ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాకు సిటీ రూ.1,000 కోట్ల రుణం | Airtel Africa signs up for USD 125 million credit pact with Citi | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాకు సిటీ రూ.1,000 కోట్ల రుణం

Published Thu, Aug 11 2022 1:25 AM | Last Updated on Thu, Aug 11 2022 1:25 AM

Airtel Africa signs up for USD 125 million credit pact with Citi - Sakshi

ముంబై: ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా 125 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1,000 కోట్లు) రుణ సదుపాయం కోసం అమెరికాకు చెందిన సిటీ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. 14 ఆఫ్రికా దేశాల్లో ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా టెలికం, మొబైల్‌ మనీ సేవలు అందిస్తోంది.

స్థానిక కరెన్సీతోపాటు, డాలర్‌ మారకంలో ఈ రుణ సదుపాయం ఉంటుందని ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా ప్రకటించింది. ఈ సదుపాయం 2024 సెప్టెంబర్‌ వరకు ఉంటుంది. ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా కార్యకలాపాలకు మద్దతుగా, నాలుగు సబ్సిడరీ కంపెనీల్లో పెట్టుబడులకు వినియోగించనున్నట్టు తెలిపింది. ఎయిర్‌టెల్‌కు చెందిన ముంబై యూనిట్‌ ద్వారా ఈ డీల్‌ చేసుకున్నట్టు ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement