
ఫ్రెండ్‌తో చేసిన ప్రాంక్ చర్య ఓ విద్యార్థినికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఒకవేళ ఆమె దోషిగా తేలితే ఏడాదిపాటు జైలుశిక్ష పడే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు తాజాగా విడుదల చేశారు. అయితే ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వివరాలిలా.. పోలాండ్‌లోని జెకోవీస్-డెడ్జీస్‌లో ఓ రోడ్డు కూడలిలో ఇద్దరు స్నేహితులు వెళ్తున్నారు. సరదాగా తన స్నేహితురాలు (17)ని ఆట పట్టించాలని ఓ విద్యార్థిని అనుకుంది. అనుకున్నదే తడవుగా తమ పక్క నుంచి బస్సు వెళ్తుండగా.. తన ఫ్రెండ్‌ను భుజంతో నెట్టింది. ఇక అంతే బ్యాలెన్స్ తప్పిన యువతి కింద పడిపోయింది. బస్సు చక్రం తనపై నుంచి వెళ్తుందని భయం చెందినా క్షణాల్లో పక్కకు జరగడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. వెంటనే సారీ చెబుతూ తన స్నేహితురాలిని హగ్ చేసుకుంది. ఏప్రిల్ 12న జరిగిన ఈ ఘటనకు సంబధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment