ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో యాపిల్ ఐఫోన్ సిరీస్‌లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఐఫోన్ 15 సిరీస్ విడుదలలో జాప్యం ఏర్పడనుంది. ముందే అనుకున్న విడుదల షెడ్యూల్ కంటే మరికొన్ని వారాలు ఆలస్యంగా విడుదల చేసే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా అనలిస్ట్ వంశీ మోహన్ మాట్లాడుతూ.. ఐఫోన్ 15 విడుదల ఆలస్యం ఎందుకు జరుగుతుందో స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే ఫోన్ క్యూ4లో అంటే అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఎప్పుడైనా యూజర్లకు పరిచయమయ్యే అవకాశం ఉందని అన్నారు.
డిస్‌ప్లే సమస్యలే కారణమా?
ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం.. యాపిల్ సంస్థ ఫోన్‌ల డిస్‌ప్లే సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లిమిటెడ్ ఫోన్‌లకే డిస్‌ప్లేలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ఐఫోన్ 15 ఫోన్‌ల డిస్‌ప్లే బెజెల్స్ పరిణామాన్ని తగ్గించడంతో పాటు, ఐఫోన్‌ల డిస్‌ప్లేలను ఎల్‌జీ తయారు చేస్తుంది. వీటి తయారీలోనూ ఆలస్యానికి కారణమని సమాచారం. యాపిల్ వాచ్ 7 డిస్‌ప్లే అంశంలోనూ ఇదే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. యాపిల్ వాచ్ 7ను మార్కెట్‌లో విడుదల చేసిన నెల రోజుల తర్వాత విక్రయాలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment