
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ మరో ఆకర్షణీయమైనప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ ఖాతాదారులకోసం సరికొత్త వార్షిక పథకాన్ని ప్రకటించింది. అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత డేటా, ఎస్‌ఎంఎస్‌లతో మూడు కొత్త ప్లాన్‌లను ప్రకటించింది. ఎయిర్‌టెల్ వెబ్ సైట్ లో పొందుపర్చిన సమాచారం ప్రకారం నేషనల్ రోమింగ్, ఎస్ఎమ్ఎస్ ఫ్రీ (100 ఎస్ఎంఎస్ /రోజుకు), రూ. 3999, రూ. 1999, రూ. 999 ల రీచార్జి ప్లాన్‌ను ప్రీ పెయిడ్ కస్టమర్లకు అందిస్తోంది.
- రూ.3999 రీచార్జ్ ప్లాన్ లో 300 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. 360 రోజులు చెల్లుబాటయ్యేలా ఈ ప్లాన్‌ను లాంచ్ చేసింది.
- రూ.1999 రీచార్జ్‌పై 180 రోజుల (ఆరునెలలు) కాలపరిమితిలో.. 125 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ (నేషనల్ రోమింగ్), 100 ఎస్ఎంఎస్లు రోజుకు ఉచితం.
- రూ. 999 రీచార్జ్‌పై 90 రోజులు(మూడు నెలలు) వ్యవధిలో 60 జీబీ డేటా, దీంతోపాటు నేషనల్ రోమింగ్ & ఎస్ఎమ్ఎస్‌లు (100 ఎస్ఎంఎస్ / రోజుకు) ఉచితం.
కాగా టెలికాం మార్కెట్‌లో నెలకొన్ని తీవ్ర పోటీనేపథ్యంలో తాజాగా ఈవార్షికప్లాన్లను లాంచ్ చేసింది. రిలయన్స్ జియో 360 రోజులకు రూ.9999 లకు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా సేవలనుఅందిస్తోంది.. జియోకు షాకిచ్చేలా ఎయిర్ టెల్ తన కస్టమర్లకు సరికొత్త ఆకర్షణీయ రీచార్జ్‌ప్లాన్లను లాంచ్ చేయడం విశేషం.
