
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ ప్రయాణం చేసేవారి కోసం ఎయిర్‌టెల్ వరల్డ్ పాస్ పేరుతో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌ను పరిచయం చేసింది. ఈ ప్యాక్‌తో కస్టమర్లు 184 దేశాల్లో రోమింగ్ సేవలను పొందవచ్చు.
ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌లోనూ ఇవి లభిస్తాయి. ఇంటర్నెట్, కాల్స్ వినియోగం, బిల్లు వంటి విషయాలను వినియోగదార్లు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో తెలుసుకోవచ్చు. ఒకరోజుతో మొదలుకుని 365 రోజుల కాలపరిమితితో ఇవి లభిస్తాయి. ఎంచుకున్న ప్యాక్‌నుబట్టి చార్జీ రూ.649 నుంచి రూ.14,999 వరకు ఉంది.