కొద్ది రోజుల క్రితం వరకు టెలికాం రంగంలో పోటీపడుతున్న దిగ్గజ కంపెనీలు టెలికాం జియో, ఎయిర్‌టెల్ ఇప్పుడు మరో రంగంలో పోటీ పడేందుకు సిద్ద పడుతున్నాయి. ప్రపంచంలోని ఇతర ప్రధాన ఇంటర్నెట్ హబ్‌లతో కనెక్ట్ చేస్తూ జియో సముద్ర మార్గానా ఇంటర్నెట్ కేబుల్ నిర్మాణాల్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నిర్మాణాలు త్వరలో మాల్దీవ్లోని హుల్ హుమలే ప్రాంతం వరకు కనెక్ట్ చేసేందుకు సిద్ద పడుతుంది. అయితే, ఎయిర్‌టెల్ కూడా జియోకి పోటీగా సముద్ర మార్గానా ఇంటర్నెట్ కేబుల్ నిర్మాణ పనుల్ని చేపట్టేందుకు సిద్ద పడుతుంది.
ఏంటి ఈ సీ-ఎంఈ-డబ్ల్యుఈ-6 ప్రాజెక్టు:
వేగంగా అభివృద్ధి చెందుతున్న డీజీటల్ ఆర్థిక వ్యవస్థకు సేవలందించే తన హైస్పీడ్ గ్లోబల్ నెట్ వర్క్ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా 'సీ-ఎంఈ-డబ్ల్యుఈ-6(SEA-ME-WE-6)' అండర్ సీ కేబుల్ కన్సార్టియంలో చేరినట్లు భారతి ఎయిర్‌టెల్ తెలిపింది. సీ-ఎంఈ-డబ్ల్యుఈ-6లో "ప్రధాన పెట్టుబడిదారు"గా పాల్గొంటున్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. ఈ అండర్ సీ కేబుల్ వ్యవస్థ నిర్మాణానికి కావాల్సిన మొత్తం పెట్టుబడిలో 20 శాతం పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది.
సీ-ఎంఈ-డబ్ల్యుఈ-6లోని మరో 12 కన్సార్టియం సభ్యుల్లో బంగ్లాదేశ్ సబ్ మెరైన్ కేబుల్ కంపెనీ, ధియాగు(మాల్దీవులు), జిబౌటీ టెలికామ్, మొబిల(సౌదీ అరేబియా), ఆరెంజ్ (ఫ్రాన్స్), సింగ్ టెల్ (సింగపూర్), శ్రీలంక టెలికామ్, టెలికామ్ ఈజిప్ట్, టెలికోమ్ మలేషియా, టెలిన్ (ఇండోనేషియా) ఉన్నాయి. SEA-ME-WE-6 ప్రాజెక్టులో భాగంగా ఫ్రాన్స్ నుంచి అన్నీ దేశాలను కలుపుతూ సింగపూర్ వరకు అండర్ సీ కేబుల్ నిర్మాణం చేపడుతారు. దీని పొడవు 19,200 కిలోమీటర్లు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సముద్రగర్భ కేబుల్ వ్యవస్థలో ఇది ఒకటిగా నిలవనుంది. SEA-ME-WE-6 వల్ల ఎయిర్‌టెల్ గ్లోబల్ నెట్‌వర్క్‌కు అదనంగా 100 టీబీపీఎస్ సామర్ధ్యం సమకూరనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎయిర్‌టెల్ ఇతర భాగస్వాములతో కలిసి సింగపూర్ - చెన్నై - ముంబై మధ్య నాలుగు ఫైబర్ పెయిర్ నిర్మించనుంది.
Comments
Please login to add a commentAdd a comment