ఈ ఫొటోలో కనిపిస్తున్నది స్మార్ట్ ఉంగరం. ఉంగరం లోపలి వైపు రాళ్లు పొదిగారేమిటా అనుకుంటున్నారా? అవి రాళ్లూ రత్నాలూ కావు. స్మార్ట్ సెన్సర్ల లైట్లు. ఈ ఉంగరం వేలికి పెట్టుకుంటే, ఇది అనుక్షణం మన ఆరోగ్యానికి కనిపెట్టుకుని ఉంటుంది. దీనిని ఒకసారి చార్జింగ్ చేసుకుంటే, ఇందులోని బ్యాటరీ ఏడురోజుల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తుంది.
ఫిన్లాండ్‌కు చెందిన ‘ఓరా’ సంస్థ ఈ స్మార్ట్ ఉంగరాన్ని ‘ఓరా రింగ్ జెన్3 హారిజన్’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. దీనిని వేలికి పెట్టుకుంటే, మన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది.
బ్లడ్ ఆక్సిజన్ లెవల్, నిద్రపోయే సమయం, గుండె స్పందనలు, రోజువారీ పనుల్లో మనం ఖర్చు చేసే కేలరీలు తదితర వివరాలను గూగుల్ ఫిట్ లేదా యాపిల్ హెల్త్ యాప్స్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది. దీని ధర 349 డాలర్లు (సుమారు రూ.28,500).
Comments
Please login to add a commentAdd a comment