ఫేస్‌బుక్@ 2015
ప్రపంచవ్యాప్తంగా జరిగే రకరకాల సంఘటనలు...దాని వల్ల జరిగే పరిణామాలు..వాటి గురించి ప్రజల మనస్సులో మెదిలే ఆలోచనలు, వారి అభిప్రాయాలు.. ఇలా ఒకటేంటి ప్రతీది బహిర్గతమయ్యేది సామాజిక మాధ్యమాల ద్వారానే. 2015 సంవత్సరం పూర్తికావస్తుంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్, యూట్యూబ్ లాగే ఫేస్‌బుక్ కూడా దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా తమ వినియోగదారులు చర్చించుకున్న విషయాలు, ప్రాంతాలు, వ్యక్తులు..ఇలా పలు విషయాలపై జాబితాను విడుదల చేసింది. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం.
-సాక్షి, స్కూల్ ఎడిషన్
ఎక్కువగా చర్చలు జరిపిన విషయాలు..
1. అమెరికా అధ్యక్ష ఎన్నికలు
2. నవంబర్ 13 ప్యారిస్ ఉగ్రదాడి
3. సిరియా వలసదారుల సంక్షోభం, సిరియా అంతర్యుద్ధం
4. నేపాల్ భూకంపం
5. గ్రీకు ఆర్థిక సంక్షోభం
6. వివాహ సమానత్వం
7. ఇస్లామిక్ స్టేట్‌పై పోరు
8. చార్లి హెబ్డొ కార్యాలయంపై ఉగ్రదాడి
9. బాల్టిమోర్ అల్లర్లు
10. అమెరికాలో చార్లెస్టన్ చర్చిపై ఉగ్రదాడి
ఎక్కువగా మాట్లాడుకున్నవిషయాలు..
1. నరేంద్ర మోదీ
2. ఈ కామర్స్ బూమ్
3. అబ్దుల్ కలాం.
4. బాహుబలి(ద బిగినింగ్)
5. నేపాల్ భూకంపం
6. సల్మాన్‌ఖాన్
7. క్రికెట్ ప్రపంచకప్, ఐపీల్
8. బిహార్ ఎన్నికలు
9. దీపిక పదుకొణె
10. ఇండియన్ ఆర్మీ
ఎక్కువగా సెర్చ్ చేసినవి..
1. ఇండియా గేట్
2. తాజ్‌మహల్
3. మెరైన్ డ్రైవ్
4. నందికొండలు
5. గేట్‌వే ఆఫ్ ఇండియా
6. హర్‌కీ పౌరీ(హరిద్వార్)
7. కుతుబ్ మినార్
8. ముస్సోరి
9. రామోజీ ఫిలింసిటీ
10. అమృత్‌సర్ స్వర్ణదేవాలయం
ప్రపంచవ్యాప్తంగా ఎక్కవ మంది చర్చించుకున్న అంశాలు..
1. బరాక్ ఒబామా
2. డానాల్డ్ ట్రంచ్
3. దిల్మా రోసెఫ్
4. హిల్లరీ క్లింటన్
5. బెర్నాయ్ సేండర్స్
6. లూజ్ ఇనాసియో లుల ద సిల్వ
7. రిసెవ్ తయివ్ ఎర్డోజన్
8. మహమూద్ బుహారి
9. నరేంద్రమోదీ
10. బెంజ్‌మిన్ నెతన్యాహు