సరదా హద్దు దాటితే..పరిస్థితి ఇలా ఉంటుందా? | Man Threw A Smoke Bomb At Girl As A Prank | Sakshi
Sakshi News home page

సరదా హద్దు దాటితే..పరిస్థితి ఇలా ఉంటుందా?

Published Mon, Jan 8 2024 3:48 PM | Last Updated on Mon, Jan 8 2024 3:52 PM

Man Threw A Smoke Bomb At Girl As A Prank - Sakshi

సరదాగే ఒకళ్లని ఆటిపట్టించేలా చేసే పనులు ఇరువురుకి ఆనందం కలిగించాలి. అవి హద్దు దాటితే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆ పనుల వల్ల ఇరువురిలో ఒక్కరూ హర్ట్‌ అయ్యి ‍ప్రతిచర్యకు దిగితే పరిణామాలు దారుణంగా ఉంటాయి. అందుకే కాబోలు పెద్దలు ఏదైన సరే శృతి మించకూడదని పదే పదే  అంటారు. ఇక్కడ అలానే సరదా అల్లరి కాస్తా శృతి మించింది. ఫలితం ఓ వ్యక్తి తీవ్ర గాయలపాలవ్వడానికి దారితీసింది. 

అసలేం జరిగిందంటే..ఈ షాకింగ్‌ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. రష్యాలో చెల్యాబిన్స్క్‌లో ప్రొఫెసర్ బ్లాగిక్ స్ట్రీట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పార్టీ జరగుతుంది. ఆదివారం కావడంతో వారంతపు రోజు ఎంజాయ్‌ చేయలనుకున్నారు. అందులో భాగంగా కొందరు వ్యక్తులు ఒక అపార్ట్‌మెంట్‌లో చేరి అ‍ల్లరి చేష్టలతో హుషారుగా ఉన్నారు. అయితే వారి అల్లరి శృతి మించింది. ఏకంగా వంటగదిలో స్మోకింగ్‌​ బాంబ్‌ పేల్చారు. దీంతో మనస్తాపం చెందిన ఓ అమ్మాయి పట్టరాని కోపంతో దారుణమైన చర్యకు పూనుకుంది.

ఏకంగా మరిగిమరిగే నీళ్లను తీసుకొచ్చి పార్టీ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తులపై పోసేందుకు యత్నించింది. అయితే ఆ నీళ్లు కాస్త ఆ ఇంటి యజమానిపైనే నేరుగాపడ్డాయి. అయితే ఆ ‍వ్యక్తి ఏమీ స్మోకింగ్‌ బాంబ్‌ ప్రయోగించిన వ్యక్తి కాదు. అతను కూడా అలా చయొద్దన్న వ్యక్తే అని పోలీసుల విచారణలో తెలిసిందే. ఈ హఠాత్పరిణామం గురించి పోలీసులకు సమాచారం అందడంతో పార్టీ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తులపై చర్య తీసుకుని వారికి జరిమాన కూడా విధించారు.

ఇలా చేసిన సదుర అమ్మాయిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, తీవ్ర స్థాయిలో చర్మం బర్న్‌ అయ్యిందని పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. సదరు మహిళపై పలువురు నెటిజన్లు ఫైర్‌ అవ్వగా, కొందరూ మాత్రం అలా వాళ్లు స్మోకింగ్‌ బాంబ్‌ పేల్చాలనుకోవడం కూడా తప్పే అందువల్ల ఆమె అలా ప్రవర్తించిందని మద్దతు పలుకుతూ ట్వీట్‌ చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

(చదవండి:  పుట్టుకొస్తున్న ప్లాస్టిక్‌ శిలలు..ఆందోళనలో శాస్త్రవేత్తలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement