
న్యూఢిల్లీ: కొత్త నంబర్ నుంచి కాల్ వస్తుంటే ఎవరు చేస్తున్నారు? అనే సందేహం వస్తుంటుంది. ఆ సందేహానికి చెక్ పెడుతూ కాల్ చేస్తున్న వారి పేరు ఫోన్ డిస్‌ప్లేపై కనిపించే ఫీచర్ త్వరలో సాకారం కానుంది.
టెలికం నెట్‌వర్క్‌లో ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ సప్లిమెంటరీ సరీ్వస్’(సీఎన్‌ఏపీ)ను ప్రవేశపెట్టాలంటూ టెలికం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ సిఫారసు చేసింది. సిఫార్సు అమలైతే కస్టమర్ అభ్యర్థన మేరకు టెలికం కంపెనీలు ఈ సేవను అందించాల్సి ఉంటుంది. స్పామ్, మోసపూరిత కాల్స్‌కు దీనితో చెక్ పెట్టొచ్చన్నది ట్రాయ్ ఉద్దేశ్యంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment