలో ట్విటర్లో షేర్ చేసింది. కాగా భారతి ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా వై ఫై కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామనీ, తమ వైఫై చందాదారుల సంఖ్య 10 లక్షలు దాటిందని ఇటీవల ప్రకటించింది. అటు రిలయన్స్ జియో కూడా ఈ సదుపాయాన్ని కొన్ని పరిమిత సర్కిళ్లలో ఇటీవల లాంచ్ చేసింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఈ సేవలకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వీఓ వైఫై టెక్నాలజీతో పబ్లిక్ హాట్‌స్పాట్ లేదా ప్రైవేట్ హోం వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకొని ఏ మొబైల్‌ఫోన్‌కైనా, ల్యాండ్‌లైన్‌కైనా కాల్స్ చేసుకోవచ్చు. చదవండి: జియోకు షాక్ : దూసుకుపోతున్న ఎయిర్టెల్ Welcome to the future of voice calling! #VoWiFi is now available across our exciting range of #Redmi smartphones. 🤙 Make calls using WiFi on your @airtelindia and @reliancejio WiFi network. RT and help us spread the word! 🙏 pic.twitter.com/XywK6Hk67P — Redmi India for #MiFans (@RedmiIndia) January 14, 2020 -
జియోకు షాక్ : దూసుకుపోతున్న ఎయిర్టెల్
సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం సంస్థ భారతి ఎయిర్టెల్ ఇటీవల ప్రారంభించిన వైఫై కాలింగ్ ఫీచర్ దూసుకుపోతోంది. ఇప్పటికే ఒక మిలియన్‌కు పైగా వినియోగదారులను నమోదు చేసింది. ఈ మేరకు ఎయిర్టెల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా వైఫై కాలింగ్ ఫీచర్ తీసుకొచ్చింది తామేనని ఎయిర్టెల్ వినియోగదారులు ఏ వైఫైలో అయినా ఈ సేవను ఉపయోగించుకోవచ్చని భారతి ఎయిర్టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సెఖోన్ తెలిపారు. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థి, రిలయన్స్ జియో తమ మొబైల్ వినియోగదారులకోసం వైఫై సేవలను ప్రారంభించిన రెండు రోజుల తరువాత ఈ గణాంకాలను విడుదల చేయడం గమనార్హం. కాగా గత ఏడాది డిసెంబరులో ఎయిర్టెల్ తన ‘వాయిస్ ఓవర్ వైఫై (వీఓవైఫై)’ సేవలను మొట్టమొదటి సారిగా ప్రారంభించింది. ఈ సేవలు తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలతోపాటు ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కోల్‌కతాలో అందుబాటులో ఉన్నాయి. 16 బ్రాండ్లలో 100కి పైగా స్మార్ట్‌ఫోన్ మోడళ్లు, ప్రస్తుతం ఎయిర్టెల్ వైఫై కాలింగ్ ఫీచర్‌కు మద్దుతునిస్తున్నాయి. ఈ సేవలకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వీఓ వైఫై టెక్నాలజీతో పబ్లిక్ హాట్‌స్పాట్ లేదా ప్రైవేట్ హోం వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకొని ఏ మొబైల్‌ఫోన్‌కైనా, ల్యాండ్‌లైన్‌కైనా కాల్స్ చేసుకోవచ్చు. -
జియో బంపర్ ప్లాన్: ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్
సాక్షి,ముంబై: ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తన కస్టమర్లకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలోనే తొలి జీరో కాస్ట్ పోస్ట్ పెయిడ్ సర్వీసులను ప్రకటించింది. ఒకే ఒక్క క్లిక్‌తో ఇంటర్నేషనల్ కాలింగ్ యాక్టివేషన సదుపాయాన్ని కల్పిస్తోంది. ఎలాంటి నెలవారీ ఛార్జీలు, డిపాజిట్లు లేకుండానే అంతర్జాతీయ కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. రిలయన్స్ జియో కొత్త పోస్ట్‌పెయిడ్ రీచార్జ్ ప్లాన్ లో నెలకు 199రూపాయల ప్యాక్‌లో 25జీబీ డేటాని ఆఫర్ చేస్తోంది. అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలను కల్పిస్తున్న ఈ ప్లాన్ మే 15నుంచి అమల్లోకి వస్తుందని గురువారం ఒక ప్రకటనలో జియో తెలిపింది. ముఖ్యంగా ఈ ప్యాక్ద్వారా జియో వినియోగదారులందరికీ అత్యంత ఆకర్షణీయమైన, ఇంటర్నేషనల్ కాలింగ్ అండ్ రోమింగ్ సౌలభ్యాన్నికూడా అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించింది. అంతర్జాతీయ కాలింగ్ నిమిషానికి 50 పైసలు నుంచి మొదలవుతుందని పేర్కొంది. ఎలాంటి సబ్స్క్రిప్షన్, సెక్యూరిటీ డిపాజిట్లు లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. -
విమానంలో వై-ఫైకు అనుమతి!!
న్యూఢిల్లీ : విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు ఫేస్బుక్లో సమయాన్ని వెచ్చించడం, ట్వీట్ చేయడం మిస్ అవుతున్నారా.? అయితే ప్రయాణికులకు త్వరలోనే ఓ గుడ్‌న్యూస్ అందనుంది. విమానాలు భారత గగనతలంలో ఎగురుతున్నప్పుడు వై-ఫై వాడుకునే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించాలని పౌరవిమానయాన శాఖ నిర్ణయించిందట. 10 రోజుల్లో దీనిపై ఓ శుభవార్తను అందించనున్నట్టు పౌర విమానయాన కార్యదర్శి ఆర్ఎన్ చౌబే తెలిపారు. భారత గగనతలంలో వై-ఫై ఆపరేట్‌కు అనుమతి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు విమాన ప్రయాణంలో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వాడకాన్ని అనుమతించేవారు కాదు. ఎవరైనా ఫోన్‌ను వాడితే అది నేరంగా పరిగణించేవారు. ప్రస్తుతం పౌర విమానయానం తీసుకునే ఈ నిర్ణయంతో కాల్స్ చేసుకునే అవకాశం కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. సివిల్ ఏవియేషన్ సెక్రటరీ వాగ్దానంతో, 'అచ్చే దిన్' ఫైనల్‌గా విమాన ప్రయాణికుల ముందుకు విచ్చేస్తుందట. ఈ ప్రతిపాదన అమలుకు కేబినెట్ అనుమతి అవసరం లేదని, 10 రోజుల్లో ప్రయాణికుల ముందుకు ఈ అవకాశాన్ని తీసుకురానున్నట్ట చౌబే తెలిపారు. భారత గగనతలంలో ఎగిరే భారత, విదేశీ విమనాలన్నింటికీ ఈ సౌకర్యం అనుమతించనున్నట్టు వెల్లడించారు. ఎయిర్ ప్యాసెంజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏపీఏఐ) నిర్వహించిన అవార్డు ఫంక్షన్లో చౌబే ఈ విషయాన్ని తెలిపారు.