న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. అక్టోబర్ నెలలో 4జీ సర్వీస్ ప్రొవైడర్లలో రిలయన్స్ జియో సెకనుకు 21.9 మెగాబిట్ డేటా డౌన్‌లోడ్ వేగంతో తన అగ్ర స్థానాన్ని నిలుపుకుంది. అలాగే, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా డేటా డౌన్‌లోడ్ వేగంలో పెరిగినట్లు పేర్కొంది. గతంతో పోలిస్తే డేటా డౌన్‌లోడ్ వేగం పరంగా భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో నెట్‌వర్క్ మధ్య అంతరం తగ్గుతుంది. 4జీ డేటా డౌన్‌లోడ్ వేగం స్వల్పంగా తగ్గిన తర్వాత అక్టోబర్ నెలలో జియో నెట్‌వర్క్ జూన్ నెలలో నమోదైన 21.9 ఎంబిపిఎస్ డౌన్‌లోడ్ వేగాన్ని అందుకుంది.
భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా డేటా డౌన్‌లోడ్ వేగం దాదాపు రెండున్నర రెట్లు పెరిగాయి. ఎయిర్‌టెల్ 4జీ డేటా డౌన్‌లోడ్ వేగం జూన్ నెలలో ఉన్న 5 ఎంబిపిఎస్ నుంచి అక్టోబర్ నెలలో 13.2 ఎంబిపిఎస్ కు పెరిగింది. ఇంకా, వొడాఫోన్ ఐడియా డేటా డౌన్‌లోడ్ వేగం ఐదు నెలల్లో 6.5 ఎంబిపిఎస్ నుంచి 15.6 ఎంబిపిఎస్'కు పెరిగింది. అయితే, అక్టోబర్ నెలలో 4జీ డేటా అప్‌లోడ్ వేగం పరంగా వొడాఫోన్ ఐడియా తన అగ్రస్థానాన్ని కొనసాగించింది.
వొడాఫోన్ ఐడియా కంపెనీ 7.6 ఎంబిపిఎస్ అప్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఈ వేగం గత ఐదు నెలల్లో అత్యధికం. అదేవిధంగా, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో నెట్‌వర్క్ అప్‌లోడ్ వేగం అక్టోబర్ నెలలో గత ఐదు నెలలతో పోలిస్తే గరిష్ట స్థాయిలో 5.2 ఎంబిపిఎస్, 6.4 ఎంబిపిఎస్ వేగాన్ని నమోదు చేశాయి. రియల్ టైమ్ ప్రాతిపదికన మైస్పీడ్ అప్లికేషన్ సాయంతో భారతదేశం అంతటా సేకరించే డేటా ఆధారంగా ట్రాయ్ ద్వారా సగటు వేగం లెక్కిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment