ఫేస్‌బుక్‌లో నేమ్‌టెక్ట్స్‌ చేశారా, ఇక అంతే! | Quiz App Nametests Exposed Data Of Over 120 Million Facebook Users | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో నేమ్‌టెక్ట్స్‌ చేశారా, ఇక అంతే!

Published Fri, Jun 29 2018 1:35 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

Quiz App Nametests Exposed Data Of Over 120 Million Facebook Users - Sakshi

నేమ్‌టెక్ట్స్‌ డేటా లీక్‌

ఇటీవల ఫేస్‌బుక్‌లో బాగా పాపులర్‌ అవుతున్న నేమ్‌టెక్ట్స్‌ గురించి తెలిసే ఉంటుంది. మీరు ఏ డిస్ని రాణి? మీరు ఎలాంటి అ‍మ్మాయిలా కనిపిస్తున్నారు? అనుకుంటూ పలు పాపులర్‌ సోషల్‌ క్విజ్‌లను నేమ్‌టెక్ట్స్‌ అనే యాప్‌ నిర్వహిస్తూ ఉంటుంది. ఫేస్‌బుల్‌ చక్కర్లు కొడుతున్న ఈ యాప్‌ను, ప్రతి ఒక్కరూ ఏదో ఒక్కసారి ఓపెన్‌ చేసిన క్విజ్‌ ఆడి ఉంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరమట. ఈ నేమ్‌టెక్ట్స్‌ యాప్‌ 12 కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల డేటా బట్టబయలు చేసిందని ఓ రీసెర్చర్‌ వెల్లడించారు. 

క్విజ్‌ల ద్వారా ఫేస్‌బుక్‌ యూజర్‌ పేరు, ప్రాంతం, పుట్టిన తేదీ, వయసు, ఫేస్‌బుక్‌ ఐడీ, ప్రొపైల్‌ ఫోటోలు, భాష, స్నేహితుల జాబితా వంటి వ్యక్తిగత వివరాలను ఇది సేకరిస్తుందని తెలిసింది. ఈ విషయాన్ని సెక్యురిటీ రీసెర్చర్‌ ఇంటి దే స్యూకెలైర్‌ తన బ్లాగ్‌లో వెల్లడించారు. ఇలా గత కొన్నేళ్లుగా మిలియన్ల కొద్దీ యూజర్ల డేటాను నేమ్‌టెక్ట్స్‌ సేకరించిందని తెలిపారు. ఫేస్‌బుక్‌ బగ్‌ బౌంటీ ప్రొగ్రామ్‌లోపాల్గొనాలని నిర్ణయించుకున్న ఈ రీసెర్చర్‌, క్విజ్‌లపై పరిశోధన చేపట్టారు. ఆ సమయంలో నేమ్‌టెక్ట్స్‌.కామ్‌ గ్లోబల్‌గా 12 కోట్ల మంది యూజర్ల డేటాను బహిర్గతం చేస్తుందని తెలుసుకున్నారు. ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను దాని పేజీలో డిస్‌ప్లే చేస్తుందని కనుగొన్నారు. అంతేకాక, ప్రమాదశాత్తు ఈ డేటా అన్ని థర్డ్‌ పార్టీలకు అందుబాటులో ఉందన్నారు. 

ఒకవేళ ఈ యాప్‌ను యూజర్లు డిలీట్‌ చేసినా కూడా యూజర్ల గుర్తింపునూ ఇది బహిర్గతం చేస్తుందని వెల్లడించారు. దీని బారి నుంచి బయటపడటానికి, యూజర్‌ తమ డివైజ్‌పై ఉన్న కుక్కీలను మాన్యువల్‌గా డిలీట్‌ చేయాల్సి ఉంటుందని రీసెర్చర్‌ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ఫేస్‌బుక్‌లో ఈ లోపాన్ని కనుగొన్న రీసెర్చర్‌, ఫేస్‌బుక్‌ డేటా అబ్యూజ్‌ ప్రొగ్రామ్‌కు రిపోర్టు చేశారు. ఈ లోపాన్ని పరిష్కరించాలని నేమ్‌టెక్ట్స్‌కు కూడా లేఖ రాశారు. ఫేస్‌బుక్‌ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. నేమ్‌టెక్ట్స్‌.కామ్‌తో కలిసి ఈ సమస్యను పరిష్కరించడానికి పనిచేశామని, జూన్‌లోనే ఇది పరిష్కారమైందని ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌ పార్టనర్‌షిప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఇమ్ ఆర్చిబాంగ్ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement