
న్యూఢిల్లీ: బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ శుభవార్త ప్రకటించనుంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు అయిన బేసిక్, ఎంటర్‌టైన్‌మెంట్, ప్రీమియం, తదితర వాటికి డేటా పరిమితిని తొలగించనుంది. ప్రస్తుతం అన్ని ప్లాన్ల వినియోగదారులకు అపరిమిత డేటా ఆఫర్ ఇవ్వనుంది. అయితే తమ ఖాతాదారులు జియోకు మారకుండా ఉండే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రూ. 299 అన్‌లిమిటెడ్ డేటా యాడ్ ఆన్ ప్యాక్‌ను తొలగించింది. అయితే అపరిమిత డేటా ప్రయోజనం 3300 జీబీ ఎఫ్‌యూపీ క్యాప్‌తో అందుబాటులోకి రానుంది.
ఎయిర్‌టెల్ తాజా ఆఫర్‌కు సంబంధించిన వివరాలు ఎయిర్‌టెల్ వెబ్‌సైట్, మై ఎయిర్‌టెల్ యాప్‌లో పెట్టనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. కాగా రిలయన్స్ జియోతో పోటీని తట్టుకోవడానికి ఈ ఆఫర్ ప్రకటించిందని మొబైల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎయిర్‌టెల్ తాజా నిర్ణయంతో తమ వినియోగదారులు జియోకు మారకుండా ఉండేందుకు దోహదం చేస్తుందని ఎయిర్‌టెల్ భావిస్తుంది. ఇదివరకే ఆంధ్రప్రదేశ్, గుజరాత్ సర్కిళ్లలో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై అపరిమిత డేటాను అందిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: చిప్స్ కొంటే..ఉచిత డేటా : ఎయిర్‌టెల్)
Comments
Please login to add a commentAdd a comment