Facebook profiles
-
మీ ఫేస్బుక్ ప్రొఫైల్‌ని ఎవరు చూశారో తెలుసుకోండి ఇలా..?
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా వేదికలలో ఫేస్బుక్ ఒకటి. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లలో ఫేస్బుక్ స్థానం ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు. ఈ ప్లాట్ ఫారమ్‌ను స్నేహితులతో చాట్ చేయడానికి, ఆన్లైన్ గేమ్‌లు ఆడటానికి, వీడియోలను చూడటానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫేస్బుక్లో ప్రతి ఒక్కరికి తమ కంటూ ఒక ప్రత్యేక అకౌంట్ ఉంటుంది. దీనిని మనం ఫేస్బుక్ ప్రొఫైల్ అని కూడా పిలుస్తాము. దీని ద్వారా ప్రపంచంలోని ఇతర ఫేస్బుక్ ఖాతాదారులతో స్నేహం చేయవచ్చు. ఇలాంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లో మీ ప్రొఫైల్ ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు. అయితే, సాధారణంగా మీతో స్నేహం చేయాలనుకునే వారు.. కొత్త స్నేహితాలను కనుగునే వారు ఫేస్బుక్ ప్రొఫైల్ చెక్ చేస్తారు. అయితే, మన ఫేస్బుక్ ప్రొఫైల్‌ని ఎంత మంది రోజు చూస్తున్నారో మనం తెలుసుకోవచ్చు, అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. మీ ఫేస్బుక్ ప్రొఫైల్‌ని ఎవరు చూశారో ఎలా తెలుసుకోవాలి? మీరు మొదట మీ ఫేస్బుక్ ఖాతాను డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ లో ఓపెన్ చేయండి. ఇప్పుడు మీ ఫేస్బుక్ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫేస్బుక్ సోర్స్ చూడటం కోసం 'View Page Source' మీద క్లిక్ చేయండి. పేజీ సోర్స్ ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్+ఎఫ్(Ctrl+F) క్లిక్ చేయండి. ఇప్పుడు, సెర్చ్ బార్ లో 'BUDDY_ID' టైప్ చేయండి. మీకు 'BUDDY_ID' పక్కన అనేక ఫేస్ బుక్ ప్రొఫైల్ ఐడీలు కనిపిస్తాయి, ఆ ఐడీలను కాపీ చేయండి. ఇప్పుడు కొత్త ట్యాబ్ తెరిచి ఉదా: 'Facebook.com/123456789123456' అని టైపు చేయండి. ఎవరో మీ ఫేస్బుక్ ప్రొఫైల్‌ని చూశారో వారి ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇలా మొత్తం ఐడీలు నమోదు చేసి ఎంత మంది మన ఫేస్బుక్ ప్రొఫైల్‌ని చూశారో తెలుసుకోవచ్చు. (చదవండి: Work From Home: వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్..!) -
యూజర్ల కోసం రూ. 95 వేల కోట్లను ఖర్చు చేసిన ఫేస్బుక్...!
ప్రముఖ టెక్ దిగ్గజం ఫేస్‌బుక్‌పై గత కొన్ని రోజుల క్రితం వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే..! వాల్ స్ట్రీట్జర్నల్ నివేదికను తప్పుబడుతూ ఫేస్బుక్ ఘాటుగా సమాధానమిస్తోంది. కొంత మంది వ్యక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఫేస్‌బుక్‌పై వాల్‌స్ట్రీట్ జర్నల్ చేసిన ఆరోపణలను కంపెనీ తిప్పికొట్టింది. ప్రతి యూజర్‌ను తమ దృష్టిలో ముఖ్యమైన వ్యక్తిగానే భావిస్తామని ఫేస్బుక్ పేర్కొంది. చదవండి: అదానీ, అవన్ని వదంతులేనా? ఆ టీవీని అమ్మడం లేదట! యూజర్ భద్రతను దృష్టిలో ఉంచుకొని 2016 నుంచి సుమారు 13 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 95, 830 కోట్లు) ఖర్చు చేసిందని ఫేస్బుక్ వెల్లడించింది. యూజర్ల సెక్యూరిటీ కోసం పని చేస్తోన్న ఉద్యోగుల సంఖ్య పదివేల నుంచి..40 వేల వరకు పెరిగిందని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి సుమారు 3 బిలియన్ల నకిలీ ఫేస్బుక్ ఖాతాలను తీసేసినట్లు తెలిపింది. కోవిడ్-19 సమయంలో ఫేక్ సమాచారాన్ని ఎక్కువగా సర్క్యూలేట్ అవ్వకుండా చూశామని ఫేస్బుక్ వెల్లడించింది. సుమారు 20 మిలియన్ల తప్పడు వార్తలను అరికట్టామని ఫేస్బుక్ తెలిపింది. ఇమేజ్-షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వేషపూరిత ప్రసంగాలను, ప్రమాణాలను ఉల్లంఘించిన కంటెంట్‌ను గతంలో కంటే15 రెట్లు ఎక్కువగా తొలగిస్తున్నామని పేర్కొంది. చదవండి: New York Times Report: వివాదాల నుంచి రిలాక్స్ అవ్వడానికే సర్ఫింగ్ చేస్తున్నారా!: -
అదిరిపోయే టెక్నాలజీని ఎంతమంది వినియోగించుకోవచ్చో తెలుసా?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో అదిరిపోయే టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. హారిజోన్ వర్క్ రూమ్ అని పిలిచే ఈ వర్చువల్ రియాలిటీ యాప్ ఎలా పనిచేస్తుందనే అంశంపై కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భవిష్యత్ 'మెటావర్స్' : మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ మాట్లాడుతూ.. తాము డెవలప్ చేస్తున్న హారిజోన్ వర్క్ రూమ్ యాప్ ఫ్యూచర్ 'మెటావర్స్' అని కామెంట్ చేశారు. మెటావర్స్ అంటే వర్చువల్ రియాలిటీ స్పేస్. ఇది కంప్యూటర్ జనరేటెడ్ ఎన్విరాన్ మెంట్‌ను క్రియేట్ చేస్తుంది. మీరు ఎక్కడో ఉన్నా ఒకే రూమ్‌లో ఎదురెదుగా ఉన్నారనే ఫీలింగ్‌ను కలిగిస్తుంది. ప్రస్తుతం ఫేస్బుక్ బిల్డ్ చేస్తున్న ఈ యాప్‌ను ఓకులస్ క్వెస్ట్ 2 హెడ్సెట్ (Oculus Quest 2 headset) వినియోగదారులు ఉచితంగా వినియోగించుకోవచ్చని ఫేస్బుక్ ప్రతినిధులు చెబుతున్నారు. ఎంత మంది వినియోగించుకోవచ్చు రాయిటర్స్ ప్రకారం..ఫేస్బుక్ సంస్థ ఇంటర్నల్‌గా జరిపే మీటింగ్‌లో ఈ హారిజన్ వర్క్ రూమ్‌ను వినియోగిస్తుంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ రియాలిటీ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ బోస్వర్త్ మాట్లాడుతూ..క్వెస్ట్ 2 హెడ్సెట్ల సాయంతో వర్చువల్ రియాలిటీలో జరిగే వీడియో కాన్ఫిరెన్స్‌లో 16 మంది నుంచి 50 మంది వరకు పాల్గొనవచ్చని తెలిపారు. చదవండి : మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి..! -
నదాల్‌కు మళ్లీ పెళ్ళా.. ఫేస్బుక్ అప్డేట్ చూసి షాక్ తిన్న అభిమానులు
పారిస్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, ప్రపంచ నంబర్ 3 ఆటగాడు, స్పెయిన్ బుల్ రఫేల్ నదాల్ సోమవారం చేసిన ఓ ఫేస్బుక్ అప్డేట్ అతని అభిమానులను అయోమయానికి గురి చేసింది. గాట్ మ్యారీడ్ అంటూ రఫా తన రిలేషన్షిప్ స్టేటస్‌ను పొరపాటున అప్డేట్ చేయడంతో ఈ గందరగోళం మొదలైంది. ఇది చూసి కొందరు ఫ్యాన్స్ ఆనందపడగా.. మరికొందరు నదాల్‌కు మళ్లీ పెళ్ళా అంటూ కామెంట్లు పోస్ట్ చేశారు. నిజానికి నదాల్‌కు 2019 అక్టోబర్‌లోనే ప్రేయసి మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లోతో పెళ్ళైంది. అయితే ఈ అప్డేట్ చూసిన కొందరు అభిమానులు నదాల్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడనుకుని పొరబడి, అతనికి శభాకాంక్షలు తెలిపారు. కాగా, నదాల్ పొరపాటున ఫేస్బుక్లో రిలేషన్షిప్ స్టేటస్‌ను అప్డేట్ చేయడంతో అది కాస్తా అతను ఆదివారమే పెళ్లి చేసుకున్నట్లుగా చూపించింది. ఇదిలా ఉంటే ఈ స్పెయిన్ బుల్ ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఈ రౌండ్లో అతను ఇటలీకి చెందిన 19 ఏళ్ల జన్నిక్ సిన్నర్‌తో తలపడనున్నాడు. కాగా, రఫా ప్రస్తుతానికి 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్లు సాధించి స్విస్ యోధుడు రోజర్ ఫెదరర్‌తో(20) సమానంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే నదాల్‌కు మట్టి కోర్టుపై తిరుగులేని రికార్డు ఉంది. అతను 2005లో అరంగేట్రం చేసిన నాటి నుంచి కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయి 103 విజయాలు సాధించాడు. చదవండి: శ్రీలంకలో టీ20 ప్రపంచకప్..? -
ఫేస్‘బుక్’ నకిలీ ఖాతాలతో జర జాగ్రత్త!
ఒకవైపు ప్రజలంతా కోవిడ్–19 మహమ్మారి భయంతో విలవిల్లాడుతున్న సమయంలోనే ఫేస్బుక్లో డబ్బులు అడిగే దందా మొదలైంది. ఇతరుల ఫేస్బుక్ పేజీల్లోని కవర్ ఫొటోలను నకలు చేసి అవే పేర్లతో కొత్త అకౌంట్లు సృష్టించడం, కాంటాక్ట్స్ జాబితాలో ఉన్న వారందరికీ డబ్బు అడుగుతూ పోస్టులు పెట్టడం. లేదా మెసెంజర్లో మెసేజ్‌లు పంపడం. ఇదీ ఈ సరికొత్త మోసం తీరూ తెన్ను. మన పేరుతో వేరే ఎవరో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బు అడుగుతున్నారని తెలిస్తే సరేసరి.. బంధు మిత్రులను హెచ్చరించి వారికి నష్టం కలగకుండా నివారించవచ్చు. తెలియకపోతేనే వస్తుంది సమస్య. అమాయకులు తమ డబ్బులు మోసగాళ్లకు సమర్పించుకోవాల్సి వస్తుంది.(చదవండి: వన్‌ప్లస్ ప్రియులకి గుడ్ న్యూస్) కరోనా సోకింది.. డబ్బులు కావాలి నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు సృష్టించి డబ్బులడిగే వారు.. అన్ని రకాల మార్గాల్లో ఇతరుల నుంచి డబ్బు గుంజేందుకు ప్రయత్నిస్తుంటారు. కోవిడ్–19 బారిన పడ్డామని, ఆసుపత్రిలో చికిత్సకు డబ్బులు కావాలనే కథలు అల్లేవాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ కారణాలతో బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయమని చెప్పేవాళ్లు కొందరైతే.. ఈ వ్యాలెట్లోకి బదిలీ చేసినా చాలనే వాళ్లు ఇంకొందరు. రాజస్థాన్, బిహార్, కేరళ, ముంబైలతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పేర్లు, హోదాలతో ఫేక్ అకౌంట్లు సృష్టించారంటేనే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో మిత్రులు ఫోన్ చేసి అంతా బాగేనా? డబ్బులు అడిగావేంటి? డబ్బులు పంపించా..చూసుకున్నావా? అని అడిగినప్పుడే మన పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ అయ్యిందన్న విషయం తెలుస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఆన్లైన్ లోనే మోసకారితో జరిపే సంభాషణ వాళ్లను పట్టిస్తోంది. మన భాషలో స్పందించక పోవడం... వచ్చీరాని ఇంగ్లిష్‌లో చాటింగ్ చేయడం అవతలి వ్యక్తి మోసగాడని గుర్తించేందుకు గట్టి నిదర్శనం.(చదవండి: ఇండియాలో 5జీ ఎప్పుడు రానుంది?) మన నిర్లక్ష్యమే కారణమా? ఫేక్ అకౌంట్లు తయారయ్యేందుకు ఒక రకంగా మనమే కారణమని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అకౌంట్లో మనం వాడే ఫొటోలు, పంచుకునే పోస్టులను బహిరంగంగా ఉంచడం వల్ల, వాటిని ఎవరైనా వాడుకునే అవకాశం కల్పించడం వల్ల ఇలా జరుగుతోందని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మన ప్రొఫైల్ వివరాలను చూడకుండా చేసేందుకు ఫేస్బుక్ కల్పించిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాల్సి ఉందని వారు సూచిస్తున్నారు. ఫేక్ ఖాతాను ఇలా గుర్తించొచ్చు ఫేక్ అకౌంట్లను సులువుగా గుర్తించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. స్నేహితుల సంఖ్య, సామాన్య మిత్రుల సంఖ్య ఫేక్ అకౌంట్ల గుర్తింపునకు ఒక మేలైన మార్గం. ఫేక్ అకౌంట్లలో సాధారణంగా మిత్రుల సంఖ్య తక్కువగా ఉంటుంది. నకిలీ ఫేస్బుక్ అకౌంట్లోని ప్రొఫైల్ పేరును ఫేస్బుక్లో వెతికితే అది అసలైందో కాదో ఇట్టే తెలిసిపోతుంది. ప్రొఫైల్‌లో పొందుపరిచిన సమాచారం కూడా దొంగ అకౌంట్లను పట్టిస్తుంది.(చదవండి: మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?) ఇలా చేసి ఖాతా క్లోజ్ చేయమనండి మీ పేరు, వివరాలతో ఎవరైనా ఫేస్బుక్ అకౌంట్లు సృష్టించారని తెలిస్తే.. వెంటనే ఇలా చేయండి. ఆ ఫేక్ అకౌంట్ ప్రొఫైల్‌ను లేదా పేజీని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే కవర్ ఫొటో దిగువన మెసేజ్ అన్న నీలిరంగు బాక్స్‌కు పక్కన మూడు చుక్కలతో ఇంకో బాక్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే... ‘‘సీ ఫ్రెండ్షిప్, ఫైండ్ సపోర్ట్ లేదా రిపోర్ట్ ప్రొఫైల్, బ్లాక్, సెర్చ్ ప్రొఫైల్’’ అన్న నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. ఫైండ్ సపోర్ట్ లేదా రిపోర్ట్ అన్న ఆప్షన్ ను క్లిక్ చేస్తే.. అందులో ప్రిటెండింగ్ టు బి సమ్‌వన్, ఫేక్ అకౌంట్, ఫేక్ నేమ్ వంటి అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. ఇం కొకరి మాదిరి నటిస్తున్నాడు అన్న తొలి ఆప్షన్ ను క్లిక్ చేసి అకౌంట్‌ను మూసి వేయమని ఫేస్‌బుక్‌ను కోరవచ్చు. -
ఎఫ్బీ పోస్టులతో జాబ్‌కు ఎసరు..
వాషింగ్టన్ : ఫేస్బుక్ ప్రొఫైల్‌లో వివాదాస్పద అంశాలపై మీ అభిప్రాయాలను వెల్లడించే పోస్ట్‌లు ఉంటే మీకు ఉద్యోగం లభించే అవకాశం సన్నగిల్లినట్టేనని తాజా అథ్యయనం తేల్చిచెప్పింది. సోషల్ మీడియా పోస్టుల్లో మితిమీరి తలదూర్చడం, నిర్థిష్ట అభిప్రాయాలను కలిగి ఉండే అభ్యర్ధులను రిక్రూటర్లు ఎంపిక చేసుకునే అవకాశాలు తక్కువని అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. డ్రగ్స్, ఆల్కహాల్‌ను ప్రోత్సహించే కంటెంట్‌ను పోస్ట్ చేసే వారిని కూడా తమ ఉద్యోగులుగా రిక్రూటర్లు నియమించుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సెలెక్షన్ అండ్ అసెస్మెంట్లో ప్రచురితమైన ఈ అథ్యయనం గుర్తించింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయని, తమ గురించి మిగిలిన ప్రపంచానికి తెలియచేస్తాయనే భావన ఉన్నా తమ వ్యక్తిగత ఆసక్తులు, ప్రతిభపై అమితాసక్తిని కనబరిచే వారు ఇతర ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాల కోసం త్యాగం చేసే స్వభావం తక్కువగా కలిగి ఉంటారని హైరింగ్ మేనేజర్లు అభిప్రాయపడుతున్నారని పరిశోధకులు వెల్లడించారు. ఇక వివాదాస్పద అంశాలపై భిన్న ఉద్దేశాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు సహకార ధోరణితో సర్ధుకుపోయే స్వభావం కలిగిఉండరని, వాదన ధోరణిని కలిగిఉంటారనే అభిప్రాయం రిక్రూటర్లలో నెలకొందని విశ్లేషించారు. ఇక మద్యం, డ్రగ్ వాడకంపై పోస్ట్‌లు చేసేవారు ఒక ఉద్యోగంలో కుదురుగా ఉండరని రిక్రూటర్లు భావిస్తున్నారని పరిశోధకులు తెలిపారు. చదవండి : నువ్వే నా సర్వస్వం - ఫేస్బుక్ సీవోవో -
ఫేస్బుక్లో నేమ్‌టెక్ట్స్ చేశారా, ఇక అంతే!
ఇటీవల ఫేస్బుక్లో బాగా పాపులర్ అవుతున్న నేమ్‌టెక్ట్స్ గురించి తెలిసే ఉంటుంది. మీరు ఏ డిస్ని రాణి? మీరు ఎలాంటి అమ్మాయిలా కనిపిస్తున్నారు? అనుకుంటూ పలు పాపులర్ సోషల్ క్విజ్‌లను నేమ్‌టెక్ట్స్ అనే యాప్ నిర్వహిస్తూ ఉంటుంది. ఫేస్‌బుల్ చక్కర్లు కొడుతున్న ఈ యాప్‌ను, ప్రతి ఒక్కరూ ఏదో ఒక్కసారి ఓపెన్ చేసిన క్విజ్ ఆడి ఉంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరమట. ఈ నేమ్‌టెక్ట్స్ యాప్ 12 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల డేటా బట్టబయలు చేసిందని ఓ రీసెర్చర్ వెల్లడించారు. క్విజ్‌ల ద్వారా ఫేస్బుక్ యూజర్ పేరు, ప్రాంతం, పుట్టిన తేదీ, వయసు, ఫేస్బుక్ ఐడీ, ప్రొపైల్ ఫోటోలు, భాష, స్నేహితుల జాబితా వంటి వ్యక్తిగత వివరాలను ఇది సేకరిస్తుందని తెలిసింది. ఈ విషయాన్ని సెక్యురిటీ రీసెర్చర్ ఇంటి దే స్యూకెలైర్ తన బ్లాగ్‌లో వెల్లడించారు. ఇలా గత కొన్నేళ్లుగా మిలియన్ల కొద్దీ యూజర్ల డేటాను నేమ్‌టెక్ట్స్ సేకరించిందని తెలిపారు. ఫేస్బుక్ బగ్ బౌంటీ ప్రొగ్రామ్లోపాల్గొనాలని నిర్ణయించుకున్న ఈ రీసెర్చర్, క్విజ్‌లపై పరిశోధన చేపట్టారు. ఆ సమయంలో నేమ్‌టెక్ట్స్.కామ్ గ్లోబల్‌గా 12 కోట్ల మంది యూజర్ల డేటాను బహిర్గతం చేస్తుందని తెలుసుకున్నారు. ఫేస్బుక్ యూజర్ల డేటాను దాని పేజీలో డిస్ప్లే చేస్తుందని కనుగొన్నారు. అంతేకాక, ప్రమాదశాత్తు ఈ డేటా అన్ని థర్డ్ పార్టీలకు అందుబాటులో ఉందన్నారు. ఒకవేళ ఈ యాప్‌ను యూజర్లు డిలీట్ చేసినా కూడా యూజర్ల గుర్తింపునూ ఇది బహిర్గతం చేస్తుందని వెల్లడించారు. దీని బారి నుంచి బయటపడటానికి, యూజర్ తమ డివైజ్‌పై ఉన్న కుక్కీలను మాన్యువల్‌గా డిలీట్ చేయాల్సి ఉంటుందని రీసెర్చర్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ఫేస్బుక్లో ఈ లోపాన్ని కనుగొన్న రీసెర్చర్, ఫేస్బుక్ డేటా అబ్యూజ్ ప్రొగ్రామ్‌కు రిపోర్టు చేశారు. ఈ లోపాన్ని పరిష్కరించాలని నేమ్టెక్ట్స్కు కూడా లేఖ రాశారు. ఫేస్బుక్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. నేమ్‌టెక్ట్స్.కామ్‌తో కలిసి ఈ సమస్యను పరిష్కరించడానికి పనిచేశామని, జూన్‌లోనే ఇది పరిష్కారమైందని ఫేస్బుక్ ప్రొడక్ట్ పార్టనర్షిప్ వైస్ ప్రెసిడెంట్ ఇమ్ ఆర్చిబాంగ్ తెలిపారు. -
ప్రాంక్ మిస్ ఫైర్.. షాకింగ్ వీడియో
ఫ్రెండ్‌తో చేసిన ప్రాంక్ చర్య ఓ విద్యార్థినికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఒకవేళ ఆమె దోషిగా తేలితే ఏడాదిపాటు జైలుశిక్ష పడే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు తాజాగా విడుదల చేశారు. అయితే ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలిలా.. పోలాండ్లోని జెకోవీస్-డెడ్జీస్లో ఓ రోడ్డు కూడలిలో ఇద్దరు స్నేహితులు వెళ్తున్నారు. సరదాగా తన స్నేహితురాలు (17)ని ఆట పట్టించాలని ఓ విద్యార్థిని అనుకుంది. అనుకున్నదే తడవుగా తమ పక్క నుంచి బస్సు వెళ్తుండగా.. తన ఫ్రెండ్‌ను భుజంతో నెట్టింది. ఇక అంతే బ్యాలెన్స్ తప్పిన యువతి కింద పడిపోయింది. బస్సు చక్రం తనపై నుంచి వెళ్తుందని భయం చెందినా క్షణాల్లో పక్కకు జరగడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. వెంటనే సారీ చెబుతూ తన స్నేహితురాలిని హగ్ చేసుకుంది. ఏప్రిల్ 12న జరిగిన ఈ ఘటనకు సంబధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు ఫేస్బుక్లో పోస్ట్ చేయగా హల్చల్ చేస్తోంది. -
ప్రాంక్ మిస్ ఫైర్.. వైరల్!
-
మీ ఫేస్బుక్లో వీటిని తొలగించడం మంచిది
సాక్షి, హైదరాబాద్ : మన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగల అవకాశం ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ అగ్రగామి. గత కొన్ని రోజులుగా ఫేస్బుక్ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థకు చేరుతున్నాయన్న విషయం అందరికి తెలిసిందే. మిలియన్ల కొద్ది ఖాతాలు చోరికి గురయ్యాయి అని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తప్పును ఒప్పుకున్నారు. అయితే ఇలాంటి డాటా హ్యాకింగ్స్ నుంచి మీ ఖాతాను రక్షించుకోడానికి, ఒకవేళ ఖాతా హ్యాకింగ్‌కి గురి అయిన ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి ముఖ్యమైన ఈ 10 అంశాలను ఫేసుబుక్‌లో ఉంచకపోవడం మేలు. ఒకవేళ ఉంటే వాటిని వెంటనే తొలగించడం ఉత్తమం. అవి, 1. పుట్టిన తేది: ఇది మీకు కేవలం ఒక తేదినే కావచ్చు కానీ హ్యాకర్లు వీటి ద్వారా మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో బ్యాంక్ అకౌంట్ వివరాలు చోరి కావచ్చు. 2. ఫోన్ నంబర్ 3. మీ సన్నిహితులను ఫ్రెండ్స్ లిస్టులో ఉంచకపోవడం, హైడ్‌లో పెట్టడం. 4. మీ కుటుంబ సభ్యుల ఫొటోలు, ముఖ్యంగా పిల్లల ఫొటోలు. 5. మీ పిల్లలు చదువుతున్న పాఠశాల వివరాలు. 6. లోకేషన్ (మీరు ఉన్న ప్రదేశం) 7. మీ లోకేషన్‌ను ట్యాగ్ చేయకపోవడం ఉత్తమం. 8. ఫలనా చోటుకి వెళ్తున్నాం అని పోస్టులు చేయకండి. 9. క్రెడిట్ కార్డ్ వివరాలు. 10. బోర్డింగ్ పాస్‌కు సంబంధించిన వివరాలు -
కేంబ్రిడ్జ్ స్కాండల్ : ఫేస్బుక్ యూజర్లకు నోటీసులు
న్యూఢిల్లీ : కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్‌లో మీ ఫేస్బుక్ డేటా చోరికి గురైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సిద్ధంగా ఉండండి. నేటి నుంచే కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్‌లో ప్రభావితమైన 8.7 కోట్ల మంది యూజర్లలో ఎవరెవరో ఉన్నారో ఫేస్బుక్ తెలియజేస్తుందట. యూజర్ల న్యూస్ ఫీడ్స్‌లో ఈ విషయాన్ని ఫేస్బుక్ తెలియజేస్తుందని తెలిసింది. ఈ స్కాండల్‌లో ప్రభావితమైన యూజర్లలో ఎక్కువ మంది(7 కోట్ల మంది) అమెరికన్లే ఉన్నట్టు ఫేస్బుక్ ఒప్పుకుంది. మిగతా యూజర్లు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, యూకే యూజర్లున్నారని కూడా తెలిపింది. అంతేకాకుండా 5 లక్షల మంది భారతీయుల డేటాను కూడా భారత్‌లో ఎన్నికల సమయంలో, కేంబ్రిడ్జ్ అనలిటికాకు చెందిన సంస్థకు షేర్ చేశామని ఫేస్బుక్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభావితమైన యూజర్లకు ఫేస్బుక్ నోటీసులు పంపబోతోంది. దీంతో పాటు మిగతా 2.2 బిలియన్ యూజర్లకు కూడా ‘ప్రొటెక్టింగ్ యువర్ ఇన్ఫర్మేషన్’ పేరుతో మరో నోటీసులు జారీచేయనుంది. దీంతో పాటు ఓ లింక్‌ను కూడా పంపిస్తుంది. ఆ లింక్‌లో కొన్ని యాప్‌ల వివరాలు వాటికి ఎలాంటి సమాచారం ఇవ్వాలి.. ఎలాంటి సమాచారం ఇవ్వకూడదు అనే వివరాలు ఉంటాయని తెలుస్తోంది. కేంబ్రిడ్జ్ స్కాండల్‌తో చరిత్రలోనే అతిపెద్ద గోప్యత సంక్షోభంలో ఫేస్బుక్ కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ట్రంప్‌కు చెందిన ఈ డేటా మైనింగ్ సంస్థతో ఫేస్బుక్ యూజర్ల డేటాను పంచుకుంది. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఫేస్బుక్ డేటాను భారీ మొత్తంలో ఈ సంస్థ వాడుకుంది. దీంతో ఫేస్‌బుక్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలా ఎలా ఫేస్బుక్ డేటాను యూజర్ల అనుమతి లేకుండా షేర్ చేశారని యూజర్లు, టెక్ వర్గాలు మండిపడుతున్నాయి. తాము అతిపెద్ద తప్పు చేశామని కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఒప్పుకున్నారు. ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు, భవిష్యత్తులో యూజర్ల గోప్యత విషయంలో వాగ్దానాలు చేసేందుకు అమెరికన్ కాంగ్రెస్ ముందుకు కూడా రాబోతున్నారు. ఈ సమయంలో మార్క్ జుకర్‌బర్గ్ కఠిన ప్రశ్నలనే ఎదుర్కోబోతున్నారని తెలిసింది. -
దాని బారిన భారత ఎఫ్బీ యూజర్లు
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్ల డేటాను ఫేస్బుక్, బ్రిటీష్ పొలిటికల్ కన్సల్టెన్సీ కేంబ్రిడ్జ్ అనలిటికాతో అక్రమంగా షేర్ చేసిందని వివాదం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. యూజర్ల డేటా షేరింగ్‌పై ఫేస్బుక్ కూడా తన తప్పును ఒప్పుకుంది. తాజాగా ఫేస్బుక్ విడుదల చేసిన గణాంకాల్లో భారతీయుల డేటా కూడా బయటపడింది. 5 లక్షల మంది భారతీయుల యూజర్ల డేటాను కూడా కేంబ్రిడ్జ్ అనలటికాతో షేర్ చేసినట్టు ఫేస్బుక్ బుధవారం ప్రకటించింది. అంతేకాక ఫేస్బుక్ షేర్ చేసిన యూజర్ల డేటా సంఖ్య కూడా పెరిగింది. అంతకముందు 5 కోట్ల మంది డేటా మాత్రమే కేంబ్రిడ్జ్ అనలిటికాతో ఫేస్బుక్ షేర్ చేసిందని అంచనాలు వెలువడితే, ప్రస్తుతం 8.7 కోట్ల మంది యూజర్ల డేటా బట్టబయలు అయినట్టు తెలిసింది. యూజర్ల అనుమతి లేకుండా.. ఫేస్బుక్ నుంచి కేంబ్రిడ్జ్ అనలిటికా ఈ డేటాను అక్రమంగా పొంది, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో, బ్రెగ్జిట్ ప్రచారంలో రాజకీయ నాయకుల లబ్ది కోసం వాడిందనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా వివాదం సృష్టిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో మొత్తం 8.7 కోట్ల మంది యూజర్ల ఫేస్బుక్ డేటాను అక్రమంగా కేంబ్రిడ్జ్ అనలిటికాతో షేర్ అయినట్టు నమ్ముతున్నామని ఫేస్బుక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మైక్ ష్రోఫెర్ అన్నారు. దీనిలో ఎక్కువగా అమెరికన్ల డేటానే ఉన్నట్టు తెలిపారు. అంతేకాక భారత రాజకీయ ప్రచారాల్లో కూడా కేంబ్రిడ్జ్ అనలిటికాతో పలు పార్టీల కోసం ఫేస్బుక్ డేటాను వాడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రిస్టోఫర్ వైలీ, విజిల్బ్లోయర్లు కూడా దీనిపై ట్వీట్లు కూడా చేశారు. ఈ ఆరోపణలు కూడా రుజువయ్యాయి. దాదాపు 5 లక్షల మంది భారతీయుల డేటాను కూడా తాము కేంబ్రిడ్జ్ అనలిటికాకు షేర్ చేసినట్టు ఫేస్బుక్ ప్రకటించింది. ఈ సంస్థ పేరెంట్ కంపెనీ, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ 2003, 2012 కాలాల్లో జరిగిన ఆరు రాష్ట్ర ఎన్నికలు, 2009 సాధారణ ఎన్నికల్లో పలు పార్టీల కోసం ఈ డేటాను వాడిందని తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూలు కేంబ్రిడ్జ్ అనలిటికాకు ప్రధాన క్లయింట్లుగా తెలుస్తోంది. మరోవైపు భారత ఎన్నికల ప్రక్రియను ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా కంపెనీలు ప్రభావితం చేయాలని చూస్తే, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ హెచ్చరించారు. ఒకవేళ అవసరమైతే, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు సమన్లు కూడా జారీచేస్తామన్నారు. -
జుకర్ బర్గ్‌ను భారత్‌కు రప్పిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ : కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ) సేవలను ఉపయోగించుకున్నట్లు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు బుధవారం పరస్పరం పార్లమెంట్లో ఆరోపణలు చేసుకున్నాయి. ఫేస్బుక్ నుంచి సేకరించిన అమెరికా ఓటర్ల డేటాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ ఉపయోగించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఈ సందర్భంలోనే మన కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ జోక్యం చేసుకొని ఫేస్బుక్ ప్రొఫైల్‌ను భారత్‌లో అనుమతిస్తామని, అయితే ఇలా ఖాతాదారుల డేటాను ఇతరులకు అందజేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అవసరమైతే ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను భారత్‌కు రప్పిస్తామని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి ఉత్తుత్తి బెదిరింపులను మనం తాటాకు చప్పుళ్లు చేయడం అని చెప్పవచ్చు. దేశంలో తగినన్ని క్రిమినల్ చట్టాలు ఉన్నప్పటికీ విదేశాలకు పారిపోయిన నేరస్థులు నీరవ్ మోదీ, లలిత్ మోదీలను భారత్‌కు రప్పించలేక పోతున్నాం. ఇక భారతీయుల డేటా పరిరక్షిణకు దేశంలో తగిన చట్టాలే లేనప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ లాంటి వారిని భారత్‌కు రప్పిస్తామంటూ హెచ్చరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి! పైగా ఇదే మంత్రిగారి ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు ఇటీవల ‘ప్రైవసీ’ ప్రాథమిక హక్కు కాదని వాదించింది. కేవలం ఐదు వందల రూపాయలకు ఆధార్ కార్డు వివరాలు ఎవరికైనా అందుబాటులో ఉండే ఈ దేశంలో పౌరుల వ్యక్తిగత వివరాలకు భద్రత ఎంతో ఊహించవచ్చు! కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన ఒకే ఒక ఐటీ సమాచార చట్టం కింద పౌరుల వ్యక్తిగత డేటాకు భద్రతను కల్పిస్తోంది. ఇది కూడా కొన్ని అంశాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఫేస్బుక్ వ్యక్తం చేసే అభిప్రాయలలాంటివాటికి భద్రత ఉండదు. ఈ చట్టం కింద భద్రంగా ఉంచాల్సిన అంశాలు 1. పాస్వర్డ్ 2. ఆర్థిక సమాచారం అంటే, బ్యాంక్ ఖాతాల వివరాలు, ఆర్థిక చెల్లింపు సాధనాలు 3. ఆరోగ్య పరిస్థితి 4. వైద్య రికార్డులు, హిస్టరీ 5.లైంగిక దక్పథం. 6. బయోమెట్రిక్ సమాచారం. ఈ ఆరు అంశాలకు తగిన భద్రత కల్పించాలని, అందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉందిగానీ ఈ అంశాలను తస్కరించిన వారికి, అందుకు సహకరించిన వారికి ఎలాంటి శిక్షలు విధించాలో లేదు. బిహార్ ఎన్నికల్లో ఓటర్ల నాడిని పట్టుకునేందుకు ఇదే కేంబ్రిడ్జి సంస్థ, ఫేస్బుక్లో భారతీయుల వివరాల డేటాను ఉపయోగించుకుంది. అలాంటప్పుడు ఈ 2000–ఐటీ చట్టం కింద భారత ప్రభుత్వం జూకర్ బర్గ్‌ను భారత్‌కు రప్పించగలదా? అన్నది కోటి రూకల ప్రశ్న. -
ఫేస్బుక్ సీఈవోకు సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ యూజర్ల డేటాను దొంగలించిన కేంబ్రిడ్జ్ అనలిటికాతో, కాంగ్రెస్‌కు కూడా లింక్ లున్నట్టు బీజేపీ ఆరోపిస్తోంది. ఒకవేళ అవసరమైతే, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌పై తాము కఠిన చర్యలు తీసుకోవడానికైనా సిద్ధమేనని బీజేపీ అధికార ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డేటా చోరీని కాంగ్రెస్ పార్టీ తన ప్రయోజనాల కోసం వాడుకుందని, ఎన్నికల్లో గెలువడానికి డేటాను తారుమారు చేసిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియా మేనేజ్మెంట్లో ఆ డేటా సంస్థ పాత్రను రవి శంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఫేస్బుక్ యూజర్ల డేటాను దొంగతనం చేయడం, తారుమారు చేయడం వంటి వాటికి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతోదా? అని అన్నారు. కేంబ్రిడ్జ్ అనలిటికాతో దేశీయ సిటిజన్ల ప్రైవేట్ డేటాను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిందని ఆయన ఆరోపించారు. 2014 నుంచి ఫేస్బుక్ యూజర్ల ప్రైవేట్ డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా చోరి చేస్తుందని పలు న్యూస్ రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంబ్రిడ్జ్ అనలిటాకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధాలున్నాయని ప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఇది భారత్‌లో ఉచిత, న్యాయపరమైన ఎన్నికలకు సంబంధించి పలు అనుమానాలకు తావిస్తుందని, దేశీయ ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయన్నారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధినేత రమ్య కొట్టిపారేశారు. కేంబ్రిడ్జ్ అనలిటికాతో కాంగ్రెస్‌కు లింక్ ఉన్నాయనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆమె ట్వీట్ చేశారు. కాగా, 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఫేస్బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా చోరీ చేసినట్టు అమెరికా, బ్రిటన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం పనిచేసిన ఈ కన్సల్టెన్సీకి ఫేస్బుక్ వినియోగదారుల వివరాలు ఎలా లభించాయన్న అంశంపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా అమెరికా, ఐరోపా విచారణ సంస్థలు ఆదేశాలు జారీచేశాయి. -
ఒక భర్త సరిపోడా.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్ : పెళ్లి అయిన తర్వాత వేరే అబ్బాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అమ్మాయిలను చూసి సిగ్గుపడుతున్నా అంటూ ఓ తెలుగమ్మాయి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. యువతి వీడియోలో ఏం చెప్పిందంటే.. 'పెళ్లి అయి భర్త ఉన్నా, వేరే అబ్బాయిలతో సంబంధం పెట్టుకుని భర్తను చంపుతున్న ఆడవాళ్లను ఇటీవలి కాలంలో మనం చాలా చూస్తున్నాం. నాకొచ్చిన కొన్ని ఆలోచనలు మీకు చెబుతున్నా, నా మాట తీరు బాగాలేక పోతే క్షమించండి. పెళ్లి కాని వాళ్లు ఇలా మాట్లాడాలో లేదో కూడా తెలియదు. కాని పరిస్థితులు డిమాండ్ చేయడంతో మాట్లాడుతున్నా, తప్పదు ఎవరో ఒకరు ఇలా మాట్లాడాలి. లేకపోతే మిగతా ఆడవాళ్లకు కూడా చెడ్డ పేరు వస్తోంది. పెళ్లి అయిపోయి పక్కదారి పడుతున్న ఆడవాళ్లు భర్త ఉండగా మరో అబ్బాయితో సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది. నాకొచ్చిన డౌటే అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కదా' అని వివాహేతర సంబంధం పెట్టుకున్నవారిపై నిప్పులు చెరిగారు. ఒక భర్త సరిపోడా.. ఎంత మంది కావాలి.. భర్తలను మోసం చేస్తున్న ఆడవాళ్లను మాత్రమే అడుగుతున్నా. మీకు ఒక భర్త సరిపోడా. ఎంత మంది కావాలి. గత మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో 10 మంది భర్తలను చంపేశారు. జీవితాంతం కలిసి ఉంటానని ప్రామిస్ చేసిన భర్తని బాయ్ ఫ్రెండ్‌తో కలిసి చంపేస్తున్నారు. మీలాంటి ఆడవాళ్ల వల్ల మిగతా ఆడవాళ్లకు చెడ్డ పేరు వస్తోంది. ఎవరో బయట వ్యక్తితో సంబంధం పెట్టుకుని భర్తను చంపేయాలనే ఆలోచన వచ్చినప్పుడు కొద్దిసేపు ఆలోచించండి. మీరు చేసేది తప్పా, ఒప్పా అని. ఎవరి కోసమో భర్తను చంపి. ప్రేమించిన వాడితో వెళ్లిపోవాలని ఆలోచనకు వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. భర్తను చంపి ప్రేమించినవాడితోనైనా సంతోషంగా ఉంటారా. భర్తను చంపితే జైలుకు వెళతారు. మీ ఫ్యామిలీకి, నీకు చెడ్డపేరు వస్తుంది. పాడు పని చేసినందుకు తల ఎత్తుకు తిరుగగలవా? మన దేశంలో ఆడవాళ్లకు ఎంతో విలువుంది. ఆ విలువ మీలాంటి వారి వల్ల పోతోంది. భర్తను మోసం చేయడం తప్పుకాదా.. మీ కోరికలను తీర్చుకోవడం కోసం. ఇలాంటి పని చేస్తారా. ప్రేమించిన వాడి కోసం భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని బయటకు వెళ్లి చచ్చిపోయిన వాళ్లను చాలామందిని చూశా. మీ భర్తను చంపేస్తున్నావు. నువ్వు జైలుకెళ్లి కూర్చుంటున్నావు. మరి నీ పిల్లల పరిస్థితి ఏంటి. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత నాన్నను ఎందుకు చంపేశావు అమ్మ అని అడిగితే పిల్లలకు ఏం సమాధానం చెబుతారు. ఈ రోజుల్లో తల్లి అనే పదానికి అర్థం లేకుండా పోతోంది మీలాంటి వారి వల్ల. ఇటీవల ప్రేమికుడితో అసభ్యంగా ఉన్న వీడియోలను భర్తకు పంపించి, ఆయన మరణానికి కారణం అయింది ఓ యువతి. భర్త ఇష్టం లేకపోతే ఎటైనా వెళ్లిపోండి. శరీర సుఖాల కోసం ఎదుటి వారితో ఆడుకోవద్దు. పెళ్లి అయిన అబ్బాయిలు కూడా భార్యల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు. కానీ, ఎదుటి వారి జీవితాలతో ఆడుకునేలా ఉండొద్దు. అబ్బాయిలకి కూడా నాదో ప్రశ్న.. పెళ్లి అయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అబ్బాయిలకి కూడా నాదో ప్రశ్న. పెళ్లి చేసుకొని భర్తనే చంపిన ఆమె, నీకంటే మంచోడు దొరికితే నిన్ను కూడా చంపేయదా? ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు జరిగిన వాటి గురించి ఎంత ఆలోచించినా ప్రయేజనం లేదు. ఇకముందు అలాంటి సంఘటనలు జరగకుండా చూద్దాం అంటూ వీడియోలో ఆ యువతి మాట్లాడారు. సంబంధిత వార్త : ప్రియుడితో భార్య పెళ్లి, భర్త ఆత్మహత్య.. వీడియో వైరల్ -
వివాహేతర సంబంధాలపై యువతి ఆగ్రహం
-
కేరళలో దుమారం రేపుతున్న బాలిక వీడియో
-
రాజకీయ దుమారం రేపుతున్న వీడియో
సాక్షి, తిరువనంతపురం : కేరళలో ఓ బాలిక వీడియో సంచలనంగా మారింది. సీపీఎం కార్యకర్తల మూలంగా తన కుటుంబానికి ముప్పు పొంచి ఉందని సదరు బాలిక ఓ వీడియోను రికార్డు చేసి ఫేస్బుక్లో పోస్టు చేసింది. దీంతో రాజకీయంగా ఒక్కసారిగా పెను దుమారం చెలరేగింది. కసరగాడ్ జిల్లాకు చెందిన సుకుమారన్ అనే వ్యక్తి మొన్నటి దాకా సీపీఎంలో కొనసాగారు. అయితే పార్టీలో సముచిత స్థానం దక్కకపోవటంతో ఈ మధ్యే బీజేపీలో చేరిపోయారు. తమకు మంచి పట్టు ఉన్న ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం.. సీపీఎం స్థానిక నేతలకు మంట పుట్టించింది. దీంతో వారు బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో గురువారం తన కూతురును స్కూల్ నుంచి తీసుకొస్తున్న క్రమంలో ఐదుగురు కార్యకర్తలు ఆయన్ని అడ్డగించారు. సుకుమారన్ కుటుంబాన్ని చంపుతామని బెదిరించారు. పోలీసులు కూడా తమనేం చేయలేరని.. ఎవరికీ భయపడే రకం తాము కాదని హెచ్చరించారు. 9వ తరగతి చదువుతున్న ఆయన కూతురు అశ్విని ఫేస్బుక్లో ఓ వీడియోను పోస్టు చేసింది. జరిగిందంతా పూస గుచ్చినట్లు వీడియోలో పేర్కొంది. స్కూల్‌కు వెళ్లాళ్లన్నా తనకు భయంగా ఉందని.. దొడ్డిదారిలో పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని ఆమె వివరించింది. ‘సీపీఎం కార్యకర్తలు నా తండ్రిని చంపేస్తారు.. నా కుటుంబాన్ని రక్షించండి’ అంటూ బాలిక వీడియోలో వేడుకుంది. సీపీఎం స్పందన... అశ్విని చేసిన ఆరోపణలను సీపీఎం నేతలు ఖండిస్తున్నారు. ‘సీపీఎంలో అతనో సాధారణ కార్యకర్తగా వ్యవహరించేవాడు. తర్వాత కాంగ్రెస్‌లో చేరాడు. ఇప్పుడు బీజేపీలో చేరాడు. అంత చిన్న స్థాయి వ్యక్తిని బెదిరించాల్సిన అవసరం మాకు ఏంటి?. పబ్లిసిటీ కోసమే అతను ఇలాంటి పనులు చేస్తున్నాడు’ అని సీపీఎం కార్యదర్శి టీకే రవి వెల్లడించారు. ఇక బీజేపీ నేతలు మాత్రం సుకుమారన్ బలమైన నేత అనే చెబుతోంది. తక్షణమే అతని కుటుంబానికి రక్షణ కల్పించి.. బెదిరింపుల వెనుక ఉంది ఎవరో కనిపెట్టాలని బీజేపీ ధర్నా చేపట్టింది. సుకుమారన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతున్న క్రమంలో విషయం ముఖ్యమంత్రి పినరయి విజయన్ దాకా వెళ్లింది. దీంతో ఘటనపై ఆయన డీజీపీ నుంచి నివేదికను కోరారు. -
ఫేస్బుక్లో ఎక్కువసేపు గడుపుతున్నారా?
బెర్లిన్: డబ్బుకు ఎక్కువగా విలువ ఇచ్చేవారు ఫేస్బుక్లో ఎక్కువసేపు గడుపుతున్నట్లు శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. స్వార్థప్రయోజనాల కోసం ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకోవాలనుకోడమే ఇందుకు కారణమని జర్మనీలోని ర్హుర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఫిలిప్ ఒజిమెక్ తెలిపారు. ఆన్లైన్లోని స్నేహితులను వీరు డిజిటల్ వస్తువులుగా భావిస్తున్నారట. ఇటువంటివారు తమ లక్ష్యాలను చేరుకునేందుకు, ఇతరులతో పోల్చుకుంటూ తమగురించి తాము తెలుసుకునేందుకు విరివిగా ఫేస్బుక్ వినియోస్తున్నారని, తరచుగా వాడడం వెనక ..వారు తమ స్నేహితులను వస్తువులుగా చూడటమేనని ఫిలిప్ అభిప్రాయపడ్డారు. సామాజిక వ్యత్యాసాలను సరిపోల్చుకునేందుకు ఫేస్బుక్ మంచి మాధ్యమమని, లక్షల మంది ప్రొఫైల్స్ ఫేస్బుక్లో ఉండడంవల్ల వారితో తమను సరిపోల్చుకోవడం సులభమే కాకుండా ఖర్చులేని పనిగా భావిస్తున్నందునే ఎక్కువ సమయాన్ని ఫేస్బుక్లో గడుపుతున్నారని ఫిలిప్ చెప్పారు. పరిశోధనలో భాగంగా 242 ఫేస్బుక్ వినియోగదారులను ఆన్లైన్ ద్వారా కొన్ని ప్రశ్నలు అడిగారు. మీరు ఎక్కువగా ఫేస్‌బుక్‌ను దేనితో పోలుస్తారని ప్రశ్నించారు. సామాజిక పోలిక, తత్వం, వస్తువులు, పరికరాలు వంటి పదాలకు రేటింగ్ ఇవ్వాలని అడిగారు. ఎక్కువ మంది వస్తువుగా చూస్తున్నట్లు చెప్పారు. ఫేస్బుక్లో మరో ఫీచర్ న్యూయార్క్: ఫేస్బుక్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో మరో పవర్ఫుల్ ఫీచర్ ఫేస్బుక్లో అందుబాటులోకి రానుంది. ‘వాచ్’(Watch) పేరిట వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌ను ఫేస్బుక్ త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు లైవ్ వీడియోలు, స్పోర్ట్స్, సినిమాలు, టీవీ షోలు వీక్షించవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ అమెరికాలో ఉన్న ఫేస్బుక్ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయనున్నారు. మన దేశంలో ఈ ఏడాది జూలై వరకు ఫేస్బుక్ లెక్కల ప్రకారం ఆ సంస్థ సేవల్ని వాడుతున్న యూజర్లు 24.1 కోట్ల వరకు ఉన్నట్టు అంచనా. అంత భారీ మార్కెట్ ఉన్నందునే ఫేస్బుక్ వీడియో స్ట్రీమింగ్ సేవలను భారత్‌లో కూడా ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నామని ఫేస్బుక్ అధికారిక బ్లాగ్ ద్వారా వెల్లడించింది. యూజర్లకు బాగా నచ్చే అంశాలు కలిగిన వీడియో షోలను స్ట్రీమింగ్ సేవల్లో ఫేస్బుక్ అందిస్తుంది. లైఫ్ స్టైల్, కామెడీ, చిల్డ్రన్స్ ఎంటర్టైన్మెంట్ వంటి విభాగాలకు సంబంధించిన వీడియోలను స్ట్రీమింగ్ సేవల ద్వారా అందించాలనే యోచనలో ఫేస్బుక్ ఉంది. అయితే ఈ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయనేది ఫేస్బుక్ వెల్లడించలేదు. -
కాంట్రవర్సీ ఇష్టం లేదు.. ఎలిమినేట్ అయ్యా!
సాక్షి, న్యూఢిల్లీ : శ్యామ్ రంగీల ప్రముఖ మిమిక్రీ కళాకారుడు. అక్షయ్ కుమార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ది గ్రేట్ ఇండియన్ లాటర్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రాజకీయ నేతలను అనుకరించటం ఇతని ప్రత్యేకత. అయితే అనూహ్యంగా అతన్ని షో నుంచి ఎలిమినేట్ చేస్తూ నిర్ణయం తీసుకోవటం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి తోడు ప్రోగ్రాంలో ఎడిటింగ్‌లో చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో... అసలు విషయం జనాలకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో రంగీల స్పందించాడు. మోదీ-రాహుల్‌లను నేను బాగా ఇమిటేట్ చేస్తాను. అయితే షో నిర్వాహకులు మాత్రం తనను కేవలం రాహుల్‌ను మాత్రమే అనుకరించాలని చెప్పారు. ఆ జోకులు బాగా పేలాయి. కొన్ని రోజుల తర్వాత ఎందుకనో రాహుల్ గొంతును కూడా చెయొద్దంటూ చెప్పారు. ఇలా పొలిటికల్ సెటైర్లు కాకుండా.. కొత్త స్కిట్లతో రావాలని నన్ను సూచించారు. కానీ, నేను ఇచ్చిన ప్రదర్శన వాళ్లకి నచ్చలేదు. అందుకే వాటిని ప్రదర్శించకుండానే.. నన్ను ఎలిమినేట్ చేశారు అని రంగీలా చెప్పాడు. వీడియో ద్వారా వైరల్ కావటం సంతోషంగానే ఉన్నప్పటికీ అది ఎవరు చేశారో తనకు తెలీదని అన్నాడు. వివాదాల్లో ఇరుక్కోవటం ఇష్టం లేకనే తాను మౌనంగా బయటకు వచ్చేశానని చెప్పాడు. మరోవైపు ప్రదర్శన సందర్భంగా రంగీలాను అభినందిస్తూ షో మెంటర్ మాలిక దువా బెల్ మోగిస్తాననటం.. దానికి జడ్జి అక్షయ్ కుమార్ ఆమెతో నీ గంట మోగిస్తానంటూ వ్యాఖ్యలు చేయగా... మాలిక్ తండ్రి, జర్నలిస్ట్ వినోద్ దువా తన ఫేస్బుక్లో ఆ కామెంట్లను పోస్ట్ చేసి, ఆపై డిలేట్ చేశారు. అయితే అప్పటికే అది వైరల్ అయ్యి వివాదాస్పదంగా మారిపోయింది. -
షాకింగ్: అవినీతి వీడియో పోస్ట్‌చేసి.. ఆపై!
-
షాకింగ్: అవినీతి వీడియో పోస్ట్‌చేసి.. ఆపై!
చెన్నై : డిపార్ట్మెంట్లో అవినీతిని తట్టుకోలేక సోషల్ మీడియాలో బయటపెట్టిన ఓ సబ్ ఇన్స్పెక్టర్.. అనూహ్యంగా వీడియో పోస్ట్ చేసిన కొన్ని క్షణాలకే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో తమిళనాడు పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుతం బాధిత ఎస్ఐ శ్రీకాంత్ కోయంబత్తూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. శ్రీకాంత్ జేశ్రీ తమిళనాడు ఫోర్త్ బెటాలియాన్ స్పెషల్ పోలీస్ ఫోర్స్‌లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం కోవైపుధుర్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్. అయితే పోలీస్ శాఖలో అవినీతి తారాస్థాయికి చేరిందని, తాను కూడా బలవంతంగా కొన్ని లంచం ఫైళ్లపై బలవంతంగా సంతకాలు చేయాల్సి వచ్చిందని శ్రీకాంత్ ఫేస్బుక్ వీడియో ద్వారా ఆరోపించాడు. దీంతో ఆయనపై కక్ష్యగట్టిన పై అధికారి తనను 15వ బెటాలియన్‌కు బదిలీ చేయించారని.. అన్ని వివరాలు వీడియో ద్వారా పేర్కొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ వీడియో ప్రకారం.. ‘రాష్ట్ర పోలీస్, రవాణా శాఖలలో అవినీతి రాజ్యమేలుతోంది. ఇటీవల ఓ సీనియర్ అధికారి సుబ్రమణి రూ.15 వేలు లంచం తీసుకునేందుకు నాపై ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా ఓ ఫైలుపై సంతకం చేయించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఫొటోల రూపంలో ఐజీగారికి పంపాను. కానీ నా ఫిర్యాదుపై ఎలాంటి విచారణ మొదలుపెట్టలేదు. పైగా నాపై బదిలీ వేటు వేశారు. నిజాయితీగా ఉండే తాను ఈ అవినీతిని భరించలేనని పేర్కొంటూ’ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. అవినీతికి ప్రోత్సహిస్తూ టార్గెట్లు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన అనంతరం ఆత్మహత్య చేసుకునేందుకు ఏదో మిశ్రమాన్ని తాగాడు. గమనించిన స్థానికులు ఎస్ఐని ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ ఆత్మహత్యాయత్నం ఘటనతో నాలుక్కరుచుకున్న డిపార్ట్మెంట్ కేసు నమోదు చేసి పూర్తి ఘటనపై విచారణ చేపట్టింది. -
వెటకారం కాదు... ఏడ్చేసిన హీరోయిన్
సాక్షి, తిరువనంతపురం : నటి అన్నా రాజన్, మమ్మూటి అభిమానులకు క్షమాపణలు చెప్పేసింది. మాలీవుడ్ మెగాస్టార్ అయిన మమ్మూటీని ఉద్దేశించి ఓ టీవీ షోలో ఆమె వ్యంగ్య కామెంట్లు చేసింది. దీంతో స్టార్ హీరో ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయగా.. కన్నీటితో సారీ చెబుతూ ఫేస్బుక్లో వీడియో సందేశాన్ని అందించింది. మమ్మూటి, ఆయన తనయుడు సల్మాన్ దుల్కర్‌లలో అవకాశం వస్తే ఎవరికి జోడీగా నటిస్తారని ఓ టీవీ షో కార్యక్రమంలో పాల్గొన్న రాజన్‌ను యాంకర్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా దుల్కర్‌తో నటించాల్సి వస్తే అందులో మమ్మూటీ తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు వెటకారంగా మాట్లాడింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమ్మూటీ ఫ్యాన్స్.. ఆమె తండ్రిని సైతం వదలకుండా ఫేస్బుక్, ట్విట్టర్లలో తీవ్ర పోస్టులు పెట్టేశారు. దీంతో దిగొచ్చిన అన్నా ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది. ‘మమ్మూటీ సర్‌ను కించపరిచేలా నేను మాట్లాడలేదు. ఎలాంటి కామెంట్లు చేయలేదు. దుల్కర్‌కు జోడీగా నటించాల్సి వస్తే అందులో మమ్మూటీ.. దుల్కర్‌కు తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు, మమ్మూటీతో కూడా జోడీగా నటించుకుంటున్నట్లు నేను చెప్పాను. కానీ, ఆ ప్రోగ్రాం నిర్వాహకులు టీఆర్పీ కోసం మొదటి సగం వరకే చూపించారు. ఫలితం నాపై తీవ్ర స్థాయిలో పడింది. అంతా ఇష్టం వచ్చినట్లు తిట్టారు. వారిద్దరినీ నేను అవమానించేలా మాట్లాడలేదు. క్షమించండి’ అని వీడియోలో కోరింది. అన్నా రాజన్ అలియాస్ లిచీ.. నటించింది రెండు చిత్రాలే అయినా రెండు కూడా హిట్లు కావటంతో మంచి పేరు సంపాదించుకుంది. తాజా చిత్రం వెలిపండిట్ పుసక్తంలో మోహన్‌లాల్(57 ఏళ్లు) వైఫ్‌గా నటించి మెప్పించింది కూడా. ఈ క్రమంలోనే యాంకర్ లిచీ కన్నా 41 ఏళ్లు పెద్దయిన మమ్మూటీ ప్రస్తావన తేవటం.. అది కాస్త ఇలా వివాదాస్పదం అయ్యిందన్న మాట. -
ఎఫ్బీ ప్రొఫైల్ బాగుంటే లోన్ దొరికినట్టే...
న్యూఢిల్లీ: పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగడం, ఎన్నో పత్రాలు సమర్పించడం వంటి తతంగం ఇక అవసరం లేదు. ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ లిస్ట్‌ను పరిశీలించి మీకు రుణం తిరిగి చెల్లించే స్ధోమతను అంచనా వేసి లోన్ ఇచ్చే సంస్థలు వచ్చేశాయి. ముంబయికి చెందిన స్టార్టప్ సంస్థ ‘క్యాష్ ఈ’ ఈ తరహా లోన్లను అందిస్తున్నది. క్యాష్ఈ ఇప్పటికే రూ 50 కోట్ల నిధులను సమీకరించింది. సోషల్ మీడియా కార్యకలాపాల ద్వారా కస్టమర్ రుణ చరిత్రను ఈ సంస్థ పసిగడుతుంది. సోషల్ మీడియా వేదికలపై కస్టమర్ కదలికల డేటాను సేకరించి ఆ వివరాల ఆధారంగా రుణాలను మంజూరు చేస్తుంది. ఇక సోషల్ మీడియా ఖాతాలతో పాటు కస్టమర్ మొబైల్ డేటా, కాంటాక్ట్స్, యాప్స్ వీటినీ పరిగణనలోకి తీసుకుంటామని క్యాష్ఈ వ్యవస్థాపకులు వి.రమణకుమార్ చెప్పారు. రుణాన్నిమంజూరు చేసే పూర్తిస్థాయి యాప్ ఆధారిత కంపెనీ దేశంలో తమదేనని చెబుతున్నారు. భౌతికంగా పత్రాలను ఎవరూ చెక్ చేయరని, రుణం తీసుకునే వారి సంతకాన్ని ఎవరూ తీసుకోరని మొత్తం ప్రక్రియ అంతా యాప్‌లోనే సాగుతుందన్నారు. ఎలా దరఖాస్తు చేయాలి..? గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ నుంచి క్యాష్ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే కేవలం ఐదు సులభ ప్రక్రియలతో రుణం సొంతం చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్న అనంతరం మీ ఫేస్బుక్, గూగుల్ ప్లస, లింకెడ్ఇన్ వంటి సోషల్ ప్రొఫైల్స్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం మీ అర్హతలకు అనుగుణంగా రుణ మొత్తం ఎంపిక చేసుకుని సంబంధిత పత్రాలు జోడించి దరఖాస్తును నింపాలి. రుణం మంజూరైన వెంటనే మీ బ్యాంక ఖాతాలో జమ అవుతుంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా చెక్ ద్వారా రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. వన్ క్యాపిటల్ అనే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ద్వారా రుణాలను క్యాష్ఈ అందుబాటులోకి తెచ్చింది. -
వికెట్ల వెనుక ధోని కింగ్.. వీడియో వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్యాటింగ్‌తో పాటు.. బెస్ట్ వికెట్ కీపర్‌గానూ జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. కెప్టెన్‌గా చేసిన అనుభవం ఉన్న ధోని, వికెట్ల వెనుక ఉండి బౌలర్లకు సంకేతాలిస్తూ ఎన్నో కీలక సమయాల్లో క్రీజును అంటిపెట్టుకుని నిలబడ్డ దిగ్గజ బ్యాట్స్మెన్లను సైతం తన అద్బుత స్టింపింగ్ నైపుణ్యంతో పెవిలియన్ బాట పట్టించిన ఘటన ధోని సొంతం. అయితే గతేడాది ధోని చేసిన కొన్ని స్టంపింగ్స్‌కు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వేల లైక్స్, షేర్లు, కామెంట్లను వన్డేల్లో 96 స్టంపింగ్స్ చేసిన ధోని, శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర (99) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. మరో నాలుగు స్టంపింగ్స్ తన ఖాతాలో వేసుకుంటే ధోని సంగక్కరను అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తాడు. ఈ వీడియోలో గమనిస్తే.. భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య ఇటీవల జరిగిన రెండో వన్డేలో విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ వికెట్ తీస్తూ చేసిన స్లో మోషన్ స్టింపింగ్ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఛేజ్‌తో కలిసి 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం కుల్దీప్ బౌలింగ్‌లో హోల్డర్‌ను ధోని స్టంప్ ఔట్ చేయడంతో భారత అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ మ్యాచ్‌లో విండిస్‌పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు మూడో వన్డే జరగనుంది. -
వికెట్ల వెనుక ధోని కింగ్.. వీడియో వైరల్
-
మెట్రో రైల్లో వెధవ్వేషాలు.. పట్టేసిన మహిళ!
మెట్రో రైల్లో వెళ్తుండగా వెధవ్వేషాలు వేస్తున్న వ్యక్తిని ఓ మహిళ రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసుకున్నారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదని అనుకున్నట్లు.. ఆ వ్యక్తి రైల్లో తన ఎదురు సీట్లో ఉన్న మహిళను ఫోన్లో వీడియో తీస్తూ.. ఎవరికీ తెలియలేదని అనుకున్నాడు. రైలు మొత్తం ఖాళీగా ఉన్నా, అతడు సరిగ్గా ఆమెకు ఎదురుగా ఉన్న సీట్లోనే కూర్చున్నాడు. తన దగ్గర ఉన్న ఐఫోన్ బయటకు తీసి, దాంట్లో ఏదో చూస్తున్నట్లుగా సీరియస్‌గా స్క్రీన్ వైపు చూస్తూ చాలాసేపు అలాగే ఉన్నాడు. అతడు ఫోన్ పట్టుకున్న తీరు అనుమానాస్పదంగా కనిపించింది. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే, అతడి వెనకాల ఉన్న కిటికీ అద్దం మీద ఆ ఫోన్లో ఏం చేస్తున్నదీ స్పష్టంగా కనిపించింది. అతడు తననే వీడియో తీస్తున్నట్లు ఆమె గుర్తించింది. ఏమీ ఎరగనట్లుగా తాను కూడా ఫోన్ తీసి అతగాడిని షూట్ చేయడం మొదలుపెట్టారు. అతడు తొలుత మామలూగా చూస్తూనే, కాసేపు ఆగి ఫోన్‌ను మరింత జూమ్ చేసి ఆమెను బాగా క్లోజప్‌లో షూట్ చేయసాగాడు. అదంతా వెనకాల కిటికీ అద్దం మీద కనిపిస్తూనే ఉంది. విషయం తెలిసిన సదరు మహిళ ఉమామహేశ్వరి.. తాను తీసిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోను కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 50 లక్షల మంది చూశారు. శనివారం జరిగిన ఈ ఘటన విషయాన్ని ఆమె ఆదివారం నాడు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అంతేకాదు, వీడియో తీసిన తర్వాత.. నువ్వు చేస్తున్న పనేంటి అంటూ అతడితో గొడవపడి, స్టేషన్ వచ్చిన తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. అతడివద్ద ఇలాంటివే చాలా వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు తమ విచారణలో గుర్తించారు. గుర్తుతెలియని మహిళలను అత్యంత అసభ్యకరమైన రీతిలో అతడు వీడియో తీశాడని ఆమె తన పోస్టులో రాశారు. తాను గుర్తుపట్టిన తర్వాత కూడా క్షమాపణలు చెప్పడానికి బదులు రకరకాల కారణాలు చెప్పుకుంటూ వచ్చాడని ఉమా మహేశ్వరి చెప్పారు. తనను అతడు చెల్లెలి లాంటిదని కూడా చెప్పాడని, అలా అయితే ఎందుకు వీడియో తీశాడని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలనే తాను అందరి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నట్లు ఆమె చెప్పారు. -
మెట్రో రైల్లో వెధవ్వేషాలు.. పట్టేసిన మహిళ!
-
కూతురికి ఉరేసి.. ఫేస్బుక్లో వీడియో!
-
కూతురికి ఉరేసి.. ఫేస్బుక్లో వీడియో!
థాయ్‌లాండ్‌లో ఓ వ్యక్తి 11 నెలల వయసున్న కన్న కూతురిని దారుణంగా చంపి.. దానికి సంబంధించిన వీడియోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వీడియోలు దాదాపు ఒక రోజంతా ఫేస్బుక్లో ఉండిపోయాయి. ఆ తర్వాత వాటిని తీసేశారు. ఇలాంటి వీడియోలకు ఫేస్బుక్లో స్థానం లేదని, అందుకే వాటిని తీసేశామని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. వుటిసాన్ వాంగ్టాలే అనే ఆ వ్యక్తి తన చిన్నారి కూతురు నటాలీకి తన చేతులతోనే ఉరి వేసేశాడు. ఆ విషయం అంతటినీ ఫేస్బుక్లో లైవ్ వీడియోలో చూపించాడు. ఆ తర్వాత తాను కూడా ఆ పక్కనే ఉరేసుకున్నాడు. అతడి వీడియో మాత్రం ఫేస్బుక్లో లేదని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి తెలిపారు. భార్య తనను వదిలేయడం, తనను ప్రేమించకపోవడంతో తీవ్రంగా మానసిక వ్యథకు గురయ్యాడని చెప్పారు. తాను అతడితో ఏడాది పాటు కలిసున్నానని, మొదట్లో అంతా బాగానే ఉన్నా తర్వాత అతడు తనకు మాజీ భర్తతో ఉన్న ఐదేళ్ల కొడుకును కొట్టేవాడని వుటిసాన్ భార్య జిరానుచ్ ట్రిరటానా తెలిపింది. నటాలీని ఇంట్లో వదిలి బయటకు వెళ్లిన తర్వాత ఏదో జరిగి ఉంటుందని తాను భయపడ్డానని, అతడికి కూతురంటే ఎంతో ప్రేమ ఉన్నా.. తనమీద కోపంతో ఏదైనా చేస్తాడని అనుమానం వచ్చిందని ఆమె చెప్పింది. అనుకున్నట్లుగానే జరగరాని ఘోరం జరిగిపోయింది. -
ఇకపై టీవీలో ఫేస్బుక్ వీడియోలు!
శాన్ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్‌లోని వీడియోలను నేరుగా టీవీలో వీక్షించేందుకు వీలుగా ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు ఆ సంస్థ బుధవారం వెల్లడించింది. దీని కోసం రూపొందించిన ఓ యాప్ ద్వారా ఆపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, శాంసంగ్ స్మార్ట్ టీవీల్లో నచ్చిన వీడియోలను చూడొచ్చని ఫేస్బుక్ తెలిపింది. గతేడాదే ఈ నూతన ఫీచర్‌ను రూపొందించామని, ప్రస్తుతం దీని సామర్థ్యాన్ని మరింత పెంచామని ఫేస్బుక్ ప్రాడక్ట్ మేనేజర్ దానా సిట్లర్, ఇంజనీరింగ్ మేనేజర్ అలెక్స్ లీ చెప్పారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ యాప్‌తో ఫేస్‌బుక్‌లోని వీడియోలతోపాటు ఇష్టమైన లైవ్ వీడియోలనూ టీవీల్లో వీక్షించవచ్చని తెలిపారు. -
వైరల్ వీడియో: కానిస్టేబుల్ ప్రధానికి ఫిర్యాదు
లక్నో: నిన్నగాన మొన్నసైనికోద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో దుమారం రేపింది. తాజాగా ఉత్తరప్రదేశ్ పోలీసు కానిస్టేబుల్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. తన సీనియర్ అధికారి వేధింపులు, అవినీతిపై ప్రదానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తూ ఫేస్ బుక్ లో ఈ వీడియో పోస్ట్ చేయడం కలకలం రేపింది. ఈటా లోని కానిస్టేబుల్ సర్వేష్ చౌదరి తన సీనియర్ అధికారిక రాజేష్ కృష్ణ పై పలు ఆరోపణలు చేశారు. కేవలం లంచం చెల్లించనందుకే తనపై కక్ష సాధిస్తున్నారంటూ ఈ వీడియోలో ప్రధానికి ఫిర్యాదు చేశారు. తాను ఘజియాబాద్ లో చేరినప్పటి నుంచి ఐదుసార్లు బదిలీ చేసినట్టు తెలిపారు. అలాగే సరైన కారణం లేకుండానే మూడుసార్లు సస్పెండ్ చేశారని వాపోయారు. తాను రూ. 500 లంచం ఇవ్వడానికి నిరాకరించినందు వల్లే తనపై వేటు పడిందని వాపోయారు. సర్వీసులోకి తీసుకున్నప్పటికీ , సస్పెన్షన్ పీరియడ్ ఇంకా జీతం చెల్లించలేదని ఆ వీడియోలో చెప్పారు. అంతేకాదు 24 గంటలూ పనిచేస్తూ, పోలీసుల ఉద్యోగుల్లో 80శాతంమంది అనారోగ్యంతో బాధపడుతున్నారని సర్వేష్ చౌదరి పేర్కొన్నారు. ఇంకా బ్రిటిష్ కాలం నాటి 1861 పోలీసు చట్టం నల్లచట్టంగా అభివర్ణించడంతోపాటు.. ఈ చట్టాన్ని ఇప్పటి అధికారులు తమపై వేధింపులకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి చట్టాలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయని ప్రశ్నించారు. మథురకు చెందిన సర్వేష్ ప్రస్తుతం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఈటా పోలీసుస్టేషన్ లో పనిచేస్తున్నారు. అయితే దీనిపై అదనపు సూపరిండెంట్ అనూప్ కుమార్ విచారణకు ఆదేశించారని ఈటా జిల్లా పోలీసు ఉన్నతాధికారి రాజేష్ కృష్ణ తెలిపారు. సర్వేష్ బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించని కారణంగా జీతం చెల్లింపులో ఆలస్యమైందనీ, 2016అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చెల్లింపులు జరిపినట్టు వివరించారు. -
వైరల్ వీడియో: కానిస్టేబుల్ ప్రధానికి ఫిర్యాదు
-
పెద్దలను‘గే’లి చేశాడు
అనేక మంది పేర్లతో ఫేస్బుక్ ప్రొఫైల్స్ వారు స్వలింగ సంపర్కులంటూ ప్రచారం ఎట్టకేలకు వైద్యుడి ఫిర్యాదుతో కటకటాల్లోకి హైదరాబాద్ : నగరానికి చెందిన గౌరవప్రదమైన వ్యక్తులతో సహా అనేక మందిని కొన్ని నెలలుగా అలా‘గే’ వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ సెల్ అధికారులు పట్టుకున్నారు. పలువురు ప్రముఖుల ఫొటోలను వినియోగించి ఫేస్బుక్లో బోగస్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడంతో పాటు వారంతా స్వలింగ సంపర్కులంటూ ప్రచారం చేస్తూ ఇబ్బందులకు గురి చేశాడని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ ఎం.భగవత్ శుక్రవారం వెల్లడించారు. బాచుపల్లికి చెందిన తుమ్మల సురేష్ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్నికల్ లీడ్‌గా పని చేస్తున్నాడు. కొన్న్ళ్లా క్రితం ఇతడి వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి స్వలింగ సంపర్కుడిగా మారాడు. ఫేస్‌బుక్‌ను విరివిగా బ్రౌజ్ చేసే సురేష్ అందులో ఉన్న అనేక మంది ఫొటోలను డౌన్లోడ్ చేసి వాటిని వినియోగిస్తూ వారి పేర్లతోనే ప్రొఫైల్స్ క్రియేట్ చేసే వాడు. అందులో తాము స్వలింగ సంపర్కులమని, ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలంటూ పోస్టులు పెట్టడంతో పాటు వారి ఫోన్ నెంబర్లనే పోస్ట్ చేసే వాడు. దీంతో అనేక మంది నుంచి బాధితులకు ఫోన్‌కాల్స్ వెళ్ళేవి. అంతేగాకుండా పలువురికి ఫోన్లు చేసిన సురేష్ తాను స్వలింగ సంపర్కుడినని, తనతో స్నేహం చేసే ఆసక్తి ఉందా? అని అడుగుతూ ఇబ్బందులు పెట్టేవాడు. ఇప్పటి వరకు అనేక మంది ఇతడి బారినపడినా... పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సురేష్ ఇటీవల నగరానికి చెందిన ఓ ప్రముఖ వైద్యుడి (సర్జన్) పేరుతో ఫేస్బుక్లో బోగస్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఇందులోనూ ‘అలాంటి’ పోస్టు పెట్టడంతో పాటు కొన్ని స్వలింగ సంపర్కులకు చెందిన వెబ్సైట్ అడ్రస్‌లు పోస్ట్ చేయడంతో సదరు వైద్యుడి బతుకు దుర్భరమైపోరుుంది. ప్రతి రోజూ 40 నుంచి 50 మంది అపరిచితుల నుంచి ఫోన్లు రావడం ప్రారంభమయ్యారుు. ఫలితంగా తీవ్ర మానసిక ఆందోళనకు లోనైన వైద్యుడు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సైబర్ సెల్ అధికారులు సాంకేతిక ఆధారాలను బట్టి సురేష్‌ను నిందితుడిగా గుర్తించారు. ఇతడిని అరెస్టు చేసిన పోలీసులు మియాపూర్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. -
రూ.646 కోట్ల ఫేస్బుక్ షేర్ల విక్రయం
దాతృత్వ కార్యక్రమాల కోసం... న్యూయార్క్: ఫేస్బుక్ సీఈఓ జుకర్‌బర్గ్ 9.5 కోట్ల డాలర్ల (రూ.646 కోట్లు)విలువైన ఫేస్బుక్ షేర్లను విక్రరుుంచారు. కంపెనీ వాటాలో 99 శాతం షేర్లను దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించాలన్న నిర్ణయంలో భాగంగా ఈ వాటా షేర్ల విక్రయం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 19 కోట్ల డాలర్లు, అక్టోబర్‌లో కూడా ఇదే స్థారుులో ఫేస్బుక్ షేర్లను దాతృత్వ కార్యక్రమాల కోసం విక్రరుుంచారు. జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్కిల్లా చాన్‌లు దాతృత్వ కార్యకలాపాల కోసం గత ఏడాది రెండు సంస్థలను- ది చాన్ జుకర్‌బర్గ్ ఫౌండేషన్, సీజడ్ఐ హోల్డింగ్‌స ఎల్‌ఎల్‌సీలను ఏర్పాటు చేశారు. కంపెనీ వాటాలో 99 శాతం వాటాను దాతృత్వ కార్యక్రమాలకు ఇవ్వనున్నామని గత ఏడాది డిసెంబర్లో జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రకటించారు. -
ఫేస్బుక్ లేటెస్ట్ యాప్ ‘లైఫ్‌స్టేజ్’
న్యూయార్క్: హైస్కూల్ విద్యార్థుల కోసం సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ ‘లైఫ్‌స్టేజ్’ పేరుతో కొత్త ఐఓఎస్ యాప్‌ను ప్రారంభించింది. ఇందులో... వినియోగదారుడు వీడియో రూపంలో ఇచ్చిన ఇష్టాయిష్టాలు, బెస్ట్ ఫ్రెండ్, అభిరుచులు, సంతోషం, బాధ కలిగించిన సందర్భాలు తదితర వివరాలను వర్చువల్ ప్రొఫైల్ వీడియోగా మార్చి ఈ నెట్‌వర్క్‌లోని ఇతర విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు. దీంతో తోటివారితో ఉన్న ఉమ్మడి ఆసక్తులు, కోరికల గురించి వారు మరింత తెలుసుకోవచ్చని శనివారం ఓ పోస్టులో ఫేస్బుక్ వెల్లడించింది. 21 ఏళ్లకు కిందనున్న వారికే ఈ సౌకర్యం ఉంటుంది. ఎవరైనా తమ పేజీని అప్డేట్ చేసిన ప్రతిసారి దాన్ని చెక్ చేసుకునేలా ఇతరులకు ఫీడ్ వెళ్తుంది. యాప్‌లోకి లాగిన్ అయిన తరువాత స్కూల్ పేరు తెలపగానే ఇతరుల ప్రొఫైల్‌లను చూపుతుంది. ఒకే స్కూల్ నుంచి కనీసం 20 మంది ఇందులో నమోదై ఉండాలి. 21 ఏళ్లకు పైనున్న వారు కూడా ఈ యాప్‌తో ప్రొఫైల్‌లు తయారుచేసుకోవచ్చు. కానీ వీరికి ఇతరుల ప్రొఫైల్‌లను చెక్ చేసే అవకాశం ఉండదు. -
'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు'
న్యూఢిల్లీ: మౌనం పదునైన ఆయుధం, మౌన మంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ద సంభాషణ అన్నాడు ఓ పెద్దాయన. నిశ్శబ్దాన్నే ఆయుధంగా చేసుకుని పాలకులపై పదునైన ప్రశ్నలు ఎక్కుపెట్టింది ఓ అమరవీరుడి కుమార్తె. పంజాబ్ లోని జలంధర్ కు చెందిన 19 ఏళ్ల గుర్ మెహర్ కౌర్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసిన నిశ్శబ్ద వీడియో చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లీషులో సందేశం రాసివున్న 30 ప్లకార్డులను ప్రదర్శించింది. భారత్-పాకిస్థాన్ శాంతి నెలకొనాలని ప్రగాఢంగా ఆకాంక్షించింది. 1999లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో తన తండ్రి కెప్టెన్ మణ్ దీప్ సింగ్ వీర మరణం పొందేనాటికి తనకు రెండేళ్లు అని తెలిపింది. తన చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఆయనతో గడిపే అవకాశం లేకుండా పోయిందని వాపోయింది. తన తండ్రి కారణమైందని పాకిస్థాన్ ను, అక్కడి ప్రజలను(ముస్లింలను) వ్యతిరేకించానని వెల్లడించింది. ఆరేళ్ల వయసులో బురఖా వేసుకుని వచ్చిన మహిళ తనపై హత్యాయత్నం చేసిందని గుర్తు చేసుకుంది. తన తండ్రి చావుకు ఆమే కారణమన్న అనుమానం కూడా కలిగిందని చెప్పింది. అయితే తండ్రి మరణానికి పాకిస్థాన్ కారణం కాదని, యుద్ధం వల్లే ఆయన తమకు దూరమయ్యాడని తన తల్లి వివరించడంతో రియలైజ్ అయినట్టు పేర్కొంది. తన తండ్రిలాగే సైనికుడిగా పోరాడుతున్నానని, భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి కోసం పోరుబాట పట్టానని వెల్లడించింది. రెండు దేశాల ప్రభుత్వాలు పంతాలకు పోకుండా సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలని విజ్ఞప్తి చేసింది. రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ఫ్రాన్స్, జర్మనీ మిత్రులుగా మారాయని.. జపాన్, అమెరికా గతం మర్చిపోయి అభివృద్ధి పథంలో సాగుతున్నాయని గుర్తు చేసింది. అలాంటప్పుడు భారత్-పాకిస్థాన్ ఎందుకు చేతులు కలపకూడదని ప్రశ్నించింది. రెండు దేశాల్లోని సామాన్య ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని, యుద్ధాన్ని కాదని స్పష్టం చేసింది. ఇరు దేశాల పాలకుల నాయకత్వ పటిమను పశ్నిస్తున్నానని, అసమర్థ నాయకుల పాలన ఉండాలని కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. బేషజాలను పక్కన పెట్టి చర్చలు జరపాలని, పరిష్కారం కనుగొనాలని కోరింది. తీవ్రవాదానికి, గూఢచర్యానికి, విద్వేషాలకు పాల్పడవద్దని రెండు దేశాలకు విజ్ఞప్తి చేసింది. సరిహద్దులో మారణహోమం ఆగాలని కౌర్ ఆకాంక్షించింది. -
జీతం రూ. 66, భద్రత వ్యయం రూ. 84 కోట్లు!
ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఏడాదికి కేవలం ఒక్క డాలర్.. అంటే సుమారు 66 రూపాయల జీతం మాత్రమే తీసుకుంటారు. కానీ, ఆయన భద్రత కోసం ఫేస్బుక్ గత మూడేళ్లుగా వెచ్చించిన మొత్తం ఎంతో తెలుసా.. దాదాపు రూ.84 కోట్లు. ఆదాయంలో దూసుకుపోతూ, సంస్థను అగ్రగామిగా నిలుపుతున్న తమ అధిపతి కోసం ఫేస్ బుక్ భారీ మొత్తంలో ఖర్చు పెడుతోంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో, బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ (31) రక్షణకు అవుతున్న వ్యయాన్ని ఫేస్ బుక్ తొలిసారిగా వెల్లడించింది. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో 24 గంటలు ఆయనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆయన భద్రత కోసం కోట్లాది రూపాయలను కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో 2013 నుంచి 2015 వరకు జుకర్‌బర్గ్ సెక్యూరిటీ కోసం సుమారు 84 కోట్ల రూపాయలను వెచ్చించినట్టు ఫేస్బుక్ ఓ నివేదికలో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను రక్షించినట్లు గానే సీక్రెట్ సర్వీసెస్ సంస్థ జుకర్‌బర్గ్ భద్రతను పర్యవేక్షిస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న జుకర్‌బర్గ్ భద్రత కోసం అమెజాన్, యాపిల్ లాంటి సంస్థల కంటే పెద్ద మొత్తంలోనే ఫేస్బుక్ వెచ్చించింది. గత సంవత్సరం మార్క్ జకర్బర్గ్ కోసం 2015 ఆర్థిక సంవత్సరంలో రూ. 30.55 కోట్లను వెచ్చించింది. వాస్తవానికి 2014లో పెట్టిన ఖర్చు కంటే ఇది కొంచెం తక్కువ. 2013లో రూ. 17.60 కోట్లు, 2014లో రూ. 37.19 కోట్లు ఖర్చుపెట్టారు. వీటితో పాటు16 మంది బాడీ గార్డుల జీతాలు, ఆయన కుటుంబ సభ్యుల రక్షణ కోసం రూ. 41 కోట్లను వెచ్చింది. భద్రత ప్యాకేజీలో అంగరక్షకులు, ప్రైవేట్ జెట్ ప్రయాణాలు, అలారం, కెమెరాలతో పాటు, ఆయ కుటుంబం, ఇంటి రక్షణ ఖర్చు తదితర వివరాలను సంస్థ వెల్లడించింది. ఇస్లామిక్ స్టే్ నుంచి బెదిరింపులు రావడంతో ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సంస్థలు తమ సీఈవో ల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. సంస్థకు ఆయన సేవల ప్రాధాన్యం నేపథ్యంలో ఈ నిర్వహణ ఖర్చు తప్పదని తెలిపింది. జుకర్‌బర్గ్‌ను కాపాడుకోడానికి ఇది చాలా అత్యవసరమని ఫేస్ బుక్ పేర్కొంది. దాదాపు 300 కోట్లకు పైగా సంపద కలిగిన జుకర్‌బర్గ్.. ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలోని టాప్-10 కుబేరుల్లో ఆరో స్థానాన్ని సంపాదించిన సంగతి తెలిసిందే. -
ఫేస్బుక్@ 2015
ప్రపంచవ్యాప్తంగా జరిగే రకరకాల సంఘటనలు...దాని వల్ల జరిగే పరిణామాలు..వాటి గురించి ప్రజల మనస్సులో మెదిలే ఆలోచనలు, వారి అభిప్రాయాలు.. ఇలా ఒకటేంటి ప్రతీది బహిర్గతమయ్యేది సామాజిక మాధ్యమాల ద్వారానే. 2015 సంవత్సరం పూర్తికావస్తుంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్, యూట్యూబ్ లాగే ఫేస్బుక్ కూడా దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా తమ వినియోగదారులు చర్చించుకున్న విషయాలు, ప్రాంతాలు, వ్యక్తులు..ఇలా పలు విషయాలపై జాబితాను విడుదల చేసింది. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం. -సాక్షి, స్కూల్ ఎడిషన్ ఎక్కువగా చర్చలు జరిపిన విషయాలు.. 1. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2. నవంబర్ 13 ప్యారిస్ ఉగ్రదాడి 3. సిరియా వలసదారుల సంక్షోభం, సిరియా అంతర్యుద్ధం 4. నేపాల్ భూకంపం 5. గ్రీకు ఆర్థిక సంక్షోభం 6. వివాహ సమానత్వం 7. ఇస్లామిక్ స్టేట్‌పై పోరు 8. చార్లి హెబ్డొ కార్యాలయంపై ఉగ్రదాడి 9. బాల్టిమోర్ అల్లర్లు 10. అమెరికాలో చార్లెస్టన్ చర్చిపై ఉగ్రదాడి ఎక్కువగా మాట్లాడుకున్నవిషయాలు.. 1. నరేంద్ర మోదీ 2. ఈ కామర్స్ బూమ్ 3. అబ్దుల్ కలాం. 4. బాహుబలి(ద బిగినింగ్) 5. నేపాల్ భూకంపం 6. సల్మాన్‌ఖాన్ 7. క్రికెట్ ప్రపంచకప్, ఐపీల్ 8. బిహార్ ఎన్నికలు 9. దీపిక పదుకొణె 10. ఇండియన్ ఆర్మీ ఎక్కువగా సెర్చ్ చేసినవి.. 1. ఇండియా గేట్ 2. తాజ్‌మహల్ 3. మెరైన్ డ్రైవ్ 4. నందికొండలు 5. గేట్‌వే ఆఫ్ ఇండియా 6. హర్కీ పౌరీ(హరిద్వార్) 7. కుతుబ్ మినార్ 8. ముస్సోరి 9. రామోజీ ఫిలింసిటీ 10. అమృత్సర్ స్వర్ణదేవాలయం ప్రపంచవ్యాప్తంగా ఎక్కవ మంది చర్చించుకున్న అంశాలు.. 1. బరాక్ ఒబామా 2. డానాల్డ్ ట్రంచ్ 3. దిల్మా రోసెఫ్ 4. హిల్లరీ క్లింటన్ 5. బెర్నాయ్ సేండర్స్ 6. లూజ్ ఇనాసియో లుల ద సిల్వ 7. రిసెవ్ తయివ్ ఎర్డోజన్ 8. మహమూద్ బుహారి 9. నరేంద్రమోదీ 10. బెంజ్‌మిన్ నెతన్యాహు -
డైపర్ కట్టుకునే వయస్సులో గంజాయి దమ్ము
న్యూయార్క్: గంజాయి దమ్ము బిగించి కొడితే గమ్మత్తుగా ఉంటున్నట్టున్నది ఈ బుడ్డోడికి. డైపర్ ధరించి కుర్చీలో బరివాతల కూర్చొని గంజాయి దమ్ము లాగిస్తున్నాడు. దాన్ని పర్యవసనాలు తెలియని వయస్సులో పెద్దల ప్రోత్సాహంతో మత్తులో కూరుకుపోతున్నాడు. బుడ్డోడి చేష్టకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఫేస్బుక్లో హల్చల్ చేస్తోంది. చికాగోకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఆండ్రి హోమ్స్ ఈ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేసి, దాని ప్రతిని పోలీసులకు పంపించారు. ‘ఈ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేయడం మూర్ఖత్వమే కావచ్చు. ఈ పిల్లవాడిని ప్రోత్సహిస్తున్న పెద్ద వాళ్లెవరో కనుక్కొని అత్యవసరంగా వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం మంచిది. అసలు పిల్లవాడెవడో గుర్తించి మెడికల్ కేర్‌లో చేర్పించడం అంతకంటే అత్యవసరం. అందుకోసమే దీన్ని పోస్ట్ చేశాను’ అని హోమ్స్ తెలిపారు. గంజాయి దమ్ము లాగుతున్న బుడ్డోడిని ఎదురుగా నిలబడి పెద్దలు ప్రోత్సహిస్తున్నట్టు, వాడు దమ్ము కొడుతుంటే వారు పగలబడి నవ్వుతున్నట్టు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. వారు కనిపించకపోయినా వారి చేతులు మాత్రం వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ పెద్ద వాళ్లెవరో దాదాపు గుర్తించామని, వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చికాగో స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ డిటెక్టివ్లు మీడియాకు తెలిపారు. -
స్మార్ట్‌గా తగ్గించుకోండి...
ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్కి ఎన్ని లైక్‌లు వచ్చాయో.? ట్విట్టర్లో ట్వీట్‌కి రెస్పాన్స్ ఏంటి.? వాట్సప్ గ్రూప్‌లో మెసేజ్‌లు మిస్ అవుతున్నానా? ఏదో ఆత్రుత.. ఇంకేదో ఆరాటం.. దానివల్ల వచ్చేది, పోయేది పెద్దగా ఉన్నా లేకపోయినా అలవాటైపోతున్న దినచర్య. సిటీలో స్మార్ట్ ఫోన్ యూజర్లలో పెరుగుతున్న యాంగ్జయిటీని తక్కువగా అంచనా వేయలేం.. వేయకూడదు కూడా. ఇది మన ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తోందని తెలియజేస్తోంది ఓ పరిశోధన. అంతేకాదు ఆ ఒత్తిడి తప్పులు చేసేందుకు కూడా కారణమవుతోందని హెచ్చరిస్తోంది. -ఓ మధు ఆఫీస్ మీటింగ్‌లో.. ఫ్యామిలీతో ఉన్నా.. ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్ చేస్తున్నా.. డైనింగ్ టేబుల్ నుంచి టాయిలెట్ కమోడ్ దాకా... దేని మీద కూర్చున్నా ధ్యాస మాత్రం మొబైల్ మోత మీదే. స్మార్ట్ ఫోన్స్, యాప్స్ లైఫ్‌ని ఎంత ఈజీ చేస్తున్నాయో.. అంతే బిజీగా మార్చేస్తున్నాయి. యాప్ వేసుకోవడమే ఆలస్యం నోటిఫికేషన్స్ షురూ. ఏ పనిలో ఉన్నా నోటిఫికేషన్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట స్మార్ట్ ఫోన్ యూజర్లు. దీనిని ‘పింగ్’ అని అభివర్ణిస్తున్నారు పరిశోధకులు. నోటిఫికేషన్ అటెండ్ చేసినా చేయకపోయినా ఈ పింగ్‌తోనే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటోందని ఫ్లోరిడాలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు నోటిఫికేషన్ రింగ్ వస్తేనే 3 రెట్లు ఎక్కువ తప్పులు చేసేస్తున్నారని ఈ పరిశోధనతో తేలింది. ఈ నేపథ్యంలో ఫోన్‌పై పెరుగుతున్న ఆత్రుత తగ్గించుకోవడానికి పరిశోధకుల సూచనలు మీకోసం... * ప్రాధాన్యతల మేరకు నోటిఫికేషన్ అలర్ట్ పెట్టుకోవాలి. * వెంటనే సమాధానం తెలియజేయాల్సిన అవసరం లేని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫుడ్, ట్రావెల్ లాంటి యాప్స్‌ని మ్యూట్ చేసుకోవాలి. * నోటిఫికేషన్ చెక్ చేసుకోవడానికి టైం ఫిక్స్ చేసుకోవాలి. ఆ సమయాన్ని విధిగా పాటించడం అలవాటు చేసుకోవాలి. * మీరేంటో ప్రతీ నిమిషం ప్రపంచానికి తెలియజేయాల్సిన పని లేదు. విందూ, విహారాలకు వెళ్లినప్పుడు చక్కగా ఎంజాయ్ చేయండి. వచ్చిన తర్వాత మాత్రమే ఫ్రెండ్స్‌తో ఆ విశేషాలు పంచుకోండి. * మన నీడకంటే ఎక్కువగా మనతో ఉండే ఫోన్‌కి అప్పుడప్పుడు బ్రేక్ ఇవ్వండి. ఈ బ్రేక్ ఫోన్ కన్నా మీకే ఎక్కువ అవసరం అని గుర్తించండి. వాకింగ్, గార్డెనింగ్ లాంటి పనుల్ని ఫోన్ లేకుండా చేసుకోండి. * ఫ్యామిలీతో గడిపే సమయంలో కూడా ఫోన్‌ని సెలైంట్‌లో పెట్టండి. వీలైతే ఆ కాసేపు దాని జోలికి వెళ్లకపోతే మీ కుటుంబానికి మీరు ఎంతో క్వాలిటీ టైం స్పెండ్ చేసిన వారవుతారు. ప్రాథామ్యాలు తెలుసుకోవాలి... స్మార్ట్ఫోన్లు వచ్చాక ఫేస్బుక్, వాట్సప్‌కు చాలామంది అడిక్ట్ అవుతున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో అనర్థాలుంటాయి. లైక్స్ రాకపోతే ఫీలవడం, ఫ్రెండ్ గ్రూప్‌లో యాక్సెప్ట్ చేయకపోతే డిప్రెషన్లోకి వెళ్లిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. వీటి విషయంలో రియలైజ్ కావాలి. మనకు ఏది ముఖ్యమో.. ఏది అప్రధానమో అర్థం చేసుకోవాలి. టీనేజర్లలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనపడుతోంది. వాళ్ల చదువు, ఇతరత్రా లక్ష్యాల మీద ఫోకస్ పెంచి ఈ తరహా కమ్యూనికేషన్‌ని తగ్గించుకోవాలి. లేదంటే కెరీర్ పాడవుతుందని గుర్తించాలి. -డా.శేఖర్‌రెడ్డి, సైకియాట్రిస్ట్ -
28న ఢిల్లీ ఐఐటీలో జుకెర్‌బర్గ్ టౌన్‌హాల్ మీట్
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్ ఈ నెల 28న ఢిల్లీ ఐఐటీలో నిర్వహించే టౌన్‌హాల్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న భారతీయులతో అనుసంధానం కావడానికి ఈ సదస్సులో పాల్గొననున్నట్టు జుకెర్‌బర్గ్ చెప్పారు. భారత్‌లో 13 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారులు ఉన్నారని, అత్యంత చురుకైన ఫేస్బుక్ సమూహాల్లో భారత్ ఒకటని, ఈ సమూహంలోని ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నానని తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన తదుపరి టౌన్‌హాల్ ప్రశ్నోత్తరాలను అక్టోబర్ 28న ఢిల్లీలో నిర్వహిస్తున్నానని, ఎవరైనా తనను ప్రశ్నలు అడగాలనుకుంటే.. కామెంట్స్ దగ్గర అడగవచ్చని.. ఒక ప్రశ్నకు ఓట్ చేయాలనుకుంటే లైక్ చేయొచ్చని.. ఫేస్బుక్ వ్యాప్తంగా వచ్చే ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తానని, ఐఐటీలో అడిగే వారికి నేరుగా సమాధానం ఇస్తానని తెలిపారు.గత నెలలో ఆల్టోలో ప్రధానితో కలసి జుకెర్‌బర్గ్ పశ్నోత్తరాలను నిర్వహించారు. -
ఫేస్బుక్ ప్రొఫైల్‌గా వీడియో
న్యూయార్క్: సామాజిక మాధ్యమం ఫేస్బుక్ తన వినియోగదారులకు మరో సౌకర్యాన్ని అందించింది. ఇకపై ఫేస్బుక్ వినియోగదారులు తమ ప్రొఫైల్ చిత్రం స్థానంలో తక్కువ నిడివి గల వీడియోను కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రజలు సృజనాత్మకంగా వీడియోలు రూపొందించటానికి ఈ సౌకర్యం దోహద పడుతుందని ఫేస్బుక్ ప్రొడక్ట్మేనేజర్ ఐజెరిమ్ షార్మెన్ తెలిపారు. -
భారత్‌లో ఫేస్బుక్ వినియోగదారులు@12.5 కోట్లు
న్యూఢిల్లీ: భారత్‌లో ఫేస్బుక్ వినియోగదారుల సంఖ్య 12.5 కోట్లకు చేరింది. దీంతో ఫేస్బుక్ వినియోగదారులు అధికంగా ఉన్న రెండో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. గత ఆరు నెలల్లో ఫేస్బుక్ యూజర్ల సంఖ్య 1.3 కోట్లు పెరిగింది. ఈ పెరుగుదలకు ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉన్న 2జీ వంటి వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ‘ఫేస్బుక్ లైట్’ ఒక కారణం. గతేడాది డిసెంబర్ నెలలో ఫేస్బుక్ యూజర్ల సంఖ్య 11.2 కోట్లుగా ఉంది. అంతర్జాతీయంగా ప్రతినెల ఫేస్‌బుక్‌ను చురుకుగా వినియోగించే వారు 144 కోట్ల మంది ఉన్నారు. భారత్‌లో ప్రతిరోజు ఫేస్‌బుక్‌ను ఉపయోగించేవారు 5.9 కోట్ల మంది ఉన్నారు. మొబైల్ ఫేస్బుక్ యూజర్ల సంఖ్య 5.3 కోట్లుగా ఉంది. -
బచ్‌ఫన్.. థియేటర్ హంగామా
కంప్యూటర్ గేమ్స్.. కార్టూన్ చానల్స్.. ఫేస్బుక్ షేరింగ్స్.. నయా జమానా పోకడ ఇది. ఆటలు, పాటలున్న సినిమాలే అసలైన ఆటవిడుపనుకునే ఈ తరం.. నాటకాలనూ తెగ ఎంజాయ్ చేస్తోంది. రంగురంగుల సినిమా బొమ్మలే కాదు.. రంగస్థలం హంగులనూ చూస్తామంటోంది. లైవ్‌లో నటిస్తూ.. అలరిస్తున్న నటులను చప్పట్లతో ఎంకరేజ్ చేస్తోంది. రెండు రోజులుగా సిటీలో జరుగుతున్న హైదరాబాద్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్-2014కు వెళ్లి చూస్తే ఈ సీన్ కనిపిస్తోంది. నాటకం రమ్యం అని ఆనాడు కాళిదాసు చెప్పిన మాటకు వంతపాడుతున్నారు నేటి సిటీ చిన్నారులు. సహజత్వంతో పోటీపడుతూ సాగిపోయే కళాకారుల నటన ఈ తరాన్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. అందుకే గంట, గంటన్నర నిడివి ఉండే నాటకాలకు గ్రాండ్ సలామ్ చెబుతున్నారు పిల్లలు. డ్రామా ఆర్టిస్టుల హాస్యం.. చిన్నారుల పొట్టలు చెక్కలయ్యేలా నవ్విస్తోంది. ఇన్నాళ్లూ మిస్సయిన ఆనందం ఏంటో పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే డ్రామా పూర్తయ్యే వరకూ కన్నార్పకుండా చూసి సంబరపడిపోతున్నారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో వైశాలి బిస్ట్స్ థియేటర్ వర్క్‌షాప్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైదరాబాద్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్-2014 అటు పిల్లలను.. ఇటు పెద్దలను అలరిస్తోంది. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్‌లో ఇప్పటికే ముంబైకి చెందిన హబీజబీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ‘ఈట్’, బెంగళూరుకు చెందిన తహట్టో వారి ‘రోమియో అండ్ జూలియట్’ డ్రామాలు ఆకట్టుకున్నాయి. విజ్ఞానం కావాలంటే కంప్యూటర్లో కావాల్సినంత దొరుకుతుంది. కానీ సామాజిక అవగాహన నాటకాల ద్వారానే కలుగుతుందంటున్నారు తల్లిదండ్రులు. అందుకే తమ పిల్లలకు దగ్గరుండి మరీ నాటకాలు చూపిస్తున్నారు. నగరంలో పిల్లలకు సంబంధించిన రంగస్థల నాటకాలు ఎక్కడ జరిగినా అక్కడికి తీసుకెళుతున్నారు. ఉద్యోగంతో ఎప్పుడు బిజీగా ఉండే నగరవాసులు పిల్లలతో పాటు డ్రామాలకు వెళ్లి రిలాక్స్ అవుతున్నారు. పిల్లల్లో ఆసక్తి పెరుగుతోంది ప్రస్తుత ఆధునిక సమాజంలో కనుమరుగవుతున్న రంగస్థల నాటకాల ప్రాముఖ్యాన్ని తెలియజేసేందుకే నగరంలో ‘హైదరాబాద్ థియేటర్ ఫెస్టివల్’ ప్రారంభించాం. ఐదేళ్ల నుంచి ‘థియేటర్’కు క్రేజ్ పెంచే దిశగా కృషి చేస్తున్నాం. ఇందుకు అనుగుణంగా సిటీలో నాటకాలపై తల్లిదండ్రులతో పాటు పిల్లల్లో ఆసక్తి పెరుగుతోంది. - వైశాలి, ఫౌండర్, వైశాలి బిస్ట్స్ థియేటర్ వర్క్‌షాప్ సిటీలో మంచి క్రేజ్ ఉంది ‘బెంగళూరులోనూ థియేటర్‌కు మంచి ఆదరణ పెరుగుతోంది. హైదరాబాద్ వేదికగా రోమియో అండ్ జూలియెట్ పాత్రలో కనిపించడం అదృష్టంగా భావిస్తున్నాం. మేం చేసిన నటనకు హైదరాబాదీలు ఇచ్చిన ప్రోత్సాహం అద్భుతం. ఈ ఫెస్ట్‌కు వచ్చే వారిని చూస్తే రానురాను ఈ సిటీ నుంచి కూడా మంచి థియేటరీ ఆర్టిస్ట్‌లు తెరపైకి వస్తారనుకుంటున్నామ’ని బెంగళూరుకు చెందిన ప్రశాంత్ నాయర్, కళ్యాణి నాయర్ తెలిపారు. ఇది మూడోసారి... ప్రత్యక్షంగా నాటక ప్రదర్శన చూడటం ఇది మూడోసారి. అమ్మ వల్లే మంచి వినోదం కలిగిన నాటకాలను చూడగలిగా. అనేక విషయాలు తెలుసుకోగలిగా. భవిష్యత్‌లోనూ నేను కూడా ఇలాంటి పాత్రలు పోషించాలనుకుంటున్నా. -క్రిశాంతిని, గీతాంజలి పాఠశాల, బేగంపేట సందేశం.. వినోదం.. ఇతర నగరాలకు చెందిన కళాకారులు ఇక్కడ వేస్తున్న రంగస్థల నాటకాలు పిల్లలను ఆలోచింపజేస్తున్నాయి. అర్థవంతమైన ప్రదర్శనతో మంచి సందేశం, వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ డ్రామాల వల్ల పిల్లలకు ప్రేమానురాగాలు, సమాజంలో ఎలా ఉండాలనే దానిపై క్లారిటీ వస్తుంది. -శిరీష, గృహిణి, ఎస్ఆర్ నగర్ ‘సురభి’ మాయాబజార్ నేడు హైదరాబాద్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్లో తొలిసారిగా తెలుగు రంగస్థల నాటికను ప్రదర్శించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 6.30కి శిల్పకళా వేదిక (మాదాపూర్)లో ‘సురభి’ ఆధ్వర్యంలో ‘మాయాబజార్’ నాటకం ప్రదర్శిస్తున్నారు. - వాంకె శ్రీనివాస్ -
ఫేస్బుక్ వినియోగదారులకు ముఖ్య సూచనలు
ఫేస్బుక్ వినియోగదారులలో కొందరు అందులో పోస్ట్ చేసే వార్తలు, వ్యాఖ్యలు, ఫొటోలపై తమ అభిప్రాయాలు రాస్తుంటారు. వారిలో కొందరు సభ్యత, సంస్కారం, మంచి, మర్యాద మరచి చాలా అసహ్యకరమైన, జుగుప్సాకరమైన భాష వాడుతుంటారు. ఎవరైనా తమ వ్యతిరేకతని మర్యాద కూడా తెలియజేయవచ్చు. ఎంతటి తీవ్రమైన వ్యతిరేకతనైనా తెలియజేయడానికి, విమర్శించడానికి చక్కటి తెలుగు పదాలు ఉన్నాయి. మరికొందరు లైక్(ఇష్టం) కొట్టి వదిలేస్తుంటారు. విషాదకరమైన వార్తలకు, ఫొటోలకు కూడా కొందరు లైక్ కొడుతుంటారు. వాస్తవానికి వారు తెలియక అలా కొడుతూ ఉండవచ్చు. హృదయవిదారకమైన సంఘటలకు కూడా అలా లైక్ కొడుతుంటారు. రోడ్డు ప్రమాదాల వార్తలు, అటువంటి ఫొటోలు, దోపిడీలు, అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు....వంటి వార్తలకు కూడా లైక్ కొడుతుంటారు. ఒక వ్యక్తి తన తండ్రి చనిపోయినట్లు తెలియజేయటానికి ఆ వివరాలు పోస్ట్ చేస్తే, అతని స్నేహితులు దానికి కూడా లైక్ కొడుతుంటారు. ఇందుకు ఈరోజు జరిగినదే ఒక ఉదాహరణ: ప్రఖ్యాత చిత్రకారుడు, సాహితీవేత్త, కార్టూనిస్ట్, సినిమా నిర్మాత, దర్శకుడు బాపు ఈరోజు మధ్యాహ్నం మృతి చెందారు. తెలుగు జాతి గర్వించదగిన గొప్ప వ్యక్తి బాపు. అటువంటి బాపు మరణ వార్తకు ఇప్పటికే 550 మంది లైక్ కొట్టారు. కారులో కన్నుమూసిన పసిపాప అనే వార్తకు 60 మంది లైక్ కొట్టారు. అంటే వాటి అర్ధం ఏమిటి? వారు అటువంటి వార్తలను ఇష్టపడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇక నుంచి ఒక వార్తకు, ఫొటోకు లైక్ కొట్టే ముందు ఒక్కసారి ఆలోచించి కొట్టడం మంచిది. -శిసూర్య -
పోకిరీని చితక్కొట్టి.. ఫేస్బుక్లో వీడియో!!
మహిళలను వేధిస్తున్న పోకిరీలకు బెంగళూరులో ఓ మహిళ గట్టిగా బుద్ధి చెప్పింది. వెనకనుంచి కామెంట్ చేస్తున్న ఆ వ్యక్తిని చూసీ చూడనట్లు వదిలేయకుండా.. వెంటపడి, తరిమి తరిమి పట్టుకుని కొట్టింది. ముందుగా అతడిని మోకాళ్లమీద వంగి కూర్చోమని ఆదేశించి.. ఆ తర్వాత కొట్టారు. ఈ మొత్తం విషయాన్ని ఆమె స్నేహితురాలు ఫోన్లో వీడియో తీయగా, ఆ వీడియోను సదరు మహిళ ఫేస్బుక్లో కూడా షేర్ చేసింది. తాను రోజూలాగే పార్కులో ఉదయం జాగింగ్‌కు వెళ్లినప్పుడు ఓ వ్యక్తి తనను వెంటపడి వేధించాడని, తాను అతడిని తరిమి పట్టుకుని కొట్టానని, అంతేకాక అతడిమీద పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. పోలీసులు కూడా చాలా సానుకూలంగా స్పందించారని చెప్పారు. మనం మారాలనుకుంటే మార్పు దానంతట అదే వస్తుందని చెప్పడానికే తానీ వీడియో పెడుతున్నానని, మహిళలు పారిపోకుండా పోకిరీలకు గట్టిగా గుణపాఠం చెప్పాలని అన్నారు. -
భారత్‌లో 10 కోట్లు దాటిన ఫేస్బుక్ యూజర్లు
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న భారతీయుల సంఖ్య 10 కోట్లను దాటింది. అమెరికా వెలుపల నెలవారీగా ఎక్కువ మంది ఫేస్బుక్ యూజర్లు క్రియాశీలంగా ఉంటున్న దేశంగా భారత్ నిలిచిందని మంగళవారం ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి. -
ఫేస్బుక్లో ‘పేపర్’!
వాషింగ్టన్: సోషల్ మీడియా సైట్ ఫేస్బుక్ యూజర్లకు ఇక ‘డిజిటల్ సోషల్ న్యూస్‌పేపర్’ కూడా అందుబాటులోకి రానుంది. ‘పేపర్’ అని పేరుపెట్టిన ఈ డిజిటల్ పేపర్ మొబైల్ ఫోన్ల ద్వారా ఉపయోగించుకునేందు కు వీలుగా రూపొం దించారు. దీనిని ఈ నెలాఖరు నాటికి విడుదల చేసేందుకు ఫేస్బుక్ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.