మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా.. వస్తువులు, ఎలక్ట్రానిక్స్ కూడా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రోగ్‌బిడ్ (Rogbid) అనేక సంస్థ ఓ ప్రత్యేకమైన 'ఎస్ఆర్08 అల్ట్రా' పేరుతో స్మార్ట్ రింగ్ రూపొందించింది. ఇది ఇప్పటికి మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని రింగులకంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
రోగ్‌బిడ్ రూపొందించిన స్మార్ట్ రింగ్ ఒక డిస్‌ప్లే కూడా కలిగి ఉండటం గమనార్హం. ఇలాంటి డిస్‌ప్లే కలిగిన రింగ్ మరొకటి లేదు అని సమాచారం. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటం మాత్రమే కాకుండా.. వివిధ సైజుల్లో కూడా లభిస్తుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే.. 20 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది.
రోగ్‌బిడ్ ఎస్ఆర్08 అల్ట్రా స్మార్ట్ రింగ్ టైటానియం అల్లాయ్ కేసింగ్ కూడా పొందుతుంది. కాబట్టి ఇది చాలా దృఢంగా ఉంటుంది. దీని గురించి చెప్పుకోవాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇది వాటర్ ప్రూఫ్ రేటింగ్ పొందింది. కాబట్టి దీనిని 50 మీటర్ల లోతున్న నీటిలో వేసినా మళ్ళీ పనిచేస్తుంది.
8.0 మీమీ వెడల్పు, 2.5 మిమీ మన్దమ్ కలిగిన ఈ రింగ్ బరువు 4 గ్రాములు మాత్రమే. ఇది ప్రత్యేక యాప్ ద్వారా ఐఓఎస్, ఆండ్రాయిడ్ వంటి వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రింగులోని ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ట్యాప్ చేస్తే టైమ్, స్టెప్ కౌంట్, హార్ట్ బీట్ రేట్, స్లీప్ ట్రాకింగ్ వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని చూపిస్తుంది.
ఇదీ చదవండి: మనిషిలా తడబడిన రోబో - వీడియో వైరల్
గోల్డ్, సిల్వర్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్మార్ట్ రింగ్ ధర 89.99 డాలర్లు (సుమారు రూ. 7600), ఇది లిమిటెడ్ ఎడిషన్ న్యూఇయర్ గిఫ్ట్ బాక్స్‌లో వస్తుంది. ఈ రింగ్ కొనుగోలు చేయడానికి కంపెనీ అధికారిక వెబ్‌సైట్ సందర్సించాలి. ఈ రింగ్ కొనుగోలుపైన సంవత్సరం వారంటీ.. ఉచిత రీప్లేస్‌మెంట్ వంటివి కూడా పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment