జియో ఫెస్టివల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. బోలెడు బెనిఫిట్లు | Reliance Jio Launches ₹349 Festive Recharge Plan with Special Dhanteras and Diwali Offers | Sakshi
Sakshi News home page

జియో ఫెస్టివల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. బోలెడు బెనిఫిట్లు

Oct 11 2025 9:12 PM | Updated on Oct 12 2025 11:09 AM

Reliance Jio offering more benefits for Rs 349 plan

ధంతేరాస్, దీపావళి సందర్భంగా రిలయన్స్ జియో (Reliance Jio) ప్రత్యేక పండుగ రీఛార్జ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా రూ.349 ప్లాన్‌ వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీ కలిగి, రోజుకు 2జిబి డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వంటి బేసిక్ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఇందులో ప్రత్యేక పండుగ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

ముఖ్యమైన ఫెస్టివ్ ఆఫర్లు
జియోఫైనాన్స్ గోల్డ్ బోనస్: జియో గోల్డ్‌లో పెట్టుబడి పెడతే అదనంగా 2శాతం బోనస్  లభిస్తుంది. ఈ బెనిఫిట్ పొందేందుకు 8010000524కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.

జియోహోమ్ ఉచిత ట్రయల్: స్మార్ట్ హోమ్ ప్రోడక్ట్స్‌ను ప్రోత్సహించేందుకు, కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు 2 నెలల జియోహోమ్ ఉచిత ట్రయల్ లభిస్తుంది. ఇందులో హోమ్ ఇంటర్నెట్, స్మార్ట్ డివైసులు, ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు ఉంటాయి.

3 నెలల జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్: ప్రీమియం కంటెంట్ కోసం, జియో 3 నెలల హాట్ స్టార్ మొబైల్/టీవీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. వినియోగదారులు అదనపు ఛార్జ్ లేకుండా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, స్పోర్ట్స్‌ని ఆస్వాదించవచ్చు.

50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్: డేటా భద్రత కోసం 50 జిబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. వినియోగదారులు ఫైళ్లను ఎక్కడినుంచి అయినా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: కొత్త ఫోన్‌ తీసుకొచ్చిన జియో.. ఇది ఉంటే ఫుల్‌ సేఫ్టీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement