సాక్షి, చిత్తూరు : ఏపీ ప్రజల డేటా చోరీ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఎదురుదాడికి దిగారు. డేటా వ్యక్తిగత ఆస్తి అని, పార్టీ డేటాను అప్‌డేట్ చేస్తుంటే కేసులు పెట్టడానికి తెలంగాణ పోలీసులు ఎవరంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మిమ్మల్ని వదిలిపెట్టను, మీ మూలాలను కదిలిస్తా, నా జోలికి వస్తే వదిలేది లేదంటూ చంద్రబాబు బెదిరింపులకు దిగారు. (ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా స్కామ్!)
సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లిలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ...‘టీడీపీని దెబ్బతీయాలనుకుంటే మీ మూలాలను కదిలిస్తా. కాంగ్రెస్ కాలంలో ఇలాంటి పరిస్థితి లేదు. పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. ప్రపంచంలోని ఐటీ కంపెనీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నేనే తెచ్చా. మీరు వాడే సెల్‌ఫోన్ కూడా నేనే కనిపెట్టాను. రాష్ట్ర విభజనతో ఇప్పటికే కష్టాల్లో ఉన్నాం. అభివృద్ధికి అడ్డుపడితే వదిలిపెట్టే సమస్యేలేదు. ఎంతమంది కలిసినా నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. మీ ఆటలు సాగనివ్వను. 37ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ఉంది. కేసీఆర్ నన్ను ఓడిస్తామంటున్నారు. ఆంధ్రాలో టీఆర్‌ఎస్ పార్టీ లేదు. ప్రధాని మోదీతో కలిసి ఆయన ఇలా బెదిరిస్తున్నారు. అందుకే మీకు రోషం రావాలి.’ అంటూ వ్యాఖ్యలు చేశారు. (డేటా చోరీ స్కాం, విస్తుగొలిపే వాస్తవాలు)
Comments
Please login to add a commentAdd a comment