హెక్సాకామ్‌లో టీసీఐఎల్‌ వాటా విక్రయం! | DoT To Raise Rs 7000 Crore From TCIL stake Sale in Bharti Hexa | Sakshi
Sakshi News home page

హెక్సాకామ్‌లో టీసీఐఎల్‌ వాటా విక్రయం!

Published Thu, Jan 27 2022 7:53 AM | Last Updated on Thu, Jan 27 2022 7:53 AM

DoT To Raise Rs 7000 Crore From TCIL stake Sale in Bharti Hexa - Sakshi

న్యూఢిల్లీ: రాజస్తాన్, ఈశాన్య రాష్ట్రాలలో టెలికం సర్వీసులందిస్తున్న భారతీ హెక్సాకామ్‌లోగల 30  శాతం వాటాను పీఎస్‌యూ సంస్థ టీసీఐఎల్‌ విక్రయించనుంది. ఈ వాటా విలువను ప్రభుత్వ ఆదేశాలమేరకు ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ రూ.8,900 కోట్లుగా మదింపు చేసినట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. భారతీ హెక్సాకామ్‌లో మొబైల్‌ సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు 70 శాతం వాటా ఉంది.  

టీసీఐఎల్‌ ద్వారా ఈ భాగస్వామ్య సంస్థ(జేవీ)లో గల వాటాను ప్రభుత్వం విక్రయించే యోచనలో ఉంది. ఈ జేవీలోగల వాటాను విక్రయించడం ద్వారా భారతీ హెక్సాకామ్‌ నుంచి ప్రభుత్వం వైదొలగనుంది.  ఈ అంశం 15ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. కాగా.. వాటా విక్రయాన్ని పబ్లిక్‌ ఇష్యూ ద్వారా చేపట్టదలిస్తే మరో రెండేళ్ల కాలం పట్టవచ్చని, అప్పటికి వాటా విలువలో మార్పులుంటాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

(చదవండి: యూని'ఫ్లాప్' కార్న్‌లు.. బేర్‌ మంటున్న టెక్‌ స్టార్టప్‌లు!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement