
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన యూజర్లకు శుభవార్త తెలిపింది. ఇతర టెలికాం సంస్థలకు పోటీగా తన యూజర్లకు ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్‌తో మీ ముందుకు వచ్చింది. ఇతర టెలికాం సంస్థలు అందిస్తున్నట్లు గానే ఓటీటీ సేవలను ఉచితంగా అందించేందుకు సిద్దం అయ్యింది. దీర్ఘకాల వ్యాలిడిటీ ప్లాన్‌లో భాగంగా ఇప్పటి వరకు ఉన్న రూ.2999 ప్లాన్‌ను ఎయిర్‌టెల్ సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసింది.
ఎయిర్‌టెల్ రూ.2999 ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే 356 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు, రూ.499 విలువ గల డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందవచ్చు. ఇంకా wynk మ్యూజిక్, ఉచిత హలోట్యూన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 వరకు క్యాష్‌బ్యాక్ లాంటి బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. నెలపాటు అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్‌ను కూడా వినియోగించుకోవచ్చు. అయితే, ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.3359 ప్లాన్ కింద కూడా ఇవే ప్రయోజనాలు ఉండడంతో. ఈ ప్లాన్ ఎన్నిరోజులు అందుబాటులో ఉంటుంది అనేదానిపై మాత్రం స్పష్టత లేదు.
(చదవండి: ద్విచక్ర వాహన దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్!)
Comments
Please login to add a commentAdd a comment