
తెలుగు రాష్టాల ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త తెలిపింది ఎయిర్‌టెల్. టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.199ను తాజాగా సవరించింది. ఈ కొత్త ప్లాన్లో భాగంగా యూజర్లు మరింత డేటాను పొందవచ్చు అని పేర్కొంది. కొత్త రూ.199 ప్లాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో టెలికాం సర్కిల్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. త్వరలో మిగతా యూజర్లకు తీసుకు రానున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు వినియోగదారులు రూ.199 ప్లాన్ కింద రోజూ 1జీబీ డేటాను పొందగా, ఇప్పుడు వారికి రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది. రిలయన్స్ జియో కూడా రూ.199 ప్లాన్ కింద 1.5 జీబీ డేటా అందిస్తుంది.(చదవండి: కొత్త ఏడాదిలో వాట్సాప్ నుంచి బిగ్ అప్‌డేట్)
ఎయిర్‌టెల్ యూజర్లు 1.5జీబీ రోజువారీ డేటా కోటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత కాలింగ్ సేవలను అందించనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజుల వరకు ఉటుంది. రీఛార్జ్‌తో పాటు ఎయిర్‌టెల్ యూజర్లు వింక్ మ్యూజిక్, హెలోట్యూన్‌లను యాక్సెస్ చేయగలరు. అలాగే, యూజర్లు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ ఉచిత సేవలను కూడా పొందవచ్చు. ఎయిర్‌టెల్ ఇప్పటికే ప్రీపెయిడ్ ప్లాన్ ప్రతిరోజూ అందిస్తుంది. రూ.249 కింద రోజుకు 1.5 జిబి డేటాను, 100 ఎస్ఎంఎస్, 28 రోజుల కాలానికి అపరిమిత కాలింగ్ సేవలను కూడా అందిస్తుంది. రెండు ప్లాన్‌లు ఒకే విదంగా ఉన్న కారణంగా దీనిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌టెల్ త్వరలో రూ.249 ప్లాన్‌లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. జియో రూ.249 ప్లాన్ కింద 2జీబీ డేటాను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment