న్యూఢిల్లీ: టెలికం కనెక్షన్లలో జియో ఆధిపత్యం కొనసాగుతోంది. సెప్టెంబర్‌లో కంపెనీ కొత్త యూజర్ల సంఖ్య 7.2 లక్షలు పెరిగింది. 4.12 లక్షల కొత్త యూజర్లతో భారతీ ఎయిర్‌టెల్ రెండో స్థానంలో నిల్చింది. సంక్షోభంలో ఉన్న వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా సెప్టెంబర్‌లో ఏకంగా 40 లక్షల యూజర్లను కోల్పోయింది. 21.75 శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానంలో నిలిచింది.
టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జియో యూజర్లు సెప్టెంబర్‌లో పెరిగినప్పటికీ ఆగస్టుతో పోలిస్తే (32.81 లక్షలు) మాత్రం తగ్గింది. ఇక తాజాగా సెప్టెంబర్‌లో మొత్తం అన్ని టెల్కోల వైర్‌లెస్ యూజర్ల సంఖ్య 36 లక్షల మేర తగ్గింది. ఆగస్టు ఆఖరు నాటికి ఇది 114.91 కోట్లుగా ఉండగా, సెప్టెంబర్ ఆఖరు నాటికి 114.54 కోట్లకు పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment